Skip to main content

ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించాలంటే.. ఈ ప్రమాణాలు ఉండాల్సిందే..

యూనివర్సిటీలు, ఇతర హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ల్లో డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో నాణ్యత ప్రమాణాల పెంపుపై యూజీసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులను అందించే యూనివర్సిటీలు.. తమ ప్రధాన కేంద్రంలో సెంటర్‌ ఫర్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.

ఆన్‌లైన్‌ కోర్సుల అమలు తీరుపై నిరంతరం సమీక్ష నిర్వహించాలి. ఇందులో ఆయా కోర్సుల సీనియర్‌ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్‌ భాగస్వాములు కావాలి.

సీఐక్యూఏ ఏర్పాటు..
ఆన్‌లైన్‌లో డిగ్రీలు అందించే ప్రతి యూనివర్సిటీ.. నిర్దిష్ట ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించేందుకు సెంటర్‌ ఫర్‌ ఇంటర్నల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ (సీఐక్యుఏ)ను ఏర్పాటు చేయాలి. దీనికి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హోదా ఉన్న వారిని డైరెక్టర్‌గా నియమించాలి. ప్రవేశాల నుంచి నిర్వహణ, మౌలిక సదుపాయాలు, కరిక్యులం రూపకల్పన, ఇతర వనరుల కల్పన వంటి విషయాలను ఈ క్వాలిటీ అష్యూరెన్స్‌ కమిటీ పర్యవేక్షించి.. పరిస్థితులకు అనుగుణంగా సిఫార్సులు చేస్తుంది.

లెర్నర్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌..
ఆన్‌లైన్‌ డిగ్రీలు అందించే యూనివర్సిటీలు.. లెర్నర్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌ను అందుబాటులో ఉంచాలి. ఇవి కూడా టెక్నాలజీ ఆధారంగా ఉండేలా చూడాలి. వీటితో విద్యార్థులు నేరుగా సంప్రదించే అవకాశం కల్పించాలి.

సెంటర్‌ ఫర్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌..
ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు కల్పించే హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లు.. నిర్దిష్టంగా మానవ వనరులను నియమించుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. ప్రతి ఇన్‌స్టిట్యూట్‌ తప్పనిసరిగా సెంటర్‌ ఫర్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ పేరిట ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రంలో టీచింగ్, నాన్‌– టీచింగ్, అడ్మినిస్ట్రేషన్‌ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని పేర్కొంది. దీని ప్రకారం..

  • శాశ్వత ప్రాతిపదికగా ప్రొఫెసర్‌ హోదా ఉన్న వ్యక్తి డైరెక్టర్‌గా ఉండాలి.
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్థాయి వ్యక్తిని డిప్యూటీ డైరెక్టర్‌(ఈ–లెర్నింగ్, టెక్నికల్‌)గా నియమించాలి.
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ స్థాయి వ్యక్తిని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా రిక్రూట్‌ చేయాలి.
  • ప్రొఫెసర్‌ లేదా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ను ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌గా నియమించాలి. కోర్స్‌ కో–ఆర్డినేటర్‌ పోస్టును భర్తీ చేయాలి.
  • ప్రతి 250 మంది విద్యార్థులకు ఒక కోర్స్‌ మెంటార్‌ను ఏర్పాటుచేయాలి.
  • టెక్నికల్‌ మేనేజర్, అసోసియేట్, అసిస్టెంట్‌లు ఈ–కంటెంట్, ఈ–మాడ్యూల్స్‌ నిర్వహణ పర్యవేక్షణ చూడాలి.

ఇంకా చదవండి : part 3: ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలోనే పరీక్షలు.. ప్రధాన కేంద్రంలో సిబ్బంది..

Published date : 28 Jun 2021 06:11PM

Photo Stories