Skip to main content

Essential Skills for Successful Career : కార్పొరేట్‌ కెరీర్‌ సక్సెస్‌కు కావాల్సిన స్కిల్స్‌ ఇవే...

Essential Skills for Successful Career  dynamic job market complexity
Essential Skills for Successful Career

ప్రస్తుత డైనమిక్‌ జాబ్‌ మార్కెట్‌ చాలా సంక్లిష్టంగా ఉంది. ఈ మార్కెట్‌లో ఉద్యోగ, ఉపాధి అందుకుని రాణించడానికి సిద్ధమవుతున్న వారికి  స్థితిస్థాపకత అనుకూలతలు అనేవి చాలా ముఖ్యమైనవి. నిరంతర అభ్యాసంతో పాటు భవిష్యత్‌ మార్కెట్‌ డిమాండ్లను ఊహించడం అత్యంత కీలకం. సమయానుగుణంగా, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న టెక్‌   వరల్డ్‌లో నిలదొక్కుకోవడానికి అద్భుతమైన కెరీర్‌ని  ఆకాంక్షించే వారికి అత్యుత్తమ నైపుణ్యాలు కావాల్సి ఉందని గ్రేట్‌ లెర్నింగ్‌ ఎకడమిక్‌ డైరక్టర్, డా. అభినందన్‌ సర్కార్‌ అంటున్నారు.

డేటా సైన్స్‌లో ప్రావీణ్యంః
ప్రస్తుతం టెక్‌ వరల్డ్‌లో డేటా సైన్స్‌ ప్రాధాన్యత కలిగిన సబ్జెక్ట్‌.  ప్రస్తుత ఏఐ బూమ్‌ దాని ప్రాధాన్యాన్ని ఇంకా పెంచుతోంది. టెన్సర్‌ఫ్లో  రైజింగ్‌ స్టార్, పైటోర్చ్‌ వంటి సాంకేతికతలతో అనుసంధానం ద్వారా పైథాన్‌ ప్రధాన ఛాయిస్‌ భాషగా నిలిచింది, ఇది మాత్రమే కాకుండా, లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎమ్‌)విస్త్రుత వృద్ధి నేపధ్యంలో నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పి)లో నిష్ణాతులు ఉద్యోగ విజయాల్లో  కీలకంగా నిలిచారు. ఇప్పటికీ అభివృద్ధికి మార్గంగా ఎక్కువ భాగం  ఆంగ్ల
భాష చుట్టూ కేంద్రీకృతమై ఉన్నప్పటికీ అందులోనూ గుర్తించదగిన మార్పు వచ్చింది. గ్లోబల్‌ బిజినెస్‌లో భాషా నైపుణ్యాలు  వృత్తినైపుణ్యానికి అనుసంధానమవుతున్నాయి.  మాండరిన్‌ కావచ్చు లేదా తెలుగు వంటి స్థానిక ప్రాముఖ్యత కలిగిన భాషలతో పని చేయగలగడం విలువైన నైపుణ్యంగా పరిగణనపొందుతోంది.

ఏఐలోనూ రాణింపు..
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాజ్యమేలనున్న పరిస్థితుల్లో ముఖ్యంగా జనరేటివ్‌ ఏఐ, అనేక అభివృద్ధి చెందుతున్న మెషిన్‌ లెర్నింగ్‌ (ఎమ్‌ఎల్‌)నైపుణ్యాలు ఈ సాంకేతిక తరంగానికి వెన్నెముకగా ఉన్నాయనేది గమనార్హం. చాట్‌ జిపిటి ఆగమనం ఏఐ ని ప్రధాన స్రవంతిలోకి నెట్టడం ఈ పెరుగుదలకు దారితీసింది. ఏఐ ఆల్గొరిథమ్‌ల గురించిన లోతైన అవగాహన ఉన్నా, చాట్‌ జిపిటీ వంటివాటిని ప్రభావితం చేయడంలో కీలకం జిపిటి,ఎల్‌ఎల్‌ఎఎమ్‌ఎ వంటి పెద్ద భాషా నమూనాలు (ఎల్‌ఎల్‌ఎమ్‌)లో ప్రావీణ్యం చూపడంలో ఉంటుంది.  టెక్స్ట్ లు, ఇమేజ్‌లు, స్టార్టర్‌ కోడ్‌ లేదా యాడ్‌ క్యాంపెయిన్స్‌ వంటి కంటెంట్‌ను రూపొందించడానికి ఈ మోడల్స్‌ను లోతుగా పరిశోధించడం ఇక్కడ అవసరం కాదు. ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ గా పేర్కొనే ప్రశ్నలను సంధించే కళ ఓ కీలక నైపుణ్యం.

సైబర్‌ సెక్యూరిటీ: డిజిటల్‌ రాజ్య పరిరక్షకులు
కంప్యూటర్‌ సిస్టమ్‌లోకి ప్రవేశించడం అనేది ఇప్పుడు పాస్‌వర్డ్‌ను ఇన్‌పుట్‌ చేయడం మాత్రమే కాదు అంత కంటే ఎక్కువ అని గుర్తించాలి. ఆన్‌లైన్‌లో స్టోర్‌ చేసి వినియోగించే డేటా పరిమాణం పెరుగుతూనే ఉన్నందున, సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల కోసం డిమాండ్‌ స్థిరమైన పెరుగుదలను చవిచూస్తోంది.  రక్షణాత్మక వ్యూహాలతో పాటు ఎథికల్‌ హ్యాకింగ్‌ కూడా వీరి బాధ్యతే.  మల్టీ–ఫాక్టర్‌ అథెంటికేషన్‌ (ఎమ్‌ఎఫ్‌ఎ)  విస్త్రుతంగా వ్యాప్తి చెందుతోంది, ఎమ్‌ఎఫ్‌ఎ వ్యవస్థను నిర్మించడం, నిర్వహించడం అనేది వాయిస్‌ గుర్తింపు, వేలిముద్రలు లేదా ఇతర బయోమెట్రిక్‌ల గుర్తింపులో నైపుణ్యాన్ని అందిస్తుంది. వర్క్‌ఫ్లో సమస్యలపై థృఢమైన అవగాహన సెక్యూరిటీ ఫీచర్స్‌పై నిరంతర అప్‌గ్రేడ్‌ భద్రతా నిపుణులుగా రాణించడానికి తప్పనిసరి.

క్లౌడ్‌ను జయించటం..
క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అనేది ఏఐ  డేటా స్టోరేజీలకు వెన్నెముక. క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు నిరంతరం తమ ఆఫర్‌లను  విస్తరింపజేస్తుండడంతో వినియోగదారులు ఈ అభివృద్ధి చెందుతున్న ప్లాట్‌ఫామ్స్‌ వినియోగించుకోవడంలో నైపుణ్యాన్నిపెంపొందించుకోవాలని భావిస్తున్నారు. ఎడబ్లు్యఎస్, మైక్రోసాఫ్ట్‌ అజురె వంటి పరిశ్రమ దిగ్గజాల నుంచి థృవపత్రాలను పొందడం ద్వారా ఈ సామర్థ్యాలను మెరుగుపర్చడానికి అవకాశం ఉంది.

డిజైన్‌ గురించి ఆలోచిస్తున్నారా...
డిజైన్‌ థింకింగ్‌ సూత్రాలు అనేవి మానవ–ఆధారిత డిజైన్ల రూపకల్పనలో, ముఖ్యంగా యుఐ/యుఎక్స్‌లలో కీలకమైనవి. తగినంత కంప్యూటింగ్‌ శక్తి
అందుబాటులోకి వచ్చినందున, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఎఆర్‌) వర్చువల్‌ రియాలిటీ (విఆర్‌)లు అత్యుత్తమ డిజిటల్‌ అనుభవాలను అందించే శక్తివంతమైన సాధనాలుగా మారాయి. ఈ నేపధ్యంలో విస్తరిస్తున్న మెటావర్స్‌  కాన్సెప్ట్‌ అందిపుచ్చుకోవడం అవసరం.   అలాగే డిజిటల్‌ ల్యాండ్‌స్కేప్‌లను పునర్నిర్మించడం మెరుగుపరచడంలో ఆర్కిటెక్ట్‌లుగా మారడానికి సిద్ధంగా ఉండాలి.

సాఫ్ట్‌వేర్‌ డెవలప్మెంట్‌.. కోడింగ్‌కు మించి
నిర్దిష్ట సాఫ్ట్‌వేర్‌తో లోతైన అవగాహన మాత్రమే కాకుండా విస్త్రుత సాఫ్ట్‌వేర్‌ ఎకోసిస్టమ్‌ను ప్రభావితం చేయగల నైపుణ్యాన్ని కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, డెవలప్‌మెంట్‌ డిమాండ్‌ చేస్తోంది. బ్యాక్‌–ఎండ్‌ , ఫ్రంట్‌–ఎండ్‌ నైపుణ్యం రెండింటినీ కలుపుకుంటే అది విలువైన నైపుణ్యంగా ఉద్భవిస్తుంది. ఉదాహరణకు, 5ఎ సామర్థ్యాలను ఉపయోగించుకొనేలా రూపొందించబడిన మొబైల్‌ యాప్స్‌ ఆవిష్కరణల సామర్థ్యాన్ని మనకు చూపిస్తుంది.

నేటి నైపుణ్యమే రేపటి భవిష్యత్తు...
రేపటి నిపుణుల పాత్ర కోడింగ్‌కు మించి ఉంటుంది; వారు స్మార్ట్‌ సిటీల çసృష్టికి దోహదపడుతున్నారు అలాగే మన దేశ అభివృద్ధికి కారకులుగా మారుతున్నారు. ఈ ఏడాది ఉద్యోగార్ధులు కెరీర్‌ను మెరుగుపరచుకునేవారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.  వారు సాంకేతిక–కేంద్రీకృత భవిష్యత్తు కోసం
సిద్ధం కావాలి. దినదినాభివృద్ధి చెందుతున్న జాబ్‌ మార్కెట్‌ ను, ప్రస్తుత నైపుణ్యాలను అందుకోవడం మాత్రమే కాకుండా భవిష్యత్‌ పోకడలను అంచనా వేయగల దూర దృష్టి కూడా ఉండాలి. నిరంతర అభ్యాసం చేయాలి, సానుకూలతను కలిగి ఉండాలి అడుగడుగునా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవాలి. Üరైన నైపుణ్యాలు అనే ఆయుధాలను కలిగి ఉంటే  సాగే ప్రయాణం డైనమిక్‌గా ఉంటుంది.
–డా. అభినందన్‌ సర్కార్‌
ఎకడమిక్‌ డైరక్టర్, గ్రేట్‌ లెర్నింగ్‌

Published date : 08 Apr 2024 04:06PM

Photo Stories