టెలికాం రంగంలో కొలువుల జోరు...
Sakshi Education
నూటా ఇరవై కోట్ల భారతదేశ జనాభాలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లకు పైమాటే! దేశంలో చిన్నాపెద్ద టెలికాం కంపెనీలు అనేకం ఉన్నాయి. వీటితోపాటు విదేశీ టెలికాం కంపెనీలు కూడా భారత మార్కెట్‌లో పాగా వేస్తున్నాయి. పట్టణాలతో పోటీపడుతూ పల్లెల్లోనూ సెల్‌ఫోన్ హల్‌చల్ చేస్తోంది. ఆయా కంపెనీల్లో వివిధ విభాగాల్లో లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడుతోంది. దాంతో టెలికాం రంగంలో అపార అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలో వివిధ విద్యా సంస్థలు టెలికాం కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులను పూర్తిచేస్తే మంచి అవకాశాలను ఒడిసిపట్టొచ్చు. ఆ వివరాలు...
లక్షల్లో ఉద్యోగాలు
రాబోయే ఐదేళ్లలో టెలికాం పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి టెలికాం రంగంలో 2.75 లక్షల మంది ఉద్యోగులు అవసరమవుతారని టీఈ కనెక్టివిటీ సంస్థ అంచనా వేసింది. మరోవైపు దేశంలోని 2.75 లక్షల గ్రామ పంచాయతీలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఇంటర్నెట్, ఐఫోన్, స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు పల్లెలకూ చేరువవుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తులను సరఫరా చేయడం, మార్కెటింగ్ చేయడం ప్రస్తుతం టెలికాం రంగంలో విస్తృత అవకాశాలకు కారణమని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెలికాం టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్.. కార్పొరేట్ రిలేషన్స్ డెరైక్టర్ పంకజ్ శ్రీవాత్సవ్ పేర్కొన్నారు.
ఆసక్తి ఉంటే అనేక మార్గాలు
టెలికాం అనగానే కేవలం టెక్నికల్ గ్రాడ్యుయేట్స్‌కు మాత్రమే అవకాశాలనేది అపోహే అంటున్నారు నిపుణులు. నాన్ టెక్నికల్, మార్కెటింగ్, సేల్స్, మానవ వనరుల విభాగాల్లో పనిచేసేందుకు ఏ గ్రాడ్యుయేషన్ చదివిన విద్యార్థులైనా అర్హులే. టెక్నికల్ విభాగంలో ఇంజనీర్లు, టెక్నీషియన్లు, ఇన్‌స్టలేషన్, మెయింట్‌నెన్స్ సిబ్బంది అవసరం ఉంటుంది. ఆయా విభాగాల్లో టెక్నికల్ డెరైక్టర్, ఫీల్డ్ టెస్ట్ ఇంజనీర్, కస్టమర్ సపోర్ట్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, రీసెర్చర్, సీనియర్ సేల్స్ మేనేజర్, సర్వీస్ ఇంజనీర్‌గా వివిధ హోదాల్లో పనిచేయవ చ్చు. ఇవికాకుండా ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమో అర్హతలతో ఎగ్జిక్యూటివ్స్, ఇన్‌చార్జులుగా విధులు నిర్వర్తించవచ్చు. ఇతర విభాగాల గ్రాడ్యుయేట్స్ కూడా కస్టమర్ సర్వీస్, మార్కెటింగ్, కలెక్షన్, సేల్స్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను దక్కించుకోవచ్చు. 2జీ, 3జీ, 4జీ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాపార కార్యకలాపాల్లో చోటుచేసుకుంటున్న నూతన మార్పులతో నిపుణుల అవసరం పెరిగింది. క్షేత్రస్థాయిలో సంబంధిత కంపెనీ రిటైల్ ఔట్‌లెట్‌లో మేనేజర్, మార్కెటింగ్.. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ పనిచేస్తుంటారు. వీరితోపాటు సెల్‌ఫోన్ రిపేరింగ్ టెక్నీషియన్స్, ఇతర ఉద్యోగులు కూడా ఉంటారు.
కోర్సులు.. అర్హతలు
టెలికమ్యూనికేషన్ కోర్సులు చేయాలనుకుంటే.. ముందు ఇంటర్మీడియెట్ ఎంపీసీ పూర్తిచేయాలి. తర్వాత బీటెక్‌లో టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కోర్సును చదవొచ్చు. బీటెక్ పూర్తయ్యాక ఎంటెక్ అభ్యసించొచ్చు. జేఎన్‌టీయూ - హైదరాబాద్, జేఎన్‌టీయూ- కాకినాడ.. ఎంటెక్‌లో టెలికమ్యూనికేషన్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. సేల్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్ వంటి విభాగాలకు ఏదైనా గ్రాడ్యుయేషన్ కోర్సులు చేయాలి. తర్వాత ఎంబీఏ పూర్తిచేస్తే మంచి అవకాశాలు చేజిక్కించుకోవచ్చు. కొన్ని విద్యా సంస్థలు టెలికాం మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
నగరంలో టెలికాం స్కిల్స్ ప్రోగ్రామ్స్
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (టీఎస్‌ఎస్‌సీ) టెలికాం రంగానికి కావాల్సిన మానవ వనరులను అందిస్తోంది. ఇందుకోసం వివిధ స్వల్పకాలిక శిక్షణా కోర్సులను నిర్వహిస్తోంది. వెబ్‌సైట్: www.tsscindia.com ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నగరంలో సుమారు 15 శిక్షణా సంస్థలున్నాయి. వీటిలో బీటెక్/ఎంటెక్/బీఎస్సీ/ఎంబీఏ విద్యార్హతలతో పలు కోర్సులను అందిస్తున్నారు.
ఇన్‌స్టిట్యూట్స్ వివరాలు..
టెలికాం రంగంలో మేనేజ్‌మెంట్/అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క్, మార్కెటింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్‌కేర్ తదితర విభాగాలు కీలకం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్), రక్షణ రంగం, టెలికాం డిపార్ట్‌మెంట్, భారతీయ రైల్వే, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రక్షణ పరిశోధన- అభివృద్ధి సంస్థ ( డీఆర్‌డీవో), బిర్లాగ్రూప్, రిలయన్స్ తదితర సంస్థలు.. ఉద్యోగ నియామకాలకు ఖాళీలను బట్టి ప్రకటనలను విడుదల చేస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ల నియామకానికి ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)ను నిర్వహిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపికైన వారిని జూనియర్ టెలికాం ఆఫీసర్(జనరల్ సెంట్రల్ సర్వీస్ - గ్రూప్-బి), ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ - గ్రూప్-ఏ, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్), ఇండియన్ సప్లై సర్వీస్, అసిస్టెంట్ నేవల్ స్టోర్ ఆఫీసర్స్, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ వంటివాటిలో నియమిస్తారు. సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్ ఉత్తీర్ణులు ఐఈఎస్‌కు అర్హులు. మరిన్ని వివరాలకు www.upsc.gov.in చూడొచ్చు.
వేతనాలు: టెలికాం ఇంజనీర్లకు ప్రారంభంలో ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వేతనాలు అందుతాయి. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి మరింత ఎక్కువ ఆదాయం గడించొచ్చు. నాన్‌టెక్నికల్ విభాగంలో పనిచేసేవారికి ప్రారంభంలో నెలకు రూ.15,000 వేతనం ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, డొమైన్ నాలెడ్జ్ ఉన్నవారు మరింత ఎక్కువ సంపాదించొచ్చు.

- స్కూల్ ఆఫ్ టెలికాం లీడర్‌షిప్ ( www.sotlglobal.com ).. సర్టిఫైడ్ ఫైబర్ ఆప్టిక్స్ నెట్‌వర్క్ ఇంజనీర్, సర్టిఫైడ్ ఆప్టికల్ ఫైబర్ స్ల్పైసర్, సర్టిఫైడ్ ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్, సర్టిఫైడ్ టెలికాం వైర్‌లెస్ నెట్‌వర్క్ ఇంజనీర్, సర్టిఫైడ్ టెలికాం బీఎస్‌ఎస్ ఇంజనీర్, సర్టిఫైడ్ టెలికాం ట్రాన్స్‌మిషన్ ఇంజనీర్ కోర్సులు అందిస్తోంది.
- మాదాపూర్‌లోని ఐ.ఎస్.టి.టి.ఎం టెక్నాలజీ బిజినెస్ స్కూల్ ( www.isttm.com ).. ఎంబీఏ టెలికాం అండ్ ఐటీ మేనేజ్‌మెంట్, వివిధ సర్టిఫికేషన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
- గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్‌సీఐ)లో సీసీఈ-కాల్‌సెంటర్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, టవర్ టెక్నీషియన్, హ్యాండ్‌సెట్ రిపేర్ ఇంజనీర్(లెవల్-2), ఆప్టికల్ ఫైబర్ స్లైఫ్సర్ , ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ కోర్సులున్నాయి.
వెబ్‌సైట్: www.escihyd.org.
- సిటీలో కొలువైన కేంద్ర ప్రభుత్వ సంస్థ.. నేషనల్ అకాడమీ ఆఫ్ టెలికాం ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఎంబీఏలో టెలికాం మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ టెలికాం టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ తదితర కోర్సులను అందిస్తోంది.
వెబ్‌సైట్: www.natfm.bsnl.co.in
టెలికాం రంగంలో మేనేజ్‌మెంట్/అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క్, మార్కెటింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్‌కేర్ తదితర విభాగాలు కీలకం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్), రక్షణ రంగం, టెలికాం డిపార్ట్‌మెంట్, భారతీయ రైల్వే, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రక్షణ పరిశోధన- అభివృద్ధి సంస్థ ( డీఆర్‌డీవో), బిర్లాగ్రూప్, రిలయన్స్ తదితర సంస్థలు.. ఉద్యోగ నియామకాలకు ఖాళీలను బట్టి ప్రకటనలను విడుదల చేస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ల నియామకానికి ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)ను నిర్వహిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపికైన వారిని జూనియర్ టెలికాం ఆఫీసర్(జనరల్ సెంట్రల్ సర్వీస్ - గ్రూప్-బి), ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ - గ్రూప్-ఏ, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్), ఇండియన్ సప్లై సర్వీస్, అసిస్టెంట్ నేవల్ స్టోర్ ఆఫీసర్స్, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ వంటివాటిలో నియమిస్తారు. సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్ ఉత్తీర్ణులు ఐఈఎస్‌కు అర్హులు. మరిన్ని వివరాలకు www.upsc.gov.in చూడొచ్చు.
వేతనాలు: టెలికాం ఇంజనీర్లకు ప్రారంభంలో ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వేతనాలు అందుతాయి. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి మరింత ఎక్కువ ఆదాయం గడించొచ్చు. నాన్‌టెక్నికల్ విభాగంలో పనిచేసేవారికి ప్రారంభంలో నెలకు రూ.15,000 వేతనం ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, డొమైన్ నాలెడ్జ్ ఉన్నవారు మరింత ఎక్కువ సంపాదించొచ్చు.
టెలికాం రంగంలో విస్తృత అవకాశాలు ‘‘టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్న ట్రెండ్‌లో టెలికాం కంపెనీలు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిపుణులను నియమించుకుంటున్నాయి. గ్రాడ్యుయేట్స్‌కే కాకుండా పదోతరగతి, ఇంటర్మీడియట్, ఎంబీఏ ఉత్తీర్ణులకు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాం. ఇంజనీరింగ్, ఎంబీఏ కోర్సుల కరిక్యులంలో లేని వివిధ అంశాలపై కూడా శిక్షణ ఇస్తున్నాం. దీని ద్వారా విద్యార్థులు ఆయా అంశాలపై పట్టు సాధిస్తున్నారు. కోర్సులు పూర్తయిన వెంటనే అధికశాతం విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. ఎన్.కల్యాణ్ సాగర్, చీఫ్ జనరల్ మేనేజర్ , నాట్‌ఫాం |
Published date : 15 Oct 2014 02:37PM