Skip to main content

కోవిడ్ కారణంగా ఎంపిక ప్రక్రియలో మార్పులు.. ఆఫ్ క్యాంపస్ నియమకాల్లోనూ ఆశాజనకమే..

పస్తుతం కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో.. పలు సంస్థలు ఎంపిక ప్రక్రియలోనూ మార్పులు చేస్తున్నాయి.

వర్చువల్ ఇంటర్వ్యూలు, వర్చువల్ హ్యాకథాన్, కోడ్‌థాన్స్ వంటి వాటిని నిర్వహిస్తున్నాయి. వీటిలో మెరుగ్గా రాణిం చాలంటే.. ముందుగా ఆయా నైపుణ్యాలపై పట్టు తప్పనిసరి. ఈ వర్చువల్ టెక్నాలజీస్‌పైనా సమగ్ర అవగాహన ఏర్పరచుకోవాలి.

ఆఫ్-క్యాంపస్ నియామకాలు..
క్యాంపస్ రిక్రూట్‌మెంట్ అవకాశం లేని విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గం.. ఆఫ్ క్యాంపస్ నియామకాలు. దీనికి మార్గం... ఆయా సంస్థల వెబ్‌సైట్స్‌ను సందర్శించి వారు నిర్వహించే ఆఫ్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ సమాచారాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు టైర్-2, టైర్-3 ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా తదుపరి రౌండ్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి.. నియామకాలు ఖరారు చేస్తున్నాయి. ఆన్-క్యాంపస్ డ్రైవ్స్ అవకాశం లేని విద్యార్థులు.. ఈ ఆన్‌లైన్ టెస్ట్‌లలో విజయం సాధించే దిశగా కృషి చేయాలి.

టెక్, ఐటీ రిక్రూట్‌మెంట్ ట్రెండ్స్... ముఖ్యాంశాలు

  • రానున్న రోజుల్లో పుంజుకోనున్న ఐటీ, టెక్ నియామకాలు.
  • ఫెషర్స్ రిక్రూట్‌మెంట్స్ చేపడతామంటున్న 75 శాతం సంస్థలు.
  • టాప్ సెక్టార్లుగా ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, ఫిన్-టెక్, ఈ-కామర్స్, ఈ-లెర్నింగ్, హెల్త్‌కేర్ రంగాలు.
  • డిజిటల్ నైపుణ్యాలున్న వారికి పెద్దపీట వేస్తున్న సంస్థలు.
  • ఆఫ్-క్యాంపస్ నియామకాల్లో ఆన్‌లైన్ టెస్ట్‌ల ద్వారా ఎంపిక ప్రక్రియ.


ఇంకా చదవండి: part 6: కంపెనీలు కొత్త నియమకాలపై దృష్టి పెట్టినందున..

Published date : 25 Dec 2020 01:38PM

Photo Stories