ఆటోమేషన్ ఎఫెక్ట్‌తో...కొలువుల తీరు మారుతోంది !
Sakshi Education
కొన్నేళ్లుగా ఉద్యోగాల హరివిల్లుగా విరాజిల్లుతున్న ఐటీ రంగంలో కొలువుల కోత కొనసాగనుందా..! ఆటోమేషన్ ప్రభావంతో మానవ వనరుల అవసరం తగ్గనుందా! బీపీవో మొదలు బగ్ గుర్తించే టెస్టింగ్ రంగాల్లో కుదుపు తప్పదా!?..
అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే అటోమేషన్ ప్రభావంతో ఐటీతో పాటు వివిధ రంగాల్లో ఉద్యోగ భదత్ర మిణుకు మిణుకు మంటోంది. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), ఆటోమేషన్ మరింతగా విస్తరించి.. ప్రస్తుతం ఉనికిలో ఉన్న అనేక ఉద్యోగాలు కనుమరుగవుతాయని అంచనా. ఇలాంటి పరిస్థితిలో సదరు ఆటోమేషన్, ఏఐ ప్రభావిత రంగాల్లో పనిచేస్తున్న వారికి ప్రత్యామ్నాయ మార్గాలేంటి? మున్ముందు ఎలాంటి టెక్నాలజీ, నైపుణ్యాలకు డిమాండ్ ఉంటుంది? తదితర అంశాలను తెలుసుకుందాం..
ఐటీ రంగంలో కొలువుల కోతతో ఉద్యోగ భద్రత సవాలుగా మారింది. పని చేస్తున్న సంస్థ ఏదైనా, జాబ్ ఎలాంటిదైనా.. అనుభవం ఎంతున్నా.. పింక్ స్లిప్ ఏ క్షణమైనా అందే ఆస్కారం! కారణం.. క్షణం క్షణం మారిపోతున్న టెక్నాలజీ!! దాంతో కంపెనీల అవసరాలు మారిపోయి.. తద్వారా కొలువుల తీరును మార్చేస్తోంది. ఆటోమేషన్ ప్రభావంతో 2021 నాటికి దేశంలో సుమారు 5 లక్షల ఉద్యోగాలు రిస్కులో పడతాయని తాజా సర్వేల్లో తేలింది. ప్రస్తుతం అమల్లో ఉన్న టెక్నాలజీ పనికిరాకుండా పోయి... దాని స్థానంలో కొత్త టెక్నాలజీ వస్తుందని... ఫలితంగా కొత్త రకాల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగులు, రొటీన్ పనులు చేసే వారు ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోతారని అంచనా.
భద్రత లేని టెస్టింగ్ :
ఉద్యోగ భద్రత లేని జాబితాలో ఉన్న టెక్నాలజీల్లో ముందు వరుసలో ఉన్నది.. టెస్టింగ్. మ్యానువల్ సాఫ్ట్‌వేర్ టెస్టర్లను వదిలించుకోవడానికి సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్లను నియమించుకునేందుకు ఐటీసంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. వీరు ఆటోమెటేడ్ టెస్టింగ్‌తోపాటు, మ్యానువల్ టెస్టింగ్‌కు సంబంధించిన టాస్కులు కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆటోమెటిక్ టెస్టింగ్ వెబ్ అప్లికేషన్, సెలీనియం వంటి అప్లికేషన్లపై పట్టున్నవారికి కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. మ్యానువల్ సాఫ్ట్‌వేర్ టెస్టర్స్.. తమ ఉద్యోగం కాపాడుకునేందుకు ఆటోమేటేడ్ టెస్టింగ్ టూల్స్ నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరితోపాటు క్యూఏ ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజనీర్లు మొదలైన ఉద్యోగాలు చేస్తుంటే.. తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం మంచిది.
బీపీవోలో కుదుపు :
డేటాఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తదితర బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ (బీపీఓ) ఉద్యోగాలు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ప్రభావంతో పెద్దయెత్తున కుదుపునకు గురయ్యే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. లోస్కిల్డ్ విభాగానికి చెందిన ఈ ఉద్యోగాల్లో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్‌పీఏ) కారణంగా 31 శాతం మేర కోత పడనున్నట్లు తెలుస్తోంది. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సదరు రంగంలోని కంపెనీలు కొత్తగా అమలు చేస్తున్న టెక్నాలజీలో తమ నైపుణ్యాలను సానబెట్టుకోవాలి. లేదాఇతర ఆకర్షణీయమైన రంగంలోకి మారిపోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. బీపీవో రంగంలో ఉద్యోగాలు కోల్పోయే దేశాల్లో ఇండియా, యూకే, యూఎస్‌ఏలు ముందు వరుసలో ఉండనున్నాయి.
నిర్వహణలోనూ కోతే..
సాఫ్ట్‌వేర్ రంగంలో మెయింటెనెన్స్, మౌలిక వసతులపై వ్యయం ఎక్కువగా ఉంటుంది. మున్ముందు సంస్థలు ఈ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి. ఇందులో భాగంగా సర్వర్ మెయింటెనెన్స్, మెయింటెన్స్ ఇంజనీర్ల ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడనున్నాయి. కంపెనీలు తమ ఉత్పత్తులను క్లయింట్లకు డెలివరీ చేశాక... సదరు ఉత్పత్తిలో ఏవైనా తప్పులు దొర్లినా, డిజైన్ ఎర్రర్స్ ఉన్నా వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ లోపాలు సరిదిద్దే మెయింటెనెన్స్ ఇంజనీర్లు ఉంటారు. అయితే కృత్రిమ మేధస్సు (ఏఐ)తో ఈ లోపాలను సరిచేసే టెక్నాలజీ వచ్చేస్తోంది. దాంతో ఆయా ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయి. అలాగే మౌలికవసతుల నిర్వహణలో ముఖ్యంగా ఉన్న సిస్టమ్ ఇంజనీర్, ఐటీ ఆపరేషన్స్ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాల నియామకాలపైనా ఆటోమేషన్, కృత్రిమ మేధ ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లోస్కిల్డ్‌పై అధిక ప్రభావం :
మానవ ప్రమేయం లేకుండా తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడం, ఉత్పాదకతను పెంచుకోవడం కోసం కంపెనీలు ఆటోమేషన్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దసంఖ్యలో ఉద్యోగులు తొలగింపునకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా లోస్కిల్డ్ (తక్కువ నైపుణ్యం) అవసరం ఉన్న ఉద్యోగాల్లో నియామకాలు ఇప్పటికే భారీగా తగ్గుముఖం పట్టాయి. అదేవిధంగా ఐటీ, ఐటీఈఎస్ (బీపీవో, కేపీవో, ఆర్‌పీవో) విభాగాల్లో నియామకాలు పడిపోనున్నాయి. ఆటోమేషన్ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులు చేసే పనిని ప్రోగ్రామింగ్ ద్వారా మెషిన్లు చేస్తాయి. లోస్కిల్డ్ ఉద్యోగాలు తగ్గినా.. మిడిల్ లెవల్ ఉద్యోగాల్లో మాత్రం పెరుగుదల కనిపిస్తుందని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రోగ్రామింగ్, డిజైనింగ్, పర్యవేక్షణ, మిడిల్ మేనేజ్‌మెంట్ వంటి మధ్యస్థాయి ఉద్యోగాల నియామకాల్లో పెరుగుదల కనిపిస్తుంది.
సృజనకు పెద్దపీట :
ఆటోమేషన్ ప్రభావం ఎంతున్నా.. సృజనాత్మకత ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఢోకా ఉండదు. ఉన్నత స్థాయి నైపుణ్యాలు ఉన్నవారికి ఆటోమేషన్ మరింత ప్రయోజనం చేకూర్చనుంది. క్లయింట్ సంస్థలకు సేవలందించడం, క్లయింట్ల అవసరాలు తెలుసుకోవడం, వాటికి అనుగుణంగా రూపొందించాల్సిన ప్రోగ్రామ్స్ డిజైన్, అమలు పరంగా క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ తదితర కీలక నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు కంపెనీలు స్వాగతం పలుకుతున్నాయి.
జాబ్స్.. హాట్‌కేక్స్
డిమాండ్ ఉన్న కోర్సులు..
రాబోయే కాలంలో డిమాండ్ ఉండే కోర్సుల్లో ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ, డెవలప్‌మెంట్-ఆపరేషన్స్, బిగ్‌డేటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తదితర విభాగాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న సీనియర్లలో నాలుగు నుంచి పదేళ్ల అనుభవమున్న 50 శాతం ఐటీ నిపుణులు ట్రైనింగ్ ప్రోగ్రాములు, ఆన్‌లైన్ కోర్సుల్లో చేరుతున్నారు. వీరు ఎక్కువగా దృష్టిసారిస్తున్న డొమైన్లలో బిగ్‌డేటా అండ్ అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్; సైబర్ సెక్యూరిటీ, ఏజైల్ అండ్ స్క్రమ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు ఉన్నాయి.
పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు..
ఆటోమేషన్ అనివార్యమవుతున్న తరుణంలో ఔత్సాహికులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటలైజేషన్ టూల్స్, ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) టూల్స్, క్లౌడ్ టెక్నాలజీస్, రిమోట్ బేస్డ్ ప్రోగ్రామింగ్స్, కంప్యూటర్ ఎయిడెడ్ ప్రోగ్రామ్స్ డిజైన్, డెవలప్‌మెంట్, రోబోటిక్స్, అప్లికేషన్ స్కిల్స్‌పై దృష్టిసారించాలి. వీటితోపాటు డిజిటల్ మార్కెటింగ్ డిజైన్, యూజర్ ఇంటర్‌ఫేస్ (యూఐ) టెక్నాలజీస్, డేటాసైన్స్, ఐఫోన్ అప్లికేషన్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఏడబ్ల్యూస్, సేల్స్‌ఫోర్స్ తదితర క్లౌడ్ టెక్నాలజీలు, యాంగులర్ జేఎస్, నోడ్ జేఎస్, డేటా అనలిటిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, హడూప్, స్పార్క్, జావా తదితర సాంకేతికతలకు డిమాండ్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

- వెబ్ ప్రొడక్షన్ లీడ్.
- ప్రొడక్ట్ డిజైనర్.
- డేటా సైంటిస్ట్.
- డిజిటల్ మార్కెటింగ్ హెడ్.
- మొబైల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఇంజనీర్.
- ప్రొడక్ట్ డెవలపర్.
- యాక్చువరీ.
- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనాలసిస్.
- రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇంజనీర్.
- క్వాలిటీ అస్యూరెన్స్ అనాలసిస్.
డిమాండ్ ఉన్న కోర్సులు..
రాబోయే కాలంలో డిమాండ్ ఉండే కోర్సుల్లో ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ, డెవలప్‌మెంట్-ఆపరేషన్స్, బిగ్‌డేటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తదితర విభాగాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న సీనియర్లలో నాలుగు నుంచి పదేళ్ల అనుభవమున్న 50 శాతం ఐటీ నిపుణులు ట్రైనింగ్ ప్రోగ్రాములు, ఆన్‌లైన్ కోర్సుల్లో చేరుతున్నారు. వీరు ఎక్కువగా దృష్టిసారిస్తున్న డొమైన్లలో బిగ్‌డేటా అండ్ అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్; సైబర్ సెక్యూరిటీ, ఏజైల్ అండ్ స్క్రమ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు ఉన్నాయి.
పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు..
ఆటోమేషన్ అనివార్యమవుతున్న తరుణంలో ఔత్సాహికులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటలైజేషన్ టూల్స్, ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) టూల్స్, క్లౌడ్ టెక్నాలజీస్, రిమోట్ బేస్డ్ ప్రోగ్రామింగ్స్, కంప్యూటర్ ఎయిడెడ్ ప్రోగ్రామ్స్ డిజైన్, డెవలప్‌మెంట్, రోబోటిక్స్, అప్లికేషన్ స్కిల్స్‌పై దృష్టిసారించాలి. వీటితోపాటు డిజిటల్ మార్కెటింగ్ డిజైన్, యూజర్ ఇంటర్‌ఫేస్ (యూఐ) టెక్నాలజీస్, డేటాసైన్స్, ఐఫోన్ అప్లికేషన్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఏడబ్ల్యూస్, సేల్స్‌ఫోర్స్ తదితర క్లౌడ్ టెక్నాలజీలు, యాంగులర్ జేఎస్, నోడ్ జేఎస్, డేటా అనలిటిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, హడూప్, స్పార్క్, జావా తదితర సాంకేతికతలకు డిమాండ్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Published date : 10 Apr 2018 01:41PM