కెరీర్ విత్ కామర్స్
Sakshi Education
ప్రపంచీకరణ నేపథ్యంలో.. వాణిజ్యరంగంలో వచ్చిన మార్పులు.. వ్యాపార లావాదేవీలు రోజురోజుకీ విస్తృతమవుతున్న తరుణంలో.. అకౌంటింగ్ కార్యకలాపాలు తప్పనిసరిగా మారాయి. ఈ క్రమంలో కామర్స్ కోర్సులు చేసిన అభ్యర్థులకూ డిమాండ్ పెరుగుతోంది. ఎగుమతి, దిగుమతి సుంకాలు, పన్నుల విధానం, జమాఖర్చు పద్దుల నిర్వహణలో వాణిజ్యశాస్త్ర నిపుణుల అవసరం బాగా ఏర్పడుతోంది. దాంతో వాణిజ్యశాస్త్రం.. అవకాశాల అస్త్రంగా మారింది. విద్యా, ఉద్యోగాల పరంగా కామర్స్‌తో ఉన్న అవకాశాలపై కెరీర్ గెడైన్స్ మీ కోసం!!
చక్కటి కెరీర్‌కు మార్గం సుగమమం చేస్తున్న విభాగాల్లో కామర్స్ ఒకటి. కామర్స్ విభాగానికి సంబంధించి ఇంటర్మీడియెట్ నుంచి పీహెచ్‌డీ వరకూ.. వివిధ స్థాయిల్లో పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా స్థాయిల్లోని కోర్సులను ఎంచుకోవడం ద్వారా కామర్స్‌తో కెరీర్ ప్రారంభించవచ్చు.
ఇంటర్మీడియెట్ ఇలా:
పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ స్థాయిలో కామర్స్ విభాగాన్ని ఎంచుకోవడానికి రెండు గ్రూపులు ఉన్నాయి. అవి.. సీఈసీ, ఎంఈసీ. కామర్స్‌కు సంబంధించి ఇవి ప్రాథమిక కోర్సులు. వీటి తర్వాత డిగ్రీ స్థాయిలో బీకామ్ కోర్సు అందుబాటులో ఉంది.
బీకామ్.. ఎన్నో కాంబినేషన్స్:
బీకామ్‌లో.. బీకామ్ జనరల్, బీకామ్ ఆనర్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీకామ్ జనరల్ కంటే ఇతర వాటిల్లో సిలబస్ పరిధి కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన కాలేజీలు (ఉదాహరణకు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్-హైదరాబాద్) బీకామ్-మార్కెటింగ్, బీకామ్-ఫారెన్ ట్రేడ్ తదితర స్పెషలైజేషన్స్‌తో బీకామ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
అర్హత: ఇంటర్మీడియెట్(సీఈసీ/ఎంఈసీ). ఇంటర్మీడియెట్-నాన్ కామర్స్ విద్యార్థులు కూడా బీకామ్ కోర్సులో చేరొచ్చు. వీరికి ప్రవేశాల్లో 20 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
స్పెషలైజేషన్స్ వివరాలు:
బీకామ్ జనరల్: ఇందులో ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఎకనామిక్స్, ఐటీ, అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్, ట్యాక్సేషన్, బిజినెస్ లా, కార్పొరేట్ అకౌంటింగ్ వంటి అంశాలను బోధిస్తారు.
బీకామ్-ఆనర్స్ : సీఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల అధ్యయనాన్ని బీకామ్ ఆనర్స్ సులభతరం చేస్తుంది.
బీకామ్-కంప్యూటర్స్: పరిశ్రమ అవసరాలకనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మిళితం చేసి ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఎకనామిక్స్, సీ లాంగ్వేజ్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఈ-కామర్స్ తదితర అంశాలను బోధిస్తారు.
బీకామ్-ఫారెన్ ట్రేడ్: ఫారెన్ ట్రేడ్ సంబంధిత అంశాల కేంద్రీకృతంగా ఈ కోర్సు ఉంటుంది. ఇందులో ఫైనాన్షియల్ అకౌంటింగ్, అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్ వంటి రెగ్యులర్ అంశాలతోపాటు ఇండియాస్ ఫారెన్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్ ఫైనాన్సింగ్ అండ్ ప్రొసీజర్స్, డాక్యుమెంటేషన్ వంటి అంశాలుంటాయి.
బీకామ్ అడ్వర్‌టైజింగ్: ఇందులో ఫైనాన్షియల్ అకౌంటింగ్, అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్ వంటి రెగ్యులర్ అంశాలతోపాటు అడ్వర్‌టైజింగ్, పర్సనల్ సెల్లింగ్ అండ్ సేల్స్‌మెన్‌షిప్, సేల్స్ ప్రమోషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వంటి అడ్వర్‌టైజింగ్ కేందీకృత అంశాలను బోధిస్తారు.
-అదే విధంగా ట్యాక్సెస్ సంబంధిత అంశాల కేంద్రీకృతంగా బీకామ్-ట్యాక్స్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ ప్రధానంగా బీకామ్-మార్కెటింగ్ స్పెషలైజేషన్లను ఆఫర్ చేస్తున్నారు.
బీకామ్ బెస్ట్:
ఇతర కోర్సులతో పోల్చితే బీకామ్ ఉత్తమ కోర్సుగా ఎదగడానికి దీనితో ముడిపడి ఉన్న ఉపాధి, ఉద్యోగావకాశాలే కారణం. ప్రపంచీకరణలో భాగంగా సేవల రంగం(సర్వీసెస్ సెక్టార్) ప్రాధాన్యం పెరిగింది. దాంతో పరిశ్రమలు, వాటి ఆర్థిక లావాదేవీల నిర్వహణకు కామర్స్ పరిజ్ఞానం అనివార్యమై కామర్స్ గ్రాడ్యుయేట్లకు డిమాండ్ పెరిగింది. దాంతోపాటు బీకామ్ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఎంకామ్ వంటి సంప్రదాయ కోర్సులు చేసే వెసులుబాటు, సీఏ తరహా జాబ్ ఓరియెంటెండ్ కోర్సులు చేసే అవకాశం.. ఇలా మూడు విధాలైన మార్గాలు ఉండడం కూడా బీకామ్‌ను బెస్ట్ కోర్సుగా మార్చాయి.
పీజీ:
బీకామ్ తర్వాత పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్స్‌తో ఎంకామ్ పూర్తి చేయవచ్చు. అవి.. ఫైనాన్స్, అకౌంటింగ్, టాక్సేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (హెచ్‌ఆర్‌ఎం). వీటిల్లో ప్రస్తుతం ఫైనాన్స్, అకౌంటింగ్ స్పెషలైజేషన్స్‌కు మంచి డిమాండ్ ఉంది.
అర్హత: బీకామ్/బీకామ్ ఆనర్స్.
ప్రవేశం: ఆయా యూనివర్సిటీలు నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా.
వినూత్న స్పెషలైజేషన్స్:
జాబ్ మార్కెట్‌లో ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని యూనివర్సిటీలు ఎంకామ్‌లో వినూత్న స్పెషలైజేషన్స్‌ను అందిస్తున్నాయి. అవి.. ఎంకామ్-ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంకామ్-ఫైనాన్స్ అండ్ కంట్రోల్ (ఉస్మానియా యూనివర్సిటీ, వెబ్‌సైట్: www.osmania.ac.in), ఎంకామ్- కార్పొరేట్ సెక్రటరీషిప్, ఎంకామ్-ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ (ఆంధ్రా యూనివర్సిటీ, వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in), మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ (ఎస్వీ యూనివర్సిటీ, వెబ్‌సైట్: www.svuniversity.in), ఎంఎస్సీ-ఫైనాన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (భారతియార్ వర్సిటీ -వెబ్‌సైట్: www.bu.ac.in), మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కంట్రోల్ (మధురై కామరాజ్ వర్సిటీ, వెబ్‌సైట్: www.mkuniversity.org).
అర్హత: బీకామ్/బీకామ్ ఆనర్స్/యూనివర్సిటీ నిర్దేశించిన డిగ్రీ.

పీహెచ్‌డీ:
పీజీ తర్వాత ఆసక్తి ఉంటే.. పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. పీహెచ్‌డీలో కూడా పీజీలోని స్పెషలైజేషన్స్ ఉంటాయి. యూజీసీ-నెట్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. ఈ క్రమంలో జేఆర్‌ఎఫ్ సాధిస్తే ఫెలోషిప్ కూడా లభిస్తుంది. నెట్ క్వాలిఫై అయితే డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా స్థిరపడొచ్చు.
మేనేజ్‌మెంట్ కోర్సులు:
మేనేజ్‌మెంట్‌వైపు ఆసక్తి ఉంటే.. సీఈసీ/ఎంఈసీ తర్వాత విద్యార్థులు బ్యాచిలర్ స్థాయిలో బీబీఏ(బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), బీబీఎం(బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సులను ఎంచుకోవచ్చు. మన రాష్ట్రంలోని కొన్ని కాలేజీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. మేనేజ్‌మెంట్ విద్యకు సంబంధించి వీటిని ప్రాథమిక కోర్సులుగా పేర్కొనవచ్చు. ఈ రంగంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలంటే.. పీజీ స్థాయిలో ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిల్లో చేరడానికి రాష్ట్ర స్థాయిలో ఐసెట్(ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్), జాతీయ స్థాయిలో క్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఎక్స్‌ఏటీ వంటి ప్రవేశ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.
సాంకేతిక పరిజ్ఞానం:
వివిధ సంస్థలకు సంబంధించిన అకౌంట్లను గతంలో రికార్డులు రాసి సరి చూసేవారు. కానీ నేటి కంప్యూటర్ యుగంలో ఇప్పుడా పద్ధతికి కాలం చెల్లింది. కంప్యూటర్స్‌పైనే అన్నిరకాల అకౌంట్లకు సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందుకోసం అనేక రకాల కంప్యూటర్ సాఫ్ట్‌వేర్లు అందుబాటులోకి వచ్చాయి. అకౌంటింగ్‌కు సంబంధించిన పలు కార్యకలాపాలను అప్పటికే రూపొందించిన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రాక్టికల్‌గా అన్వయించడం ఈ సాఫ్ట్‌వేర్ అకౌంటింగ్ ప్యాకేజ్‌ల ముఖ్యోద్దేశం. అవి..ట్యాలీ 9.0(www.tallysolutions.com ), వింగ్స్(www.wingsinfo.net), పీచ్‌ట్రీ (www.peachtreefinancial.com) వంటివి. బ్యాచిలర్, పీజీ కోర్సులకు అనుబంధంగా వీటని నేర్చుకుంటే.. జాబ్ మార్కెట్లో అదనపు అర్హతగా ఉపయోగపడతాయి. సొంతంగా ట్యాక్స్ ప్రాక్టీషనర్లుగా స్థిరపడాలనుకున్న వారికి కూడా ఈ ప్యాకేజ్‌లు ఎంతో ప్రయోజనం చేకూర్చుతారుు. బ్యాచిలర్ /పీజీకి అకౌంటింగ్ ప్యాకేజ్ పరిజ్ఞానం కూడా తోడైతే జూనియర్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్స్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.
యాడ్ ఆన్ కోర్సులు:
కామర్స్ అభ్యర్థులు రెగ్యులర్ కోర్సులకు అదనంగా కొన్ని అదనపు(యాడ్ ఆన్) కోర్సులను చేయడం ద్వారా కెరీర్‌లో త్వరగా, ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది.
అవి..
సెబీ:
సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మూడు రకాల కోర్సులను అందిస్త్తుంది.
సర్టిఫికెట్ ఇన్ సెక్యూరిటీస్ ‘లా’స్: ఈ కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. ఎంబీఏ, ఎంకామ్, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ వంటి కామర్స్ నేపథ్యం ఉన్న వారికి అనువైన కోర్సుగా పేర్కొనొచ్చు. ఈ కోర్సు ప్రవేశ ప్రక్రియ ప్రతి ఏటా అక్టోబర్/ నవంబర్‌లలో మొదలవుతుంది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: అకడెమిక్ రికార్డ్ 20 శాతం వెయిటేజీ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. దీనికి కల్పించే వెయిటేజీ 60 శాతం. ఆ తర్వాత నిర్వహించే ఎస్సే రైటింగ్ (వెయిటేజీ 20)కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆయా వెయిటేజీలను గణించి తుది జాబితా ప్రకటిస్తారు.
సర్టిఫికెట్ ఇన్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్: ఇది కేవలం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఉద్దేశించిన కోర్సు. మొత్తం మూడు వందల గంటల వ్యవధిలో కోర్సు పూర్తిచేస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ.
ఎంపిక: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్ జాబితాలో నిలిచిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. సాధారణంగా ఈ కోర్సుకు నోటిఫికేషన్ మార్చి/ఏప్రిల్ నెలల్లో వెలువడుతుంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ సెక్యూరిటీస్ మార్కెట్:
వ్యవధి: ఏడాది
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీ.
ఎంపిక: ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా.
వెబ్‌సైట్: www.nism.ac.in
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)
ఈ సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు:
ఎంబీఏ - ఫైనాన్షియల్ మార్కెట్స్
వ్యవధి: రెండేళ్లు .
ఈ కోర్సును ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది.
అర్హత: 10+2+3 విధానంలో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: బీఎస్‌ఈ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ స్కోర్ లేదా క్యాట్ స్కోర్ ఆధారంగా(విదేశీ విద్యార్థులైతే జీమ్యాట్ స్కోర్ ఆధారంగా) మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి కోర్సుకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఈ కోర్సుకు సాధారణంగా డిసెంబర్/జనవరి నెలల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. దానికి అనుగుణంగా ఆన్‌లైన్ ద్వారా, ఇగ్నో స్టడీ సెంటర్ల ద్వారా, లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ద్వారా నిర్దేశిత ఫీజు చెల్లించి దరఖాస్తు కొనుగోలు చేసి పూర్తి చేసి పంపాల్సి ఉంటుంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్:
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత.
ఎంపిక: ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
బీఎస్‌ఈ ఆఫర్ చేస్తున్న మరికొన్ని కోర్సులు:

- గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ప్రోగ్రాం
- బేసిక్ కోర్స్ ఇన్ స్టాక్ మార్కెట్
- అడ్వాన్స్‌డ్ ప్రోగ్రాం ఆన్ స్టాక్ మార్కెట్
- ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అనాలిసిస్
- సర్టిఫికెట్ ప్రోగ్రాం ఆన్ కేపిటల్ మార్కెట్
- సర్టిఫికెట్ ప్రోగ్రాం ఆన్ కమొడిటీ అండ్ కరెన్సీ మార్కెట్స్.
వెబ్‌సైట్: www.bsebti.com,
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్స్ సర్టిఫికేషన్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్:
ఎన్‌సీఎంపీ (ఎన్‌ఎస్‌ఈ సర్టిఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్):
రిజిస్ట్రేషన్: ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్‌లోని ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లింక్‌లో ఉండే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిర్దేశిత ఫీజు మొత్తాన్ని చెల్లిస్తే పేరు నమోదు అవుతుంది. పేరు నమోదై రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించిన 180 రోజుల్లోపు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్
- పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్

అర్హత: యాభై శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి మెరిట్ జాబితాలో నిలిచిన వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.nseindia.com
నేషనల్ కమొడిటిస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛ్‌ంజ్ లిమిటెడ్
కోర్సు: ఎన్‌సీడీఈఎక్స్-కమొడిటి సర్టిఫికేషన్ కోర్సు
వెబ్‌సైట్: www.ncdex.com
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్
కోర్సు: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.nism.ac.in
ఈ కోర్సులను పూర్తి చేసినవారికి అవకాశాల విషయంలో ఢోకాలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్ విభాగానికి చెందిన గ్రాడ్యుయేట్స్ లభ్యత ఉన్నప్పటికీ.. కరిక్యులంను పరిగణనలోకి తీసుకుంటే స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో అవగాహన తక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో కామర్స్ నేపథ్యంతో పైన పేర్కొన్న కోర్సులను పూర్తి చేసిన వారికి విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పొచ్చు. వీరికి.. బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు, స్టాక్ ట్రేడింగ్ సంస్థలు, మ్యూచువల్‌ఫండ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.
తోడుగా ‘లా’:
కామర్స్ గ్రాడ్యుయేట్లకు న్యాయశాస్త్రంలోనూ పట్టా ఉంటే ఎన్నో అవకాశాలు సొంతమవుతాయి. న్యాయ శాస్త్రంలో బోధించే ఇంటర్నేషనల్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కార్పొరేట్ అకౌంటెన్సీ, టాక్స్ లా తదితరాలన్నీ వాణిజ్య రంగంలోని లోటుపాట్లను సులువుగా తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి కామర్స్‌కు తోడుగా ‘లా’ ఉండడం కెరీర్ పరంగా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ క్రమంలో ‘లా’ కోర్సులో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో లాసెట్ (లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్), జాతీయ స్థాయిలో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్), ఏఐఎల్‌ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్), లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియా (ఎల్‌శాట్) తదితర ప్రవేశ పరీక్షలకు హాజరు కావచ్చు.
సీఏ/సీఎస్/సీఎంఏ:
ఇంజనీరింగ్, మెడిసిన్, కంప్యూటర్ కోర్సులకు దీటుగా సత్వర ఉద్యోగానికి ధీమా ఇచ్చే కోర్సులు... ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహిస్తున్న చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అందిస్తున్న కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ), ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్‌ఐ) నిర్వహిస్తున్న కంపెనీ సెక్రటరీషిప్(సీఎస్) కోర్సులు. ఇంటర్‌లో చదివిన గ్రూప్‌తో నిమిత్తం లేకుండా.. ఎవరైనా ఈ కోర్సుల్లో చేరే వీలున్నప్పటికీ.. కామర్స్ విద్యార్థులకు ఇవి సౌలభ్యంగా ఉంటారుు. ఎందుకంటే.. కామర్స్‌లో చదివిన సబ్జెక్టులే అధిక శాతం వరకు ఆయా కోర్సులో ఉంటాయి. కాబట్టి వీటి అధ్యయనం సులభతరం అవుతుంది. అంతేకాకుండా సీఏలో.. డిగ్రీ లేదా పీజీలో 55 శాతం మార్కులు సాధించిన కామర్స్ గ్రాడ్యుయేట్లకు సీపీటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. వీరు నేరుగా రెండో దశ ఐపీసీసీలో చేరొచ్చు. ఇవేకాకుండా ఐసీఏఐ ప్రవేశపెట్టిన నూతన కోర్సు అకౌంటింగ్ టెక్నీషియన్. సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తి చేయలేను అని భావిస్తే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తి చేసి, ఒక ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్‌తో అకౌంటెంట్‌గా నెలకు రూ.25,000 వేతనం పొందొచ్చు.
ఉన్నతంగా స్థిరపడాలంటే:
కామర్స్ విభాగంతో ఉన్నతస్థానంలో స్థిరపడాలంటే మాత్రం పీజీ తప్పనిసరి. దీనికి తోడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, బజాజ్ క్యాపిటల్ వంటి ఫైనాన్షియల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ ఆఫర్ చేస్తున్న మ్యాడుల్స్‌లో.. ఒకదాంట్లో సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేస్తే భవిష్యత్‌కు ఎటువంటి ఢోకా ఉండదు. ముఖ్యంగా కామర్స్ బ్యాగ్రౌండ్‌తో ఈ తరహా సర్టిఫికెట్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఫైనాన్షియల్ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి.
స్కిల్స్:
కామర్స్ స్ట్రీమ్‌ను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు కెరీర్‌లో రాణించాలంటే కొన్ని స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి.

- చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్
- ఇంగ్లిష్ భాషపై పట్టు
- తాజా మార్పులకనుగుణంగా కంప్యూటర్ నాలెడ్జ్
- సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ వంటి కీలక సబ్జెక్ట్‌లపై సమగ్ర అవగాహన
ఉద్యోగావకాశాలు:
ప్రపంచీకరణ నేపథ్యంలో.. కామర్స్ అభ్యర్థులకు అవకాశాలకు ఢోకా లేదని చెప్పొచ్చు. చిన్న చిట్‌ఫండ్ కంపెనీ నుంచి మల్టీనేషనల్ కంపెనీల వరకు అకౌంట్స్ రాయడానికి కామర్స్ గ్రాడ్యుయేట్ల అవసరం. ఈ క్రమంలో బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, అవుట్ సోర్సింగ్ కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థలు, ఆడిటింగ్ ఫర్మ్స్ సంబంధిత కంపెనీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఫైనాన్షియల్ మార్కెట్స్, కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. పీహెచ్‌డీ/నెట్ అర్హతతో టీచింగ్‌ను కూడా కెరీర్ ఎంచుకోవచ్చు.
ఈ క్రమంలో వివిధ రంగాల్లోని అవకాశాలను పరిశీలిస్తే..
ట్యాక్సేషన్:
ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, సంబంధిత సంస్థల్లో ట్యాక్స్ విభాగంలో ట్యాక్స్ అకౌంటెంట్, ట్యాక్స్ అనలిస్ట్, ట్యాక్స్ రిక్రూటర్, ట్యాక్స్ అడ్వైజర్, ట్యాక్స్ ఎగ్జామినర్స్‌గా స్థిర పడొచ్చు.
బ్యాంకింగ్:
ఇంటర్మీడియెట్‌లో సీఈసీ/ఎంఈసీ అభ్యర్థులు పలు బ్యాంకులు క్లరికల్ పోస్టులకోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీకామ్ పూర్తయ్యాక.. డిగ్రీ అర్హతగా ఎస్‌బీఐతోపాటు ఆయా ప్రభుత్వ, ప్రయివేట్ రంగ బ్యాంకుల ప్రొబేషనరీ ఆఫీసర్‌స నియామకాల కోసం నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చు. ప్రైవేట్ బ్యాంకులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా సీఏ, ఎంబీఏ, సీఎఫ్‌ఏ అర్హత ఉన్న అభ్యర్థులను నియమించుకుంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ వరకు ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.
ఇన్సూరెన్స్:
ఈ రంగంలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా అవకాశాలు ఉంటాయి.
క్యాపిటల్ మార్కెట్:
ఈ రంగంలో డెవలప్‌మెంట్ మేనేజర్స్, రిలేషన్‌షిప్ మేనేజర్స్, అడ్వైజర్స్, ఫండ్ మేనేజర్, పోర్ట్‌ఫోలియో మేనేజర్, ఫైనాన్షియల్ అనలిస్ట్ వంటి హోదాల్లో స్థిరపడొచ్చు.
వేతనాలు:
అకౌంటెంట్ అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభలో నెలకు రూ.15,000-20,000 వరకు వేతనం లభిస్తుంది. ఆ తర్వాత అర్హత అనుభవం ఆధారంగా లక్షల్లో సంపాదించవచ్చు. పీజీ డిగ్రీ అభ్యర్థులకు సరాసరి వేతనం రూ.50 వేల వరకు ఉంటోంది. పీజీతోపాటు అదనపు కోర్సులను పూర్తి చేస్తే కెరీర్ ప్రారంభంలోనే రూ. లక్ష వరకు వేతనంగా అందుకునే అవకాశముంది.
ఐఎఫ్‌ఆర్‌ఎస్ ప్రభావం:
ప్రపంచీకరణ నేపథ్యంలో.. వివిధ కంపెనీలు పలు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అకౌంట్స్‌కు సంబంధించి ఆయా దేశాల్లో విభిన్న పద్ధతులను అవలంబిస్తున్నారు. దీంతో కంపెనీలు అకౌంట్స్ విషయంలో పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు పరిష్కారంగా 2014 నుంచి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ (ఐఎఫ్‌ఆర్‌ఎస్) చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఒకే విధమైన అకౌంటింగ్ విధానం ఉండాలి. మన సిలబస్ ఐఎఫ్‌ఆర్‌ఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం కామర్స్ గ్రాడ్యుయేట్లకు కలిసొస్తుంది. ఫలితంగా విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
విదేశీ బ్యాంకులు:
ప్రస్తుతం అమెరికా వంటి దేశాలు ట్రేడ్, అకౌంట్స్ విషయంలో మన దేశంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. వారి వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అకౌంట్లు అన్నీ ఇక్కడే పూర్తి చేసి పంపిస్తున్నారు. అందులో భాగంగానే బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్‌ఎస్‌బీసీ, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి సంస్థలు ఇక్కడ నుంచే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం మన కామర్స్ గ్రాడ్యుయేట్లను ఎక్కువగా నియమించుకుంటున్నాయి. వీటిల్లో ఎంట్రీ లెవల్ ఎగ్జిక్యూటివ్‌గా చేరొచ్చు. అంతేకాకుండా విదేశాల్లో కూడా కామర్స్ బ్యాగ్రౌండ్‌తో మేనేజ్‌మెంట్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులను నియమించుకోవడానికి అక్కడి సంస్థలు ప్రాధాన్యతనిస్తున్నాయి.
కామర్స్ గ్రాడ్యుయేట్లు మిగతా అభ్యర్థులు మాదిరిగానే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు నిర్వహించే అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరు కావచ్చు.
టాప్ రిక్రూటర్స్:

- కార్వీ
- డెలాయిట్
- ఎన్‌ఎస్‌ఈ
- బీఎస్‌ఈ
- జెన్‌ప్యాక్ట్
- క్యాపిటల్ ఐక్యూ
- ఐసీఐసీఐ
జాతీయ స్థాయి టాప్ ఇన్‌స్టిట్యూట్స్:
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
-ఎంకామ్
అర్హత: బీకామ్ ఆనర్స్/బీకామ్/బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్)/బీబీఎస్/బీబీఏ / బీఐఎఫ్‌ఏ/బీబీఈ
ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
-ఎంఫిల్(అకౌంటింగ్, ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ డెవలప్‌మెంట్ స్పెషలైజేన్స్‌గా)
అర్హత: 55 శాతం మార్కులతో ఎంకామ్/ఎంఐబీ/ఎంహెచ్ ఆర్‌ఓడీ/ ఎంఎఫ్‌సీ/ఎంబీఏ
-పీహెచ్‌డీ
ప్రవేశం: రాత పరీక్ష, డెరైక్ట్ అడ్మిషన్స్ విధానంలో ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.commercedu.com
శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్-న్యూఢిల్లీ
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
-బీకామ్-ఆనర్స్
అర్హత: ఇంటర్మీడియెట్/తత్సమానం (అకౌంటెన్సీ, మ్యాథమెటిక్స్, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్‌లలో ఏదైనా ఒక సబ్జెక్ట్)
ప్రవేశం: మెరిట్ ఆధారంగా
-ఎంకామ్
అర్హత: బీకామ్
ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: www.srcc.edu
లయోలా కాలేజ్-చెన్నై
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
-బీకామ్
అర్హత: ఇంటర్మీడియెట్/10+2/తత్సమానం (కామర్స్, అకౌంటె న్సీ, మ్యాథ మెటిక్స్/బిజినెస్ మ్యాథ్స్/స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్/ఎకనామిక్స్‌లతో)
ప్రవేశం: మెరిట్ ఆధారంగా
-ఎంకామ్
అర్హత: బీకామ్/బీకామ్ (కార్పొరేట్)/బీకామ్ (బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్) /బీబీఎం
ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
-ఎంఫిల్
స్పెషలైజేషన్స్: అడ్వాన్స్‌డ్ బిజినెస్ స్ట్రాటజీ, రీసెర్చ్ మెథడాలజీ, ఎంటర్‌ప్రె న్యూషిప్/ మార్కెటింగ్/ఫైనాన్స్, డిసర్షన్.
-పీహెచ్‌డీ
వెబ్‌సైట్: www.loyolacollege.edu
సెయింట్ జేవియర్స్ కాలేజ్-కోల్‌కతా
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
-బీకామ్ (అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, కామర్స్ స్పెషలైజేషన్స్)
అర్హత: హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్/తత్సమానం (వెస్ట్ బెంగాల్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి లేదా కలకత్తా యూనివర్సిటీ గుర్తింపు ఉన్న బోర్డు నుంచి)
ప్రవేశం: మెరిట్ ఆధారంగా
-ఎంకామ్
అర్హత: బీకామ్ (ఆనర్స్), బీబీఏ
ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా.
వెబ్‌సైట్: www.sxccal.edu
ప్రెసిడెన్సీ కాలేజ్-చెన్నై
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
- బీకామ్ (కార్పొరేట్ సెక్రటరీషిప్ స్పెషలైజేషన్)
అర్హత: 12వ తరగతి/తత్సమానం
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రవేశం: మెరిట్ ఆధారంగా
-ఎంకామ్
అర్హత: బీకామ్
ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: www.presidencychennai.com
సింబయాసిస్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్-పుణే

వెబ్‌సైట్: https://symbiosiscollege.edu.in
సెయింట్ జేవియర్స్-ముంబై
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
-బీకామ్
అర్హత: 12వ తరగతి (సీబీఎస్‌ఈ/ఐఎస్‌సీ/ఇంటర్మీడియెట్ బోర్డ్‌ల నుంచి)
వెబ్‌సైట్: https://xaviers.edu
మన రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల పరిధిలో కామర్స్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కామర్స్ బెస్ట్
కెరీర్ పరంగా కామర్స్ ఉత్తమంగా మారడానికి దానితో ముడిపడి ఉన్న విద్యా, ఉపాధి, ఉద్యోగావకాశాలే కారణం. ప్రపంచీకరణలో భాగంగా సర్వీస్ సెక్టార్ ప్రాధాన్యం పెరిగింది. దీంతో పరిశ్రమలు, వాటి ఆర్థిక లావాదేవీల నిర్వహణకు కామర్స్ పరిజ్ఞానం అనివార్యమైంది. దీంతో కామర్స్ గ్రాడ్యుయేట్ల రిక్రూట్‌మెంట్ పెరిగింది. దానికితోడు బీకామ్ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఎంకామ్ వంటి సంప్రదాయ కోర్సులు చేసే వెసులుబాటు, సీఏ తరహా జాబ్ ఓరియెంటెండ్ కోర్సులు చేసే మూడు విధాలైన అవకాశాలు ఉండడం కూడా బీకామ్‌ను ప్రత్యేక కోర్సుగా మార్చాయి. కెరీర్‌లో ఉన్నతంగా స్థిరపడాలంటే మాత్రం పీజీతోపాటు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, బజాజ్ క్యాపిటల్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేస్తున్న సర్టిఫికెట్ కోర్సులను పూర్తి చేయాలి. కామర్స్ బ్యాక్ గ్రౌండ్‌తో ఈ తరహా కోర్సులను పూర్తి చేసిన వారికి ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇంగ్లిష్‌పై పట్టు, కంప్యూటర్ పరిజ్ఞానం, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే కెరీర్‌లో రాణించవచ్చు. మరే ఇతర కోర్సుల్లో లేని విధంగా పరిశ్రమ అవసరాలకనుగుణంగా సిలబస్‌ను ఎప్పటికప్పుడు ఆప్‌డేట్ చేస్తుండడం కూడా కామర్స్ విద్యార్థులకు వరంగా మారింది.
-ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,
హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్,
ఉస్మానియా యూనివర్సిటీ.

Published date : 18 Jun 2013 01:44PM