కెనరా బ్యాంక్‌లో 220 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. వివరాలు తెలుసుకోండిలా..
Sakshi Education
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ కెనరా బ్యాంక్.. స్కేల్-1, స్కేల్-2 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం 220 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో వివిధ కేటగిరీలకు చెందిన పోస్టులు ఉన్నాయి. షార్ట్‌లిస్టింగ్/రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ పోస్టులకు వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య: స్పెషలిస్ట్ ఆఫీసర్స్- 220
పోస్టుల వివరాలు..
ఇందులో బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్, ఈటీఎల్ స్పెషలిస్ట్, బీఐ స్పెషలిస్ట్, యాంటీ వైరస్ అడ్మినిస్ట్రేటర్స్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, ప్రోగ్రామర్స్/ డెవలపర్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఎస్‌ఓసీ అనలిస్టులు, మేనేజర్ లా, కాస్ట్ అకౌంటెంట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, మేనేజర్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్స్ అండ్ పెనట్రేషన్ టెస్టర్స్, సైబర్ ఫోరెన్సిక్ అనలిస్టులు, డేటా మైనింగ్ ఎక్స్‌పర్ట్స్, ఓఎఫ్‌ఎస్‌ఏఏ అడ్మినిస్ట్రేటర్, ఓఎఫ్‌ఎస్‌ఎస్ టెక్నో ఫంక్షనల్, బేస్ 24 అడ్మినిస్ట్రేటర్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, మిడిల్‌వేర్ అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్ వంటి వివిధ కేటగిరీలకు చెందిన పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితోపాటు ఎస్టీ కేటగిరీలో 13 మేనేజర్, ఒకటి సీనియర్ మేనేజర్ బ్యాక్‌లాగ్ పోస్టు ఉన్నాయి.
అర్హతలు..
వయసు..
వేతనం..
ఎంపిక విధానం
ముఖ్యమైన సమాచారం..
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.canarabank.com/

- ఆయా పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎంసీఏ,ఈసీఈ, ఎల్‌ఎల్‌బీ, చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ/ఎంఎంఎస్, బీఏ/ఎంఏ/ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌లలో 60 శాతం మార్కులు సాధించినవారు అర్హులు.
- బ్యాక్‌లాగ్ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు అర్హులు. లేదా డిప్లొమా ఇన్ రిస్క్ మేనేజ్‌మెంట్/ట్రజరీ మేనేజ్‌మెంట్/ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు..
- పోస్టును బట్టి 20 నుంచి 35 ఏళ్ల వరకు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, బెంచ్ మార్క్ డిసేబిలిటీస్‌కు 10ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్, కమిషన్డ్ ఆఫీసర్స్, షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీర్స్‌కు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది.
వేతనం..
- కేటగిరీ-1 పోస్టులకు రూ.42,020, కేటగిరీ-2 పోస్టులకు రూ.45,950, కేటగిరీ-3 పోస్టులకు రూ.51,490.
ఎంపిక విధానం
- దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపినవారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ఎంట్రన్స్ ఆబ్జెక్టివ్ విధానంలో 150 ప్రశ్నలు- 200 మార్కులకు ఉంటుంది. ఇందులో ప్రొఫెషనల్ నాలెడి నుంచి 50 ప్రశ్నలు-100 మార్కులు, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ 50 ప్రశ్నలు-50 మార్కులు, లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులకు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.
ముఖ్యమైన సమాచారం..
- అభ్యర్థులు పైన పేర్కొన్న పోస్టుల్లో ఒక్కదానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్స్: నవంబర్ 25 నుంచి డిసెంబర్ 15, 2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులకు రూ.100, ఇతరులకు రూ.600
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.canarabank.com/
Published date : 24 Nov 2020 04:33PM