Skip to main content

‘ఎల్‌ఐసీ’ కొలువులకు ప్రిపరేషన్ టిప్స్..

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ... లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ). దేశవ్యాప్తంగా వేర్వేరు జోన్లల్లో మొత్తం8,581 అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్(ఏడీవో) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
తెలుగు రాష్ట్రాలు ఉండే దక్షిణ మధ్య జోన్‌లో 1,251 ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఏడీవో పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు.. ఎంపిక ప్రక్రియ.. పరీక్ష విధానం.. ప్రిపరేషన్ మెలకువలు తెలుసుకుందాం...

జోన్ల వారీగా ఖాళీలు :
సెంట్రల్(భోపాల్)-525, ఈస్టర్న్(కోల్‌కతా): 922, ఈస్ట్ సెంట్రల్ (పాట్నా)-701, నార్తర్న్(న్యూఢిల్లీ)-1130, నార్త్ సెంట్రల్(కాన్పూర్)-1042, సదరన్(చెన్నై)-1257, సౌత్ సెంట్రల్(హైదరాబాద్)- 1251, వెస్టర్న్(ముంబయి)-1753.

దక్షిణ మధ్య జోన్‌లో పోస్టులు: 1251
దక్షిణ మధ్య జోన్‌లో మొత్తం పోస్టుల సంఖ్య 1,257. వీటిల్లో అన్‌రిజర్వ్‌డ్ విభాగంలో 530, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ విభాగంలో 118, ఓబీసీ విభాగంలో 297, ఎస్సీ విభాగంలో 217, ఎస్టీ విభాగంలో 89 ఖాళీలు ఉన్నాయి.

డివిజన్ల వారీగా పోస్టులు:
కడప-102; హైదరాబాద్-101; కరీంనగర్-35; మచిలీపట్నం- 97; నెల్లూరు- 85; రాజమండ్రి-71; సికింద్రాబాద్-91; విశాఖపట్నం-64; వరంగల్-43; బెంగళూరు-1: 106; బెంగళూరు-2: 101; బెల్గాం-54; ధార్వాడ్-58; మైసూర్-79; రాయ్‌చూర్- 57; షిమోగ-45; ఉడిపి-63.

అర్హతలు..
గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏడీవో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కెటింగ్‌లో ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయసు :
2019, మే1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు మినహారుుంపు లభిస్తుంది. ఎల్‌ఐసీ ఉద్యోగులకు గరిష్ట వయోపరిమితిలో ప్రత్యేక సడలింపు ఉంటుంది.

నెలకు రూ.34,500 వేతనం :
ఏడీవోగా ఎంపికైన అభ్యర్థికి అప్రెంటీస్ సమయంలో నెలకు రూ.34,503 స్టైఫండ్ చెల్లిస్తారు. అప్రెంటీస్ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని ప్రొబేషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా నియమిస్తారు. వీరికి పేస్కేల్ ప్రకారం వేతనం అమల్లోకి వస్తుంది. నెలకు రూ.21,865 ప్రాథమిక వేతనం లభిస్తుంది. ఇతర అలవెన్సులు కలుపుకొని ‘ఏ’ క్లాస్ సిటీలో నెలకు రూ.37,345 వేతనం అందుతుంది. వీటితోపాటు తక్కువ వడ్డీతో రుణాలు, ఇతర రాయితీలు ఉంటాయి.

విధులు ఇవే..
ఏడీవోగా విధుల్లో చేరిన ఉద్యోగులు నిర్దేశించిన డివిజనల్‌లో ఎల్‌ఐసీ పాలసీల సేల్స్‌ను పర్యవేక్షించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏజెంట్లను నియమించుకొని.. ఎక్కువ సంఖ్యలో పాలసీలను విక్రరుుంచేలా చూడాలి. ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడంతోపాటు ఎల్‌ఐసీ అందించే వివిధ బీమా పథకాలను వివరించాలి. అవసరమైతే ఏజెంట్లు చేర్చిన పాలసీదారులతో మాట్లాడి.. వారి సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. తాము పనిచేసే డివిజన్‌లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి.

రెండు దశల్లో ఎంపిక :
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి రెండో దశలో మెయిన్ పరీక్ష కూడా ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. మెయిన్‌లోనూ నిర్దేశిత మార్కులు పొందిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మెయిన్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. తుది జాబితాలో నిలిచిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలను ఖరారు చేస్తారు. ఏడీవోగా నియమితులైన అభ్యర్థులు కనీసం నాలుగేళ్లపాటు ఎల్‌ఐసీలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉద్యోగంలో చేరేముందు రూ.25,000 బాండ్ ఇవ్వాలి.

పరీక్ష విధానం:
  • ఏడీవో పోస్టులను మూడు కేటగిరీలుగా విభజించారు. ఓపెన్ మార్కెట్ కేటగిరీ, ఏజెంట్స్ కేటగిరీ, ఎంప్లాయీ కేటగిరీలుగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. వీటిల్లో ఓపెన్ మార్కెట్ కేటగిరీ పోస్టులకు రెండు దశల్లో ఆన్‌లైన్ పరీక్ష జరుగుతుంది. మిగతా కేటగిరీ ఉద్యోగాలకు ఒకటే పరీక్ష, మెయిన్ ఉంటుంది.
  • ప్రిలిమినరీ పరీక్ష కాల వ్యవధి ఒక గంట. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ-35 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ-35 ప్రశ్నలు, ఇంగ్లిష్ సెక్షన్-30 ప్రశ్నలు చొప్పున ఉంటాయి. ఇంగ్లిష్ సబ్జెక్టు అర్హత పరీక్ష మాత్రమే. ప్రతి సెక్షన్‌కు వేర్వేరుగా 20 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన ఓపెన్ మార్కెట్ కేటగిరి అభ్యర్థులకు, ఏజెంట్స్, ఎంప్లాయీ కేటగిరీల అభ్యర్థులకు వేర్వేరుగా మెయిన్ పరీక్ష జరుగుతుంది. ప్రతి కేటగిరీ అభ్యర్థులకు ప్రశ్న పత్రంలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటిల్లో రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ; జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. మూడో విభాగం కింద కేటగిరీ ఆధారంగా వేర్వేరు పేపర్లు ఉంటాయి. ఓపెన్ మార్కెట్ కేటగిరీ వారికి ఇన్సూరెన్‌‌స అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్‌నెస్(లైఫ్ ఇన్సూరెన్‌‌స,ఫైనాన్షియల్ రంగానికి ప్రాధాన్యం) సెక్షన్ ఉంటుంది. ఏజెంట్లకు ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్; ఎంప్లాయీ కేటగిరి అభ్యర్థులకు ప్రాక్టీస్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సెక్షన్ ఉంటుంది.
  • ఇంటర్వ్యూకు అర్హత సాధించాలంటే.. ప్రతి పేపర్‌లోనూ ఎల్‌ఐసీ నిర్ణయించిన నిర్దేశ కటాఫ్ మార్కులు సాధించాలి. రుణాత్మక మార్కులు లేవు.

ప్రిపరేషన్ సాగించాలిలా..
రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ:
  • అభ్యర్థి తార్కిక ఆలోచన శక్తిని, విశ్లేషణా సామర్థ్యాన్ని పరిశీలించేలా ఈ విభాగం నుంచి ప్రశ్నలడుగుతారు. నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్‌‌స, సీటింగ్ అరేంజ్‌మెంట్, స్టేట్‌మెంట్స్ మొదలైనవాటి నుంచి ప్రశ్నలెదురవుతారుు. సంబంధిత ప్రాథమిక అంశాలపై పట్టు, నిశిత పరిశీలనతో ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు.
  • న్యూమరికల్ ఆప్టిట్యూడ్ విభాగంలో..నంబర్ సిస్టమ్స్, రిలేషన్‌షిప్ బిట్వీన్ నంబర్స్, శాతాలు, స్క్వేర్ రూట్స్, సగటు, సాధారణ, చక్రవడ్డీ, లాభనష్టాలు,డిస్కౌంట్, భాగస్వామ్య వ్యాపారం మొదలైన అంశాలపై ప్రశ్నలడుగుతారు.
  • గణితంపై అభ్యర్థికున్న పట్టును తెలుసుకునేలా ప్రశ్నలుంటారుు. ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించాలంటే ఆర్‌ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ పుస్తకాలను సాధన చేయాలి. దీంతోపాటు 8, 9, 10వ తరగతుల మ్యాథ్స్ పాఠ్యపుస్తకాలలోని మాదిరి సమస్యలను సాధన చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు. ప్రతి చాప్టర్‌ను ప్రాక్టీస్ చేయడంతోపాటు వీలైనన్ని మాక్ టెస్ట్‌లను సాధన చేయాలి. సంబంధిత అంశాలలో ప్రాథమిక సూత్రాలను బాగా గుర్తు పెట్టుకోవాలి.

జనరల్ నాలెడ్‌‌జ, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లిష్:
జీకేలో అత్యధిక మార్కుల కోసం 6 నుంచి 10వ తరగతి వరకు సోషల్ పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వీటితోపాటు దినపత్రికలను, ఇయర్‌బుక్‌ను చదవాలి. ఈ విభాగంలో భారతదేశ చరిత్ర, సంస్కృతి, జాతీయ ఉద్యమం, ఇండియన్ జాగ్రఫీ, జనరల్ సైన్‌‌స, వ్యక్తులు-బిరుదులు, పుస్తకాలు- రచరుుతలు, అవార్డులు-వ్యక్తులు, క్రీడలు, నియామకాలు, వివిధ సదస్సులు జరిగిన ప్రాంతాలు, శాస్త్రసాంకేతిక ప్రయోగాలు మొదలైనవాటి నుంచి ప్రశ్నలడిగే అవకాశముంది. అదేవిధంగా పరీక్షకు ఆరు నెలల ముందు నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్‌పై దృష్టి పెట్టాలి.
  • ఎల్‌ఐసీలో ఉద్యోగం కాబట్టి ఎల్‌ఐసీ, ఐఆర్‌డీఏ తాజా విధానాలు, వడ్డీరేట్లు, బడ్జెట్ వంటి విషయాలు తెలుసుకోవాలి. ఇంగ్లిష్‌లో ప్రధానంగా వొక్యాబులరీ, గ్రామర్‌పై ప్రశ్నలడుగుతారు. ఆరు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాన్ని సాధన చేస్తే ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించొచ్చు.
  • ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్‌నెస్ (లైఫ్ ఇన్సూరెన్‌‌స, ఫైనాన్షియల్ సెక్టార్ ప్రత్యేక ప్రాధాన్యం) 50 మార్కులు కేటారుుంచారు కాబట్టి విజయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించిన వర్తమాన సంఘటనలపై అవగాహన పెంపొందించుకోవాలి.
ముఖ్యసమాచారం :
 దరఖాస్తులకు చివరి తేది: జూన్9, 2019
 హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 2019 జూన్ 29
 ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2019 జూలై 6, 13
 మెయిన్ పరీక్ష తేది: 2019 ఆగస్టు 10
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.licindia.in
Published date : 29 May 2019 12:01PM

Photo Stories