బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో సరికొత్త కొలువులు..!
Sakshi Education
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్.. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారింది. ఉపాధి హామీ పథకం డబ్బులు తీసుకోవడం దగ్గరి నుంచి పెద్దపెద్ద వ్యాపారాల నిర్వహణ దాకా.. ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం సేవలు అందకుంటే ఒక్కరోజు గడవదు.
ఈ రంగం రోజురోజుకూ విస్తరిస్తూ.. టెక్నాలజీ ప్రవేశంతో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఫలితంగా సంప్రదాయ కొలువులతోపాటు.. టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలను అందిస్తోంది. క్లర్క్, పీవోల నుంచి బ్లాక్‌చైన్ ఆర్కిటెక్ట్, డేటా అనలిస్ట్, సైబర్‌సెక్యూరిటీ స్పెషలిస్ట్ వరకూ.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టెక్నాలజీ యుగంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో మారుతున్న నియామకాల తీరు.. అవసరమైన అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకుందాం...
ప్రస్తుతం బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోని సంస్థల పనితీరు, రిక్రూట్మెంట్ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే... క్లర్క్, పీఓ కోలువులతోపాటు టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలు కలుపుకొని మొత్తంగా వచ్చే మూడేళ్లలో రెండు లక్షలకు పైగా నియామకాలు చేపట్టే అవకాశముందని అంచనా. వీటిలో టెక్ ఉద్యోగాల సంఖ్యే 25 శాతం నుంచి 30 శాతం మేరకు ఉంటుందని పేర్కొంటున్నారు. బ్యాంకింగ్‌రంగ కార్యకలాపాల్లో టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతోందనడానికి నిదర్శనం ఇదే.
టెక్ కొలువులు..
టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలు పెరుగుతుండటంతో బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థల్లో ఇటీవల కాలంలో కొత్త కొలువులు ఆవిష్కృతమవుతున్నాయి. బ్లాక్‌చైన్ ఆర్కిటెక్ట్, రోబో ప్రోగ్రామర్స్, క్రెడిట్ అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, డేటా అనలిస్ట్, ప్రాసెస్ మోడల్ స్పెషలిస్ట్, క్లౌడ్ మేనేజర్స్ వంటి టెక్ జాబ్ ప్రొఫైల్స్‌లో నియామకాలు చేపడుతున్నాయి. ఈ ఉద్యోగాల్లో తగిన విద్యార్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులను నియమించుకునేందుకు బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి.
సరికొత్త హోదాలు..
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఇప్పుడు కనిపిస్తున్న మరో కొత్త ధోరణి.. ఫిన్‌టెక్ సంస్థల జోరు. సంప్రదాయ బ్యాంకింగ్ కార్యకలాపాలతోపాటు ఇటీవల టెక్నాలజీ వినియోగం పెరిగిన విషయం తెలిసిందే. ఉదాహరణకు మొబైల్ వాలెట్స్, యాప్ బేస్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పెరిగాయి. వీటిని అందించేవన్నీ ఫిన్‌టెక్ సంస్థల కోవలోకే వస్తున్నాయి. కొంతకాలంగా వినియోగదారుల్లోనూ మొబైల్ వాలెట్స్, యాప్స్‌పై అవగాహన పెరుగుతోంది. ఇదే సమయంలో కొత్త ఫిన్‌టెక్ సంస్థలు మార్కెట్లో ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 200 వరకు ఫిన్‌టెక్ సంస్థలు ఉన్నట్లు అంచనా. ఇవి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో టెక్ కొలువులు కోరుకునే అభ్యర్థులకు సరికొత్త వేదికలుగా నిలుస్తున్నాయి. ఇవి ప్రధానంగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కస్టమర్ ఎక్విజిషన్, బిగ్‌డేటా అనలిటిక్స్, అప్లికేషన్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ విభాగాల్లో కొలువులు అందిస్తున్నాయి. ఫిన్‌టెక్ రంగంలో విభాగాల వారీగా... సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్, కన్సల్టింగ్, కోర్ ఫైనాన్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ హోదాలు లభిస్తున్నాయి.
నియామకాలు ప్రత్యేకంగా..
బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థలు నియామకాల పరంగా ప్రత్యేక విధానాలు అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు రంగంలోని బ్యాంకుల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని బ్యాంకులు నిర్దిష్టంగా అకడమిక్ ఇన్‌స్టిట్యూట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఆ మేరకు విద్యాసంస్థలు సదరు బ్యాంకు పనితీరుకు సరితూగే కరిక్యులం రూపొందించి.. పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సులను నిర్దిష్ట వ్యవధిలో నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సులను పూర్తిచేసుకున్న అభ్యర్థులకు తమ బ్యాంకుల్లోనే పీఓలుగా కొలువులు ఖాయం చేస్తున్నాయి.
'టెక్' ప్రొఫైల్స్.. క్యాంపస్ డ్రైవ్స్ :
టెక్నాలజీ ఆధారిత ఉద్యోగ నియామకాల కోసం సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్స్పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఐఐటీలు, ఐఐఎంలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తూ.. అనలిస్ట్, క్లౌడ్ ఇంజనీర్స్ వంటి కొలువులను భర్తీ చేస్తున్నాయి. గతేడాది ఐఐటీలు, ఐఐఎంల క్యాంపస్ డ్రైవ్స్‌లో బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో టెక్ జాబ్ ప్రొఫైల్స్ సంఖ్య 20 శాతం మేరకు ఉండటమే ఇందుకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయిల్లోనూ ఇప్పుడు కొత్త హోదాలు ఆవిష్కృతమవుతున్నాయి. స్ట్రాటజీ అనలిస్ట్, సీఎఫ్ఓ, లీగల్ అప్రైజర్స్, రిస్క్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్ వంటివి వీటిలో ప్రధానమైనవి. ఈ హోదాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సంస్థలు అనుభవం గల అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో..
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ నియామకాల సంఖ్య పెరుగుతోంది. వీటిలోనూ సంప్రదాయ ఉద్యోగాలతోపాటు టెక్ ఆధారిత కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. సంప్రదాయ ఉద్యోగాల (క్లర్క్, పీఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్)ను ఐబీపీఎస్ నిర్వహించే ఉమ్మడి పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా నియమించుకుంటున్నాయి. టెక్ ఆధారిత ఉద్యోగాల భర్తీకి మాత్రం ప్రత్యేక ప్రకటనల ద్వారా వేర్వేరుగా నియామకాలు చేపడుతున్నాయి.
కొత్త జాబ్ ప్రొఫైల్స్.. విధులు
బ్యాంకింగ్ రంగంలో కొత్తగా పుట్టుకొస్తున్న టెక్ ఆధారిత ఉద్యోగాలకు సంబంధించిన విధుల వివరాలు..
క్లౌడ్ ఇంజనీర్స్: బ్యాంకుకు సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్న ఐటీ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరపడం.. ఇంటర్నెట్ ఆధారంగానే అన్నిరకాల కార్యకలాపాలు జరిగేలా చూడటం, సమస్యలను పరిష్కరించడం వీరి ప్రధాన విధులు.
టెక్నికల్ అనలిస్ట్: బ్యాంకులు అనుసరిస్తున్న సాంకేతికత, వాటికి మరింత ఆధునికతను జోడించడం వీరి విధి.
రోబోటిక్ ఇంజనీర్స్: బ్యాంకులు అందించే ఆటోమేటెడ్ సేవలను పర్యవేక్షించడం, కొత్త సేవలను రూపొందించడం వీరి ప్రధాన విధులు.
సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్: సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుగొనడం సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ విధుల్లో ముఖ్యమైనవి.
నెట్వర్క్ ఇంజనీర్స్: ఇంటర్నెట్ ఆధారిత బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడకుండా.. నెట్వర్క్ సంబంధిత సాంకేతిక అంశాలైన డాట్నెట్, ఇంట్రానెట్ విభాగాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
టెక్ నైపుణ్యాలు+సాఫ్ట్‌స్కిల్స్ :
టెక్నాలజీ ఆధారిత సేవలందిస్తూ ఆ నైపుణ్యాలున్న వారికోసం అన్వేషిస్తున్న బ్యాంకింగ్ సంస్థలు, టెక్ స్కిల్స్‌తోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌కు కూడా ప్రాధాన్యమిస్తున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లిష్‌లో మాట్లాడటం, ఇంటరాక్టివ్ స్కిల్స్, బృంద నైపుణ్యాలు, క్రాస్ కల్చరల్ స్కిల్స్ ప్రధానమైనవి.
ముఖ్య సాంకేతిక నైపుణ్యాలు :
అభ్యర్థుల్లో టెక్నాలజీ స్కిల్స్ పరంగా పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు..
1. కోడింగ్
2. లాంగ్వేజెస్
3. అల్గారిథమ్స్
4. క్లౌడ్ కంప్యూటింగ్ (ఎస్ఏఏఎస్)
5. బ్లాక్‌చైన్ టెక్నాలజీ
బీఎఫ్ఎస్ఐ రంగం.. ముఖ్యాంశాలు
భవిష్యత్తు టెక్నాలజీదే...
బ్యాంకింగ్ రంగం కార్యకలాపాల పరంగా భవిష్యత్తులో టెక్నాలజీది కీలక పాత్ర. మరోవైపు పేమెంట్ బ్యాంక్స్, వ్యాలెట్ సర్వీసెస్ కూడా పెరుగుతున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు సంబంధిత అంశాల్లో శిక్షణ పొందడం ద్వారా మంచి కొలువులు సాధించే అవకాశం ఉంటుంది.
- పి.కిశోర్, హెచ్ఆర్ హెడ్, డీబీఎస్ బ్యాంక్.
- క్లర్క్స్, పీఓ.. బ్యాంకు ఉద్యోగాలనగానే ప్రతిఒక్కరి మదిలో మెదిలేవి ఇవే! కానీ, నేటి టెక్నాలజీ యుగంలో.. ఐఓటీ, ఆటోమేషన్, రోబోటిక్స్ ఆధారిత కార్యకలాపాలు బ్యాంకింగ్ రంగంలోకి సైతం ప్రవేశించాయి. ఫలితంగా ఈ రంగంలో కొత్త కొలువులు పుట్టుకొస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ‘టెక్’ ఉద్యోగాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో వచ్చే మూడేళ్లలో టెక్ జాబ్స్ సంఖ్య రెండు లక్షలకుపైగా ఉండే అవకాశముందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోని సంస్థల పనితీరు, రిక్రూట్మెంట్ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే... క్లర్క్, పీఓ కోలువులతోపాటు టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలు కలుపుకొని మొత్తంగా వచ్చే మూడేళ్లలో రెండు లక్షలకు పైగా నియామకాలు చేపట్టే అవకాశముందని అంచనా. వీటిలో టెక్ ఉద్యోగాల సంఖ్యే 25 శాతం నుంచి 30 శాతం మేరకు ఉంటుందని పేర్కొంటున్నారు. బ్యాంకింగ్‌రంగ కార్యకలాపాల్లో టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతోందనడానికి నిదర్శనం ఇదే.
టెక్ కొలువులు..
టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలు పెరుగుతుండటంతో బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థల్లో ఇటీవల కాలంలో కొత్త కొలువులు ఆవిష్కృతమవుతున్నాయి. బ్లాక్‌చైన్ ఆర్కిటెక్ట్, రోబో ప్రోగ్రామర్స్, క్రెడిట్ అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, డేటా అనలిస్ట్, ప్రాసెస్ మోడల్ స్పెషలిస్ట్, క్లౌడ్ మేనేజర్స్ వంటి టెక్ జాబ్ ప్రొఫైల్స్‌లో నియామకాలు చేపడుతున్నాయి. ఈ ఉద్యోగాల్లో తగిన విద్యార్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులను నియమించుకునేందుకు బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి.
సరికొత్త హోదాలు..
- బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఔత్సాహికులకు సరికొత్త హోదాలు పలకరిస్తున్నాయి. బిజినెస్ బ్యాంకింగ్ మేనేజర్, కార్పొరేట్ బిజినెస్ సేల్స్, మేకర్/వెరిఫైయర్, బ్రాంచ్ సర్వీస్ పార్ట్నర్, బిజినెస్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఫైనాన్స్ బిజినెస్ మేనేజర్, ఫైనాన్షియల్ ప్లానర్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఆఫీసర్, రెవెన్యూ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్/ఆఫీసర్స్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి కొత్త హోదాల్లో నియామకాలు జరుపుతున్నాయి.
- బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్లో రిక్రూట్మెంట్స్ పరంగా మరో కొత్త ట్రెండ్... ప్రస్తుతం మనం సంప్రదాయ ఉద్యోగాలుగా భావించే వాటికి కొత్త రూపునివ్వడం. సేల్స్ అసోసియేట్‌ను సేల్స్ స్పెషలిస్ట్‌గా.. కస్టమర్ అసోసియేట్‌ను ఇష్యూ రిడ్రెసల్ స్పెషలిస్ట్‌గా.. లోన్ అసోసియేట్‌ను ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజర్‌గా.. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌ను చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా సంస్థలు పేర్కొంటున్నాయి.
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఇప్పుడు కనిపిస్తున్న మరో కొత్త ధోరణి.. ఫిన్‌టెక్ సంస్థల జోరు. సంప్రదాయ బ్యాంకింగ్ కార్యకలాపాలతోపాటు ఇటీవల టెక్నాలజీ వినియోగం పెరిగిన విషయం తెలిసిందే. ఉదాహరణకు మొబైల్ వాలెట్స్, యాప్ బేస్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పెరిగాయి. వీటిని అందించేవన్నీ ఫిన్‌టెక్ సంస్థల కోవలోకే వస్తున్నాయి. కొంతకాలంగా వినియోగదారుల్లోనూ మొబైల్ వాలెట్స్, యాప్స్‌పై అవగాహన పెరుగుతోంది. ఇదే సమయంలో కొత్త ఫిన్‌టెక్ సంస్థలు మార్కెట్లో ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 200 వరకు ఫిన్‌టెక్ సంస్థలు ఉన్నట్లు అంచనా. ఇవి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో టెక్ కొలువులు కోరుకునే అభ్యర్థులకు సరికొత్త వేదికలుగా నిలుస్తున్నాయి. ఇవి ప్రధానంగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కస్టమర్ ఎక్విజిషన్, బిగ్‌డేటా అనలిటిక్స్, అప్లికేషన్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ విభాగాల్లో కొలువులు అందిస్తున్నాయి. ఫిన్‌టెక్ రంగంలో విభాగాల వారీగా... సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్, కన్సల్టింగ్, కోర్ ఫైనాన్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ హోదాలు లభిస్తున్నాయి.
నియామకాలు ప్రత్యేకంగా..
బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థలు నియామకాల పరంగా ప్రత్యేక విధానాలు అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు రంగంలోని బ్యాంకుల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని బ్యాంకులు నిర్దిష్టంగా అకడమిక్ ఇన్‌స్టిట్యూట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఆ మేరకు విద్యాసంస్థలు సదరు బ్యాంకు పనితీరుకు సరితూగే కరిక్యులం రూపొందించి.. పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సులను నిర్దిష్ట వ్యవధిలో నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సులను పూర్తిచేసుకున్న అభ్యర్థులకు తమ బ్యాంకుల్లోనే పీఓలుగా కొలువులు ఖాయం చేస్తున్నాయి.
'టెక్' ప్రొఫైల్స్.. క్యాంపస్ డ్రైవ్స్ :
టెక్నాలజీ ఆధారిత ఉద్యోగ నియామకాల కోసం సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్స్పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఐఐటీలు, ఐఐఎంలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తూ.. అనలిస్ట్, క్లౌడ్ ఇంజనీర్స్ వంటి కొలువులను భర్తీ చేస్తున్నాయి. గతేడాది ఐఐటీలు, ఐఐఎంల క్యాంపస్ డ్రైవ్స్‌లో బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో టెక్ జాబ్ ప్రొఫైల్స్ సంఖ్య 20 శాతం మేరకు ఉండటమే ఇందుకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయిల్లోనూ ఇప్పుడు కొత్త హోదాలు ఆవిష్కృతమవుతున్నాయి. స్ట్రాటజీ అనలిస్ట్, సీఎఫ్ఓ, లీగల్ అప్రైజర్స్, రిస్క్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్ వంటివి వీటిలో ప్రధానమైనవి. ఈ హోదాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సంస్థలు అనుభవం గల అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో..
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ నియామకాల సంఖ్య పెరుగుతోంది. వీటిలోనూ సంప్రదాయ ఉద్యోగాలతోపాటు టెక్ ఆధారిత కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. సంప్రదాయ ఉద్యోగాల (క్లర్క్, పీఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్)ను ఐబీపీఎస్ నిర్వహించే ఉమ్మడి పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా నియమించుకుంటున్నాయి. టెక్ ఆధారిత ఉద్యోగాల భర్తీకి మాత్రం ప్రత్యేక ప్రకటనల ద్వారా వేర్వేరుగా నియామకాలు చేపడుతున్నాయి.
కొత్త జాబ్ ప్రొఫైల్స్.. విధులు
బ్యాంకింగ్ రంగంలో కొత్తగా పుట్టుకొస్తున్న టెక్ ఆధారిత ఉద్యోగాలకు సంబంధించిన విధుల వివరాలు..
క్లౌడ్ ఇంజనీర్స్: బ్యాంకుకు సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్న ఐటీ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరపడం.. ఇంటర్నెట్ ఆధారంగానే అన్నిరకాల కార్యకలాపాలు జరిగేలా చూడటం, సమస్యలను పరిష్కరించడం వీరి ప్రధాన విధులు.
టెక్నికల్ అనలిస్ట్: బ్యాంకులు అనుసరిస్తున్న సాంకేతికత, వాటికి మరింత ఆధునికతను జోడించడం వీరి విధి.
రోబోటిక్ ఇంజనీర్స్: బ్యాంకులు అందించే ఆటోమేటెడ్ సేవలను పర్యవేక్షించడం, కొత్త సేవలను రూపొందించడం వీరి ప్రధాన విధులు.
సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్: సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుగొనడం సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ విధుల్లో ముఖ్యమైనవి.
నెట్వర్క్ ఇంజనీర్స్: ఇంటర్నెట్ ఆధారిత బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడకుండా.. నెట్వర్క్ సంబంధిత సాంకేతిక అంశాలైన డాట్నెట్, ఇంట్రానెట్ విభాగాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
టెక్ నైపుణ్యాలు+సాఫ్ట్‌స్కిల్స్ :
టెక్నాలజీ ఆధారిత సేవలందిస్తూ ఆ నైపుణ్యాలున్న వారికోసం అన్వేషిస్తున్న బ్యాంకింగ్ సంస్థలు, టెక్ స్కిల్స్‌తోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌కు కూడా ప్రాధాన్యమిస్తున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లిష్‌లో మాట్లాడటం, ఇంటరాక్టివ్ స్కిల్స్, బృంద నైపుణ్యాలు, క్రాస్ కల్చరల్ స్కిల్స్ ప్రధానమైనవి.
ముఖ్య సాంకేతిక నైపుణ్యాలు :
అభ్యర్థుల్లో టెక్నాలజీ స్కిల్స్ పరంగా పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు..
1. కోడింగ్
2. లాంగ్వేజెస్
3. అల్గారిథమ్స్
4. క్లౌడ్ కంప్యూటింగ్ (ఎస్ఏఏఎస్)
5. బ్లాక్‌చైన్ టెక్నాలజీ
బీఎఫ్ఎస్ఐ రంగం.. ముఖ్యాంశాలు
- వచ్చే మూడేళ్లలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు.
- వీటిలో 20 నుంచి 30 శాతం మేర కొత్తగా ఐఓటీ ఆధారిత కొలువులు.
- ప్రారంభంలో సగటున రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వార్షిక వేతనం.
- క్రెడిట్ అనలిస్ట్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణులు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్, స్ట్రాటజీ అనలిస్ట్స్ వంటి ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్.
- మేనేజ్మెంట్ విభాగంలో డేటాఅనలిస్ట్, డేటా మేనేజర్, ఈఆర్పీ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్.
భవిష్యత్తు టెక్నాలజీదే...
బ్యాంకింగ్ రంగం కార్యకలాపాల పరంగా భవిష్యత్తులో టెక్నాలజీది కీలక పాత్ర. మరోవైపు పేమెంట్ బ్యాంక్స్, వ్యాలెట్ సర్వీసెస్ కూడా పెరుగుతున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు సంబంధిత అంశాల్లో శిక్షణ పొందడం ద్వారా మంచి కొలువులు సాధించే అవకాశం ఉంటుంది.
- పి.కిశోర్, హెచ్ఆర్ హెడ్, డీబీఎస్ బ్యాంక్.
Published date : 08 May 2019 05:14PM