కెరీర్ గైడెన్స్...పైలట్
Sakshi Education
ప్రయాణాలు అంటే మక్కువ.. ఆకాశ వీధిలో విహరించాలనుకునే ఆసక్తి .. సవాళ్లను ఇష్టంతో స్వీకరించే తత్వం.. అందరి కంటే భిన్నమైన కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే వారికి అనువైన కెరీర్ ‘పైలట్’.. మేఘాల్లో దూసుకుపోతూ.. వేల కిలోమీటర్ల దూరాలను సైతం క్షణాల్లోనే చేధించే సామర్థ్యం పైలట్ సొంతం.. పెరుగుతున్న అవకాశాలు.. ఆకర్షణీయమైన వేతనాలు.. అంతకు మించి లభించే సౌకర్యాలు.. దీంతో పైలట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే యువత సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. ఈ నేపథ్యంలో పైలట్ కెరీర్‌పై ఫోకస్..
విమానయాన రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న విభాగం పైలట్. డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అంచనాల ప్రకారం విమానయాన రంగం ప్రతి ఏటా దాదాపు 25 శాతం వృద్ధిని సాధిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం విమానయాన రంగంలోకి పలు ప్రైవేటు ఎయిర్‌లైన్ సంస్థల ప్రవేశించడమే. అంతేకాకుండా పైలట్లకు లక్షల్లో వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో లెసైన్స్‌డ్ పైలట్ల కోసం డిమాండ్ పెరుగుతోంది.
మూడు రకాలు:
పైలట్‌గా కెరీర్ ప్రారంభించడానికి మూడు రకాల లెసైన్స్‌లు తోడ్పడతాయి. అవి..

- స్టూడెంట్ పైలట్ లెసైన్స్
- ప్రైవేట్ పైలట్ లెసైన్స్
- కమర్షియల్ పైలట్ లెసైన్స్
స్టూడెంట్ పైలట్ లెసైన్స్:
కెరీర్‌లో పైలట్‌గా స్థిరపడాలనుకునే ఔత్సాహికులు దాటాల్సిన తొలి దశ స్టూడెంట్ పైలట్ లెసైన్స్. ఇందులో విమాన చోదనానికి సంబంధించిన ప్రాక్టికల్స్, థియరీ సబ్జెక్టుల బోధన సాగుతుంది. వంద మార్కులకు ఉండే థియరీ పరీక్షలో ఎయిర్‌క్రాఫ్ట్, ఇంజిన్స్, ఎయిరోడైనమిక్స్ సబ్జెక్టులు ఉంటాయి.
-స్టూడెంట్ పైలట్ లెసైన్స్ కోర్సులో చేరడానికి కనీస అర్హత పదో తరగతి ఉత్తీర్ణత.
-వయసు: 16 ఏళ్లు వయసు నిండి ఉండాలి.
ప్రైవేట్ పైలట్ లెసైన్స్:
ఇది రెండో దశ. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు నేరుగా ఈ ప్రైవేట్ పెలైట్ లెసైన్స్ కోర్సులో ప్రవేశించొచ్చు. ప్రైవేట్ పైలట్ లెసైన్స్ దశలో కూడా ప్రాక్టికల్, థియరీ పరీక్షలు ఉంటాయి. ప్రాక్టికల్ విభాగంలో ఇన్‌స్ట్రక్టర్ సహాయంతో 40 గంటలు, స్వయంగా 20 గంటల పాటు విమానాన్ని నడపాల్సి ఉంటుంది. థియరీ విభాగంలో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్, ఎయిర్ నేవిగేషన్, ఏవియేషన్ మెటీయరాలజీ, సీమన్‌షిప్ వంటి అంశాలు ఉంటాయి. ప్రైవేట్ పైలట్ లెసైన్స్ శిక్షణ దాదాపు రెండేళ్లపాటు సాగుతుంది.
కమర్షియల్ పైలట్ లెసైన్స్:
పైలట్‌గా స్థిరపడే క్రమంలో చివరి దశ..కమర్షియల్ పైలట్ లెసైన్స్. ఇందులో 250 గంటలపాటు ఫ్లయింగ్ శిక్షణ ఉంటుంది. ఈ దశలో ప్రైవేట్ పైలట్ లెసైన్స్ సమయంలో శిక్షణ పొందిన 60 గంటలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా 250 గంటలపాటు ఇన్‌స్ట్రక్టర్ల పర్యవేక్షణలో సాగే శిక్షణతోపాటు 200 గంటల స్వీయ చోదన అనుభవం గడించాలి. ఇక.. థియరీ విభాగంలో ఎయిర్ రెగ్యులేషన్స్, ఏవియేషన్ మెటీయరాలజీ, ఎయిర్ నేవిగేషన్, టెక్నికల్ ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ రేడియో అండ్ వైర్‌లెస్ ట్రాన్స్‌మిషన్ వంటి సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఇదే కాకుండా నిర్ణీత శారీరక ధ్రుడత్వం కూడా తప్పనిసరి. ఆయా ఫ్లయింగ్ క్లబ్‌ల సామర్థ్యాన్ని బట్టి లెసైన్స్ శిక్షణ కాలం ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది. నిర్ణీత కాలపరిమితి అంటూ ప్రత్యేకంగా ఉండదు.
ఇన్‌స్టిట్యూట్స్ ఇవే:
పైలట్ లెసైన్స్ శిక్షణనిచ్చే సంస్థలను ఫ్లయింగ్ క్లబ్‌లుగా పేర్కొంటారు. వాస్తవానికి దేశంలో ఏవియేషన్ రంగానికి చెందిన కోర్సులు, ఇతర శిక్షణ వంటి అంశాలను డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం డీజీసీఏ అనుమతితో దేశవ్యాప్తంగా 29 ఫ్లయింగ్ క్లబ్‌లు పైలట్ లెసైన్స్ శిక్షణను ఇస్తున్నాయి.
వాటిల్లో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు...
ఇందిరాగాంధీ ఉరాన్ అకాడమీ-పుర్సత్‌జంగ్ (ఉత్తరప్రదేశ్)
ఆఫర్ చేస్తున్న కోర్సులు: కమర్షియల్ పైలట్ లెసైన్స్.
అర్హత: ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లతో)
వయసు: 17 సంవత్సరాలు
వెబ్‌సైట్: www.igrua.gov.in
ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ-హైదరాబాద్.
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
స్టూడెంట్ పైలట్ లెసైన్స్,
ప్రైవేట్ పైలట్ లెసైన్స్, కమర్షియల్ పైలట్ లెసైన్స్.
అర్హత: ప్రైవేట్ పైలట్ లెసైన్స్-10వ తరగతి
కమర్షియల్ పైలట్ లెసైన్స్-ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లతో)
వయసు: 16 సంవత్సరాలు
వెబ్‌సైట్: https://apaviationacademy.in
ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ-హైదరాబాద్

కమర్షియల్ పైలట్ లెసైన్స్-10+2
వెబ్‌సైట్: www.flytechaviation.com
రాజీవ్‌గాంధీ అకాడమీ ఆఫ్ ఏవియేషన్ టెక్నాలజీ-తిరువనంతపురం (కేరళ)

అర్హత:
ప్రైవేట్ పైలట్ లెసైన్స్-10వ తరగతి
కమర్షియల్ పైలట్ లెసైన్స్-10+2 (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లతో)
వయసు: 18 ఏళ్లు.
వెబ్‌సైట్: https://rgaviation.com
గవర్నమెంట్ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్-భువనేశ్వర్

వెబ్‌సైట్: www.flywithgati.com
ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ప్రత్యేకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తాయి. సాధారణంగా ఇవి.. ‘ఏవియేషన్ రంగంలో రాణించేందుకు అభ్యర్థికి ఉన్న సన్నద్ధతను పరీక్షించే విధంగానే’ ఉంటాయి. నిర్ణీత అకడమిక్ కాల పరిమితి అనే విధానం లేనందున నిరంతరం ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంటాయి. దరఖాస్తుల సంఖ్య, విమానాల లభ్యతను బట్టి బ్యాచ్‌లను ప్రారంభిస్తుంటారు.
ఖర్చు అధికం.. కానీ చేయూత:
పూర్తి స్థాయిలో పైలట్‌గా రూపొందే క్రమంలో లెసైన్స్ శిక్షణకు దాదాపు రూ. పది లక్షల వరకు వ్యయం అవుతుంది. అయితే ఈ మేరకు ఆయా ఫ్లయింగ్ క్లబ్‌లు పలు బ్యాంక్‌లతో ఒప్పందం ద్వారా అభ్యర్థులకు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి.
కావాల్సిన నైపుణ్యాలు:
పైలట్‌గా కెరీర్‌లో స్థిరపడాలనుకున్న వారికి సాంకేతిక అంశాలపై సునిశిత పరిశీలన, సమయ స్ఫూర్తి అనేవి ప్రధానంగా కావాల్సిన లక్షణాలు. ఈ రెండూ ఉంటేనే ఈ రంగంలో రాణించగలరు. విమాన చోదన సమయంలో ఎదురయ్యే హఠాత్పరిణామాలు, సమస్యలకు క్షణాల్లో పరిష్కారం కనుగొనాల్సిన మానసిక స్థైర్యం కూడా ఉండాలి.
పరీక్షలు పాసవ్వాల్సిందే:
దేశంలోని ఫ్లయింగ్ క్లబ్‌లలో పైలట్ లెసైన్స్ తీసుకుంటున్న అభ్యర్థులకు ఆయా దశల్లో డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ-వెబ్‌సైట్: www.dgca.nic.in) థియరీ పరీక్షలు నిర్వహిస్తుంది. వాటిలో ఉత్తీర్ణత సాధిస్తేనే పైలట్‌గా వృత్తిలో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. ఈ పరీక్షలను డీజీసీఏ జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్‌లలో నిర్వహిస్తుంది.
ఉద్యోగావకాశాలు:
కమర్షియల్ పెలైట్ శిక్షణ పూర్తిచేసుకుని.. డీజీసీఏ నిర్వహించిన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి కమర్షియల్ పైలట్ లెసైన్స్ పొందిన అభ్యర్థికి తొలుత ట్రైనీ పైలట్‌గా అవకాశం లభిస్తుంది. ఈ దశలో సదరు సంస్థ సామర్థ్యాన్ని బట్టి రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు నెలకు వేతనం లభిస్తుంది. ఆ తర్వాత అనుభవం పనితీరు ప్రాతిపదికగా ఫస్ట్ ఆఫీసర్ (జూనియర్)గా, ఇంకా అనుభవంతో ఫస్ట్ ఆఫీసర్ (సీనియర్); హోదాలకు చేరుకోవచ్చు. పూర్తిస్థాయిలో అనుభవ సామర్థ్యం సొంతం చేసుకుంటూ ఉన్నతంగా కమాండర్ స్థాయికి ఎదగొచ్చు. ఈ దశలో నెలకు రూ. నాలుగు లక్షల వేతనం లభిస్తుంది.
టాప్ రిక్రూటర్లు:

- ఇండియన్ ఎయిర్‌లైన్స్
- జెట్ ఎయిర్‌వేస్
- స్పైస్ జెట్
- ఇండిగో ఎయిర్‌లైన్స్
Published date : 19 Aug 2013 02:06PM