Skip to main content

డిజైన్ యువర్ కెరీర్ విత్ వెబ్‌ డిజైనింగ్‌

అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, గుండు సూది నుంచి విమానాలు, వజ్రాల వరకు ప్రతి వస్తువుకు సంబంధించి అనేక కంపెనీలు, ఫ్యాక్టరీలు వెలిశాయి. వాటి ఉత్పత్తులు, సేవల గురించి వినియోగదారులకు తెలియజేసేందుకు నేటి ఆధునిక ప్రపంచంలో ప్రత్యేక వెబ్‌సైట్‌ల రూపకల్పన అనివార్యమవుతుంది. ఈ నేపథ్యంలో వీక్షకులకు పూర్తిస్థాయి సమాచారాన్ని ఆకర్షణీయంగా, సరళంగా మౌస్‌ క్లిక్‌ల ద్వారా అందించడంలో వెబ్‌ డిజైనింగ్‌ కీలకపాత్ర పోషిస్తుంది. విస్తృత కెరీర్‌ అవకాశాలను అందిస్తున్న ఈ కెరీర్ పై ఫోకస్‌..

వెబ్‌డిజైనర్‌
వెబ్‌సైట్‌ రూపకల్పనలో యూజర్‌(వినియోగదారుడు) ఇంటర్‌ఫేస్‌ డిజైన్‌కు బాధ్యత వెబ్‌ డిజైనర్‌దే. వెబ్‌సైట్‌కు సంబంధించిన లోగో, బ్యానర్లు, ప్రకటనలు, ముఖ్య సమాచారం ఇవన్నీ ప్రత్యేకంగా తీర్చిదిద్దడంలో వెబ్‌డిజైనర్‌ బాధ్యత వహించాలి. వినియోగదారుడికి ఆసక్తి కలిగించేలా వెబ్‌సైట్‌ను రూపొందించాలి. డిజైన్‌ను మెచ్చి ఎక్కువ లింక్స్‌ను క్లిక్‌ చేసేలా చూడాలంటే ఆకర్షణీయంగా డిజైన్‌ ఉండాలి. కావాల్సిన సమాచారమంతా వెబ్‌ పేజీల్లో నిక్షిప్తం చేయడానికి మార్కప్‌ లాంగ్వేజెస్‌పై పట్టుండాలి. కనీసం హెచ్‌టీఎంఎల్‌పై పూర్తిస్థాయి అవగాహన తప్పనిసరి. స్టాటిక్‌ వెబ్‌పేజీల్లో సమాచారమంతా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రం మాన్యువల్‌గా డిజైనర్‌ మార్పులు చేస్తారు. అదే డైనమిక్‌ వెబ్‌సైట్‌లో వినియోగదారుడు ఇచ్చిన ఇన్‌పుట్‌ ప్రకారం సమాచారం మారుతూ ఉంటుంది.

వెబ్‌సైట్‌ ఆకర్షణీయంగా..
ఇమేజెస్‌, సమాచారంలో నాణ్యతతేలిక పదాలతో సులభంగా అర్ధమయ్యేలా ఉండటం...యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే దాన్ని క్లిక్‌ చేస్తున్నవారు సులువుగా ఆపరేట్‌ చేయగలగాలి. సెర్చ్‌ ఇంజిన్స్‌కు ఫ్రెండ్లీగా ఉండాలి... బ్యాక్‌ గ్రౌండ్‌, ఇమేజెస్‌, టెక్స్ట్‌ మ్యాటర్స్‌కు రంగుల కాంబినేషన్‌ బాగుండాలి... వెబ్‌ పేజీలు వేగంగా డౌన్‌లోడ్‌ కావాలి...అన్ని పేజీలూ ఒకే విధంగా ఉండాలి...నావిగే షన్‌ (రూట్‌ మ్యాప్‌) తేలికగా ఉండాలి.

బాధ్యతలు:
సమాచారం అప్‌డేట్‌, రోజువారీ నిర్వహణ చేయూలి. డిజైన్‌ ఫంక్షనాలిటీకోసం కావాల్సిన ఇన్‌పుట్‌ అండ్‌ సపోర్ట్‌ను అందించాలి. క్లైంట్‌ అవసరాలు అర్థం చేసుకొని దానికి కావాల్సిన సమాచారం సేకరించి, కోరిన విధంగా వెబ్‌సైట్‌ డిజైన్‌ చేయాలి. బ్యానర్లు, టెంప్లేట్స్‌, లోగోలు అన్నీ డిజైన్‌ చేయూలి. డిజిటల్‌ ఇమేజ్‌ కోసం ఫొటోషాప్‌, ఫ్లాష్‌ టూల్స్‌ వినియోగంపై అవగాహన ఉండాలి.

అర్హతలు:

  • వెబ్‌ డిజైనర్‌గా కెరీర్‌ ప్రారంభించడానికి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలి.
  • క్లైంట్లతో నేరుగా మాట్లాడటానికి మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తప్పనిసరి.
  • డిజైనింగ్‌ కాన్సెప్ట్‌పై పట్టుండాలి. సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ టెక్నిక్స్‌పై అవగాహన ఉండాలి.
  • వెబ్‌ డిజైనింగ్‌, డెవలప్‌మెంట్‌లో సరికొత్త పోకడలను తెలుసుకోవాలి.
  • హెచ్‌టీఎంఎల్‌, డీహెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, జావా స్క్రిప్ట్‌, డ్రీమ్‌ వీవర్‌, ఫ్లాష్‌, ఫ్లాష్‌ యాక్షన్‌ స్క్రిప్ట్స్‌, ఫొటోషాప్‌పై పట్టుండాలి.
  • సర్వర్‌ సైడ్‌ స్క్రిప్ట్స్‌, డేటాబేస్‌ హ్యాండ్లింగ్‌పై ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి.
  • మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌, ఒపెరా, ఫైర్‌ఫాక్స్‌...లాంటి వెబ్‌ బ్రౌజర్లలో వెబ్‌ అప్లికేషన్‌ కస్టమరైజ్‌ చేయగలగాలి.

 

ఫ్లాష్‌ డిజైనర్‌ అండ్‌ గేమ్‌ స్పెషలిస్ట్‌ వెబ్‌సైట్‌ వీక్షకుల కంటికి ఇంపుగా, ఆకర్షణీయంగా యూనిమేషన్స్‌ను తీర్చిదిద్దాలి. మాక్రో మీడియూ ఫ్లాష్‌, యూక్షన్‌ స్క్రిప్టింగ్‌ ఉపయోగించి చాలా రకాల 2డీ, 3డీ డిజైన్లను అభివృద్ధి చేయాలి. ప్రొఫెషనల్‌ ఉత్పత్తుల డెమోలు, ప్రకటనలు, యూనిమేషన్లలో ఫ్లాష్‌ యూనిమేటర్ల సేవలు అనివార్యం. సృ జన, డిజైన్‌ ప్రత్యేకంగా అర్ధం చేసుకోవడం, వ్యాపార ఆలోచనలకు యూనిమేషన్స్‌/ప్రెజెంటేషన్స్‌ ద్వారా ప్రతిరూపమివ్వడం వీరి చేయూల్సిన పని. ఆన్‌లైన్‌ ఆటలు, కార్పొరేట్‌ ఇంట్రోలు, ఉత్పత్తులు అర్ధమయ్యేలా వివరంగా చెప్పడానికి మంచి రూపాన్నివ్వడం ఇవన్నీ యూక్షన్‌ స్క్రిప్ట్‌ ప్రోగ్రామర్ల పనులు. ఇందులో రాణించడానికి యూక్షన్‌ స్క్రిప్ట్‌ 2, యూక్షన్‌ స్క్రిప్ట్‌ 3, షేరెబుల్‌ కంటెంట్‌ ఆబ్జెక్ట్‌ రిఫరెన్స్‌ మోడల్‌(ఎస్‌సీఓఆర్‌ఎం) బాగా రావాలి. అదిరిపోయేలా ఆటల(గేమ్స్‌)ను అభివృద్ధి చేసి వెబ్‌సైట్లో పెట్టడం యూనిమేటర్ల ముఖ్య విధి. గేమ్‌ డెవలపర్లు క్లైంట్లు, ఇన్‌ హౌస్‌ టీంలను హ్యాండిల్‌ చేయూలి. ఆన్‌లైన్‌ ఆటల అభివృద్ధికి అద్భుతమైన యూనిమేషన్లు సృష్టించాలంటే ఎక్కువ సంఖ్యలో టూల్స్‌ వాడుకలో ప్రావీణ్యం ఉండాలి.

అర్హతలు:
ఏదైనా విభాగంలో డిగ్రీ. ప్రస్తుతం వాడుకలో ఉన్న వెబ్‌ ప్రమాణాలు, యూజర్‌ ఇంటర్ఫేస్‌ తెలిసుండాలి. హెచ్‌టీఎంఎల్‌/ఎక్స్‌హెచ్‌టీఎంఎల్‌, జావా స్క్రిప్ట్‌, సీఎస్‌ఎస్‌, మాక్రో మీడియూ ఫ్లాష్‌, యూక్షన్‌ స్క్రిప్ట్‌, మాక్రో మీడియూ బ్రీజ్‌లపై లోతైన పరిజ్ఞానంతోపాటు వాటిలో పనిచేసిన అనుభవమూ ఉండాలి. 2డీ, 3డీ యూనిమేషన్‌ స్కిల్స్‌పై పట్టుండాలి. ఊహించడం, ఊహకు ప్రతిరూపమిచ్చే సామర్థ్యం ఉండాలి. కాన్సెప్ట్‌ తయూరుచేయడం, విజువలైజేషన్‌ స్కిల్స్‌ బాగుండాలి. మల్టీ మీడియూ ప్యాకేజీలపై పూర్తిస్థాయి పరిజ్ఞానం ఉండాలి. కోరెల్‌ డ్రా, సౌండ్‌ఫోర్జ్‌, ఫ్లాష్‌ యూక్షన్‌ స్క్రిప్టింగ్‌ (ఏఎస్‌ 2, ఏఎస్‌ 3), అంతర్జాతీయ క్లైంట్లతో యూనిమేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంటే అదనపు ఆకర్షణ. మంచి అనలెటికల్‌ స్కిల్స్‌, ఆప్టిట్యూడ్‌ ఉండాలి. సొంతంగా ప్రొజెక్ట్‌ను నిర్వహించే సామర్థ్యం, బృంద సభ్యులతో మమేకమవ్వడం అలవాటు కావాలి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ ఆటలంటే ఉత్సాహం ఉరకలేయాలి.

బాధ్యతలు:
క్లైంట్‌తో మమేకమై వాళ్ల అవసరాలను విశ్లేషించడం, నాణ్యమైన పనితో పాటు సలహాలను చేర్చి కొత్త మార్గాల్లో గేమ్‌ అభివృద్ధి చేసి సమర్థంగా ప్రోగ్రామింగ్‌ చేర్చాలి. వీడియో, ఆడియో ఎడిటింగ్‌ చేయూలి. సులువుగా కొత్త టెక్నాలజీ ఉపయోగించడం, విజువలైజేషన్‌, ఎనాలసిస్‌, డిజైన్‌, డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌ దశల్లోనే ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయూలి. కనులకు ఇంపుగా గేమ్స్‌, యూనిమేషన్స్‌ చేయూలి. ఆడియన్స్‌ బాగా అనుభూతి చెందడానికి ఫ్లాష్‌, పీహెచ్‌పీ లాంటి టెక్నాలజీలపై పనిచేసేవారితో కూడా కలిసి పనిచేయూల్సి ఉంటుంది.

వెబ్‌మాస్టర్‌ అండ్‌ పోర్టల్‌ మేనేజర్‌
వెబ్‌ ఆర్కిటెక్ట్‌, వెబ్‌ డెవలపర్‌, వెబ్‌సైట్‌ ఆథర్‌, వెబ్‌సైట్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఇవన్నీ వెబ్‌మాస్టర్‌కు పర్యాయపదాలు. వెబ్‌సైట్‌ డిజైన్‌, అభివృద్ధి, మార్కెటింగ్‌ లేదా నిర్వహణ ఇవన్నీ ఇతడి బాధ్యతలే. వెబ్‌ ఆపరేషన్‌కు సంబంధించి అన్ని అంశాల్లోనూ బాధ్యత వహిం చాల్సింది వెబ్‌మాస్టర్‌. ఇంటర్నెట్‌ స్పెషలిస్ట్‌, నెట్‌వర్క్‌/వెబ్‌ ఇంజనీర్‌, వెబ్‌ అడ్మినిస్ట్రేటర్‌, వెబ్‌ అప్లికేషన్‌ ఇంజనీర్‌.. వంటి పేర్లతో వెబ్‌మాస్టర్‌ను పిలుస్తారు. పీెహచ్‌పీ, కోల్డ్‌ఫ్యుజన్‌, పెర్ల్‌, జావాస్క్రిప్ట్‌.. వంటి స్క్రిప్టింగ్‌ లాంగ్వేజ్‌లపై పట్టు, వెబ్‌సర్వర్స్‌ కాన్ఫిగరేషన్‌లో ప్రావీణ్యం ఉండాలి. వెబ్‌సైట్‌ వీక్షకుల యూక్సెస్‌, అపియరెన్స్‌, నావిగేషన్‌ విషయూల్లో బాధ్యత వహించాలి. వెబ్‌ పోర్టల్‌ మేనేజర్‌ వృత్తి కూడా దాదాపు వెబ్‌మాస్టర్‌ లాంటిదే అయినప్పటికీ స్వల్ప తేడాలుంటాయి. భిన్న వెబ్‌సైట్ల సమాచారాన్ని వెబ్‌సైట్లో వెబ్‌పోర్టల్‌లో పెట్టాలి. వెబ్‌పోర్టల్‌లో మాట్రిమెునీ, ఈమెయిల్స్‌, న్యూస్‌, స్పోర్ట్స్‌, షాపింగ్‌, ట్రావెల్స్‌ అండ్‌ టూర్స్‌ మేనేజ్‌మెంట్‌, స్టాక్‌ ప్రెసైస్‌ అండ్‌ బిజినెస్‌ డీటైల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌.. వంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయి. గూగుల్‌, యూహూ, రెడిఫ్‌లు ఇందుకు ఉదాహరణలు.

అర్హతలు:
వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌పై మంచి పరిజ్ఞానం. కొత్త డిజైన్లు, ఐడియూలు, వెబ్‌ లాజిక్‌, వెబ్‌ స్ఫేర్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం, కోడింగ్‌ (హెచ్‌టీఎంఎల్‌, పీహెచ్‌పీ, డాట్‌నెట్‌, ఏఎస్పీ, డేటాబేస్‌, జావాస్క్రిప్ట్‌..పరిజ్ఞానం), నెట్‌వర్క్‌ ట్రబుల్‌షూటింగ్‌తో యునిక్స్‌, లైనక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌, సీఏ సైట్‌మైండర్‌లో పని అనుభవం, వెబ్‌ డిజైన్‌ స్కిల్స్‌, టాగ్‌ లెవె ల్‌లో హెచ్‌టీఎంల్‌ పరిజ్ఞానం, డీహెచ్‌టీఎంఎల్‌, కామ్‌, క్లైంట్‌ సైడ్‌ జావా స్క్రిప్టింగ్‌లో అనుభవం, అన్ని ప్లాట్‌ఫాంల్లో బ్రౌజర్‌ కంపేటబిలిటీ విషయూల్లో పరిజ్ఞానం. ఇమేజ్‌ కన్వర్షన్‌, ఫొటోషాప్‌, అడాబ్‌ ఇమేజ్‌ ఇవన్నీ రావాలి.

బాధ్యతలు:
వెబ్‌సైట్‌ తయూరీ, నిర్వహణ రెంటినీ సమర్థంగా నిర్వహించాలి. కొత్త విషయూలు చేర్చడం, పాతవి తొలగించాలి. సెర్చ్‌ఇంజిన్‌ను మానిటర్‌ చేయూలి. ట్రాకింగ్‌ లింక్స్‌ ఇవ్వాలి. ఎస్‌ఎస్‌ఎల్‌ సర్టిఫికెట్లు ఇన్‌స్టాల్‌ చేయూలి. వెబ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కాంపొనెంట్లు, బిజినెస్‌ అప్లికేషన్లు ఒకదానికొకటి ఇంటిగ్రేట్‌ చేయూలి.యూఆర్‌ఎల్‌ రీడెరైక్షన్లను మేనేజ్‌చేయూలి. వెబ్‌సైట్‌ కాంక్యురెన్సీ, సెక్యూరిటీని మేనేజ్‌ చేయూలి.

ప్రవేశం:
వెబ్‌ డిజైనింగ్‌కు సంబంధించి ఐఐటీల నుంచి ఎన్‌ఐఐటీ వంటి పలు ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా వివిధ రకాల కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. వివరాలు..

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌-అహ్మదాబాద్‌, గాంధీ నగర్‌, బెంగళూర్‌ క్యాంపస్‌లు.
వెబ్‌సైట్‌:
https://www.nid.edu

ఐఐటీ-కాన్పూర్‌
కోర్సు:
మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌
వెబ్‌సైట్‌: https://www.iitk.ac.in

ఐఐటీ-గౌహతి
కోర్సు:
మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌
వెబ్‌సైట్‌: https://www.iitg.ac.in

లయోలా కాలేజ్‌, చెన్నై.
కోర్సు:
బీఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌)
అర్హత: 10+2
కోర్సు: ఎంఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌):
అర్హత: బీఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌)/బీఎస్సీ(కంప్యూటర్స్‌)/బీఎఫ్‌ఏ
వెబ్‌సైట్‌: https://www.loyolacollege.edu

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ -కాంచీపురం, తమిళనాడు.
కోర్సు:
బీఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌)
అర్హత: 60 శాతం మార్కులతో 10+2
కోర్సు: ఎంఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌):
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌.
వెబ్‌సైట్‌: www.srmuniv.ac.in

సత్యభామ యూనివర్సిటీ-చెన్నై.
కోర్సు: బీఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌)
అర్హత: 60 శాతం మార్కులతో 10+2
వెబ్‌సైట్‌: https://www.sathyabamauniversity.ac.in/

అమిటీ స్కూల్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌.
కోర్సు: ఎంఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌):
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌.
వెబ్‌సైట్‌: https://www.amity.edu

ఇంటర్నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌
(జేఎన్‌టీయూ-సౌజన్యంతో నిర్వహిస్తోంది).
కోర్సు: ఎంఎస్సీ(మల్టీమీడియా)
అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌.
వెబ్‌సైట్‌: https://www.iacg.info/

అన్నా యూనివర్సిటీ, చెన్నై.
కోర్సు:
ఎంఎస్సీ(ఎలక్ట్రానిక్‌ మీడియా):
అర్హత: విజువల్‌ కమ్యూనికేషన్‌/మాస్‌ కమ్యూనికేషన్‌/జర్నలిజంలో డిగ్రీ.
వెబ్‌సైట్‌: https://www.annauniv.edu/

యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, చెన్నై.
కోర్సు:
మాస్టర్‌ ఆఫ్‌ జర్నలిజం ఆన్‌లైన్‌ మీడియా
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌
వెబ్‌సైట్‌: https://www.unom.ac.in/

 

Published date : 08 Jan 2024 05:38PM

Photo Stories