బొమ్మను గీసి, ప్రాణం పోసె.. యానిమేషన్ అండ్ గేమింగ్’ కెరీర్
Sakshi Education
బొమ్మలు గీసి.. ‘ప్రాణం’ పోస్తే ఎలా ఉంటుంది? తనువు పులకరిస్తుంది.. మనసు ఉప్పొంగుతుంది. కళాకారుడి చేతి నుంచి జాలువారిన బొమ్మలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ‘ప్రాణం’పోసి కదలికలు తెప్పించడం ‘యానిమేషన్’కే సాధ్యం.. ఈ కదిలే బొమ్మలు నేడు వినోద రంగంలో రూ. కోట్లు కుమ్మరిస్తున్నాయి. కుర్రకారుకు కలల కొలువులనూ సిద్ధంగా ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో యానిమేషన్ అండ్ గేమింగ్’ కెరీర్‌పై స్పెషల్ ఫోకస్..
యానిమేషన్ రంగంలో రాణించాలంటే ఉండాల్సిన ప్రధాన అర్హతలు
1. సూక్ష్మ పరిశీలన
2. సృజనాత్మకత,
3. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అభిరుచి
యానిమేషన్ అంటే జంతువులు, మనుషులు లేదా ఇంకేవైనా బొమ్మలను కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సహాయంతో కదిలిస్తూ సినిమాలు, గేమ్‌లు, యాడ్స్ వంటివి రూపొందించడమే. చిన్న పిల్లలకు బాగా సుపరిచితమైన మిక్కీమౌస్, డొనాల్డ్ డక్, టామ్ అండ్ జెర్రీ వంటివన్నీ యానిమేషన్ కళ నుంచి పుట్టినవే. యానిమేషన్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలంటే కాసింత కళాపోషణ, సూక్ష్మ పరిశీలన, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానంపై అభిరుచి ఉండాలి.
2డీ అండ్ 3డీ:
యానిమేషన్‌లో 2 డెమైన్షనల్ (2డీ), 3 డెమైన్షల్ (3డీ) ముఖ్యమైనవి. 2డీ కంటే 3డీ అధిక ప్రభావవంతమైంది. 3డీ యానిమేషన్‌లో మాయా సాఫ్ట్‌వేర్, 3డీ-మ్యాక్స్ సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో కావాల్సిన క్యారెక్టర్‌ను డిజైన్ చేసి, యానిమేట్ చేయొచ్చు. మోడలింగ్, రెండరింగ్, టెక్చరింగ్ వంటివన్నీ ఈ సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో పూర్తిచేయొచ్చు.
ఓ అభ్యర్థిని యానిమేషన్ రంగానికి సరిపడే విధంగా తీర్చిదిద్దేందుకు పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బేసిక్ స్కెచింగ్ నైపుణ్యాలు, ఆసక్తి ఉంటే ఎవరైనా ఈ కోర్సులు చేసి, ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. దేశంలో చాలా సంస్థలు యానిమేషన్ అండ్ గేమింగ్‌పై వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
కోర్సుల కోలాహలం..
యానిమేషన్, గేమింగ్ రంగంలో ఉద్యోగావకాశాలు పెరగడంతో సంస్థలు డిగ్రీ, డిప్లొమా, మాస్టర్ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.
కొన్ని సంస్థలు VFXతో కలిపి యానిమేషన్ కోర్సును అందిస్తుంటే, మరికొన్ని ప్రత్యేకంగా యానిమేషన్ అండ్ గేమింగ్‌లో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ఇవీ కోర్సులు:

- గ్రాడ్యుయేషన్ ఇన్ యానిమేషన్ అండ్ గేమింగ్.
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ యానిమేషన్ అండ్ గేమింగ్.
- మాస్టర్ డిప్లొమా ఇన్ యానిమేషన్ అండ్ గేమింగ్.
- సర్టిఫికెట్ ఇన్ యానిమేషన్.
- డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్ 3డీ యానిమేషన్.
- గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు యానిమేషన్ అండ్ గేమింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు.
- ఇన్‌స్టిట్యూట్‌లు పర్సనల్ ఇంటర్వ్యూ, డ్రాయింగ్ టెస్ట్‌ల ద్వారా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
- హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ యానిమేషన్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. కాల వ్యవధి నాలుగేళ్లు. అర్హత: 10+2లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ప్రవేశాలు: ఎంట్రెన్స్ పరీక్ష ఆధారంగా.
వెబ్‌సైట్: www.jnafau.ac.in
యానిమేషన్, గేమింగ్ కోర్సుల్లో బోధించే అంశాలు:
యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టికల్స్ ఉంటాయి. లెర్నింగ్ బై డూయింగ్ విధానానికి ప్రాధాన్యం ఇస్తారు.
వెబ్‌సైట్: www.jnafau.ac.in
యానిమేషన్, గేమింగ్ కోర్సుల్లో బోధించే అంశాలు:
యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టికల్స్ ఉంటాయి. లెర్నింగ్ బై డూయింగ్ విధానానికి ప్రాధాన్యం ఇస్తారు.
- హిస్టరీ ఆఫ్ మల్టిమీడియా, డ్రాయింగ్, కలర్ థియరీ, కంప్యూటర్ బేసిక్స్, వీడియో అండ్ ఫిల్మ్ ఎడిటింగ్, కాన్సెప్ట్యువల్ ఆర్ట్, టెక్చరింగ్, రిగ్గింగ్, కంపోజిటింగ్, యాక్టింగ్ ఫర్ యానిమేటర్స్, క్యారెక్టర్ యానిమేషన్, ఫేషియల్ యానిమేషన్ తదితర అంశాలు.
- అడ్వాన్స్‌డ్ మోడలింగ్ (గేమ్స్), క్యారెక్టర్ మోడలింగ్ (గేమ్స్), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ గేమ్స్, లెవెల్ డిజైన్ ఫర్ గేమ్స్, 3డీ గేమ్ కాన్సెప్ట్, స్టోరీ టెల్లింగ్ ఫర్ గేమ్స్, ప్రి ప్రొడక్షన్ ఫర్ గేమ్స్, గేమ్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ తదితర అంశాలు.
కెరీర్ గ్రాఫ్:
యానిమేషన్ అండ్ గేమింగ్‌లో కోర్సులు పూర్తిచేసి నైపుణ్యాలను సొంతం చేసుకున్న వారికి దేశ, విదేశాల్లో అనేక ఉద్యోగావకాశాలున్నాయి. ఫిల్మ్ స్టూడియోలు, అడ్వర్‌టైజింగ్ కంపెనీలు, టీవీ చానళ్లు, గేమింగ్ ఇండస్ట్రీ, విద్యా సంస్థలు (ఈ-లెర్నింగ్), సిమ్యులేషన్ ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
లభించే ఉద్యోగాలు:

- కంపోజిటర్స్
- 2డీ, 3డీ యానిమేటర్స్
- బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్స్
- ఆడియో, వీడియో ఎడిటర్స్
- కంటెంట్ డెవలపర్స్ అండ్ టెక్చరింగ్ ఆర్టిస్ట్
- క్యారెక్టర్ యానిమేటర్స్
- లే అవుట్ ఆర్టిస్ట్స్
యానిమేషన్ అండ్ గేమింగ్, సంబంధిత కోర్సులు పూర్తిచేసిన తర్వాత జూనియర్ యానిమేటర్‌గా ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రారంభ వేతనం రూ.14 వేలు నుంచి రూ.20 వేలు ఉంటుంది.
- రెండు మూడేళ్ల అనుభవంతో చక్కటి పనితీరు కనబరిస్తే రూ.45 వేల వరకు డ్రా చేయొచ్చు. మంచి నైపుణ్యాలు కనబరిస్తే స్వల్ప కాలంలోనే రూ.లక్ష వరకు వేతనాన్ని తీసుకోవచ్చు.
- సొంత ప్రాజెక్టులు, ఫ్రీలాన్స్ సర్వీస్ ద్వారా అధిక మొత్తంలో ఆర్జించవచ్చు.
- ఎప్పటికప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కూడా ఒడిసిపట్టుకుంటే విదేశీ సంస్థల్లో డాలర్ కొలువుల్ని సొంతం చేసుకోవచ్చు.
- మాయా డిజిటల్ స్టూడియోస్
- రిథమ్ అండ్ హ్యూస్ స్టూడియోస్
- టూంజ్ యానిమేషన్
- ప్రైమ్ ఫోకస్
- మూవింగ్ పిక్చర్స్ కంపెనీ
- ప్రాణా స్టూడియో
- ఈఎఫ్‌ఎక్స్- మ్యాజిక్ ఇన్ మోషన్
- యానిమేటర్ల విధులు కొత్త ఆలోచనలను అభివృద్ధిపరచడంతో ప్రారంభమవుతుంది. తర్వాత ప్రి ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్.. ఇలా వివిధ దశలుంటాయి. ఆలోచన అభివృద్ధి దశలోనే పాత్రల రూపకల్పన జరుగుతుంది. తర్వాత ఐడియాలను లేఅవుట్‌లుగా మార్చుతారు.
- తర్వాత స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ బోర్డింగ్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్, బ్యాక్‌గ్రౌండ్స్, లేఅవుట్ డిజైనింగ్, యానిమాటిక్స్ అండ్ వాయిస్.. ఇవన్నీ ప్రి ప్రొడక్షన్ కిందకు వస్తాయి. తర్వాత స్కానింగ్, కంపోజింగ్, బ్యాక్‌గ్రౌండ్ ప్రిపరేషన్, కలరింగ్ పని పూర్తయ్యాక... సౌండ్ రికార్డింగ్స్, కలర్ ఎడిటింగ్, టెస్టింగ్, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ జత చేస్తారు.
- పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఎడిటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కలర్ కరెక్షన్, వాయిస్ టెస్టింగ్, మ్యూజిక్ ఎడిటింగ్ వంటి పనులు జరుగుతాయి.
ఓ గేమ్‌ను తయారు చేయాలంటే గేమ్ డిజైనింగ్, గేమ్ ప్రోగ్రామింగ్, గేమ్ టెస్టింగ్ వంటి స్కిల్స్ అవసరం.
గేమ్ డిజైనింగ్: ఇందులో పాత్రల మోడలింగ్, బ్యాక్‌గ్రౌండ్స్ పనులు ఉంటాయి. ఇవన్నీ 3డీ మాయా సాఫ్ట్‌వేర్‌లో చేస్తారు.
గేమ్ ప్రోగ్రామింగ్: ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో పాత్రలకు సంబంధించిన యాక్షన్స్‌ను అభివృద్ధి చేస్తారు.
గేమ్ టెస్టింగ్: అభివృద్ధి చేసిన గేమ్‌లో ఏవైనా లోపాలుంటే సరిదిద్దుతారు.
- వచ్చిన ఔట్‌పుట్‌ను మైబైల్ గేమ్స్, పీసీ గేమ్స్, పీఎస్‌పీ గేమ్స్, ఎక్స్ బాక్స్‌లోకి మారుస్తారు.
- గేమ్స్‌లో 2డీ గేమ్స్, 3డీ గేమ్స్ అనే రెండు రకాలుంటాయి. కార్టూన్ రకం గేమ్స్ అన్నీ 2డీ కిందకు వస్తాయి. ఈ రకం గేమ్స్ మొబైల్‌లో వాడుతున్నారు. 3డీ గేమ్స్ వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి. ప్రస్తుతం 3డీ గేమ్స్‌కు ఎక్కువ ఆదరణ ఉంది.
3డీ యానిమేషన్ కోర్సులకు డిమాండ్
ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సులతో సమానంగా యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్సులకు డిమాండ్ ఉంది. Animation & VFX; Animation & Gaming; Advanced 3D Animation తదితర కోర్సులైపై ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. వివిధ సంస్థలు నాలుగేళ్ల వ్యవధిగల ఫ్రొఫెషనల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లతో పాటు ఏడాది వ్యవధిగల డిప్లొమా కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నాయి. సృజనాత్మక ఆలోచనలు, వాటిని అమల్లో పెట్టే చొరవ, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారెవరైనా యానిమేషన్ రంగంలో ప్రవేశించి ఉన్నత స్థానాలను అందుకోవచ్చు. రాష్ట్రంలో గేమ్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అది వస్తే గేమింగ్ రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి.
సరిచూసుకొని చేరాలి
యానిమేషన్, గేమింగ్‌లో శిక్షణ ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. ఓ అభ్యర్థి కోర్సు చేసేందుకు ఎన్నుకునే సంస్థకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంస్థకు మార్కెట్లో ఉన్న పేరు, ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, కోర్సు కరిక్యులం, చేపడుతున్న ప్రాజెక్టులు, ప్లేస్‌మెంట్స్ వంటి వాటిని పరిశీలించాలి.

Published date : 12 Jul 2013 01:22PM