ఆండ్రాయిడ్‌తో కొలువుల జోరు..
Sakshi Education
ఒకప్పుడు మొబైల్ అంటే మాటల ముచ్చట్లకే! కానీ, ఇప్పుడది హస్తాభరణమై భాసిల్లుతోంది. అందుకే నిన్నామొన్నటి వరకు మొరటుగా ఉన్న మొబైల్ ఇప్పుడు ‘స్మార్ట్ ఫోన్’గా ముస్తాబై యువత మనసుల్లో కొలువుదీరింది. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లు చాలా వరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ నైపుణ్యాలను సొంతం చేసుకున్న యువతకు ఉన్నత కొలువులు ఆహ్వానం పలుకుతున్నాయి.
తొలుత టచ్‌స్క్రీన్ ఫోన్లు, తర్వాత ట్యాబ్లెట్ కంప్యూటర్ల కోసం ఆండ్రాయిడ్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)కు రూపకల్పన చేశారు. ఇది రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఒక అధ్యయనం ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి గ్లోబల్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ఆండ్రాయిడ్‌తో పనిచేసే ఫోన్ల వాటా 64 శాతంగా ఉంది. ఇది రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆండ్రాయిడ్ కోర్సు పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది.
ఆప్స్‌ల లోకంలో కొలువుల జాతర:
మన మొబైల్‌కు ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. మనకు కాల్ చేసిన వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి? దీనికో పరిష్కారం ఉంది.. వెంటనే ఇలాంటి సౌకర్యం ఉండే అప్లికేషన్ (ఆప్)ను మన మొబైల్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మన స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తున్నట్లయితే ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ ఆధారంగా అభివృద్ధి చేసిన ఆప్‌నే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రకరకాల అవసరాల కోసం అభివృద్ధి చేసిన ఆప్స్ ఇప్పటికే బోలెడు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి కొత్త కొత్త ఆప్స్‌ను అభివృద్ధి చేయాలనుకుంటే ఆండ్రాయిడ్ కోర్సులో చేరి యువత నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది.

- ఉత్పత్తి, సేవల రంగ కంపెనీలు తమ ఉత్పత్తుల్ని వినియోగదారులకు సులువుగా చేరవేసేందుకు ఆండ్రాయిడ్ ఆప్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి. మొబైల్-కామర్స్‌లో ఆప్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. మొబైల్ ద్వారా వివిధ రకాల బిల్లులు చెల్లించడం, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి సేవలన్నీ ఆండ్రాయిడ్ ఆప్స్ ద్వారా సాధ్యమవుతాయి.
- ఆర్థికం, వినోదం, విద్య, వైద్యం, ఉత్పత్తి రంగాలకు సంబంధించిన చాలా సంస్థలు ఆప్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయి. దీనివల్ల ఆండ్రాయిడ్ ఆప్స్ డెవలపర్స్‌కు డిమాండ్ పెరిగింది. మొబైల్ గేమ్స్ ఆప్స్‌కు కూడా స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ కోర్సు చేసిన వారికి జాబ్ మార్కెట్లో మంచి అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి.
ఆసక్తే అదనపు అర్హత:
మార్కెట్లో చాలా సంస్థలు ఆండ్రాయిడ్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. సైన్స్/ఐటీ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు ఆండ్రాయిడ్ కోర్సులో చేరొచ్చు. అభ్యర్థులకు బేసిక్ జావా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. వీటితో పాటు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా అవసరం.
కోర్సు కాలం:
పలు ప్రైవేట్ సంస్థలు 30-45 రోజుల కాల పరిమితితో ఆండ్రాయిడ్‌కు సంబంధించిన వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సంస్థను అనుసరించి ప్రారంభ కోర్సుల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఫీజు ఉంటుంది.
కోర్సులో ఏమి నేర్పుతారు?
ఆండ్రాయిడ్ కోర్సులో భాగంగా హిస్టరీ ఆఫ్ ఆండ్రాయిడ్ నుంచి పబ్లిషింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వరకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. అవి:

- ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్
- ఆండ్రాయిడ్ ఇన్‌స్టలేషన్
- ఆండ్రాయిడ్ అప్లికేషన్
- బేసిక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌అడ్వాన్స్‌డ్ యూజర్ ఇంటర్‌ఫేస్
- యానిమేషన్ - గ్రాఫిక్స్
- నెట్‌వర్కింగ్, ఆండ్రాయిడ్ సర్వీసెస్
- లొకేషన్ బేస్డ్ సర్వీసెస్
- వైఫై, టెలిఫోనీ, కెమెరా, బ్లూటూత్
కోర్సులో భాగంగా థియరీ, ప్రాక్టికల్స్ ఉంటాయి. తరగతి గదిలో చెప్పిన అంశాలను ఎప్పటికప్పుడు ప్రాక్టికల్‌గా, అన్వయించి విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది.
కొన్ని సంస్థలు క్రాస్ ఫ్లాట్‌ఫాం మొబైల్ అప్లికేషన్స్ అంశాలపై కూడా శిక్షణ ఇస్తున్నాయి. దీనివల్ల ఆండ్రాయిడ్‌లో డెవలప్ చేసిన ఆప్స్‌ను ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో ఉపయోగించే స్కిల్స్ సొంతమవుతాయి.
ఆండ్రాయిడ్ కోర్సుకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ శిక్షణ సంస్థలు ప్రత్యేక కరిక్యులంతో కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి.
- మొబైల్ అప్లికేషన్ డెవలపర్ (జూనియర్, సీనియర్)
- మొబైల్ అప్లికేషన్స్ టెస్టింగ్ స్పెషలిస్ట్.
- మొబైల్ గేమ్ డెవలపర్.
- మొబైల్ అప్లికేషన్స్ మార్కెటింగ్ మేనేజర్.
ఆండ్రాయిడ్ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.18 వేలు నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది.
- నైపుణ్యాలు పెంచుకుంటే రెండుమూడేళ్లలోనే నెలకు రూ.60 వేల వరకు సంపాదించవచ్చు.
- అత్యుత్తమ ప్రతిభావంతులైన, అనుభవమున్న అభ్యర్థులకు రూ.లక్షల ప్యాకేజీతో కొలువులను ఇచ్చేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి.
- జూనియర్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్‌గా కెరీర్ ప్రారంభించిన వారు అనుభవం, ప్రతిభ ద్వారా టీమ్ లీడర్ స్థాయికి ఎదగొచ్చు.
- సొంతంగా ఆప్‌ను అభివృద్ధి చేస్తే దాన్ని గూగుల్ ప్లే (గతంలో ఆండ్రాయిడ్ మార్కెట్)లో పబ్లిష్ చేయొచ్చు. ఈ ఆప్‌నకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తే కాసుల వర్షం కురిసినట్లే.
- శిక్షణ కాలంలో ప్రాజెక్టులో భాగంగా ఏదైనా ఆప్‌ను అభివృద్ధిచేసి నెట్‌లో పెడితే అది ఒకవేళ బాగా నచ్చితే కంపెనీలు పోటీపడి మరీ కొలువులు ఇచ్చేందుకు ముందుకొస్తాయి.
- మల్టీమీడియా ఆప్స్.
- బిజినెస్ ఆప్స్.
- ఈ-బుక్స్ పబ్లికేషింగ్ ఆప్స్.
- మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్స్.
- ట్రావెల్ ఆప్స్.
- మ్యాప్స్ అండ్ నేవిగేషన్ ఆప్స్.
- లైఫ్‌స్టైల్ ఆప్స్.
- హెల్త్, మెడికల్ ఆప్స్.
- గేమ్స్ ఆప్స్.
- ఎడ్యుకేషన్ ఆప్స్.
- ఐటీ శిక్షణ సంస్థకు మార్కెట్లో ఉన్న పేరు
- ఆండ్రాయిడ్ కోర్సు కరిక్యులం
- ల్యాబ్ వసతులు
- ప్లేస్‌మెంట్ సౌకర్యం
ఇతర కోర్సులతో ఉన్నత స్థానాలకు
ఆండ్రాయిడ్ కోర్సు చేసిన వారు ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ డెవలప్‌మెంట్‌కే పరిమితం కానవసరం లేదు. జీై మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన కోర్సు కూడా చేసి ఐఫోన్, ఐపాడ్‌లకు ఉపయోగపడే ఆప్స్‌ను కూడా అభివృద్ధి చేయొచ్చు. ఐఫోన్ ఆప్స్ అభివృద్ధికి సంబంధించిన కోర్సుల్లో చేరాలంటే బేసిక్ ైై్క పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
ఐఫోన్ ఆప్స్ కోర్సు కరిక్యులంలోని కొన్ని అంశాలు:

- ఐఫోన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (ఎస్‌డీకే).
- ఆబ్జెక్టివ్- ఇ.
- యూఐ అప్లికేషన్ అండ్ యూఐ అప్లికేషన్ డెలిగేట్.
- యూఐ నేవిగేషన్ బార్, యూఐ నేవిగేషన్ కంట్రోలర్.
- ఎక్స్‌ఎంఎల్ పార్సింగ్.
- వెబ్ సర్వీసెస్.
- మల్టిమీడియా.
- కోర్ ప్లాట్(బార్ గ్రాఫ్స్), కోర్ గ్రాఫిక్స్ ఇంట్రడక్షన్.
---------------------------------------------------------------------------------------------
ఆప్స్ డెవలపర్లకు పెరుగుతున్న డిమాండ్
స్మార్ట్ ఫోన్లను వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న వారి సంఖ్య వందల కోట్లను దాటింది. ధరలు అందుబాటులో ఉండటం వల్ల ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పోలిస్తే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే వారి సంఖ్య అధికంగా ఉంది. అందువల్ల ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్‌ను అభివృద్ధి చేసే వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రతిభ ఉన్న ఆండ్రాయిడ్ ఆప్స్ డెవలపర్లకు శామ్‌సంగ్, సోనీ, మైక్రోమాక్స్ వంటి కంపెనీలు మంచి ప్యాకేజీలతో కొలువులను ఆఫర్ చేస్తున్నాయి. సాంకేతిక నైపుణ్యాలతో పాటు సృజనాత్మక ఆలోచనలు, వాటిని అమలు చేయగల సత్తా ఉన్నవారు మాత్రమే మొబైల్ ఆప్స్ కోర్సు చేసి ఉన్నత స్థానాలకు ఎదగగలరు. ఆండ్రాయిడ్ కోర్సులతో పాటు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ (ఓఎస్)లకు సంబంధించిన కోర్సులు చేసి కెరీర్ గ్రాఫ్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. కోర్సులు పూర్తిచేసిన తర్వాత యువత సొంతంగా ప్రాజెక్టులు చేపట్టి స్వయం సమృద్ధి సాధించొచ్చు. మరింత మందికి ఉపాధి కల్పించవచ్చు.

Published date : 26 Jul 2013 04:30PM