ఫైర్ ఇంజనీరింగ్
Sakshi Education
బహుళ అంతస్తులు, మల్టీప్లెక్స్‌ల నిర్మాణాలు.. భారీగా విస్తరిస్తున్న పారిశ్రామిక రంగం.. మరోవైపు.. సేఫ్టీ మెజర్స్, కొత్త నిబంధనలు వంటి కారణాలతో కెరీర్ పరంగా అవకాశాలకు వేదికగా నిలుస్తున్న విభాగం ఫైర్ ఇంజనీరింగ్. ఇంటర్ అర్హతతో ఫైర్ ఇంజనీరింగ్ కోర్సులెన్నో ఉన్నాయి. వాటితో అవకాశాలూ సొంతం చేసుకోవచ్చు.
దేశ వ్యాప్తంగా వివిధ సంస్థలు ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో ఇంటర్మీడియెట్ అర్హతగా పలు కోర్సులు బోధిస్తున్నాయి. ఈ కోర్సులకు విద్యార్హతలేకాకుండా నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. ధైర్య సాహసాలు, సమయస్పూర్తి కూడా అవసరమే. ఇంజనీరింగ్ సూత్రాలను ఉపయోగించి అగ్నిప్రమాదాలను నివారించి, ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టం జరగకుండా చూడడమే ఫైర్ ఇంజనీరింగ్.
కోర్సు స్వరూపం: కోర్సులో స్థూలంగా.. ఫైర్ ఇంజనీరింగ్ సైన్స్, ఫైర్ ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్, ఫైర్ ఎక్స్‌టింక్షన్ సైన్స్, ఫైర్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్, సేఫ్టీ మేనేజ్‌మెంట్, సేఫ్టీ ఇంజనీరింగ్, లాస్‌కంట్రోల్ అండ్ సేఫ్టీ లాస్, ఇండస్ట్రియల్ హైజిన్ అండ్ హెల్త్, ఫైర్ ఫైటింగ్ డ్రిల్, ప్రాక్టికల్ ఫీల్డ్ ట్రైనింగ్ అంశాలు ఉంటాయి.
ఉద్యోగాలిక్కడ: ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఫైర్ ఇంజనీర్లకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఫైర్ సర్వీసెస్, ఆర్కిటెక్చరల్ అండ్ బిల్డింగ్ డిజైన్, ఇన్సూరెన్స్ అసెస్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇండస్ట్రీ, రిఫైనరీస్, బాట్లింగ్ ప్లాంట్స్, టెక్స్‌టైల్స్, విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించే, అగ్నిప్రమాదాలకు అవకాశమున్న ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ యూనిట్‌ల్లో ఫైర్ ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. దాంతోపాటు స్థానిక ప్రభుత్వ విభాగాలు, ఇన్సూరెన్స్ కంపెనీల్లోనూ ఫైర్ ఇంజనీర్లకు జాబ్స్ లభిస్తాయి. ప్రారంభంలో రూ.12000 జీతంలోపాటు ఇతర అలవెన్సులూ పొందొచ్చు. ఫైర్ ఇంజనీర్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్న గల్ఫ్ లాంటి దేశాల్లో ప్రారంభంలోనే నెలకు రూ.50,000 వరకు పొందొచ్చు.
ఫైర్ ఇంజనీరింగ్ కోర్సులను అందించే కాలేజీలు
నేషనల్ ఫైర్ సర్వీస్ కాలే జ్-నాగ్‌పూర్
కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్(ఫైర్)
అర్హత: బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
ప్రవేశం: జాతీయ స్థాయి పరీక్ష ద్వారా.
కోర్సు పేరు: సబ్ ఆఫీసర్స్
అర్హత: 10+2
కోర్సు పేరు: డివిజనల్ ఆఫీసర్స్
అర్హత: 10+2 పాసై ఉండాలి. నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ లేదా తత్సమానం నుంచి ఫైర్ సర్వీస్‌లో డిప్లొమా ఉండాలి. డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి.
వెబ్‌సైట్: https://nfscnagpur.nic.in
యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్-డెహ్రాడూన్
కోర్సు పేరు: బీటెక్(ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్)
కోర్సు కాలపరిమితి: నాలుగేళ్లు
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 10+2లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
ప్రవేశం: ఈ సంస్థ నిర్వహించే ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్/ఏఐఈఈఈ
వెబ్‌సైట్: https://www.upes.ac.in
హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్
కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
అర్హత: ఏదైనా డిగ్రీ
కోర్సు పేరు: డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
అర్హత: పదోతరగతి
కోర్సు పేరు: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
అర్హత: ఎవరైనా చేరొచ్చు
వెబ్‌సైట్: www.hifehyd.com
కాలేజ్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్, ఔరంగాబాద్
కోర్సు పేరు: పోస్ట్ హెచ్‌ఎస్‌సీ డిప్లొమా ఇన్ ఫైర్ సర్వీస్ ఇంజనీరింగ్
అర్హత: పదో తరగతి
కోర్సు పేరు: అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ
అర్హత: పదో తరగతి
కోర్సు పేరు:పోస్టు డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్
అర్హత: పదో తరగతి
కోర్సు పేరు: ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్
అర్హత: పదో తరగతి
కోర్సు పేరు: ఇండస్ట్రియల్ సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్
అర్హత: పదో తరగతి
కోర్సు పేరు: ఫైర్ ఇంజనీరింగ్(ఫైర్‌మాన్)
అర్హత: పదో తరగతి
కోర్సు పేరు: ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్
అర్హత: పదో తరగతి
కోర్సు పేరు: ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్
అర్హత: పదో తరగతి
వెబ్‌సైట్: www.fireengg.in
ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్
కోర్సులు:
కోర్సు పేరు: ఎంబీఏ సేఫ్టీ మేనేజ్‌మెంట్
అర్హత: ఏదైనా డిగ్రీ
కోర్సు పేరు: సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఫైర్ సేఫ్టీ (సీసీఎఫ్‌ఎస్)
అర్హత: పదో తరగతి
కోర్సు పేరు: డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ (డీఎఫ్‌ఎస్)
అర్హత: పదోతరగతి
కోర్సు పేరు: డిప్లొమా ఇన్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎన్వినాన్‌మెంట్
అర్హత: పదో తరగతి
కోర్సు పేరు:అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ(ఏడీఎఫ్‌ఎస్)
అర్హత: డిప్లొమా/బీఈ/బీటెక్
కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ(పీజీడీఎఫ్‌ఎస్‌ఈ)
అర్హత: ఏదైనా డిగ్రీ
కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్(పీజీడీహెచ్‌ఎస్‌ఈ)
అర్హత: బీఎస్‌సీ/డిప్లొమా/బీఈ/బీటెక్
వెబ్‌సైట్: www.nifesmindia.net

- సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్‌మెంట్
- సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ ఫైటింగ్
- డిప్లొమా కోర్స్ ఫర్ సీనియర్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ సూపర్‌వైజర్
- డిప్లొమా కోర్స్ ఇన్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్
- పార్ట్ టైమ్ కోర్స్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అండ్ ఫైర్ ఫైటింగ్
- డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.dife.in
కోర్సు పేరు: ఎంబీఏ సేఫ్టీ మేనేజ్‌మెంట్
అర్హత: ఏదైనా డిగ్రీ
కోర్సు పేరు: సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఫైర్ సేఫ్టీ (సీసీఎఫ్‌ఎస్)
అర్హత: పదో తరగతి
కోర్సు పేరు: డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ (డీఎఫ్‌ఎస్)
అర్హత: పదోతరగతి
కోర్సు పేరు: డిప్లొమా ఇన్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎన్వినాన్‌మెంట్
అర్హత: పదో తరగతి
కోర్సు పేరు:అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ(ఏడీఎఫ్‌ఎస్)
అర్హత: డిప్లొమా/బీఈ/బీటెక్
కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ(పీజీడీఎఫ్‌ఎస్‌ఈ)
అర్హత: ఏదైనా డిగ్రీ
కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్(పీజీడీహెచ్‌ఎస్‌ఈ)
అర్హత: బీఎస్‌సీ/డిప్లొమా/బీఈ/బీటెక్
వెబ్‌సైట్: www.nifesmindia.net
Published date : 23 Jun 2012 05:34PM