పారామెడికల్ కోర్సులు
Sakshi Education
ఆడియోమెట్రీ టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ వంటి పారామెడికల్ కోర్సుల ద్వారా మెడికల్ సంబంధిత రంగంలో ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ సంబంధిత పోస్ట్‌లను భర్తీ చేస్తుండటం.. కార్పొరేట్ ఆస్పత్రులు వైద్య సేవలను చిన్న పట్టణాలకు విస్తరిస్తుండటంతో పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వీరు ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధినీ పొందొచ్చు. పారామెడికల్ అభ్యర్థులకు విదేశాల్లోనూ అవకాశాలు పుష్కలం.
ప్రవేశం: మనరాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ (ఏపీపీఎంబీ) పారామెడికల్ కోర్సులను నిర్వహిస్తోంది. దీనికి అనుబంధంగా ఉన్న వివిధ కళాశాలలు, ఇన్‌స్టిట్యూట్‌లు పారామెడికల్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిల్లో ప్రవేశానికి పారామెడికల్ బోర్డ్ ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. కొన్ని కోర్సులకు అర్హత పదో తరగతికాగా, మరికొన్ని కోర్సులకు ఇంటర్మీడియెట్ (బైపీసీ)ను అర్హతగా నిర్ధ్దేశించారు.
కోర్సులు-కెరీర్:
ఆడియోమెట్రీ టెక్నీషియన్: చెవి సంబంధిత పరీక్షలు నిర్వహించడం.. వినికిడి లోపం ఏ స్థాయిలో ఉందో నిర్ధారించడం..పుట్టుకతో వచ్చిన వినికిడి సమస్యలను గుర్తించడంలో ఆడియోమెట్రీ టెక్నీషియన్లు డాక్టర్లకు సహాయపడతారు. అంతేకాకుండా ఆయా సమస్యలకు ఆపరేషన్ అవసరమా, లేదా? అనే విషయాన్ని నిర్ధారించడంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తారు. రాష్ట్రంలో ఈ కోర్సును 16 కాలేజీలు అందిస్తున్నాయి. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.
పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్: హృద్రోగ చికిత్స నిర్వహించే బృందంలో పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్ ది కీలక పాత్ర. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లకు సహాయపడటం..ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఉపయోగించే హార్ట్-లంగ్ మెషిన్ ఎంపిక, అమరికలో..పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్‌లు బాధ్యత వహిస్తారు. ఆపరేషన్ తర్వాత రోగికి అన్నివిధాలుగా సేవలు అందిస్తారు. ప్రస్తుతం గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు పెరుగుతుండడంతో వీరి అవసరం పెరుగుతోంది. మనరాష్ట్రంలో ఈ కోర్సును 8 కాలేజీలు అందిస్తున్నాయి. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.
రేడియోథెరపీ టెక్నీషియన్: కేన్సర్ సంబంధిత చికిత్సలో రేడియోథెరపీ టెక్నీషియన్లు పాల్పంచుకుంటారు. కేన్సర్ ఏ స్థాయిలో ఉంది? దానికి రేడియేషన్ ఎంత స్థాయిలో ఇవ్వాలి? రేడియేషన్ అవసరం ఉందా, లేదా? అనే అంశాలను వీరే నిర్ణయిస్తారు. ఈ కోర్సును రాష్ట్రంలో 4 కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.
రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్: ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిర్ధారణ, ‘బ్రోంకేసో్కిపీ’ టెస్ట్ చేయడంలో రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్‌లు సంబంధిత వైద్యులకు సహాయపడతారు. ఈ కోర్సు రాష్ట్రంలో 7 కాలేజీల్లో ఉంది. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.
డయాలసిస్ టెక్నీషియన్: అవుట్ పేషంట్ డయాలసిస్ విభాగాల్లో డయాలసిస్ టెక్నీషియన్‌లు కీలక పాత్ర పోషిస్తారు. డయాలసిస్ చేసేటప్పుడు వినియోగించే పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి? ఆ పరికరాల నిర్వహణ, సంబంధిత అంశాలు ఈ కోర్సులో ఉంటాయి. ఈ కోర్సును రాష్ట్రంలో 7 కాలేజీలు అందిస్తున్నాయి.
కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.
మల్టీపర్పస్ హెల్త్ వర్కర్: గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి రోగ నివారణ సంబంధిత కార్యక్రమాల అమల్లో వీరు ముఖ్యపాత్ర పోషిస్తారు. ఈ కోర్సు రాష్ట్రంలో 209 కళాశాలలు అందిస్తున్నాయి.
బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్: బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహించడంలో వీరి పాత్ర ముఖ్యమైంది. రక్తాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం, బ్లడ్‌బ్యాంక్‌కు సంబంధించిన అన్ని రికార్డులు, ఇతర విధులు నిర్వహించడం వీరి ప్రధాన బాధ్యత. ఈ కోర్సు రాష్ట్రంలో 24 కాలేజీల్లో అందుబాటులో ఉంది.
అనస్థీషియా టెక్నీషియన్: శస్త్ర చికిత్స నిర్వహించే రోగికి అన స్థీషియా (మత్తుమందు) ఇవ్వడంలో.. సంబంధిత అంశాల నిర్వహణలో అనస్థీషియా టెక్నీషియన్‌లు డాక్టర్లకు సహాయపడతారు. ఈ కోర్సును రాష్ట్రంలో 17 కాలేజీలు అందిస్తున్నాయి.
మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్: MRI, XRay, CTscan, Ultrasound లాంటి పరీక్షల్లో రేడియాలజిస్ట్‌లకు వీరు సహాయపడతారు. ఈ కోర్సు రాష్ట్రంలో దాదాపు 25 కాలేజీల్లో ఉంది. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.
ఫిజియోథెరపీ: వ్యాయామ పరికరాలను అవసరానికనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపీ, మాగ్నటోథెరపీ, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి, లిగమెంట్స్, టెండాన్ సమస్యల పరిష్కారానికి ఫిజియోథెరపిస్టులు అత్యవసరం. అమెరికాలో ఫిజియోథెరపీకి మంచి డిమాండ్ ఉంది. మన రాష్ర్టంలోని 38 కాలేజీల్లో మొత్తం 1815 ఫిజియోథెరపీ సీట్లు ఉన్నాయి. వీటిని ఇంటర్‌లో మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు.
శానిటరీ ఇన్‌స్పెక్టర్: ఇది రెండేళ్ల కోర్సు. కోర్సు పూర్తిచేసినవాళ్లకు పంచాయతీరాజ్, మున్సిపాలిటీల్లో ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి.హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ పొందొచ్చు.
ఎక్స్‌రే, రేడియాలజిస్టు: ఇవి మంచి ఉద్యోగ అవకాశాలున్న కోర్సులు. ఎక్స్ కిరణాలు, అధిక పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను ఉపయోగించి శరీర భాగాల స్కానింగ్, సిటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ మొదలైనవి నిర్వహించడానికి రేడియాలజీ విభాగంలో శిక్షణ ఇచ్చే రెండేళ్ల కోర్సు ఇది. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు అనుబంధంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఇంటర్‌లో మార్కుల ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి రూ. 10,000 నుంచి రూ.20,000వరకు వేతనాలుంటాయి.
పై అన్ని కోర్సులకూ సంబంధించిన పూర్తి సమాచారం కోసం www.appmb.org, www.ntruhs.ap.nic.in వెబ్‌సైట్లు చూడొచ్చు.

Published date : 25 Jun 2012 04:18PM