Skip to main content

నర్సింగ్

ఓ అంచనా ప్రకారం... 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా...2 కోట్ల మంది నర్సులు అవసరం. వృద్ధులు, రోగుల సంఖ్య పెరగడం, నూతనంగా విజృంభిస్తున్న వ్యాధులే దీనికి కారణం. నర్సింగ్ నేడు జాబ్ గ్యారెంటీ వృత్తిగా మారడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువమంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. నర్సింగ్‌లోనూ వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం...

బీఎస్సీ నర్సింగ్: నాలుగేళ్ల వ్యవధి ఉన్న ఈ కోర్సును ఇంటర్(బైపీసీ) ఉత్తీర్ణత తో చేయొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 6 ప్రభుత్వ కాలేజీలు.. 201 ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో... 10,498 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సీటు పొందడానికి.. ఇంటర్ మార్కులే కీలకం. ఎందుకంటే.. నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి ప్రత్యేక అర్హత పరీక్ష లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సీట్లు భర్తీచేస్తుంది.

జీఎన్‌ఎం: జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం). కోర్సు కాలవ్యవధి.. మూడున్నరేళ్లు. ఏఎన్‌ఎం చేసినవారికి ఏడాది సడలింపునిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 234 కాలేజీల్లో ఈ కోర్సు ఉంది. ఇందులో చేరడానికి కనీస అర్హత ఇంటర్‌లో బైపీసీ.

ఏఎన్‌ఎం: యాక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్(ఏఎన్‌ఎం) కోర్సు చేయాలంటే.. టెన్త్ పాస్ కావాలి. ఇది ఏడాదిన్నర కోర్సు. ఏఎన్‌ఎం చేసినవారు నర్సుగా చేరొచ్చు.

మిలిటరీ నర్సింగ్ సర్వీస్ (ఎంఎన్‌ఎస్): ఇందులో చేయూలంటే.. ఇంటర్(బైపీసీ)లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. వయస్సు 17 నుంచి 24 ఏళ్లు. పెళ్లికాని యువతులు, భర్త నుంచి విడాకులు తీసుకున్నవారు, వితంతువులు అర్హులు. రాత పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. కోర్సు పూర్తయ్యాక 4 లేదా ఐదేళ్లు మిలిటరీ హాస్పిటల్‌లో పనిచేస్తామని బాండ్ రాయూలి. ఈ కోర్సును దేశవ్యాప్తంగా 16 సంస్థలు అందిస్తున్నారుు. మన రాష్ట్రంలో సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

విదేశాల్లోనూ అవకాశాలు:
నర్సింగ్ కోర్సులు చేసినవారికి రాష్ట్ర, కేంద్ర స్థారుులో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులే కాకుండా అనేక విదేశీ అవకాశాలు కూడా ఉన్నాయి. వుుఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో నర్సుల కొరత ఎక్కువగా ఉండటంతో ఆ అవసరాలు తీర్చేందుకు భారత్ ప్రధాన వేదికగా వూరుతోంది. ఈ క్రవుంలో అమెరికా, యుూకే, కెనడా, ఆస్ట్రేలియూ, ఐర్లాండ్, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాలు వున దేశంలో నర్సింగ్ ఉత్తీర్ణులకు ప్రధాన గవ్యూలని చెప్పొచ్చు. వాటిలో అవకాశాలు సొంతం చేసుకోవాలంటే.. అక్కడి ప్రభుత్వాలు నిర్వహించే అర్హత పరీక్షలు రాయూలి. ఉదాహరణకు అమెరికాలో నర్స్‌గా స్థిరపడాలంటే కమిషన్ ఆన్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఫారిన్ స్కూల్స్ (సీజీఎఫ్‌ఎన్‌ఎస్) నిర్వహించే నేషనల్ కౌన్సిల్ లెసైన్సర్ ఎగ్జామినేషన్ ఫర్ రిజిస్టర్డ్ నర్సెస్ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్- ఆర్‌ఎన్)లో ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా కెనడాలో అడుగుపెట్టాలంటే.. కెనడియున్ రిజిస్టర్డ్ నర్స్ ఎగ్జామినేషన్ (సీఆర్‌ఎన్‌ఈ)లో ఉత్తీర్ణత తప్పనిసరి. వీటితోపాటు గల్ఫ్ దేశాలు కూడా భారీఎత్తున భారత నర్సింగ్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారుు. నర్సింగ్‌కు సంబంధించి పరిజ్ఞానంతోపాటు ఇంగ్లిష్ భాషపై పట్టుంటే ఎంతో సులువుగా విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అమెరికాలో ప్రారంభంలోనే నెలకు ఐదు వేల డాలర్ల వేతనం లభిస్తోంది.

కెరీర్:
ముఖ్యంగా నర్సింగ్ పూర్తిచేసినవాళ్లకు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలు, ప్రైవేటు క్లినిక్‌లు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, వివిధ ప్రయివేటు పరిశ్రమల్లోని ఇండస్ట్రియల్ హౌసెస్‌లు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, రైల్వేల్లోని ఆరోగ్య విభాగాల్లో డిమాండ్ ఉంది.

ఎంఎస్సీ నర్సింగ్:
ఈ కోర్సులో ప్రవేశానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏటా జూలై/ఆగస్టులలో ప్రకటన విడుదల చేస్తుంది. 55 శాతం మార్కులతో బీఎస్సీ(నర్సింగ్) లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులు దీనికి అర్హులు. పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 కాలేజీల్లో ఎంఎస్సీ నర్సింగ్ అందుబాటులో ఉంది.

ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు:
నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)
మెడి కల్ సర్జికల్ నర్సింగ్, పీడియాట్రిక్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, సైకియాట్రిక్ నర్సింగ్ స్పెషలైజేషన్లతో ఎంఎస్సీ నర్సింగ్ అందిస్తుంది.
అర్హత: నర్సింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ(10+2+4 విధానంలో).
వెబ్‌సైట్: www.nims.ap.nic.in

శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (స్విమ్స్) -తిరుపతి: ఈ సంస్థ కూడా ఎంఎస్సీ నర్సింగ్ కోర్సు ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: https://svimstpt.ap.nic.in
Published date : 25 Jun 2012 03:56PM

Photo Stories