Skip to main content

మెరుగైన కెరీర్‌కు-బీఎస్సీ/బీకామ్/బీఏ

ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీలతో ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరని వాళ్లు సంప్రదాయ కోర్సులైన బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సుల్లో చేరి రాణించొచ్చు. డిగ్రీ తర్వాత ఎంఎస్సీ/ఎంకాం/ఎంఏలతో పాటు ఎంబీఏ, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ చేరొచ్చు. బీఎడ్ చేసి ఉపాధ్యాయ వృత్తిలోనూ రాణించొచ్చు. పీజీ తర్వాత పీహెచ్‌డీ చేస్తే బోధన, పరిశోధనా రంగాల్లో రాణించొచ్చు లేదంటే పోటీ పరీక్షల కోసం ప్రయత్నించొచ్చు.

కెరీర్ విత్ కామర్స్
బీకామ్...

సీఈసీతో నేరుగా సంప్రదాయ బీకాంలో చేరిపోవచ్చు. ఇది మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సు. ఇతర డిగ్రీలతో పోల్చితే స్వయం ఉపాధి దిశగా మార్గం వేసే కోర్సు బీకాం. వ్యాపార లావాదేవీలు రోజురోజుకీ విస్తృతమవుతున్న తరుణంలో.. అకౌంటింగ్ కార్యకలాపాలు తప్పనిసరవుతున్నాయి. వీటి నిర్వహణకు కామర్స్ పట్టభద్రుల అవసరం తప్పనిసరి. ప్రతి కంపెనీకి అకౌంటెంట్ ల అవసరం ఉంటుంది. కాబట్టి బీకాం పూర్తిచేసిన వారికి అకౌంటెంట్ ఉద్యోగం ఖాయం. దాంతోపాటు ఇతర విభాగాల్లోనూ వుంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. సీఈసీ పూర్తయ్యాక ఉపాధి చూసుకొని.. రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లే అవకాశం లేకపోతే డిస్టెన్‌‌సలో బీకాం పూర్తిచేయొచ్చు. అలాంటి వారికోసం మన రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు జాబ్ మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉన్న బీకాం కంప్యూటర్‌‌సను సైతం అందిస్తున్నాయి.
  • ఆచార్య నాగార్జున వర్సిటీ-సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. బీకాం(కంప్యూట ర్స్)ను డిస్టెన్స్ విధానంలో అందిస్తోంది.
    అర్హత: ఇంటర్, లేదా తత్సమానం.
    వెబ్‌సైట్: www.anucde.com
  • ద్రవిడియన్ యూనివర్సిటీ-డెరైక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కుప్పం(చిత్తూరు జిల్లా) కూడా దూర విద్యావిధానంలో బీకాం (కంప్యూటర్స్) కోర్సుందిస్తోంది.
    అర్హత: ఇంటర్ లేదా తత్సమానం
    వెబ్‌సైట్: www.dravidianuniversity.ac.in
  • బీకాం చదువుతూ సీఏ, ఐసీడబ్ల్యుఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులనూ పూర్తిచేయొచ్చు.
  • బీకాం పూర్తై తర్వాత ఎంకాం, ఆ తర్వాత పీహెచ్‌డీ చేయొచ్చు. వ్యాపార సంస్థలు, బోధనా రంగాల్లో స్థిరపడొచ్చు.
మేనేజ్‌మెంట్ కోర్సులు:
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనేక యూనివర్సిటీలు ఇంటర్ అర్హతతో గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీబీఎం, బీబీఏ కోర్సులను అందిస్తున్నాయి. బీబీఎం అంటే.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్. బీబీఏ అంటే.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సంస్థల నిర్వహణలో కీలక పాత్ర పోషించే మేనేజ్‌మెంట్ విభాగాల్లో ... ఈ కోర్సులు పూర్తి చేసిన వారి అవసరం ఎంతో ఉంటుంది. బీబీఎం, బీబీఏ పూర్తయ్యాక దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐఎంలతోపాటు వివిధ బిజినెస్ స్కూళ్లలో చేరేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్), మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్)లు రాయాలి. వీటిల్లో ర్యాంకు ఆధారంగా వివిధ బిజినెస్ స్కూళ్లలో అడ్మిషన్ లభిస్తుంది. మన రాష్ట్రంలో ఎంబీఏలో చేరేందుకు ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఐసెట్) రాయాలి.

ఇంటర్- ఎంపీసీ/బైపీసీ
ఇంటర్ ఎంపీసీతో బీఎస్సీ ఆప్షన్స్...
  • మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
  • మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్
  • మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్
  • మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్
  • మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్
ఎంఎస్సీ:
ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రంలో ఆయా యూనివర్సిటీలు నిర్వహించే పీజీ సెట్‌ల ద్వారా ఎంఎస్సీలో అడ్మిషన్ లభిస్తుంది. రెండేళ్ల ఎంఎస్సీ పూర్తయ్యాక టీచింగ్, లేదా రీసెర్చ్ రంగంవైపు మళ్లొచ్చు. పీహెచ్‌డీ పూర్తిచేస్తే ఈ రెండు రంగాల్లోనూ అత్యున్నతంగా రాణించొచ్చు.

ఎంబీఏ:
బీఎస్సీ లేదా ఏదైనా డిగ్రీ చదివిన వాళ్లకు మరో ముఖ్య పీజీ ఆప్షన్ ఎంబీఏ. జాతీయ స్థాయి క్యాట్, మ్యాట్‌లే కాకుండా మన రాష్ట్రంలోనైతే ఐసెట్ రాసి ఎంబీఏ చేయొచ్చు. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, తదితర విభాగాల్లో కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకుల్లో జాబ్స్ సొంతం చేసుకోవచ్చు.

ఎంసీఏ:
రాష్ట్రంలో ఎంసీఏలో చేరేందుకు మార్గం.. ఐసెట్. ఐఐటీ-రూర్కీతోపాటు నిట్లలోనూ ఈ కోర్సు అందుబాటులో ఉంది. మూడేళ్ల ఎంసీఏ పూర్తిచేసుకోవడం ద్వారా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడొచ్చు.

బీఈడీ:
బీఎస్సీ విద్యార్థులు టీచింగ్‌లో ప్రవేశించాలంటే.. బీఈడీ చేయడం ఉత్తమ మార్గం. ఇది ఏడాది కోర్సు. దీన్ని పూర్తిచేసుకున్నాక డీఎస్సీ రాసి స్కూల్ అసిస్టెంట్‌లుగా స్థిరపడొచ్చు.

మీడియా, మాస్ కమ్యూనికేషన్:
డిగ్రీ పూర్తయ్యాక మీడియా, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పూర్తిచేసుకోవడం ద్వారా రోజురోజుకూ విస్తరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో భారీ జీతాలతో ఉద్యోగం పొందొచ్చు.

ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ:
ఇంటర్మీడియెట్ ఎంపీసీ పూర్తిచేసిన విద్యార్థులు.. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో చేరొచ్చు. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా ఆయా వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ఆధారంగా వీటిలో చేరొచ్చు. ఐదేళ్ల కోర్సు వ్యవధిలో.. మొదటి మూడేళ్లు పూర్తయ్యాక బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ కూడా విద్యార్థుల చేతికందుతుండటం ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల ప్రత్యేకత.

బైపీసీ విద్యార్థులకు...
బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, బయోఇన్ఫర్మాటిక్స్, కెమిస్ట్రీ...ఇలా భిన్న సబ్జెక్టులతో బీఎస్సీలో చేరొచ్చు.

బయోటెక్నాలజీ:
బైపీసీ విద్యార్థులు గణితంలో బ్రిడ్‌‌జ కోర్సు ఉత్తీర్ణులైతే.. మన రాష్ర్టంలో బయోటెక్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులు. ఇవి దాదాపు ప్రైవేట్ కళాశాలల్లోనే ఉన్నాయి. ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో అతిస్వల్ప సంఖ్యలో సీట్లు ఉన్నాయి. ఇంటర్ బైపీసీ విద్యార్థులు డిగ్రీలో బయోటెక్నాలజీని ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇదే అంశంలో పీజీ చేయొచ్చు. ఢిల్లీలోని జేఎన్‌యూ బయోటెక్నాలజీలో పీజీ కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తుంది. దీనిద్వారా జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు ప్రముఖ సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఎంఎస్సీ బయోటెక్ పూర్తిచేసి, పీహెచ్‌డీ చేస్తే ప్రముఖ పరిశోధన సంస్థల్లో మంచి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

బయోఇన్ఫర్మాటిక్స్:
ఇందులో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు, డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి నైపుణ్యం, అనుభవాన్ని బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ.50,000 వరకు జీతం లభిస్తుంది.

నానోటెక్నాలజీ:
నానో టెక్నాలజీ.. మెడిసిన్, ఎలక్ట్రానిక్స్ శక్తి ఉత్పాదన, రోబోటిక్స్‌లో ఉపయోగపడుతుంది. నానో టెక్నాలజీలో డిగ్రీ, పీజీ కోర్సులు అందించే కేంద్రాలు: ఎంజైమ్ బయోసెన్సైస్- బెంగళూరు; ఏఐఎన్‌టీ- నోయిడా; యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జీవీకే బయో కాంప్లెక్స్- హైదరాబాద్, బిట్స్- పిలానీ క్యాంపస్.

లెక్చరర్‌‌సగా:
బోటనీ, జువాలజీ, జెనెటిక్స్...ఇలా ఎందులోనైనా పీజీ పూర్తయ్యాక పీహెచ్‌డీ చేసి యూనివర్శిటీలు, పీజీ కళాశాలల్లో లెక్చరర్‌‌స, రీడర్‌‌సగా, ప్రొఫెసర్‌‌సగా ఎదగొచ్చు.

సివిల్ సర్వీసెస్:
డిగ్రీలో చదివిన సబ్జెక్టులను ఆప్షన్లుగా ఎంచుకొని సివిల్ సర్వీస్, ఐఎఫ్‌ఎస్‌లో మంచి ర్యాంకులు సాధించిన వారెందరో ఉన్నారు.

ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు

బీఏ-ఎంఏ
ఇంటర్‌లో హెచ్‌ఈసీ పాసయ్యాక సంప్రదాయ కోర్సులవైపు మళ్లాలనుకుంటే.. డిగ్రీలో బీఏలో చేరొచ్చు. బీఏ పూర్తిచేసిన తర్వాత ఎకనామిక్స్, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ... ఇలా బీఏలో తీసుకున్న ఆప్షన్లను బట్టి ఆయా సబ్జెక్టుల్లో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ వరకూ ఉన్నత విద్యను కొనసాగించొచ్చు. జాతీయ స్థాయిలో జేఎన్‌యూలో ఎంఏ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది.

ఎంఏ ఎకనామిక్స్:
బీఏ తర్వాత జేఎన్‌యూలో, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎంఏ ఎకనమిక్స్ కోర్సు పూర్తిచేస్తే జాబ్ మార్కెట్‌లో మంచి అవకాశాలు దక్కించుకోవచ్చు. ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా స్టాక్‌మార్కెట్ ఉద్యోగాలతోపాటు మీడియాలోనూ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. అకడెమిక్ రంగంపై ఆసక్తి ఉంటే... ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేసి అధ్యాపక వృత్తిలో ఉన్నతంగా రాణించొచ్చు.

బీఏ-ఎంబీఏ
బీఏ పూర్తయ్యాక బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరిపోవచ్చు. జాతీయ స్థాయిలో నిర్వహించే అన్ని మేనేజ్‌మెంట్ పీజీ కోర్సులకూ బీఏ విద్యార్థులు అర్హులే.

బీఈడీ
గ్రాడ్యుయేషన్(బీఏ) తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేందుకు అవకాశం కల్పించే కోర్సు... బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ). ఈ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎడ్‌సెట్. ఎడ్‌సెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా బీఈడీలో ప్రవేశం కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించొచ్చు.

‘లా’ కోర్సులు:
‘లా’... విద్యార్థుల క్రేజీ కోర్సుగా మారుతోంది. ప్రముఖ ‘లా’ కాలేజీల్లో విద్యనభ్యసించిన వారు హాట్ కేక్‌ల్లా అవకాశాలు సొంతం చేసుకోవడమే దానికి కారణం. లా నేడు బహుముఖ అవకాశాలు కల్పిస్తుండటం.. మన దేశంలో అంతర్జాతీయ స్థారుు ప్రమాణాలతో.. నేషనల్ లా స్కూల్, నల్సార్ వంటి లా స్కూల్స్ ఏర్పాటవడం కూడా అందుకు ప్రధాన కారణాలు. ఇంటర్మీడియెట్ అర్హతతో ప్రవేశ పరీక్షల ద్వారా లా కోర్సులో చేరొచ్చు. వున రాష్ట్రంలో లాసెట్ ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. జాతీయ స్థారుులోని పదకొండు లా స్కూల్స్ అత్యంత ఉన్నత ప్రమాణాలతో న్యాయవాద విద్యను అందిస్తున్నారుు. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (సీఎల్‌ఏటీ- క్లాట్)లో ర్యాం కు ఆధారంగా వీటిలో ప్రవేశం లభిస్తుంది.
వెబ్‌సైట్: www.clat.ac.in

బీబీఏ:
ఆర్ట్స్ విద్యార్థులు బీబీఏ కోర్సులోనూ చేరొచ్చు. ఆ తర్వాత ఎంబీఏ చదువుకోవచ్చు.

జ్యుయలరీ డిజైన్ కోర్సులు:
ప్లెర్ అకాడెమీ ఆఫ్ ఫ్యాషన్, ఢిల్లీ ... జ్యుయలరీ డిజైనింగ్‌లో నాలుగేళ్ల వ్యవధితో బీఏ(ఆనర్స్) కోర్సును అందిస్తోంది. 50 శాతం మార్కులతో 10+2 పూర్తిచేసిన వారు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.pearlacademy.com
  • ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఢిల్లీ... జ్యుయలరీ డిజైనింగ్ డిప్లొమాను అందిస్తోంది. 10+2 పూర్తిచేసిన వారు అర్హులు.
    వెబ్‌సైట్: www.iiftindia.net
  • జ్యుయలరీ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, నోయిడా జ్యుయలరీ డిజైన్ అండ్ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా కోర్సు; ఏడాది వ్యవధి సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
    వెబ్‌సైట్: www.jdtiindia.com
మీడియా, మాస్ కమ్యూనికేషన్
డిగ్రీ పూర్తయ్యాక మీడియా, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పూర్తిచేసుకోవడం ద్వారా రోజురోజుకూ విస్తరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక అవకాశాలను భారీ జీతాలతో సొంతం చేసుకోవచ్చు.

హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్
హెచ్‌ఈసీ తర్వాత బీఏతో విస్తృత ఉద్యోగావకాశాలు కల్పించే హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరొచ్చు. దేశంలో, రాష్ట్రంలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను అందిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్(ఎంబీఏ) కోర్సులో...క్యాట్/మ్యాట్/ఐసెట్‌లలో స్కోర్, గ్రూప్‌డిస్కషన్ ఆధారంగా ప్రవేశం పొందొచ్చు.
వెబ్‌సైట్: www.nithm.ac.in

ఫైన్ ఆర్ట్స్
10+2 అర్హతతో.. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్.. పెయింటింగ్ స్పెషలైజేషన్‌తో అందించే బీఎఫ్‌ఏలో చేరొచ్చు.
వెబ్‌సైట్: www.jnafau.ac.in

ఆంధ్రాయూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, విశాఖపట్నం... పెయింటింగ్ స్పెషలైజేషన్స్‌తో బీఎఫ్‌ఏను అందిస్తోంది. 10+2 అర్హతతో ఆంధ్రా యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏయూసెట్) ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

పోటీ పరీక్షలు:
నియామక పరీక్షల్లో బీఏ విద్యార్థులు ముందంజలో ఉంటారు. దీనికి కారణం సమకాలీన, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై వీరికి పట్టుండటమే. సమాజ స్థితిగతులను అవగతం చేసుకునే అవకాశం వీరికి బాగా దక్కుతుంది. బీఏనే కదా.. పరీక్ష ముందు చదివితే పాసవుతాంలే..’ అనుకునే ధోరణిని విడనాడి.. సివిల్స్, గ్రూప్స్‌ను టార్గెట్‌గా చేసుకుంటే వుంచి అవకాశాలు సొంతం చేసుకోవ చ్చు.
వెబ్‌సైట్లు: www.upsc.gov.in, www.apspsc.gov.in
Published date : 14 Jun 2012 07:55PM

Photo Stories