Skip to main content

మెడిసిన్-ఎంబీబీఎస్

ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థుల మధుర స్వప్నం డాక్టర్. ఎవర్‌గ్రీన్ లాంటి మెడిసిన్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకోవడం ద్వారా స్వర్ణమయ భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని కలలుకనే విద్యార్థులెందరో. సమాజంలో హోదా, ఆకర్షణీయ సంపాదన, ఏ ఇతర వృత్తుల వారికీ లభించని గౌరవం, వైద్యుల కొరత, కోర్సు పూర్తై వెంటనే ఉపాధి.. ఇవన్నీ విద్యార్థులను మెడిసిన్ కోర్సుపై ఆసక్తి కలిగిస్తున్నాయి. కెరీర్ ఆప్షన్స్‌లో టాప్‌గా నిలుస్తోన్న మెడిసిన్ కెరీర్‌పై ఫోకస్..

డాక్టర్ వృత్తిని చేపట్టడానికి తొలి అడుగులు ఇంటర్మీడియెట్ దశ నుంచే ప్రారంభమవుతాయని చెప్పొచ్చు. మెడిసిన్‌లో ప్రవేశించాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో బైపీసీ గ్రూపు తీసుకోవాలి. ఈ అర్హతతో మెడిసిన్‌తోపాటు అనుబంధ కోర్సుల్లోనూ ప్రవేశం పొందొచ్చు.

కోర్సులు.. వివరాలు:
అన్ని కోర్సుల్లో మాదిరిగానే మెడిసిన్‌లో కూడా బ్యాచిలర్, పీజీ/డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ కోర్సులు ఉంటాయి. బ్యాచిలర్ డిగ్రీ కోర్సును ఎంబీబీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ)గా వ్యవహరిస్తారు. తర్వాత పీజీ స్థాయిలో వివిధ స్పెషలైజేషన్స్‌తో ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్), ఎంఎస్(మాస్టర్ ఆఫ్ సర్జన్) కోర్సులు, సూపర్ స్పెషాలిటీ కోర్సులు ఉంటాయి.

ఎంబీబీఎస్:
మెడికల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఎంబీబీఎస్. భారతదేశంలో మెడికల్, సర్జరీ విభాగంలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయడానికి ఈ కోర్సు తప్పనిసరి. ఈ కోర్సులో చేరేందుకు అర్హత ఇంటర్మీడియెట్(బైపీసీ). కోర్సు కాల వ్యవధి ఐదున్నరేళ్లు(ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌తో కలిపి). దేశ వ్యాప్తంగా దాదాపు 330 కాలేజీల్లో 40 వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మన రాష్ట్రంలో సుమారు 4800 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటిదాకా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు, స్టేట్ బోర్డులు నిర్వహించే రాత పరీక్షతో ప్రవేశం కల్పించేవారు. ఇకనుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పీజీ
ఎంబీబీఎస్ తర్వాత పీజీ స్థాయిలో ఎండీ(డాక్టర్ ఆఫ్ మెడిసిన్), ఎంఎస్(మాస్టర్ ఆఫ్ సర్జ న్)కోర్సులు ఉంటాయి. ఈ కోర్సుల్లో మెడిసిన్, సర్జరీ, నాన్ క్లినికల్‌కు సంబంధించి పలు స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. మూడేళ్ల పీజీ కోర్సులతో పాటు రెండేళ్ల డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

సూపర్ స్పెషాలిటీ కోర్సులు:
ఎండీ/ఎంఎస్ కోర్సుల తర్వాత ఆసక్తిని బట్టి ఇష్టమున్న స్పెషలైజేషన్‌తో డీఎం/డీఎన్‌బీ/ఎంసీహెచ్ వంటి కోర్సులు చేయొచ్చు. వీటినే సూపర్ స్పెషాలిటీ డిగ్రీలుగా పేర్కొంటారు. వీటిలో ఇందులో ఉండే స్పెషలైజేషన్స్.. కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోంటరాలజీ, కార్డియోథొరాసిక్ సర్జన్, యూరాలజీ, ఆండ్రాలజీ...

అవసరమైన స్కిల్స్:
  • సేవా దృక్పథం, ఓర్పు, ఆత్మ విశ్వాసం, ఏకాగ్రత
  • దృఢచిత్తంతో వ్యవహరించడం
  • వేగంగా నిర్ణయాలు తీసుకోవడం
  • కమ్యూనికేషన్
  • కష్టపడే మనస్తతత్వం
  • కొత్త పోకడలపై ఆసక్తి
ఫీజు రీయింబర్స్‌మెంట్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం- ఆయా వర్గాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం ఉంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ కళాశాలలతోపాటు ప్రైవేటులోని ఎ, బి(రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ (నాన్ మైనార్టీ) వైద్య కళాశాలల్లోని సీట్లను ‘ఎ’, ‘బి’, (ఫీజు చెల్లింపులో ఉన్న తేడా ఆధారంగా కేటగిరీలుగా వర్గీకరించారు), ‘సి’ కేటగిరీలుగా విభజించారు.) కేటగిరీ సీట్లకు కూడా రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది. బీసీ అభ్యర్థులకు, కుటుంబ వార్షికాదాయం లక్షలోపు ఉన్న ఈబీసీ అభ్యర్థులకు ప్రైవేటు-ఎ కేటగిరీ సీట్లకు రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది. ప్రభుత్వ కళాశాలల్లో సీట్లన్నీ జి-కేటగిరీ సీట్లు. ఇవన్నీ ఉచితం.

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్:
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖలు, విభాగాల్లో వైద్యుల నియామకానికి యూపీఎస్సీ ఈ పరీక్షను ఏటా నిర్వహిస్తోంది. దీని ద్వారా ప్రవేశం పొందే విభాగాలు..
  • రైల్వేస్-అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్
  • కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ హెల్త్ సర్వీస్
  • అసిస్టెంట్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ హెల్త్ సర్వీస్
  • జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఇన్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్
  • మెడికల్ ఆఫీసర్స్ ఇన్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
కెరీర్‌గ్రాఫ్:
ఇతర వృత్తులకు భిన్నమైంది డాక్టర్ ప్రొఫెషన్. ప్రాక్టీస్‌తోపాటే సేవ చేస్తున్నామనే సంతృప్తి మిగిల్చే పవిత్ర వృత్తి. ఎంబీబీఎస్‌లో నాలుగున్నర ఏళ్ల కోర్సు తర్వాత ఇంటర్న్‌షిప్ ప్రారంభమవుతుంది. ఏడాది పాటు ఉండే ఇంటర్న్‌షిప్‌లో ఎంబీబీఎస్ విద్యార్థులను హౌస్ సర్జన్‌గా వ్యవహరిస్తారు. ఈ దశలో కాలేజీకి అనుబంధంగా ఉన్న లేదా నిర్దేశించిన హాస్పిటల్‌లో సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలో విద్యార్థులు ప్రాక్టీకల్ నాలెడ్జ్ పెంచుకుంటారు. దీని తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్టర్‌గా సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు(కొన్ని పరిమితులకు లోబడి). లేదా ఏదైనా హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్/హౌస్ స్టాఫ్‌గా, మెడికల్ కాలేజ్‌ల్లో క్లినికల్ అసిస్టెంట్/క్లినికల్ ట్యూటర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.

గతంలో మాదిరిగా ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటే సరిపోదు. జీవన విధానంలో వచ్చిన మార్పులు, కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులతో స్పెషలిస్ట్ డాక్టర్ల అవసరం పెరుగుతోంది. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో కెరీర్‌లో దూసుకు పోవాలంటే... ఏదో ఒక స్పెషలైజేషన్‌తో పీజీ తప్పనిసరి. ఎండీ/ఎంఎస్ వంటి పీజీ కోర్సులను పూర్తి చేస్తే.. మెడికల్ ఆఫీసర్/సీనియర్ మెడికల్ స్టాఫ్/సీనియర్ రెసిడెంట్ హోదాల్లో స్థిర పడొచ్చు.

కెరీర్‌గ్రోత్:
పెరుగుతున్న జనాభాకు సరిపడ డాక్టర్లు లేకపోడంతో డాక్టర్లకు మంచి డిమాండ్ ఉంది. కె రీర్ గ్రోత్ అంశం..పని చేస్తున్న రంగాన్ని(ప్రభుత్వ, ప్రై వేట్, కాలేజ్) బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అర్హత, అనుభవం ఎంత ఉంటే అంతేస్థాయిలో ఉన్నత స్థానాలకు అందుకునే అవకాశం వైద్య రంగం కల్పిస్తుంది. ప్రభుత్వ రంగంలోనైతే.. అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. అర్హత, అనుభవం, సీనియార్టీ ఆధారంగా సివిల్ సర్జన్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్‌ఎంఓ), అడిషనల్ డీఎంహెచ్‌ఓ, డీఎంహెచ్‌ఓ(జిల్లా వైద్యాధికారి), రీజనల్ డెరైక్టర్, ెహ ల్త్ డెరైక్టర్ వంటి హోదాల్లో స్థిర పడొచ్చు.

ప్రైవేట్ రంగంలో.. జూనియర్ డాక్టర్/హౌస్ స్టాఫ్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. తర్వాత అర్హత, అనుభవం, సీనియార్టీ ఆధారంగా... సీనియర్ డాక్టర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్/ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్‌ఎంఓ) వంటి హోదాలను అందుకోవచ్చు. మెడికల్ కాలేజ్/ఇన్‌స్టిట్యూట్‌ల్లో మాత్రం క్లినికల్ అసిస్టెంట్/క్లినికల్ ట్యూటర్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, హెచ్‌ఓడీ, డీన్, ప్రిన్సిపల్, డెరైక్టర్ వంటి హోదాలను చేరుకోవచ్చు.

కెరీర్ అవెన్యూస్:
  • వివిధ ప్రభుత్వ/ప్రైవేట్ హాస్పిటల్స్/క్లినిక్స్/నర్సింగ్ హోమ్స్
  • వివిధ మెడికల్ కాలేజ్‌లు/ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు
  • ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లోని మెడికల్ సర్వీసెస్
  • వివిధ పరిశోధనా సంస్థలు
  • సొంతంగా కూడా హాస్పిటల్స్/క్లినిక్స్ ప్రారంభించి..ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
పీజీ/డిప్లొమా-స్పెషలైజేషన్లు...
  • జనరల్ మెడిసిన్
  • జనరల్ సర్జరీ
  • పిడియాట్రిక్స్
  • డెర్మటాలజీ
  • ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ
  • ఆర్థోపెడిక్స్
  • ఈఎన్‌టీ
  • సైకియాట్రీ
  • అనస్థీషియా
  • రేడియోథెరపి
  • ఆప్తాల్మాలజీ
  • బయోకెమిస్ట్రీ
  • అనాటమీ
స్కాలర్‌షిప్స్
సీబీఎస్‌ఈ-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్: స్కాలర్‌షిప్ నెలకు:
రూ. 1000 (నాలుగేళ్లు-ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్‌ను రెన్యువల్ చేసుకోవాలి). మొత్తం స్కాలర్‌షిప్‌లలో 10 శాతం తల్లిదండ్రుల ఏకైక సంతానంగా ఉన్న కుమార్తె (సింగిల్ గర్ల్ చైల్డ్) ఉన్న వారికి కేటాయిస్తారు.
వెబ్‌సైట్: https://cbse.nic.in

ఐఓసీ స్కాలర్‌షిప్స్: స్కాలర్‌షిప్ విలువ నెలకు రూ. 2 వేలు (నాలుగేళ్లపాటు).
వెబ్‌సైట్: www.iocl.com

డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ: స్కాలర్‌షిప్ విలువ ఎంబీబీఎస్ విద్యార్థులకురూ. 10 వేలు
వెబ్‌సైట్: www.sercdst.org

ఫెయిర్ అండ్ లవ్‌లీ ఫౌండేషన్:
ప్రకటన:
జూలై లేదా ఆగస్టులో
వెబ్‌సైట్: www.fairandlovely.in

ఆశా-శ్రీ ఎండోమెంట్ స్కాలర్‌షిప్స్(ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు) స్కాలర్‌షిప్ మొత్తం: ఏడాదికి రూ. 30 వేలు.
వెబ్‌సైట్: www.ashashree.org

ఫౌండేషన్ ఫర్ అకడెమిక్ ఎక్సలెన్స్ అండ్ యాక్సిస్ (ఎఫ్‌ఏఈఏ): స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, మెయింటెనెన్స్ అలవెన్స్, హాస్టల్/మెస్ చార్జీలను చెల్లిస్తారు.
వెబ్‌సైట్: www.faeaindia.org

సాహుజైన్ ట్రస్ట్ స్కాలర్‌షిప్స్: స్కాలర్‌షిప్ మొత్తం: నెలకు రూ.150 -1,000 వరకు.
వెబ్‌సైట్: https://sahujaintrust.timeso-findia.com/

కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన: స్కాలర్‌షిప్ నెలకు రూ.4000+వార్షిక కంటింజెన్సీ-రూ.16,000.
వెబ్‌సైట్: www.iisc.ernet.in

ఇన్‌సై ్పర్ స్కాలర్‌షిప్స్: బేసిక్ సైన్స్, నేచురల్ సెన్సైస్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ప్రతిభావంతులకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది.
వెబ్‌సైట్: www.inspiredst.gov.in

దేశంలో ప్రముఖ మెడికల్ కాలేజీలు
  • ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్
  • జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
  • క్రిస్టియన్ మెడికల్ కాలేజ్
  • ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్
  • మణిపాల్ అకాడెమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
  • బెనారస్ హిందూ వర్సిటీ
  • మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్
  • శ్రీరామచంద్ర మెడికల్ కాలేజ్
  • మద్రాస్ మెడికల్ కాలేజ్
  • గ్రాంట్ మెడికల్ కాలేజ్
  • లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్
  • సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్
  • మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్
  • కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్
  • యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సెన్సైస్-ఢిల్లీ యూనివర్సిటీ
రాష్ట్రంలో...
  • ఉస్మానియా మెడికల్ కాలేజ్ - హైదరాబాద్
  • గాంధీ మెడికల్ కాలేజ్-హైదరాబాద్
  • సిద్దార్థ మెడికల్ కాలేజ్-విజయవాడ
  • ఆంధ్రా మెడికల్ కాలేజ్-విశాఖపట్నం
  • గుంటూరు మెడికల్ కాలేజ్- గుంటూరు
  • కాకతీయ మెడికల్ కాలేజ్-వరంగల్
  • రంగరాయ మెడికల్ కాలేజ్-కాకినాడ
  • అల్లూరి సీతారామరాజు-ఏలూరు
Published date : 06 Jun 2012 06:39PM

Photo Stories