Skip to main content

కెరీర్ ఇన్ హెల్త్‌కేర్

వైద్యరంగమంటే కేవలం వైద్యులే కాదు. ఎంతో మంది అనుబంధ నిపుణుల సేవలూ కీలకమే. కార్పొరేట్ ఆసుపత్రులు పెరగడం, ప్రజలు తరచూ రోగాల బారిన పడడం, ఆరోగ్యంపై అవగాహన...లాంటి కారణాలతో హెల్త్‌కేర్ పరిశ్రమ బాగా వృద్ధి చెందుతోంది. దీంతో ఈ రంగంలో అనుభవజ్ఞుల సేవల అవసరమూ పెరుగుతోంది. డాక్టర్లు కానప్పటికీ వివిధ కోర్సులతో హెల్త్‌కేర్ పరిశ్రమలో ప్రవేశించొచ్చు.

మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
వ్యాధి నిర్ధారణకు సంబంధించి మెడికల్ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించి డాక్టర్‌కు రిపోర్టు అందించేవారే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు. వివిధ రకాల రక్త పరీక్షలు, మల, మూత్ర పరీక్షలు నిర్వహించడం వీరి పని. డాక్టర్ రాసే మందులకు వీరిచ్చే రిపోర్టే కీలకం. దీంతో వీరికి అవకాశాలూ పుష్కలం.

కోర్సులు-అర్హతలు:
కోర్సు: డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (డీఎంఎల్‌టీ). మన రాష్ట్రంలో డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ కోర్సు నిర్వహిస్తోంది.
కాల వ్యవధి: రెండేళ్లు.
అర్హత: పదో తరగతి.

కోర్సు: ఎంఎల్‌టీ(మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్)
ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా ఇంటర్మీడియెట్ బోర్డు ఈ కోర్సును అందిస్తోంది.
కాల వ్యవధి: రెండేళ్లు.
అర్హత: పదోతరగతి.

కోర్సు: బీఎంఎల్‌టీ(బీఎస్సీ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ)
కాల వ్యవధి: మూడేళ్లు
అర్హత: బైపీసీతో ఇంటర్ పూర్తి చేసిన వారు లేదా ఇంటర్ ఒకేషనల్ (ఎంఎల్‌టీ) లేదా డిప్లొమా ఇన్ ఎంఎల్‌టీ చేసిన వారు అర్హులు.

ఎంపిక: ఈ కోర్సులో ప్రవేశానికి ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేస్తుంది. ఇంటర్ సబ్జెక్టుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాష్ట్రంలో కాలేజీలు: 54
మొత్తం సీట్లు: 1905
వెబ్‌సైట్: http://59.163.116.210

ఉన్నత విద్య:
పదో తరగతి తర్వాత డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు పూర్తిచేసినవారు మూడేళ్ల బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సులో చేరొచ్చు.ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా ఇంటర్మీడియెట్ బోర్డు నిర్వహించే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులు... మూడేళ్ల బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సును అభ్యసించవచ్చు. బ్రిడ్జి కోర్సు పూర్తిచేసి బీఎస్సీ (మైక్రోబయాలజీ), బీఎస్సీ (బయో కెమిస్ట్రీ), బీఎస్సీ (బయోటెక్), బీజడ్‌సీ వంటి కోర్సుల్లోనూ చేరొచ్చు.
  • ఎలాంటి పరీక్ష లేకుండా ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీపీటీ, మేల్ నర్సింగ్, బ్లడ్ బ్యాంకింగ్, ఎనిస్థీషియా, ఆప్తమాలజీ వంటి డిప్లొమా కోర్సులనూ చేయొచ్చు.
  • అత్యంత సున్నిత పరీక్షలను చేసే డీఎమ్‌ఐటీ (డిప్లొమా ఇన్ మెడికల్ ఇమాజినింగ్ టెక్నీషియన్), ఎమ్‌ఆర్‌ఐ, సీటీ స్కాన్‌లకు సంబంధించిన కోర్సులు కూడా చేసుకోవచ్చు. ప్రభుత్వ సహాయంతో ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
కెరీర్:
లేబొరేటరీల్లో రోగ నిర్ధారణ, తీవ్రత కోసం నిర్వహించే ప్రాక్టికల్, టెక్నికల్ ప్రయోగాల్లో ఈ కోర్సు చేసినవారు పాల్గొంటారు. వ్యాధులు, ప్రమాదాలు, ఆపరేషన్లతోపాటు శరీరంలో సంభవించే ఇతర మార్పులను గుర్తించేందుకు అవసరమైన పరీక్షలను వీరు నిర్వహిస్తారు. హాస్పిటల్స్, డయూగ్నస్టిక్ సెంటర్స్, పరిశోధన సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

వేతనాలు: ప్రారంభంలో రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఆశించొచ్చు. ఆ తర్వాత పనిలో అంకితభావం, కష్టించే స్వభావం ద్వారా మరింత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. లేదంటే సొంతంగా డయాగ్నస్టిక్ సెంటర్ పెట్టుకోవచ్చు.

బీఎస్సీ(ఎంఎల్‌టీ) కోర్సును ఆఫర్ చేస్తున్న కళాశాలలు:
మన రాష్ట్రంలో కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సెన్సైస్, మమత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ సెన్సైస్(ఖమ్మం) ... తదితర సంస్థలు బీఎస్సీ(ఎంఎల్‌టీ) కోర్సును ఆఫర్ చేస్తున్నారుు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) కూడా బీఎస్సీ (ఎంఎల్‌టీ), డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (డీఎంఎల్‌టీ) కోర్సులను అంది స్తోంది.
వెబ్‌సైట్: www.ignou.ac.in

పీజీ స్థారుులో ఎంఎల్‌టీని ఆఫర్ చేసే సంస్థలు:
శ్రీరామచంద్ర యూనివర్సిటీ, తమిళనాడు
వెబ్‌సైట్: www.srmc.edu

లయోలా కాలేజ్, చెన్నై
వెబ్‌సైట్:
www.loyolocollege.edu
పద్మశ్రీ ఇన్‌స్టిట్యూషన్స్- బెంగళూరు

బిట్స్ పిలానీ: ప్రఖ్యాత ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్), పిలానీ-ఆఫ్ క్యాంపస్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ విధానంలో శంకర నేత్రాలయు మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్(తమిళనాడు) సహకారంతో ఎంఎస్(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) కోర్సును అందిస్తుంది.
అర్హత: బీఎస్సీ (బయలాజికల్ సైన్స్) లేదా బిట్స్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు.
ఎంపిక విధానం: రాత పరీక్ష , ఇంటర్వ్యూల ద్వారా

వెబ్‌సైట్స్: www.sankaranethralaya.org, www.bitspilani.ac.in
Published date : 25 Jun 2012 04:11PM

Photo Stories