Skip to main content

ఈవెంట్ మేనేజ్‌మెంట్

నేటి కార్పొరేట్ యుగంలో బర్త్ డే పార్టీ నుంచి మ్యారేజ్ ఫంక్షన్ వరకు అదిరిపోయే విధంగా నిర్వహించాలని ఎక్కువమంది కోరుకుంటున్నారు. దీన్ని సమర్థంగా నిర్వహించేవారే ఈవెంట్ మేనేజర్లు. ఎడ్యుకేషన్ ఈవెంట్స్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్స్ వరకు.. కార్పొరేట్ నుంచి ప్రొడక్ట్ లాంచింగ్, సెమినార్లు, వర్క్‌షాప్స్, సినిమా అవార్డుల ప్రదానం, సన్మానాలు, సత్కారాలు.. ఇలా అనేక కార్యక్రమాలను డిజైన్ చేయడానికి.. చాలా మంది ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దాంతో సంబంధిత రంగంలో కోర్సు పూర్తి చేసిన వారికి అవకాశాలు పెరిగాయి.

చాలా సంస్థలు ఈవెంట్ మేనేజ్‌మెంట్ విభాగంలో సర్టిఫికెట్ నుంచి డిప్లొమా, పీజీ డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, ఎంబీఏ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

ఆఫర్ చేస్తోన్న సంస్థలు-కోర్సులు
ది ఇన్‌స్టిట్యూట్ నేషనల్ అకాడెమీ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్
  • ఎంబీఏ(ఈవెంట్ మేనేజ్‌మెంట్)
  • బీబీఏ (ఈవెంట్ మేనేజ్‌మెంట్)
  • డిప్లొమా, పీజీ డిప్లొమా (ఈవెంట్ మేనేజ్‌మెంట్)
    వెబ్‌సైట్: www.naemd.com
ఏపీజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-న్యూఢిల్లీ.
కోర్సు:
పీజీ డిప్లొమా ఇన్ కార్పొరేట్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.apeejay.edu

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్-గుర్గావ్
కోర్సు:
పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
వెబ్‌సైట్: www.inlead.in

మాస్‌కో మీడియా-నోయిడా
కోర్సు:
పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్
వెబ్‌సైట్: www.masscomedia.com

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్-ముంబై
కోర్సు:
పీజీ డిప్లొమా/డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
వెబ్‌సైట్: www.www.niemindia.com

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ఫ్యూచర్ మేనేజ్‌మెంట్-చండీగఢ్
కోర్సు:
పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.itftindia.com

అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ (అమిటీ యూనివర్సిటీ)-న్యూఢిల్లీ
వెబ్‌సైట్:
www.amity.edu/aiem

అర్హతలు: డిప్లొమాకు 10+2 లేదా ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పీజీ డిప్లొమా/ఎంబీఏ కోర్సుకు గ్రాడ్యుయేషన్ తప్పనిసరి.

అవకాశాలు: ఈ రంగంలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, కార్పొరేట్ హౌస్‌లు, స్టార్ హోటల్స్, రేడియో స్టేషన్స్, రిసార్ట్స్, క్లబ్స్, అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీలు, మీడియా హౌసెస్, మూవీ/టీవీ ప్రొడక్షన్ హౌసెస్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలు, మ్యూజిక్ పరిశ్రమ, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఫ్యాషన్ హౌస్‌ల్లో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. అనుభవం ఆధారంగా సొంతంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని కూడా స్థాపించుకోవచ్చు.

ఎంట్రీ లెవల్: కెరీర్ ప్రారంభంలో.. జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయాలి. తర్వాత స్కిల్స్, అనుభవం ఆధారంగా సీనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్, ఈవెంట్ కో-ఆర్డినేటర్, ఈవెంట్ అసిస్టెంట్ వంటి వివిధ హోదాల్లో స్థిర పడొచ్చు. ఈ హోదాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ రంగంలో ఉన్నత స్థానమైన.. ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి కూడా చేరుకొవచ్చు.

వేతనాలు: ప్రారంభంలో జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌కు నెలకు రూ.15-20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం, హోదాను బట్టి నెలకు దాదాపు రూ.30-50 వేల వరకు సంపాదించవచ్చు. ఈవెంట్ మేనేజర్/ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి చేరుకుంటే నెలకు దాదాపు రూ.2-4 లక్షల వరకు అందుకోవచ్చు.

కావల్సిన స్కిల్స్: ఈ రంగంలో రాణించాలంటే. సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించడం, సమయస్ఫూర్తి అవసరం. అంతేకాకుండా విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులు, చర్చలు సాగించాల్సి ఉంటుంది కాబట్టి ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. బడ్జెట్ కు సంబంధించి అప్రమత్తంగా వ్యవహరించాలి. కాబట్టి సదరు స్కిల్స్ కూడా ఉండాలి. రిస్క్ మేనేజ్‌మెంట్ స్కిల్స్, ఈవెంట్‌ను విజయవంతం చేసే క్రమంలో ప్రచారాన్ని కల్పించడానికి మీడియా మేనేజ్‌మెంట్ స్కిల్స్ వంటి అంశాలు కూడా అవసరమే.

టాప్ రిక్రూటర్స్: విజ్‌క్రాఫ్ట్, లాక్మే, ఫిల్మ్‌ఫేర్ మీడి యా హౌస్, పర్సెప్ట్ డీ మార్క్, సీఎన్‌బీసీ, డీఎన్‌ఏ నెట్‌వర్క్, సర్వీస్ ఇంటర్నేషనల్, 360 డిగ్రీస్, హెల్ప్ ఏజ్ ఇండియా, ఇంటర్‌ఫేస్, రెడ్ ఈవెంట్స్, లైట్ అండ్ రిఫ్‌లెక్షన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఫుడ్ ఆర్ట్, ఈవెంట్ క్రాఫ్టర్, షోమేకర్స్ ఇండియా, ఓపస్ మీడియా, ఈవెంట్ గురు, నక్షత్ర, గ్లోబల్ నెక్సస్, ఇంటర్‌ఫేస్ తదితర సంస్థలు.
Published date : 23 Jun 2012 05:46PM

Photo Stories