ఇంజనీరింగ్
Sakshi Education
వినూత్న కోర్సులు, విభిన్న ఉద్యోగావకాశాలకు వేదిక ఇంజనీరింగ్. అందుకే ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన విద్యార్థుల హాట్ టాపిక్.. ఇంజనీరింగ్! దాంతోపాటు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు దేశ విదేశాల్లో లభిస్తున్న ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయ్. దేశవ్యాప్తంగా సుమారు మూడువేల ఐదు వందల ఇంజనీరింగ్ కాలేజీల్లో పదిహేను లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఐఐటీల వాటా మాత్రం పదివేలే. మన రాష్ట్రంలో సుమారు 700 ఇంజనీరింగ్ కాలేజీల్లో మూడు లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఐదో వంతు ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి.
కాలేజీ ఎంపికలో...
మౌలిక సదుపాయాలు:
ఒక ఇన్‌స్టిట్యూషన్ లేదా కళాశాల విజయంలో మౌలిక సదుపాయాల పాత్ర కీలకం. క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, ఎక్విప్‌మెంట్, లైబ్రరీ, హాస్ట ల్, సెమినార్ రూమ్స్, ఇంటర్నెట్, ట్రాన్స్‌పోర్ట్, ప్లే గ్రౌండ్ మొదలైనవి చాలా అవసరం.
ఫ్యాకల్టీ:
ఇంజనీరింగ్ కాలేజీకి మౌలిక సదుపాయాలు అస్థిపంజరమైతే... ఫ్యాకల్టీ శరీరం అని చెప్పొచ్చు. విద్యార్థిని సరైన దిశలో నడిపించడంలో ఫ్యాకల్టీది ప్రధాన బాధ్యత. ఫ్యాకల్టీ బృందం సీనియర్, జూనియర్ల సమ్మిళితంగా ఉంటే బోధన ప్రభావవంతంగా ఉంటుంది. ఎంత మంది పీహెచ్‌డీ చేశారు? ప్రస్తుతం పీహెచ్ డీ చేస్తున్న వారెందరు? ఏయే ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు? అనుభవం? తదితర వివరాలను తెలుసుకోవాలి.
ప్రారంభించిన సంవత్సరం:
రెండు-మూడేళ్ల క్రితం కొత్తగా స్థాపించిన ఇన్‌స్టిట్యూషన్స్‌తో పోల్చితే కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన కాలేజీలు సౌకర్యాల పరంగా మెరుగ్గా ఉంటాయి. అనుభవ జ్ఞులైన అధ్యాపకులు కూడా పాత కాలేజీల్లో లెక్చర్స్ ఇవ్వడానికి ప్రాధాన్యతనివ్వడంతోపాటు లైబ్రరీ, ల్యాబ్ వంటి సపోర్టింగ్ సిస్టమ్స్ ప్రభావవంతంగా ఉంటాయి. అంతేకాకుండా కనీసం రెండు పాస్ అవుట్ బ్యాచ్‌లు ఉంటేనే టాప్ ఎంఎన్‌సీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్ నిర్వహిస్తాయి.
అక్రెడిటేషన్:
అక్రెడిటేషన్‌ను బట్టి ఆ ఇన్‌స్టిట్యూషన్ స్థాయిని చెప్పొచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్‌బీఏ), నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్(నాక్).. మొదలైన ఏజెన్సీలు విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి. ఈ ఏజెన్సీలు నిర్దేశించిన ప్రమాణాల మేరకు సౌకర్యాలు ఉంటే అక్రెడిటేషన్ స్టేటస్‌ను ఇస్తాయి.
ప్లేస్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెల్:
ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా వివిధ రకాల స్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణతోపాటు ప్లేస్‌మెంట్ సెల్ ఉన్న కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం మూడేళ్ల కాలంలో ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంతమంది క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపిక అయ్యారు అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. జేకేసీలు ఉన్నాయో లేవో కూడా పరిశీలించాలి.
పనితీరు:
గత కొంతకాలంగా కాలేజీ సాధించిన ఫలితాలు, ఎంత మంది విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్‌మెడల్స్ పొందారు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ శాతం, ఇండస్ట్రీ లింకేజ్ ప్రాజెక్ట్స్ వంటి అంశాలాధారంగా కాలేజీ పనితీరును విశ్లేషించుకోవాలి.
కో-కరిక్యులర్ - ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్:
కాలేజీలు విద్యార్థి సమగ్రాభివృద్ధి కోసం దోహదపడేలా క్విజ్, ఎస్సే రైటింగ్, ప్రెజంటేషన్ ఆఫ్ పేపర్స్ వంటి కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌తోపాటు గేమ్స్, కల్చరల్ ప్రోగ్రామ్‌లు, ఎన్‌ఎస్‌ఎస్ తరహా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇటువంటి యాక్టివిటీస్ వల్ల విద్యార్థుల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసంతోపాటు ప్రెజంటేషన్ స్కిల్స్, ఆర్గనైజ్డ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషలైజేషన్ స్కిల్స్ వంటి ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్ మెరుగవుతాయి.
రీసెర్చ్-హయ్యర్ ఎడ్యుకేషన్:
విద్యార్థులను పరిశోధనల పట్ల ప్రోత్సహిస్తున్న ఇన్‌స్టిట్యూషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా గేట్, క్యాట్, ఐఈఎస్ వంటి పరీక్షల్లో ఆ కాలేజీ విద్యార్థుల ప్రతిభను కూడా పరిగణించాలి. దీన్నిబట్టి ఆ కాలేజ్ విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా ఎలాంటి ఇన్‌పుట్స్ ఆ కాలేజ్ ఇచ్చిందో అవగాన చేసుకోవచ్చు.
ఇతర సంస్థలతో అవగాహన:
పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి..సదరు పరిశ్రమలతో కలిసి ఆ ఇన్‌స్టిట్యూషన్ పని చేయాలి. తద్వారా విద్యార్థికి కావల్సిన ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ లభించడంతోపాటు.. పరిశ్రమ కోరుకునే పరిపూర్ణ ఇంజనీర్‌గా రూపొందుతాడు. అంతేకాకుండా జేకేసీ, వివిధ ఆర్ అండ్ డీ సంస్థలతో ఉన్న అవగాహన కూడా విద్యార్థి కెరీర్‌కు ఇతోధికంగా తోడ్పడుతుంది.
ప్రవేశమిలా...
ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హత... మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు సబ్జెక్ట్స్‌గా ఇంటర్మీడియెట్ లేదా త త్సమాన సబ్జెక్టు ఉత్తీర్ణత. ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి ఎంసెట్, ఐఐటీల్లో ప్రవేశానికి ఐఐటీ-జేఈఈ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి ఏఐట్రిపుల్‌ఈ, బిర్లా సంస్థల్లో ప్రవేశానికి బిట్‌శాట్, ఇవే కాకుండా డీమ్డ్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఆయా యూనివర్సిటీలు/సంస్థలు నిర్వహించే పరీక్షల ద్వారా ప్రవేశం లభించేది. కానీ 2013 నుంచి దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని భావించారు. దీంతో రకరకాల పరీక్షల స్థానంలో ఒకే పరీక్ష రాస్తే సరిపోతుంది.
ప్రముఖ సంస్థల్లో సీట్ల వివరాలు సుమారుగా...
పాపులర్ బ్రాంచ్‌లు:
ఆసక్తి:
బ్రాంచ్ ఎంపికలో విద్యార్థి ఆసక్తే ప్రధానమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎటువంటి అవగాహన లేకుంటే.. బ్రాంచ్ ఎంపికలో కొంత కసరత్తు తప్పదు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న బ్రాంచ్‌లు..అవకాశాలు, భవిష్యత్ కెరీర్, దీనికి సంబంధించి వివిధ సంస్థలు ఇచ్చే నివేదికలు తదితర అంశాలతో అవగాహనకు రావొచ్చు.
ఆప్టిట్యూడ్:
స్కిల్స్, అప్టిట్యూడ్ మదింపు చేసుకుని తదనుగుణంగా ఉన్న బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి. మ్యాథ్స్,ఫిజిక్స్‌పై మంచి పట్టు ఉంటే..ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ వంటి బ్రాంచ్‌లను ఎంచుకోవచ్చు. మ్యాథ్స్, లాజికల్ విషయాల్లో ఆసక్తి ఉంటే సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచ్‌ల్లో చేరొచ్చు.
బలం-బలహీనత:
కొన్ని బ్రాంచ్‌లకు ఎక్కువ సమయం కేటాయిస్తూ బాగా హార్డ్ వర్క్ చేయాలి. కొన్ని బ్రాంచ్‌లకు అంతగా అవసరం ఉండదు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ బ్రాంచ్‌లకు సమయస్ఫూర్తితో వ్యవహరించే చతురతతోపాటు అనలిటికల్ స్కిల్స్ అవసరం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
జాబ్ పొటెన్షియల్:
బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు..కోర్సు పూర్తయ్యాక నాలుగేళ్ల తర్వాత ఎటువంటి ఉద్యోగావకాశాలు ఉంటాయనే అంశం మీద ఒక అవగాహనకు రావాలి. ఈ విషయంలో కచ్చితమైన విశ్లేషణకు రావడం కొంత కష్టతరమైన విషయమైనప్పటికీ.. సీనియర్లు, ఇంటర్నెట్, ఫ్యాకల్టీ, తల్లిదండ్రులు, నిపుణుల సలహాలను తీసుకోవాలి.
హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్:
ఎంచుకున్న బ్రాంచ్‌లో ఉండే హయ్యర్ ఎడ్యుకేషన్ అవకాశాల గురించి విశ్లేషించుకుని సరైన బ్రాంచ్‌ను ఎంచుకోవాలి.
ఆఫ్టర్ బీటెక్...
బీటెక్ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే... గేట్ రాసి, ఎంటెక్‌లో చేరొచ్చు. జీ-మ్యాట్, జీఆర్‌ఈ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత ద్వారా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో, విదేశీ వర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించొచ్చు. లేదంటే... చదివిన బ్రాంచ్‌ను బట్టి ఆయా రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నించొచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్, బీహెచ్‌ఈఎల్, ఇస్రో వంటి సంస్థలు... నవరత్న కంపెనీలు ఏటా క్రమం తప్పకుండా ఫ్రెషర్స్‌ను ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి.
గేట్-గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్:
బీటెక్ పూర్తయ్యాక ఎంటెక్/ఎంఈలో చేరాలంటే గేట్ రాయాలి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)-బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో విద్యనభ్యసించాలంటే.. ఏకైక మార్గం గేట్. ఇవికాకుండా గేట్ స్కోర్ ఆధారంగా ఎన్‌ఐటీలు, ఇతర ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఎంఈ/ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.
విదేశాల్లో ఇంజనీరింగ్‌లో పీజీ చేయాలంటే.. టోఫెల్/జీఆర్‌ఈ/ఐఈఎల్‌ఈటీఎస్ వంటి పరీక్షల ద్వారా ఎంఎస్ కోర్సులో చేరొచ్చు. చాలా విదేశీ యూనివర్సిటీలు తక్కువ మొత్తానికే విద్యనందించడంతో పాటు స్కాలర్‌షిప్స్/ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేస్తున్నాయి.
మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరదలిస్తే:
మేనేజ్‌మెంట్ కోర్సులపై ఆసక్తి ఉంటే.. వివిధ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) రాయొచ్చు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలతోపాటు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంబీఏ చదవొచ్చు. జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ఎక్స్‌ఏటీ పరీక్షలో విజయం సాధించి వివిధ విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయొచ్చు లేదా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ నిర్వహించే ‘ఎయిమ్స్ టెస్ట్ ఫర్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్స్(ఏటీఎంఏ)’ పరీక్ష రాసి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశం పొందొచ్చు. ఇంకా సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (స్నాప్) రాసి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సింబయాసిస్ క్యాంపస్‌ల్లో ఎంబీఏ చేయొచ్చు. విదేశాల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు అభ్యసించాలంటే జీమ్యాట్ రాయాలి. ఇందులో వచ్చిన స్కోరు ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు/విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయొచ్చు. హైదరాబాద్‌లో ఇండియన్ బిజినెస్ స్కూల్ కూడా జీమ్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తోంది.
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్:
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ రైల్వేస్, సెంట్రల్ వాటర్ వర్క్స్, సెంట్రల్ ఇంజనీరింగ్, మిలిటరీ ఇంజనీరింగ్, బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా... తదితర విభాగాల్లో ఇంజనీర్ ఉద్యోగ నియామకాలకు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంది. ఇంజనీరింగ్‌లో ఈఈఈ, ఈసీసీ, సివిల్, మెకానికల్ బ్రాంచ్ ఉత్తీర్ణులు ఈ పరీక్షకు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
సివిల్ సర్వీసెస్:
జాతీయ స్థాయిలో అత్యున్నత పరీక్ష సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీని ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏటా డిసెంబర్ చివర్లో ప్రకటన విడుదలయ్యే ఈ పరీక్షకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఇటీవల గత కొన్నేళ్లుగా సివిల్స్ విజేతల్లో 20 నుంచి 30 శాతం మంది ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న అభ్యర్థులుంటున్నారనేది గమనించాల్సిన విషయం. మొత్తం మూడు దశల్లో (ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ) ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
బ్యాంక్ పరీక్షలు:
బీటెక్ అభ్యర్థులకు బ్యాంక్ పరీక్షలు కూడా ఓ ప్రధాన అవకాశంగా పేర్కొనచ్చు. కొన్ని బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్ పేరిట ఐటీ, కంప్యూటర్స్, అగ్రికల్చరల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో బీటెక్ ఉత్తీర్ణులను ప్రత్యేకంగా నియమిస్తున్నాయి.
రాష్ట్ర స్థాయిలో ఏపీపీఎస్సీ ద్వారా:
ఏపీపీఎస్సీ నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్ష ద్వారా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ, రోడ్లు భవనాల శాఖ, ప్రజారోగ్య శాఖ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌ల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చరల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్లను నియమిస్తారు. ఆయా బ్రాంచ్‌ల్లో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వీటితోపాటు మెట్రో వాటర్‌వర్క్స్ ఇంజనీరింగ్ పరీక్షలకు కూడా పోటీ పడొచ్చు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షకు కూడా హాజరు కావొచ్చు.

ఇన్‌స్టిట్యూట్ | సీట్లు |
---|---|
ఐఐటీలు | 10000 |
ఐఐఎస్‌ఈఆర్ | 386 |
ఎన్‌ఐటీలు | 13,248 |
ట్రిపుల్‌ఐటీలు | 698 |
బిట్స్ | 1970 |
వీఐటీ | 2043 |
ఎస్‌ఆర్‌ఎం | 4965 |
పాపులర్ బ్రాంచ్‌లు:
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- సివిల్ ఇంజనీరింగ్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- బయోటెక్నాలజీ
- ఏరోనాటికల్ ఇంజనీరింగ్
- కెమికల్ ఇంజనీరింగ్
- అగ్రికల్చర్ ఇంజనీరింగ్
- బయోమెడికల్ ఇంజనీరింగ్
- లెదర్ టెక్నాలజీ
- టెక్స్‌టైల్ టెక్నాలజీ
- మెరైన్ ఇంజనీరింగ్
- ప్యాకేజింగ్ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ
- మెకట్రానిక్స్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్
- బయోకెమికల్ ఇంజనీరింగ్
- ఆయిల్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్
- డెయిరీ టెక్నాలజీ
- మైనింగ్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్(ఈటీఎం)
- ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్
- ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
- మెటలర్జికల్ ఇంజనీరింగ్ - కెమికల్ పెట్రో ఇంజనీరింగ్
ఆసక్తి:
బ్రాంచ్ ఎంపికలో విద్యార్థి ఆసక్తే ప్రధానమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎటువంటి అవగాహన లేకుంటే.. బ్రాంచ్ ఎంపికలో కొంత కసరత్తు తప్పదు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న బ్రాంచ్‌లు..అవకాశాలు, భవిష్యత్ కెరీర్, దీనికి సంబంధించి వివిధ సంస్థలు ఇచ్చే నివేదికలు తదితర అంశాలతో అవగాహనకు రావొచ్చు.
ఆప్టిట్యూడ్:
స్కిల్స్, అప్టిట్యూడ్ మదింపు చేసుకుని తదనుగుణంగా ఉన్న బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి. మ్యాథ్స్,ఫిజిక్స్‌పై మంచి పట్టు ఉంటే..ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ వంటి బ్రాంచ్‌లను ఎంచుకోవచ్చు. మ్యాథ్స్, లాజికల్ విషయాల్లో ఆసక్తి ఉంటే సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచ్‌ల్లో చేరొచ్చు.
బలం-బలహీనత:
కొన్ని బ్రాంచ్‌లకు ఎక్కువ సమయం కేటాయిస్తూ బాగా హార్డ్ వర్క్ చేయాలి. కొన్ని బ్రాంచ్‌లకు అంతగా అవసరం ఉండదు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ బ్రాంచ్‌లకు సమయస్ఫూర్తితో వ్యవహరించే చతురతతోపాటు అనలిటికల్ స్కిల్స్ అవసరం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
జాబ్ పొటెన్షియల్:
బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు..కోర్సు పూర్తయ్యాక నాలుగేళ్ల తర్వాత ఎటువంటి ఉద్యోగావకాశాలు ఉంటాయనే అంశం మీద ఒక అవగాహనకు రావాలి. ఈ విషయంలో కచ్చితమైన విశ్లేషణకు రావడం కొంత కష్టతరమైన విషయమైనప్పటికీ.. సీనియర్లు, ఇంటర్నెట్, ఫ్యాకల్టీ, తల్లిదండ్రులు, నిపుణుల సలహాలను తీసుకోవాలి.
హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్:
ఎంచుకున్న బ్రాంచ్‌లో ఉండే హయ్యర్ ఎడ్యుకేషన్ అవకాశాల గురించి విశ్లేషించుకుని సరైన బ్రాంచ్‌ను ఎంచుకోవాలి.
ఆఫ్టర్ బీటెక్...
బీటెక్ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే... గేట్ రాసి, ఎంటెక్‌లో చేరొచ్చు. జీ-మ్యాట్, జీఆర్‌ఈ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత ద్వారా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో, విదేశీ వర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించొచ్చు. లేదంటే... చదివిన బ్రాంచ్‌ను బట్టి ఆయా రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నించొచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్, బీహెచ్‌ఈఎల్, ఇస్రో వంటి సంస్థలు... నవరత్న కంపెనీలు ఏటా క్రమం తప్పకుండా ఫ్రెషర్స్‌ను ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి.
గేట్-గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్:
బీటెక్ పూర్తయ్యాక ఎంటెక్/ఎంఈలో చేరాలంటే గేట్ రాయాలి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)-బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో విద్యనభ్యసించాలంటే.. ఏకైక మార్గం గేట్. ఇవికాకుండా గేట్ స్కోర్ ఆధారంగా ఎన్‌ఐటీలు, ఇతర ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఎంఈ/ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.
విదేశాల్లో ఇంజనీరింగ్‌లో పీజీ చేయాలంటే.. టోఫెల్/జీఆర్‌ఈ/ఐఈఎల్‌ఈటీఎస్ వంటి పరీక్షల ద్వారా ఎంఎస్ కోర్సులో చేరొచ్చు. చాలా విదేశీ యూనివర్సిటీలు తక్కువ మొత్తానికే విద్యనందించడంతో పాటు స్కాలర్‌షిప్స్/ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేస్తున్నాయి.
మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరదలిస్తే:
మేనేజ్‌మెంట్ కోర్సులపై ఆసక్తి ఉంటే.. వివిధ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) రాయొచ్చు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలతోపాటు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంబీఏ చదవొచ్చు. జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ఎక్స్‌ఏటీ పరీక్షలో విజయం సాధించి వివిధ విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయొచ్చు లేదా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ నిర్వహించే ‘ఎయిమ్స్ టెస్ట్ ఫర్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్స్(ఏటీఎంఏ)’ పరీక్ష రాసి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశం పొందొచ్చు. ఇంకా సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (స్నాప్) రాసి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సింబయాసిస్ క్యాంపస్‌ల్లో ఎంబీఏ చేయొచ్చు. విదేశాల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు అభ్యసించాలంటే జీమ్యాట్ రాయాలి. ఇందులో వచ్చిన స్కోరు ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు/విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయొచ్చు. హైదరాబాద్‌లో ఇండియన్ బిజినెస్ స్కూల్ కూడా జీమ్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తోంది.
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్:
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ రైల్వేస్, సెంట్రల్ వాటర్ వర్క్స్, సెంట్రల్ ఇంజనీరింగ్, మిలిటరీ ఇంజనీరింగ్, బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా... తదితర విభాగాల్లో ఇంజనీర్ ఉద్యోగ నియామకాలకు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంది. ఇంజనీరింగ్‌లో ఈఈఈ, ఈసీసీ, సివిల్, మెకానికల్ బ్రాంచ్ ఉత్తీర్ణులు ఈ పరీక్షకు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
సివిల్ సర్వీసెస్:
జాతీయ స్థాయిలో అత్యున్నత పరీక్ష సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీని ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏటా డిసెంబర్ చివర్లో ప్రకటన విడుదలయ్యే ఈ పరీక్షకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఇటీవల గత కొన్నేళ్లుగా సివిల్స్ విజేతల్లో 20 నుంచి 30 శాతం మంది ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న అభ్యర్థులుంటున్నారనేది గమనించాల్సిన విషయం. మొత్తం మూడు దశల్లో (ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ) ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
బ్యాంక్ పరీక్షలు:
బీటెక్ అభ్యర్థులకు బ్యాంక్ పరీక్షలు కూడా ఓ ప్రధాన అవకాశంగా పేర్కొనచ్చు. కొన్ని బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్ పేరిట ఐటీ, కంప్యూటర్స్, అగ్రికల్చరల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో బీటెక్ ఉత్తీర్ణులను ప్రత్యేకంగా నియమిస్తున్నాయి.
రాష్ట్ర స్థాయిలో ఏపీపీఎస్సీ ద్వారా:
ఏపీపీఎస్సీ నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్ష ద్వారా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ, రోడ్లు భవనాల శాఖ, ప్రజారోగ్య శాఖ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌ల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చరల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్లను నియమిస్తారు. ఆయా బ్రాంచ్‌ల్లో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వీటితోపాటు మెట్రో వాటర్‌వర్క్స్ ఇంజనీరింగ్ పరీక్షలకు కూడా పోటీ పడొచ్చు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షకు కూడా హాజరు కావొచ్చు.
Published date : 06 Jun 2012 05:54PM