Skip to main content

ఏవియేషన్ కోర్సులు

ప్రస్తుతం ఏవియేషన్ పరిశ్రమ బాగా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో ఉంది. ఉద్యోగావకాశాల్లోనూ ఏవియేషన్ ముందుంటోంది. ఎయిర్ హోస్టెస్, ఎయిర్ టికెటింగ్, గ్రౌండ్‌స్టాఫ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మొదలైన కెరీర్ ఆప్షన్లు ఏవియేషన్ పరిశ్రమలో ఉన్నాయి. వీటన్నింటికీ అర్హత ఇంటర్మీడియెట్. విభాగాల వారీగా ఏవియేషన్ రంగంలోని కోర్సులు.. అవకాశాలపై ఫోకస్..

ఎయిర్ హోస్టెస్..
ఆకట్టుకునే రూపం.. ఎదుటి వారిని ఒప్పించే నేర్పు ఉంటే అవకాశం కల్పించే ఉద్యోగమే ఎయిర్ హోస్టెస్. 19 నుంచి 26 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న మహిళలెవరైనా దీనికి సంబంధించిన కోర్సులో ప్రవేశించి.. శిక్షణ పూర్తి చేసుకున్నాక ఎయిర్ హోస్టెస్ లేదా కేబిన్ క్రూ హోదాలో విమానాల్లో విహరించొచ్చు. ఈ విభాగంలో కెరీర్ ప్రారంభానికిఅర్హత ఇంటర్.

కోర్సులు, సంస్థలు:
ఎయిర్ హోస్టెస్ శిక్షణకు సంబంధించి పలు షార్ట్‌టర్మ్, లాంగ్ టర్మ్ కోర్సులు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.
  • ఎయిర్ హోస్టెస్ అకాడెమీ (న్యూఢిల్లీ)
    కోర్సు:
    ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ డిప్లొమా వ్యవధి: ఏడాది
    వెబ్‌సైట్: www.airhostessacademy.com
  • ఫ్రాంక్‌ఫిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్‌హోస్టెస్ ట్రైనింగ్:
    కోర్సు:
    డిప్లొమా ఇన్ ఏవియేషన్, హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్
    వ్యవధి: ఏడాది
    వెబ్‌సైట్: www.frankfinn.com
  • ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్(సూరత్)
    కోర్సు:
    క్యాబిన్ క్రూ ట్రైనింగ్
    వ్యవధి: ఆరు నెలలు
    వెబ్‌సైట్: www.aiiaindia.in
  • ఆసియా పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఇన్ ఎయిర్ హోస్టెస్/కేబిన్ క్రూ ట్రైనింగ్:
    కోర్సు:
    ఎయిర్ హోస్టెస్ / ఫ్లయిట్ స్టివార్డ్ ట్రైనింగ్
    వ్యవధి: ఏడాది
    వెబ్‌సైట్: www.apimindia.net
  • ఫ్లయింగ్ క్యాట్స్ (చెన్నై)
    కోర్సు:
    డిప్లొమా ఇన్ ఎయిర్ హోస్టెస్ అండ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్
    వ్యవధి: ఏడాది
    వెబ్‌సైట్: www.flyingcats.com
ఉన్నత విద్య :
ఎయిర్ హోస్టెస్ శిక్షణ అనంతరం ఐఏటీఏ సర్టిఫికేషన్లు పొందడానికి వీలవుతుంది. అదేవిధంగా కేబిన్ క్రూ గా పేర్కొనే ఎయిర్ హోస్టెస్ బాధ్యతల నుంచి గ్రౌండ్ క్రూ విభాగానికి బదిలీ కావాలనుకునేవారికి హాస్పిటాలిటీ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ విభాగాల్లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

కెరీర్ ఆప్షన్స్:
ఆయా ఇన్‌స్టిట్యూట్‌లతో పలు ఎయిర్‌లైన్ సంస్థలు ఒప్పందాలు చేసుకుని శిక్షణ పూర్తి చేసుకున్న ఎయిర్ హోస్టెస్‌లను వెనువెంటనే ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి. ప్రారంభంలోనే నెలకు కనీసం రూ.50 వేల జీతం అందిస్తున్నాయి. మాతృభాష, ఇంగ్లిష్‌తోపాటు కనీసం మరో విదేశీ భాషపై పట్టు సాధిస్తే మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు పాటించడమే కాకుం డా నిరంతరం కొనసాగేలా జాగ్రత్త వహించాలి.

గ్రౌండ్ స్టాఫ్
విమాన ప్రయాణాల విషయంలో కొన్ని ప్రత్యేక సందర్భాలు (చెక్-ఇన్, చెక్-అవుట్, బ్యాగేజ్ కలెక్షన్ తదితర) ఎదురవుతాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులకు తమ సేవల ద్వారా సహకరించే సిబ్బందే గ్రౌండ్ స్టాఫ్. ప్రతి ఎయిర్‌లైన్ సంస్థ.. తమ విమాన సర్వీసుల ప్రయాణికుల సౌకర్యం కోసం ఆయా విమానాశ్రయాల్లో ఈ గ్రౌండ్ స్టాఫ్ విభాగాన్ని ఏర్పాటు చేస్తాయి.


గ్రౌండ్ స్టాఫ్ శిక్షణకు సంబంధించిన కోర్సుల్లో లాంగ్వేజ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ప్యాసింజర్ హ్యాండ్లింగ్, ఎయిర్‌పోర్ట్ హ్యాండ్లింగ్, కార్గో హ్యాండ్లింగ్ వంటి అంశాల్లో తర్ఫీదునిస్తారు. ప్రయాణికుడికి చెక్ ఇన్ నుంచి చెక్ అవుట్ వరకు అన్ని విధాల సహకారం అందించేందుకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పిస్తారు.

సంస్థలు, కోర్సులు:
ఏవ్‌లాన్ అకాడెమీ(విశాఖపట్నం):
ఆప్‌టెక్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇన్ గ్రౌండ్ స్టాఫ్ సర్వీసెస్:
వ్యవధి: ఆరు నెలలు
వెబ్‌సైట్: www.avalonacademy.in

ఐరావత్ ఏవియేషన్ అకాడెమీ (ముంబై)
కోర్సు:
ఎయిర్ పోర్ట్ హ్యాండ్లింగ్ మేనేజ్‌మెంట్
వ్యవధి: ఆరు నెలలు

ఎయిర్‌పోర్ట్ ఫెమిలియరైజేషన్ అండ్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్
వ్యవధి:
మూడు నెలలు
కోర్సు: కార్గో అండ్ కొరియర్ మేనేజ్‌మెంట్
వ్యవధి: నాలుగు నెలలు
కోర్సు: ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్
వ్యవధి: మూడు నెలలు
వెబ్‌సైట్: www.airawataviationacademy.com

కెరీర్ వింగ్స్ మేనేజ్‌మెంట్ అకాడెమీ (బరేలి)
కోర్సులు:
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ సర్వీసెస్
వ్యవధి: ఆరు నెలల నుంచి ఏడాది
వెబ్‌సైట్: www.careerwings.co.in

యురేసియా ఏవియేషన్ అకాడెమీ(చెన్నై)
కోర్సులు:
సర్టిఫికేషన్ ఇన్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్
వ్యవధి: మూడు నెలలు
వెబ్‌సైట్: www.uaacademy.com

ఉన్నతవిద్య:
ఈ కోర్సు పూర్తై తర్వాత ఐఏటీఏ సర్టిఫికేషన్ కోసం ప్రయత్నించడం మరింత లాభిస్తుంది.

కెరీర్ ఆప్షన్స్:
ఆయా విమానయాన సంస్థల్లో ఎయిర్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్, ఫేర్స్ అండ్ టికెటింగ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్, కార్గో హ్యాండ్లింగ్ వంటి విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రారంభంలో నెలకు * 25 వేల జీతం కచ్చితంగా లభిస్తుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్, ఏదో ఒక విదేశీ భాషపై అవగాహన ఉంటే కెరీర్ మరింత ఉజ్వలంగా ఉంటుంది.

ఎయిర్ టికెటింగ్
ఇటీవల కాలంలో విస్తృత అవకాశాలను కల్పిస్తున్న విభాగం ఎయిర్ టికెటింగ్. ఉన్నత చదువులు చదివే అవకాశం లేని వారు తక్కువ వ్యవధిలోనే ఉద్యోగం సొంతం చేసుకునే కోర్సు ఎయిర్ టికెటింగ్.

ఎయిర్ టికెటింగ్ అంటే:
విమానాల వేళలు, ప్రయాణికులు అవసరాలను రెండిటినీ పరిగణనలోకి తీసుకుంటూ.. వీటిని అనుసంధానం చేసుకుంటూ టికెట్లను ఖరారు చేసి అందించే కోర్సే ఎయిర్‌లైన్ టికెటింగ్. ఈ కోర్సులో పలు రకాల పద్ధతులు (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, ఏజెంట్ నెట్‌వర్క్, కౌంటర్) ద్వారా విమాన టికెట్ల బుకింగ్, రిజర్వేషన్ వంటి అంశాల్లో శిక్షణనిస్తారు. అంతేకాకుండా ఎయిర్‌లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, టికెట్ రిజర్వేషన్, ట్రావెల్ ఏజెన్సీ మేనేజ్‌మెంట్, జియోగ్రాఫికల్ కోడ్స్, టైంటేబుల్ చెకింగ్, ఫ్లయిట్ ఎవైలబిలిటీ చెకింగ్, హోటల్ రిజర్వేషన్, కస్టమర్ రిలేషన్‌షిప్ వంటి అంశాల్లోనూ శిక్షణనిస్తారు.

కోర్సులు, సంస్థలు:
ప్రస్తుతం ఎయిర్‌లైన్ టికెటింగ్ విభాగంలో రెండు నెలల నుంచి ఏడాది వ్యవధిలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సులను బట్టి వాటిలో ప్రవేశానికి అర్హత ప్రమాణాలుంటాయి. దేశంలో పలు ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు ఇంటర్మీడియెట్ అర్హతగా ఎయిర్ టికెటింగ్ కోర్సులు అందిస్తున్నాయి.

ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అకాడెమీ(న్యూఢిల్లీ):
కోర్సు:
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ టికెటింగ్
వ్యవధి:ఏడాది/ ఆరు/రెండు నెలలు
వెబ్‌సైట్: www.airhostessacademy.com

ఎయిర్‌హోస్టెస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(న్యూఢిల్లీ):
కోర్సు:
ఎయిర్ ఫేర్, ట్రావెల్ అండ్ టికెటింగ్
వ్యవధి: నాలుగు నెలలు
వెబ్‌సైట్: www.airhostesstraininginstitute.com

ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అకాడెమీ (చెన్నై):
కోర్సులు:
ఎయిర్ టికెటింగ్ అండ్ ట్రావెల్ కార్గో అండ్ కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్
వ్యవధి: నాలుగు/ ఎనిమిది/ 10 నెలలు
వెబ్‌సైట్: www.airlinesacademy.com

ట్రేడ్ వింగ్స్ (న్యూఢిల్లీ):
కోర్సు:
ఎయిర్‌లైన్స్ అండ్ టికెటింగ్
వెబ్‌సైట్: www.tradewinginstitute.com

ఉన్నత విద్య:
కోర్సు పూర్తై తర్వాత ఐఏటీఏ అందించే డిప్లొ మా, పోస్ట్ డిప్లొమా, సర్టిఫికేషన్స్ పూర్తిచేస్తే భవిష్యత్తులో అవకాశాలు విస్తృతమవుతాయి.

కెరీర్ ఆప్షన్లు:
ఎయిర్‌లైన్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్స్, ట్రాఫిక్ అసిస్టెంట్స్, రెవెన్యూ అకౌంటెంట్స్ వంటి హో దాల్లో ట్రావెల్ ఏజెన్సీలు, ఎయిర్‌లైన్ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.ప్రారంభంలోనే నెలకు * 15 వేలు జీతం ఆశించొచ్చు. ఈ విభాగంలో స్థిరపడాలనుకుంటే సహనం, ఎదుటివారిని మెప్పించి, చక్కని ఆతిథ్యం ఇచ్చే నైపుణ్యం కావాలి. అంతేకాక.. ఇంగ్లిష్‌తోపాటు ఏదో ఒక విదేశీ భాషలో నైపుణ్యం ఉంటే కెరీర్‌లో రాణించేందుకు ఎన్నో మార్గాలు ఏర్పడతాయి.

ఏవియేషన్‌లో బీబీఏ
సన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్(విశాఖపట్నం, హైదరాబాద్)
వెబ్‌సైట్:
www.sitam.org

యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (డెహ్రాడూన్)
కోర్సు:
బీబీఏ (ఏవియేషన్ ఆపరేషన్స్)
వెబ్‌సైట్: www.upes.ac.in

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ (డెహ్రాడూన్)
కోర్సు:
బీబీఏ (ఏవియేషన్, హాస్పిటాలిటీ అండ్ టూరిజం)
వెబ్‌సైట్: www.aiiaindia.in

ఏవ్‌లాన్ అకాడెమీ
కోర్సు: బీబీఏ(ఏవియేషన్)
వెబ్‌సైట్: www.avalonacademy.in

ఏరోనాటికల్ ఇంజనీరింగ్
ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణులు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సు చదవడానికి అర్హులు. మన రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. మొత్తం 22 కళాశాలల్లో 1440 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. కోర్సులో భాగంగా విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు, శాటిలైట్ల డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, మెకానిజంను బోధిస్తారు.

ఉన్నత విద్య:
ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ తర్వాత ఎంటెక్ లేదా ఎంఎస్‌లో చేరొచ్చు. ఏరోడైనమిక్స్, డైనమిక్స్ అండ్ కంట్రోల్, ఏరోస్పేస్ ప్రొపల్షన్, ఏరోస్పేస్ స్ట్రక్చర్స్... మొదలైన స్పెషలైజేషన్లు ఉంటాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో చేసిన వారు ఏవియేషన్‌లో మేనేజ్‌మెంట్ కోర్సును కూడా ఎంచుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్-ఎంబీఏ (ఏవియేషన్ మేనేజ్‌మెంట్)ను ఆఫర్ చేస్తోంది.

ఉద్యోగావకాశాలు:
ఏరోనాటికల్ ఇంజనీర్లకు డిజైన్, డెవలప్‌మెంట్‌తోపాటు మేనేజ్‌మెంట్, టీచింగ్ రంగాల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్‌లలో, ఏవియేషన్ రంగంలోని డిజైన్ యూనిట్లలో వీరికి డిమాండ్ ఉంది. ఇస్రో, డీఆర్‌డీవో వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో... ప్రైవేటు రంగంలో ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్‌లైన్, శాటిలైట్, డిఫెన్స్ ఇండస్ట్రీతోపాటు వాటి అనుబంధ రంగాల్లోనూ ఉపాధి పొందొచ్చు. ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీలలో ఏరోనాటికల్ ఇంజనీర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఐఎస్‌ఆర్‌వో), నేషనల్ ఏరోనాటిక్స్ లేబొరేటరీ(ఎన్‌ఏఎల్) వంటి సంస్థలు ఏరోనాటికల్ ఇంజనీర్లకు అవకాశాలు కల్పిస్తున్నాయి.

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అందిస్తోన్న సంస్థలు:
ఐఐటీల్లో...
కోర్సు:
ఏరోస్పేస్ ఇంజనీరింగ్
అర్హత: 60 శాతం (ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులు 55 శాతం) మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత.
సంస్థలు: ఐఐటీ ముంబై (www.iitb.ac.in), ఐఐటీ-కాన్పూర్ (www.iitk.ac.in),
ఐఐటీ-ఖరగ్‌పూర్ (www.iitkgp.ac.in), ఐఐటీ-మద్రాస్ (www.iitm.ac.in).
ప్రవేశం: ఐఐటీ-జేఈఈ ద్వారా

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ)
కోర్సు:
ఏరోస్పేస్ ఇంజనీరింగ్
అర్హత: 10+2లో ఎంపీసీ 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ప్రవేశం: ఐశాట్ ద్వారా
వెబ్‌సైట్: www.iist.ac.in
Published date : 23 Jun 2012 04:43PM

Photo Stories