ఎస్‌సీఆర్‌ఏ... ఫ్రీగా బీటెక్+రైల్వేలో ఇంజనీర్ జాబ్
Sakshi Education
స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ (ఎస్‌సీఆర్‌ఏ) ద్వారా ఇంటర్మీడియెట్ ఎంపీసీతోనే రైల్వేలో ఉన్నత కెరీర్‌కు బాట వేసుకోవచ్చు. పైసా ఖర్చులేకుండా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేయొచ్చు. పైగా కోర్సు చదువుతూనే నెలనెలా స్టైపెండ్ కూడా అందుకోవచ్చు. కోర్సు పూర్తై వెంటనే రైల్వేలో మెకానికల్ ఇంజనీర్‌గా చే రిపోవచ్చు. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులకు ఉన్న సువర్ణావకాశం ఎస్‌సీఆర్‌ఏ.
యూపీఎస్‌సీ నిర్వహించే అత్యున్నత పరీక్షల్లో స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ (ఎస్‌సీఆర్‌ఏ) ఒకటి. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులకు ఉన్న సువర్ణావకాశంగా ఎస్‌సీఆర్‌ఏను చెప్పుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్ల మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుతో పాటు నెలకు రూ.9100 స్టైపెండ్ కూడా చెల్లించడం విశేషం. ఎంపికైన అభ్యర్థులకు బీహార్‌లోని జమల్‌పూర్ వర్క్‌షాప్‌లో శిక్షణ ఉంటుంది. సెలవుల్లో వర్క్‌షాప్ ట్రైనింగ్ సెషన్ బిట్ మెస్రాలో నిర్వహిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారికి బిట్-మెస్రా డిగ్రీ ప్రదానం చేస్తుంది. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్ సబ్జెక్టులపై పట్టుంటే ఎస్‌సీఆర్‌ఏలో నెగ్గడం తేలికే. ఎందుకంటే.. ఈ పరీక్షలో 400 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఇంటర్మీడియట్ సిలబస్ నుంచే అడుగుతారు.
రాత పరీక్ష ఇలా:
ఇందులో పశ్నలన్నీ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటాయి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు. ఇంగ్లిష్ మాద్యమం. తప్పు సమాధానానికి మార్కుల్లో కోత ఉంటుంది. రాత పరీక్షలో మూడు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి 200 మార్కులు.
పేపర్-1: జనరల్ ఎబిలిటీ టెస్ట్ (ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, సైకలాజికల్ టెస్ట్). వ్యవధి 2 గంటలు. మార్కులు 200.
పేపర్-2: ఫిజికల్ సైన్స్(ఫిజిక్స్, కెమిస్ట్రీ). వ్యవధి 2 గంటలు. మార్కులు 200.
పేపర్-3: మ్యాథమేటిక్స్. వ్యవధి: 2 గంటలు, మార్కులు: 200
పర్సనాలిటీ టెస్ట్: 200 మార్కులు (రాత పరీక్షలో ఎంపికైనవారికి మాత్రమే)
సిద్ధంకండిలా:
నెలకు రూ.9100 చొప్పున కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు పాటు చెల్లిస్తారు. ప్రతి ఆరు నెలలకూ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారు. మంచి పనితీరు కనబర్చని వారిని మధ్యలో తొలగిస్తారు. కనీసం మూడేళ్లపాటు రైల్వేలో పనిచేస్తామని ఒప్పందపత్రాన్ని రాయాలి.
ప్రొబేషన్:
విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారిని మూడేళ్లు ప్రొబేషన్‌లో ఉంచుతూ రైల్వేలో మెకానికల్ ఇంజనీర్‌గా నియమిస్తారు. ఇప్పుడున్న స్కేల్ ప్రకారం ప్రొబేషన్‌లో నెలకు రూ.30,000కు పైగా సంపాదించొచ్చు. దీంతోపాటు రైల్వే ఏసీ కోచ్‌లో ఉచితంగా కుటుంబమంతా ప్రయూణించొచ్చు కూడా. ఎస్‌సీఆర్‌ఏకు ఎంపికైనవారు భవిష్యత్తులో రైల్వే బోర్డ్ చైర్మన్ లాంటి అత్యున్నత పదవి కూడా చేపట్టొచ్చు. డివిజినల్ ఇంజనీర్, జోనల్ చీఫ్ ఇంజనీర్.. ఇలాంటి హోదాలు ఎంపికైన అందరికీ దక్కుతాయి.
అర్హతలివీ...
విద్యార్హత: ప్లస్ టూ/ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.
వయోపరిమితి: కనీసం పదిహేడేళ్లకు తక్కువ కాకుండా 21 ఏళ్లు మించకుండా ఉండాలి. (పరీక్ష నిర్వహించే సంవత్సరం ఆగస్ట్ 1 నాటికి). ఎస్సీ, ఎస్టీలకు గరిష్టంగా ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోసడలింపులుంటాయి.
సీట్లు: ఖాళీలపై ఆధారపడి ఉంటాయి. సుమారు 50 వరకూ ఉండొచ్చు.
ప్రకటన: రెండేళ్లకొకసారి ఫిబ్రవరి/మార్చిలో
నిర్వహణ: యూపీఎస్‌సీ
పరీక్ష: జూలై/ఆగస్ట్
మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశా ఖపట్నం, తిరుపతి
వెబ్‌సైట్: www.upsc.gov.in

- అభ్యర్థికి ఇంగ్లిష్‌లో పరిజ్ఞానం, ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడో పరిశీలించేవిధంగా ఇంగ్లిష్‌పై ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ యూసేజ్, ఒకాబులరీ ఎక్సర్‌సైజ్‌లు ప్రాక్టీస్ చేయూలి.
- జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఫిజికల్ జాగ్ర ఫీ, పాలిటీ, హిస్టరీ, సోషల్ ప్లానింగ్, సోషల్ వెల్ఫేర్, ఎకనామిక్స్, పంచవర్ష ప్రణాళికలు అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి.
- ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ పుస్తకాలు చదివితే జీకే ప్రిపరేషన్ చాలావరకు పూర్తైట్లే.
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంశాలకోసం ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాలు క్షుణ్నంగా చదివితే సరిపోతుంది.
- వీలైనన్ని మోడల్ ప్రశ్నలు సాధన చేయూలి.
నెలకు రూ.9100 చొప్పున కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు పాటు చెల్లిస్తారు. ప్రతి ఆరు నెలలకూ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారు. మంచి పనితీరు కనబర్చని వారిని మధ్యలో తొలగిస్తారు. కనీసం మూడేళ్లపాటు రైల్వేలో పనిచేస్తామని ఒప్పందపత్రాన్ని రాయాలి.
ప్రొబేషన్:
విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారిని మూడేళ్లు ప్రొబేషన్‌లో ఉంచుతూ రైల్వేలో మెకానికల్ ఇంజనీర్‌గా నియమిస్తారు. ఇప్పుడున్న స్కేల్ ప్రకారం ప్రొబేషన్‌లో నెలకు రూ.30,000కు పైగా సంపాదించొచ్చు. దీంతోపాటు రైల్వే ఏసీ కోచ్‌లో ఉచితంగా కుటుంబమంతా ప్రయూణించొచ్చు కూడా. ఎస్‌సీఆర్‌ఏకు ఎంపికైనవారు భవిష్యత్తులో రైల్వే బోర్డ్ చైర్మన్ లాంటి అత్యున్నత పదవి కూడా చేపట్టొచ్చు. డివిజినల్ ఇంజనీర్, జోనల్ చీఫ్ ఇంజనీర్.. ఇలాంటి హోదాలు ఎంపికైన అందరికీ దక్కుతాయి.
అర్హతలివీ...
విద్యార్హత: ప్లస్ టూ/ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.
వయోపరిమితి: కనీసం పదిహేడేళ్లకు తక్కువ కాకుండా 21 ఏళ్లు మించకుండా ఉండాలి. (పరీక్ష నిర్వహించే సంవత్సరం ఆగస్ట్ 1 నాటికి). ఎస్సీ, ఎస్టీలకు గరిష్టంగా ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోసడలింపులుంటాయి.
సీట్లు: ఖాళీలపై ఆధారపడి ఉంటాయి. సుమారు 50 వరకూ ఉండొచ్చు.
ప్రకటన: రెండేళ్లకొకసారి ఫిబ్రవరి/మార్చిలో
నిర్వహణ: యూపీఎస్‌సీ
పరీక్ష: జూలై/ఆగస్ట్
మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశా ఖపట్నం, తిరుపతి
వెబ్‌సైట్: www.upsc.gov.in
Published date : 27 Jun 2012 08:18PM