బైపీసీతో విభిన్న కోర్సులెన్నో..!
Sakshi Education
బైపీసీ అంటే.. ఎంబీబీఎస్, అగ్రికల్చరల్ కోర్సులేకాదు.. అత్యున్నత శిఖరాలకు ఎదగడానికి ఇంకా ఎన్నో మార్గాలున్నాయి. మెడిసిన్‌లో సీటు లభిస్తే.. మంచిదే! లేకున్నా... లైఫ్ సెన్సైస్‌తో ఉజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. బయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, జెనెటిక్ ఇంజనీరింగ్, బాటనీ, జువాలజీలతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని... పీజీ, పీహెచ్‌డీలతో రీసెర్చ్, టీచింగ్ కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు!!
బీఎస్సీలో లైఫ్ సెన్సైస్ కాంబినేషన్లు
ఉస్మానియా యూనివర్సిటీ అందిస్తున్నవి:
బయూలజీ, టెక్నాలజీల కలరుుకతో రూపుదిద్దుకున్న బయోటెక్నాలజీ.. రీసెర్చ్ ఓరియెంటెడ్ సైన్స్. వారసత్వంగా సంక్రమించే వ్యాధులకు వ్యాక్సిన్లు, వైద్య, ఆరోగ్య అంశాలకు సంబంధించిన బయలాజికల్ ఇండికేటర్ల తయూరీ.. పరిశ్రమల వ్యర్థాలను బయూలాజికల్‌గా తొలగించడం వంటి విధులను బయోటెక్నాలజిస్ట్‌లు నిర్వహించాలి.
ప్రవేశం: మన రాష్ట్రంలో బ్యాచిలర్స్ స్థారుులో బీఎస్సీ(బయోటెక్నాలజీ), బీటెక్ (బయోటెక్నాలజీ) కోర్సులు అందుబాటులో ఉన్నారుు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైనవారు వీటికి అర్హులు. బీఎస్సీ (బయోటెక్నాలజీ), ఎంఎస్సీ కోర్సులను రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు నిర్వహిస్తున్నారుు. పీజీ కోర్సుల్లో ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌లాధారంగా ప్రవేశం ఉంటుంది.
ప్రముఖ సంస్థలు: దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఐఐటీలు. వీటిలో కొన్ని ఐఐటీలు నాలుగేళ్ల బీఈ/బీటెక్ స్థాయిలో బయోటెక్నాలజీ, బయోలాజికల్ సెన్సైస్ అండ్ బయోఇంజనీరింగ్, బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ అందిస్తున్నాయి. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయూలు, ఇతర ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ స్థారుులో కూడా బయోటెక్నాలజీ, దాని అనుబంధ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఇక ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశం పొందాలంటే ఐఐటీ జారుుంట్ అడ్మిషన్ టు ఎంఎస్సీ(జామ్) పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలి.
జేఎన్‌యూ పరీక్ష కూడా ప్రధానమే:
పీజీ స్థారుులో బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికంగా నిలుస్తున్న ‘గేట్’, ‘జామ్’లతో పాటు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నిర్వహించే ఆల్ ఇండియూ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ టెస్ట్‌కు కూడా ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకుల ప్రాతిపదికగా దేశంలోని దాదాపు 32 యూనివర్సిటీలు ఎంఎస్సీలో ప్రవేశం కల్పిస్తున్నారుు.
అవకాశాలు:
ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆక్వాకల్చర్, బయోటెక్నాలజీ పరిశ్రమలు, కెమికల్, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో అవకాశాలు విరివిగా ఉంటాయి. రీసెర్చ్ సైంటిస్ట్, టీచర్, మార్కెటింగ్ మేనేజర్, బయోఇన్ఫర్మాసిస్ట్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌లుగా కెమికల్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. బయోటెక్నాలజీ కంపెనీలు బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ ఉన్న వారిని కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమించుకుంటున్నాయి. ప్రభుత్వాలు నిర్వహించే పలు కాలేజీలు, యూనివర్సిటీలు, పరిశోధన సంస్థల్లో సైంటిస్ట్, అసిస్టెంట్స్‌గా బయోటెక్నాలజీ అభ్యర్థులకు అవకాశాలుంటాయి.
బయోఇన్ఫర్మాటిక్స్
మాలిక్యులర్ బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌ల కలయికే.. బయోఇన్ఫర్మాటిక్స్. బయోటెక్నాలజీ పరిశోధనల వల్ల డేటా రూపంలో లభ్యమవుతున్న సమాచారాన్ని సాఫ్ట్‌వేర్ సహకారంతో నిక్షిప్తం చేసుకోవాలి. ఈ విధులను నిర్వర్తించేందుకు బయోఇన్ఫర్మాటిక్స్ చదివిన అభ్యర్థులు అవసరం. వివిధ వ్యాధులకు కారణాలు, వాటి నివారణకు ఉపయోగపడే నూతన ఔషధాలు, జీనోమ్ అసెంబ్లీ, ప్రొటీన్ స్ట్రక్చర్ వంటి అంశాలపై కూడా వీరు పరిశోధనలు చేస్తుంటారు.
అవకాశాలు: బయోఇన్ఫర్మాటిక్స్ చేసిన వారికి ఐటీ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ కంపెనీలు, వివిధ పరిశోధన సంస్థల్లో అవకాశాలుంటాయి. పీజీ స్థాయిలో బయోఇన్ఫర్మాటిక్స్ ఎంఎస్సీ, ఎంటెక్ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఇందులో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు, అడ్వాన్‌స డిప్లొమా కోర్సులు, డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి నైపుణ్యం, అనుభవాన్ని బట్టి నెలకు రూ. 10,000 నుంచి రూ.50,000 వరకు జీతం లభిస్తుంది.
ఎంఎస్సీ బయోఇన్ఫర్మాటిక్స్ కోర్సును అందిస్తోన్న సంస్థలు:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లైడ్ బయోటెక్నాలజీ-బెంగళూరు; కోర్సు: ఎంఎస్సీ బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ బయోటెక్నాలజీ; వెబ్‌సైట్: www.ibab.ac.in
బెనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి
కోర్సు: ఎంఎస్సీ బయోఇన్పర్మాటిక్స్
వెబ్‌సైట్: www.bhu.ac.in
యూనివర్సిటీ ఆఫ్ పుణే
కోర్సు: ఎంఎస్సీ బయోఇన్ఫర్మాటిక్స్
వెబ్‌సైట్: www.unipune.ac.in
ఎంటెక్ (బయోఇన్ఫర్మాటిక్స్)ను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఐఐఐటీ-హైదరాబాద్; వెబ్‌సైట్: www.iiit.ac.in
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ;
వెబ్‌సైట్: www.uohyd.info
ఫోరెన్సిక్ సైన్స్
నేర పరిశోధనలో ఆధారాలను సేకరించడంలో ఫోరెన్సిక్ సైన్స్ కీలక పాత్ర వహిస్తోంది. ఇష్టపడే వారికి చక్కని కెరీర్ ఫోరెన్సిక్ సైన్స్. ఈ కోర్సు చేసిన వారికి ప్రభుత్వ నేర పరిశోధన సంస్థలు, సీబీఐ, ఐబీ, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్‌తోపాటు ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీల్లోను అవకాశాలుంటాయి. ఫోరెన్సిక్ సైన్స్‌లో.. జరిగిన సంఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించడానికి ఉపయోగించే టెక్నిక్స్,సేకరించిన వాటిని శాస్త్రీయంగా విశ్లేషించడం వంటి నేర పరిశోధనకు ఉపకరించే అంశాలు ఈ కోర్సులో ఉంటాయి.
విభాగాలు:
ఫోరెన్సిక్ ఆర్కియాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ లింగ్విస్టిక్స్, ఫోరెన్సిక్ సిరియాలజీ, ఫోరెన్సిక్ కంప్యూటింగ్.
కోర్సులు: గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, డిప్లొమా స్థాయిల్లో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు అందుబాటులో ఉంది. మెడిసిన్, ఆంత్రోపాలజీ, సైకాలజీ చేసిన వారికి కూడా ఆయా రంగాలకు చెందిన స్పెషలైజ్డ్ కోర్సులను ఎంచుకునే అవకాశం ఉంది.
స్కిల్స్: బృందంలో పని చేయగలగడం, వివిధ పద్ధతుల్లో సమాచారాన్ని సేకరించడం, పరిశోధనల పట్ల అభిరుచి, విశ్లేషణ సామర్థ్యం వంటి లక్షణాలు ఫోరెన్సిక్ సైన్స్ చదవాలనుకునేవారికి తప్పనిసరి.
ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
మన రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్, మాస్టర్ స్థాయిలో ఎంఎస్సీ(ఫోరెన్సిక్ సైన్స్)ను అందిస్తోంది. కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
ఉపాధికి గ్యారెంటీ
పారామెడికల్ కోర్సులు: బైపీసీ విద్యార్థులకు వెంటనే ఉపాధి కల్పించేవి పారామెడికల్ కోర్సులు. వివిధ రకాల రక్త పరీక్షలు, మల, మూత్ర పరీక్షల నిర్వహణ, రిపోర్టింగ్ చేయడం మెడికల్ ల్యాబ్‌టె క్నీషియన్ పని. కోర్సు పూర్తిచేసిన వెంటనే డయాగ్నోస్టిక్ సెంటర్‌సలో రూ.10,000 నుంచి రూ.15,000 వరకు వేతనంతో ఉద్యోగాలు లభిస్తాయి. మన రాష్ర్టంలో అనేక ప్రయివేట్, ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఈ కోర్సులున్నాయి. ఇంటర్‌లో మొత్తం మార్కులను బట్టి ఎన్‌టీఆర్‌యూ హెచ్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.
ఫిజియోథెరపి: వ్యాయామ పరికరాలను అవసరానికనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపి, మాగ్నటోథెరపి, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి, లిగమెంట్స్, టెండాన్ సమస్యల పరిష్కారానికి ఫిజియో థెరపిస్టులు అత్యవసరం. అమెరికాలో ఫిజియోథెరపికి మంచి డిమాండ్ ఉంది. మన రాష్ర్టంలోని 38 కాలేజీల్లో మొత్తం 1815 ఫిజియోథెరపి సీట్లు ఉన్నాయి. వీటిని ఇంటర్‌లో మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు.
నర్సింగ్: ఇంటర్‌లో మార్కుల ఆధారంగా నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. మన రాష్ట్రంలో సుమారు 9862 సీట్లు ఉన్నాయి. నర్సింగ్‌లో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్, రెండేళ్ల ఎంఎస్సీ నర్సింగ్, రెండేళ్ల డిప్లొమా కోర్సులు న్నాయి. డిప్లొమా వారికి రూ. 5000 నుంచి రూ.10,000.. డిగ్రీ ఉన్న వారికి రూ.15,000 నుంచి రూ. 20,000 నెలసరి వేతనాలు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో లభిస్తున్నాయి. నర్సింగ్ పూర్తిచేసినవారికి మన దేశంతో పాటు, అమెరికా, పశ్చిమ ఆసియాలలో మంచి వేతనాలు లభిస్తున్నాయి.
శానిటరీ ఇన్స్‌పెక్టర్: ఇది రెండేళ్ల కోర్సు. పంచాయితీరాజ్, మున్సిపాలిటీలలో ప్రభుత్వ ఉద్యోగావకాశాలు మెండు. హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ పొందవచ్చు. రూ.10,000 నుంచి 20,000 వరకు జీతం లభిస్తుంది.
ఎక్స్ రే, రేడియాలజిస్టు: ఇవి మంచి ఉద్యోగ అవకాశాలున్న కోర్సులు. శరీర భాగాల స్కానింగ్, సిటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ నిర్వహించడానికి రేడియాలజీ విభాగంలో శిక్షణ ఇచ్చే రెండేళ్ల కోర్సు ఇది. ఇంటర్‌లో మార్కుల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. అనుభవాన్ని బట్టి రూ.10,000 నుంచి రూ.20,000 వేతనాలుంటాయి.
ఆప్టోమెట్రి: ఇది నాలుగేళ్ల కోర్సు. పూర్తయిన వెంటనే ఆప్టేషియన్ ఉద్యోగం లభిస్తుంది. బాస్ అండ్ లాంబ్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెటస్, హైదరాబాద్; ఏఐఐఎంఎస్, బీవీయూ, పూణె, ఇగ్నో, మధురై నేత్ర చికిత్సాలయం, అగర్వాల్ నేత్ర చికిత్సాలయం, ఎల్.వి.ప్రసాద్ నేత్ర చికిత్సాలయం దీన్ని నిర్వహిస్తున్నాయి.
జెనెటిక్స్
జన్యువుల ద్వారా జీవుల్లోని మార్పులను అధ్యయనం చేసే శాస్త్రమే జెనెటిక్స్. ఇది బయోటెక్నాలజీ, మైక్రోబయూలజీలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇందులో హ్యూమన్ జెనెటిక్స్, మాలిక్యులర్ జెనెటిక్స్, మెడికల్ జెనెటిక్స్ వంటి ప్రత్యేకాంశాలు ఉంటారుు.
అవకాశాలు: ఈ కోర్సు పూర్తిచేసినవారికి హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్, అగ్రికల్చర్, బ్యూటీ కేర్, ఫార్మాస్యూటికల్, డెయి రీ, బయోటెక్నాలజీ రంగంతో ముడిపడి ఉన్న పరిశ్రమలు, విద్యా సంస్థలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో అవకాశాలుంటాయి. ఉస్మానియా, కాకతీయ, ఆంధ్రా యూనివర్సిటీలు జెనెటిక్స్ కోర్సును అందిస్తున్నాయి.
బీఎస్సీలో లైఫ్ సెన్సైస్ కాంబినేషన్లు
ఉస్మానియా యూనివర్సిటీ అందిస్తున్నవి:
- మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ; మైక్రోబయాలజీ, బాటనీ, కెమిస్ట్రీ; బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ; మైక్రోబయాలజీ, జెనిటిక్స్, కెమిస్ట్రీ; బాటనీ, కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ; బాటనీ, కెమిస్ట్రీ,అప్లయిడ్ న్యూట్రిషన్; జువాలజీ, కెమిస్ట్రీ, అప్లయిడ్ న్యూట్రిషన్; కెమిస్ట్రీ, బాటనీ, బయోకెమిస్ట్రీ; కెమిస్ట్రీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ; కెమిస్ట్రీ, జెనిటిక్స్, బయోకెమిస్ట్రీ; కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ; బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్; బాటనీ, కెమిస్ట్రీ, క్లినికల్ న్యూట్రిషన్; మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ; మైక్రోబయాలజీ, జెనిటిక్స్, బయోకెమిస్ట్రీ; బాటనీ, కెమిస్ట్రీ/జువాలజీ, జెనిటిక్స్; బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ; బయోఫిజిక్స్, జెనిటిక్స్, కెమిస్ట్రీ; కెమిస్ట్రీ, బాటనీ, జెనిటిక్స్.
- ఆంధ్రాయూనివర్సిటీ... బాటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, హ్యుమాన్ జెనిటిక్స్, మెరైన్ లివింగ్ రీసోర్సెస్, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్‌ల్లో.. లైఫ్ సెన్సైస్ కోర్సులను అందిస్తోంది.
- హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీ... బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ మైక్రోబయాలజీ, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, ఓషన్ అండ్ అట్మాస్పియరిక్ సెన్సైస్, హెల్త్ సైకాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. వీటిలో చేరేందుకు అర్హత సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్.
- కాకతీయ యూనివర్సిటీ... బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనిటిక్స్, జువాలజీ, ఫిషరీ బయాలజీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ తదితర సబ్జెక్టుల్లో వివిధ స్థాయిల్లో కోర్సులను అందిస్తోంది.
- శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పీజీ స్థాయిలో బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, అప్లయిడ్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
- ఇంటర్ లేదా 10+2లో బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు వివిధ కాంబినేషన్లలో ఆయా లైఫ్ సెన్సైస్ సబ్జెక్టుల్లో డిగ్రీ పాసయ్యాక.. బయెటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, క్లినికల్ రీసెర్చ్, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ వంటి కోర్సుల్లో పీజీ, పీహెచ్‌డీ వరకు ఉన్నత విద్య కొనసాగించవచ్చు. తద్వారా ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు.
బయూలజీ, టెక్నాలజీల కలరుుకతో రూపుదిద్దుకున్న బయోటెక్నాలజీ.. రీసెర్చ్ ఓరియెంటెడ్ సైన్స్. వారసత్వంగా సంక్రమించే వ్యాధులకు వ్యాక్సిన్లు, వైద్య, ఆరోగ్య అంశాలకు సంబంధించిన బయలాజికల్ ఇండికేటర్ల తయూరీ.. పరిశ్రమల వ్యర్థాలను బయూలాజికల్‌గా తొలగించడం వంటి విధులను బయోటెక్నాలజిస్ట్‌లు నిర్వహించాలి.
ప్రవేశం: మన రాష్ట్రంలో బ్యాచిలర్స్ స్థారుులో బీఎస్సీ(బయోటెక్నాలజీ), బీటెక్ (బయోటెక్నాలజీ) కోర్సులు అందుబాటులో ఉన్నారుు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైనవారు వీటికి అర్హులు. బీఎస్సీ (బయోటెక్నాలజీ), ఎంఎస్సీ కోర్సులను రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు నిర్వహిస్తున్నారుు. పీజీ కోర్సుల్లో ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌లాధారంగా ప్రవేశం ఉంటుంది.
ప్రముఖ సంస్థలు: దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఐఐటీలు. వీటిలో కొన్ని ఐఐటీలు నాలుగేళ్ల బీఈ/బీటెక్ స్థాయిలో బయోటెక్నాలజీ, బయోలాజికల్ సెన్సైస్ అండ్ బయోఇంజనీరింగ్, బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ అందిస్తున్నాయి. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయూలు, ఇతర ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ స్థారుులో కూడా బయోటెక్నాలజీ, దాని అనుబంధ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఇక ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశం పొందాలంటే ఐఐటీ జారుుంట్ అడ్మిషన్ టు ఎంఎస్సీ(జామ్) పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలి.
జేఎన్‌యూ పరీక్ష కూడా ప్రధానమే:
పీజీ స్థారుులో బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికంగా నిలుస్తున్న ‘గేట్’, ‘జామ్’లతో పాటు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నిర్వహించే ఆల్ ఇండియూ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ టెస్ట్‌కు కూడా ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకుల ప్రాతిపదికగా దేశంలోని దాదాపు 32 యూనివర్సిటీలు ఎంఎస్సీలో ప్రవేశం కల్పిస్తున్నారుు.
అవకాశాలు:
ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆక్వాకల్చర్, బయోటెక్నాలజీ పరిశ్రమలు, కెమికల్, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో అవకాశాలు విరివిగా ఉంటాయి. రీసెర్చ్ సైంటిస్ట్, టీచర్, మార్కెటింగ్ మేనేజర్, బయోఇన్ఫర్మాసిస్ట్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌లుగా కెమికల్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. బయోటెక్నాలజీ కంపెనీలు బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ ఉన్న వారిని కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమించుకుంటున్నాయి. ప్రభుత్వాలు నిర్వహించే పలు కాలేజీలు, యూనివర్సిటీలు, పరిశోధన సంస్థల్లో సైంటిస్ట్, అసిస్టెంట్స్‌గా బయోటెక్నాలజీ అభ్యర్థులకు అవకాశాలుంటాయి.
బయోఇన్ఫర్మాటిక్స్
మాలిక్యులర్ బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌ల కలయికే.. బయోఇన్ఫర్మాటిక్స్. బయోటెక్నాలజీ పరిశోధనల వల్ల డేటా రూపంలో లభ్యమవుతున్న సమాచారాన్ని సాఫ్ట్‌వేర్ సహకారంతో నిక్షిప్తం చేసుకోవాలి. ఈ విధులను నిర్వర్తించేందుకు బయోఇన్ఫర్మాటిక్స్ చదివిన అభ్యర్థులు అవసరం. వివిధ వ్యాధులకు కారణాలు, వాటి నివారణకు ఉపయోగపడే నూతన ఔషధాలు, జీనోమ్ అసెంబ్లీ, ప్రొటీన్ స్ట్రక్చర్ వంటి అంశాలపై కూడా వీరు పరిశోధనలు చేస్తుంటారు.
అవకాశాలు: బయోఇన్ఫర్మాటిక్స్ చేసిన వారికి ఐటీ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ కంపెనీలు, వివిధ పరిశోధన సంస్థల్లో అవకాశాలుంటాయి. పీజీ స్థాయిలో బయోఇన్ఫర్మాటిక్స్ ఎంఎస్సీ, ఎంటెక్ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఇందులో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు, అడ్వాన్‌స డిప్లొమా కోర్సులు, డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి నైపుణ్యం, అనుభవాన్ని బట్టి నెలకు రూ. 10,000 నుంచి రూ.50,000 వరకు జీతం లభిస్తుంది.
ఎంఎస్సీ బయోఇన్ఫర్మాటిక్స్ కోర్సును అందిస్తోన్న సంస్థలు:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లైడ్ బయోటెక్నాలజీ-బెంగళూరు; కోర్సు: ఎంఎస్సీ బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ బయోటెక్నాలజీ; వెబ్‌సైట్: www.ibab.ac.in
బెనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి
కోర్సు: ఎంఎస్సీ బయోఇన్పర్మాటిక్స్
వెబ్‌సైట్: www.bhu.ac.in
యూనివర్సిటీ ఆఫ్ పుణే
కోర్సు: ఎంఎస్సీ బయోఇన్ఫర్మాటిక్స్
వెబ్‌సైట్: www.unipune.ac.in
ఎంటెక్ (బయోఇన్ఫర్మాటిక్స్)ను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఐఐఐటీ-హైదరాబాద్; వెబ్‌సైట్: www.iiit.ac.in
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ;
వెబ్‌సైట్: www.uohyd.info
ఫోరెన్సిక్ సైన్స్
నేర పరిశోధనలో ఆధారాలను సేకరించడంలో ఫోరెన్సిక్ సైన్స్ కీలక పాత్ర వహిస్తోంది. ఇష్టపడే వారికి చక్కని కెరీర్ ఫోరెన్సిక్ సైన్స్. ఈ కోర్సు చేసిన వారికి ప్రభుత్వ నేర పరిశోధన సంస్థలు, సీబీఐ, ఐబీ, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్‌తోపాటు ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీల్లోను అవకాశాలుంటాయి. ఫోరెన్సిక్ సైన్స్‌లో.. జరిగిన సంఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించడానికి ఉపయోగించే టెక్నిక్స్,సేకరించిన వాటిని శాస్త్రీయంగా విశ్లేషించడం వంటి నేర పరిశోధనకు ఉపకరించే అంశాలు ఈ కోర్సులో ఉంటాయి.
విభాగాలు:
ఫోరెన్సిక్ ఆర్కియాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ లింగ్విస్టిక్స్, ఫోరెన్సిక్ సిరియాలజీ, ఫోరెన్సిక్ కంప్యూటింగ్.
కోర్సులు: గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, డిప్లొమా స్థాయిల్లో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు అందుబాటులో ఉంది. మెడిసిన్, ఆంత్రోపాలజీ, సైకాలజీ చేసిన వారికి కూడా ఆయా రంగాలకు చెందిన స్పెషలైజ్డ్ కోర్సులను ఎంచుకునే అవకాశం ఉంది.
స్కిల్స్: బృందంలో పని చేయగలగడం, వివిధ పద్ధతుల్లో సమాచారాన్ని సేకరించడం, పరిశోధనల పట్ల అభిరుచి, విశ్లేషణ సామర్థ్యం వంటి లక్షణాలు ఫోరెన్సిక్ సైన్స్ చదవాలనుకునేవారికి తప్పనిసరి.
ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
మన రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్, మాస్టర్ స్థాయిలో ఎంఎస్సీ(ఫోరెన్సిక్ సైన్స్)ను అందిస్తోంది. కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
ఉపాధికి గ్యారెంటీ
పారామెడికల్ కోర్సులు: బైపీసీ విద్యార్థులకు వెంటనే ఉపాధి కల్పించేవి పారామెడికల్ కోర్సులు. వివిధ రకాల రక్త పరీక్షలు, మల, మూత్ర పరీక్షల నిర్వహణ, రిపోర్టింగ్ చేయడం మెడికల్ ల్యాబ్‌టె క్నీషియన్ పని. కోర్సు పూర్తిచేసిన వెంటనే డయాగ్నోస్టిక్ సెంటర్‌సలో రూ.10,000 నుంచి రూ.15,000 వరకు వేతనంతో ఉద్యోగాలు లభిస్తాయి. మన రాష్ర్టంలో అనేక ప్రయివేట్, ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఈ కోర్సులున్నాయి. ఇంటర్‌లో మొత్తం మార్కులను బట్టి ఎన్‌టీఆర్‌యూ హెచ్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.
ఫిజియోథెరపి: వ్యాయామ పరికరాలను అవసరానికనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపి, మాగ్నటోథెరపి, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి, లిగమెంట్స్, టెండాన్ సమస్యల పరిష్కారానికి ఫిజియో థెరపిస్టులు అత్యవసరం. అమెరికాలో ఫిజియోథెరపికి మంచి డిమాండ్ ఉంది. మన రాష్ర్టంలోని 38 కాలేజీల్లో మొత్తం 1815 ఫిజియోథెరపి సీట్లు ఉన్నాయి. వీటిని ఇంటర్‌లో మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు.
నర్సింగ్: ఇంటర్‌లో మార్కుల ఆధారంగా నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. మన రాష్ట్రంలో సుమారు 9862 సీట్లు ఉన్నాయి. నర్సింగ్‌లో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్, రెండేళ్ల ఎంఎస్సీ నర్సింగ్, రెండేళ్ల డిప్లొమా కోర్సులు న్నాయి. డిప్లొమా వారికి రూ. 5000 నుంచి రూ.10,000.. డిగ్రీ ఉన్న వారికి రూ.15,000 నుంచి రూ. 20,000 నెలసరి వేతనాలు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో లభిస్తున్నాయి. నర్సింగ్ పూర్తిచేసినవారికి మన దేశంతో పాటు, అమెరికా, పశ్చిమ ఆసియాలలో మంచి వేతనాలు లభిస్తున్నాయి.
శానిటరీ ఇన్స్‌పెక్టర్: ఇది రెండేళ్ల కోర్సు. పంచాయితీరాజ్, మున్సిపాలిటీలలో ప్రభుత్వ ఉద్యోగావకాశాలు మెండు. హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ పొందవచ్చు. రూ.10,000 నుంచి 20,000 వరకు జీతం లభిస్తుంది.
ఎక్స్ రే, రేడియాలజిస్టు: ఇవి మంచి ఉద్యోగ అవకాశాలున్న కోర్సులు. శరీర భాగాల స్కానింగ్, సిటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ నిర్వహించడానికి రేడియాలజీ విభాగంలో శిక్షణ ఇచ్చే రెండేళ్ల కోర్సు ఇది. ఇంటర్‌లో మార్కుల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. అనుభవాన్ని బట్టి రూ.10,000 నుంచి రూ.20,000 వేతనాలుంటాయి.
ఆప్టోమెట్రి: ఇది నాలుగేళ్ల కోర్సు. పూర్తయిన వెంటనే ఆప్టేషియన్ ఉద్యోగం లభిస్తుంది. బాస్ అండ్ లాంబ్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెటస్, హైదరాబాద్; ఏఐఐఎంఎస్, బీవీయూ, పూణె, ఇగ్నో, మధురై నేత్ర చికిత్సాలయం, అగర్వాల్ నేత్ర చికిత్సాలయం, ఎల్.వి.ప్రసాద్ నేత్ర చికిత్సాలయం దీన్ని నిర్వహిస్తున్నాయి.
జెనెటిక్స్
జన్యువుల ద్వారా జీవుల్లోని మార్పులను అధ్యయనం చేసే శాస్త్రమే జెనెటిక్స్. ఇది బయోటెక్నాలజీ, మైక్రోబయూలజీలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇందులో హ్యూమన్ జెనెటిక్స్, మాలిక్యులర్ జెనెటిక్స్, మెడికల్ జెనెటిక్స్ వంటి ప్రత్యేకాంశాలు ఉంటారుు.
అవకాశాలు: ఈ కోర్సు పూర్తిచేసినవారికి హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్, అగ్రికల్చర్, బ్యూటీ కేర్, ఫార్మాస్యూటికల్, డెయి రీ, బయోటెక్నాలజీ రంగంతో ముడిపడి ఉన్న పరిశ్రమలు, విద్యా సంస్థలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో అవకాశాలుంటాయి. ఉస్మానియా, కాకతీయ, ఆంధ్రా యూనివర్సిటీలు జెనెటిక్స్ కోర్సును అందిస్తున్నాయి.
Published date : 08 Jun 2012 01:17PM