Skip to main content

అగ్రికల్చర్ కోర్సులు....

నేటికీ 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడటం.. జీడీపీలో వ్యవసాయం వాటా 25 శాతం ఉండటం దేశంలో వ్యవసాయ రంగం ఆవశ్యకతను తెలుపుతోంది. జనాభా పెరుగుదలకు సరిపోయేలా వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం అనివార్యం. దీంతో వ్యవసాయ విద్య పరిధులు, అవకాశాలు రెండూ విస్తరించాయి. అగ్రికల్చర్, అనుబంధ కోర్సులు, అవకాశాలపై స్పెషల్ ఫోకస్ ఈ రోజు కెరీర్స్ స్పెషల్...

బీటెక్ ఫుడ్ సైన్స్
కోర్సు కాలవ్యవధి:
నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 104 (ఇన్‌టేక్ కెపాసిటీ 90, ఐసీఏఆర్ 14)
అర్హత: ఇంటర్మీడియెట్ (ఫిజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్)
వయసు: 17-22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు

కాలేజీలు:
  • కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాపట్ల, గుంటూరు జిల్లా
  • కాలేజ్ ఆఫ్ ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ, పులివెందుల, కడప జిల్లా
ఉన్నత విద్య: బీటెక్ ఫుడ్ సైన్స్ విద్యార్థులు ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో చేరొచ్చు.

అవకాశాలు: ఫుడ్ సైన్స్ కోర్సును పూర్తి చేసుకున్నాక ఫుడ్ టెక్నాలజిస్టుగా, బయోటెక్నాలజిస్టుగా పనిచేయొచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో, లేబొరేటరీల్లోనూ ఫుడ్ సైంటిస్టులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రధానంగా హోటళ్లు, ఫుడ్ అండ్ ప్యాకేజింగ్ పరిశ్రమలోనూ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్
కాల వ్యవధి:
నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 46
అర్హత: ఇంటర్మీడియెట్ (ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్ , లేదా నేచురల్ సెన్సైస్)
వయసు: 17-22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు

కోర్సు అందించే సంస్థ:
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్

ఉన్నత విద్య: బీఎస్సీ(సీఏబీఎం) పూర్తయ్యాక ఉన్నత విద్య కోసం ఎంఎస్సీ అగ్రికల్చర్, ఎంఏబీఎం, ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సీ వాటర్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. పీజీ పూర్తయ్యాక సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ కూడా చేసుకోవచ్చు.

అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
కాల వ్యవధి:
రెండేళ్లు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత, విద్యార్థి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చుండాలి. తన ఏడేళ్ల విద్యాభ్యాస కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామంలో చదివి ఉండాలి. పదో తరగతిలో 55 శాతం మార్కులు(హిందీ కాకుండా) రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 45 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.

వయసు: 15-22 ఏళ్లు

సీట్లు: 13 ప్రభుత్వ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 545 సీట్లు, 4 ప్రైవేట్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్‌ల్లో 150కుపైగా సీట్లు ఉన్నాయి.

అగ్రికల్చరల్ ఇంజనీరింగ్..
కోర్సు: బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్
కాల వ్యవధి: నాలుగేళ్లు
అర్హత: ఇంటర్మీడియెట్ (ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్, లేదా నేచురల్ సెన్సైస్)
మొత్తం సీట్లు: 113
వయసు: 17-22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు

కాలేజీలు:
  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బాపట్ల, గుంటూరు జిల్లా
  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, మడకసిర, అనంతపురం జిల్లా
  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, సంగారెడ్డి, మెదక్ జిల్లా
ఉన్నత విద్య:
బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఎంటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌తోపాటు ఎంఏబీఎం, ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సీ వాటర్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. పీజీ పూర్తయ్యాక సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ కూడా చేసుకోవచ్చు

ఉద్యోగాలిక్కడ: అమూల్ డెయిరీ, ఐటీసీ, ఎస్కార్ట్స్, శ్రీరాం హోండా, నెస్లే ఇండియా, ప్రో ఆగ్రో సీడ్స్, డెయిరీ కంపెనీల్లో అవకాశాలుంటాయి.

ఫిషరీ సైన్స్
మన రాష్ట్రంలో విశాలమైన తీర ప్రాంతం... పౌష్టికాహారంగా చేపలకున్న ప్రాధాన్యం.... మత్స్యఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్.. ఫిషరీ కోర్సులకు గిరాకీ పెంచాయి. రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అందించే ఏకైక కాలేజీ నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఉంది.

కోర్సు పేరు:
బీఎఫ్‌సీ(ఫిషరీ సైన్స్)
కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 29
అర్హత: ఇంటర్మీడియెట్(ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్, లేదా నేచురల్ సెన్సైస్)
వయసు: 17-22 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు
అవకాశాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా, నాబార్డ్ వంటి వాటిల్లో అసిస్టెంట్ ఫిషరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు(ఏఎఫ్‌డీవో), ఫిషరీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు(ఎఫ్‌ఈవో)లుగా చేరొచ్చు. దీంతోపాటు ప్రైవేట్ రంగంలోని సీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్‌పోర్టు యూనిట్లలో, ఆక్వా ఫీడ్ ప్లాంట్‌లలో, ఫిషింగ్ గియర్ ఇండస్ట్రీల్లో ఆఫీసర్లుగా, మేనేజర్లుగా కెరీర్ సొంతం చేసుకోవచ్చు.

హోంసైన్స్
కోర్సు పేరు:
బీఎస్సీ(ఆనర్స్) హోంసైన్స్
కోర్సు కాలవ్యవధి: నాలుగేళ్లు. సీట్లు: 80
అర్హత: అమ్మాయిలకు మాత్రమే. ఇంటర్మీడియెట్(ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్, లేదా నేచురల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్)
వయసు: 17-22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25

కోర్సును అందిస్తున్న కాలేజీలు..
  • కాలేజ్ ఆఫ్ హోంసైన్స్, హైదరాబాద్
  • డి.కె.గవర్నమెంట్ కాలేజీ ఫర్ ఉమెన్, నెల్లూరు(శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ)
  • శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ -అనంతపురం
  • జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
  • గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్, నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు.
ప్రముఖ హోంసైన్స్ కాలేజీలు:
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోం ఎకనామిక్స్, న్యూఢిల్లీ
  • జి.బి.పంత్ యూనివర్సిటీ, పంత్ నగర్
  • ఎంఎస్ యూనివర్సిటీ, బరోడా
అవకాశాలు: టూరిజం, హెల్త్‌కేర్, సర్వీస్ ఇండస్ట్రీ, ప్రొడక్షన్ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

బీఎస్సీ అగ్రికల్చరల్
కాల వ్యవధి:
నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 695 (మన రాష్ట్రంలో)
అర్హత: ఇంటర్మీడియెట్(ఫిజికల్ సెన్సైస్; బయలాజికల్, లేదా నేచురల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్)
వయసు: 17-22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు

రాష్ట్రంలోని కాలేజీలు:
  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్
  • అగ్రికల్చరల్ కాలేజీ, బాపట్ల, గుంటూరు జిల్లా
  • ఎస్.వి.అగ్రికల్చరల్ కాలేజీ, తిరుపతి, చిత్తూరు జిల్లా
  • అగ్రికల్చరల్ కాలేజీ, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా
  • అగ్రికల్చరల్ కాలేజీ, నైరా, శ్రీకాకుళం జిల్లా
  • అగ్రికల్చరల్ కాలేజీ, మహానంది, కర్నూలు జిల్లా
  • అగ్రికల్చరల్ కాలేజీ, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా
  • అగ్రికల్చరల్ కాలేజీ, జగిత్యాల, కరీంనగర్ జిల్లా
దేశంలో ప్రముఖ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు:
  • ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హైదరాబాద్
  • ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆనంద్, గుజరాత్
  • బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి, యూపీ
  • చౌదరీ చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివ ర్సిటీ, హిస్సార్, హర్యానా
  • గోవింద్ వల్లభ్‌పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ,పంత్‌నగర్, ఉత్తరాఖండ్
  • పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, లూధియానా, పంజాబ్
  • రాజస్థాన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బికనుర్, రాజస్థాన్
  • సర్దార్ కృషినగర్ దంతెవాడ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, బనాస్‌కాంథా, గుజరాత్
  • తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, కోయంబత్తూర్, తమిళనాడు
  • యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్, బెంగళూరు, కర్ణాటక
  • యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్, ధార్వాడ్, కర్ణాటక
  • విశ్వభారతీ శాంతినికేతన్, పశ్చిమబెంగాల్
  • అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అలీగఢ్, యూపీ
  • కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఎర్నాకులం, కేరళ
ఉన్నత విద్య: బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తయ్యాక ఉన్నత విద్య కోసం ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేరొచ్చు. పీజీ పూర్తై తర్వాత పరిశోధనలవైపు దృష్టిసారించాలనుకుంటే పీహెచ్‌డీ చేయొచ్చు.

అవకాశాలిక్కడ: ఫెర్టిలైజర్ కంపెనీలు, అగ్రిబయోటెక్ సంస్థ లు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, విత్తన కంపెనీలు, రిటైల్ మార్కెటింగ్, వ్యవసాయ పరిశోధనలు, బోధన తదితర రంగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

హార్టికల్చర్...
ాష్ట్రంలో... ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ యూనివర్సిటీని 2007లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకటరామన్నగూడెంలో ఏర్పాటుచేశారు. దీన్ని 2011 నుంచి వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీగా పేర్కొంటున్నారు. ఇది దేశంలోనే రెండో హార్టికల్చర్ యూనివర్సిటీ.
కోర్సు: బీఎస్సీ(హానర్‌‌స) హార్టికల్చర్
కోర్సు కాలవ్యవధి: నాలుగేళ్లు
అర్హత: ఇంటర్మీడియెట్(ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్, లేదా నేచురల్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, అగ్రికల్చర్‌లో ఒకేషనల్ కోర్సులు)
వయసు: 17-22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు
మొత్తం సీట్లు: 230

హార్టికల్చర్ కోర్సులను అందిస్తున్న కాలేజీలు:
  • కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, వెంకటరామన్న గూడెం, పశ్చిమగోదావరి జిల్లా
  • కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్
  • కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, మోజెర్ల, మహబూబ్‌నగర్ జిల్లా
  • కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, అనంతరాజుపేట, కడప జిల్లా
హయ్యర్ ఎడ్యుకేషన్:
పీజీ స్థాయిలో ఎంఎస్సీ హార్టికల్చర్‌లో చేరొచ్చు. పరిశోధనలు చేయాలనుకుంటే ఎంఎస్సీ తర్వాత పీహెచ్‌డీ చేయొచ్చు.

ఉద్యోగాలు: ఫుడ్ రిటైలర్ సంస్థలు, వ్యవసాయ క్షేత్రాల్లో సూపర్‌వైజర్లు, ఫార్మ్ మేనేజర్లు, ఎస్టేట్ మేనేజర్లుగా కెరీర్ ప్రారంభించొచ్చు. ప్రభుత్వ రంగంలో అసిస్టెంట్లు, ఆఫీసర్లు, డెరైక్టర్ల హోదా పొందొచ్చు. నర్సరీలు, ఫార్మ్ సెంటర్స్‌ను నెలకొల్పుకోవచ్చు.

డెయిరీ టెక్నాలజీ...
కోర్సు పేరు:
బీటెక్ డెయిరీ టెక్నాలజీ
కోర్సు కాలవ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 38
అర్హత: ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)

కాలేజీలు:
  • కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ, తిరుపతి
  • డెయిరీ టెక్నాలజీ ప్రోగ్రామ్, కామారెడ్డి
ఉన్నత విద్య: ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. తర్వాత పీహెచ్‌డీ కూడా చేయొచ్చు.

అవకాశాలు: ప్రభుత్వ, ప్రయివేట్ పాల ఉత్పత్తుల పరిశ్రమలు, డెయిరీ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. సొంతంగా డెయిరీ పెట్టుకోవచ్చు.
Published date : 06 Jun 2012 07:42PM

Photo Stories