వాట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్
ఎంపీసీ తర్వాత..ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులో చేరడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు. దీనికోసం ఎంసెట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షలపై దృష్టిసారిస్తారు. ఎంసెట్ రాసి, సీటు పొందడం తేలికే అయినా, జేఈఈలో ప్రతిభ కనబరిచి, ఉన్నత ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశం లభించడం కష్టమే. పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటం, పోటీ లక్షల్లో ఉండటమే దీనికి కారణం. అయితే వీటికి దీటుగా మరెన్నో ప్రతిష్టాత్మక సంస్థలు అందుబాటులో ఉన్నాయి. విద్యతో పాటు ఉపాధిని పొందే మార్గాలూ ఉన్నాయి. లక్ష్యం ఇంజనీరింగ్.. గమ్యం సుస్థిర కెరీర్. ఈ రెండిటికీ మార్గం వేసేలా ఇటు బీటెక్ పట్టా.. అటు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాలున్నాయి.
పూర్తి వివరాలకు చూడండి: After 10+2/Inter: ఇంటర్ ఎంపీసీ తర్వాత ఎన్నో అవకాశాలు
బైపీసీ తర్వాత..
అకడమిక్, కెరీర్ పరంగా బైపీసీతో లభించినన్ని విస్తృతావకాశాలు మరే ఇతర గ్రూప్‌తో లభించవనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బైపీసీతో మెడిసిన్, ఫార్మా, రీసెర్చ్, ల్యాబ్స్, టీచింగ్ వంటి బహుళరంగాల్లో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవచ్చు. అకడెమిక్‌గా ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఉజ్వల భవితకు మార్గంవేసే అనేక వినూత్న కోర్సులకు బైపీసీ వేదికగా నిలుస్తోంది. అందువల్లే లక్షలాది విద్యార్థులు బైపీసీ గ్రూప్‌ను ఎంచుకుంటున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో బైపీసీ అర్హతతో లభించే అవకాశాలపై ప్రత్యేక కథనం.
- బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌లతో పాటు అగ్రికల్చర్ బీఎస్సీ నుంచి ఆగ్రోనమీ వరకు.. పారా మెడికల్ కోర్సుల నుంచి ప్లాంట్ సైన్స్ వరకు; ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు నుంచి లైఫ్ సెన్సైస్‌లో సైంటిస్ట్ వరకు.. అకడమిక్ అండ్ కెరీర్‌ల పరంగా అనేక అవకాశాలున్నాయి.
- బైపీసీని కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు చదివేందుకు మార్గంగానే భావించకుండా.. బహుళ అవకాశాలు అందించే సాధనంగా గుర్తిస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు చూడండి: After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!