Skip to main content

వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 8,432 కోట్లు

  • వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అటవీశాఖను కూడా కలిపి ప్రభుత్వం రూ. 8,432 కోట్లు కేటాయించింది. వీటిలో రైతు రుణమాఫీకే రూ. 4,250 కోట్లు పోనున్నాయి.
  • మొత్తం బడ్జెట్‌లో ప్రణాళిక పద్దు రూ. 2,572.72 కోట్లుగా ఉంది. గత పద్దుకన్నా ఇది ఏకంగా రూ. 478.60 కోట్లు తక్కువ.
  • ప్రత్యేకంగా వ్యవసాయ శాఖకు గత బడ్జెట్లో రూ. 1828.87 కోట్లను ప్రణాళిక పద్దుకింద కేటాయించగా.. తాజా బడ్జెట్లో రూ. 1035.55 కోట్లను మాత్రమే ఇచ్చింది. అంటే ఈసారి రూ. 793.32 కోట్ల మేర కోత పడింది.
  • ఉద్యానశాఖకు రూ. 559.02 కోట్లు, గ్రీన్‌హౌస్‌కు రూ. 250 కోట్లు కేటాయించారు.
  • మత్స్యశాఖకు గత బడ్జెట్లో రూ. 64.96 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 50.57 కోట్లు మాత్రమే దక్కాయి.
  • మార్కెటింగ్ శాఖకు రూ. 402.82 కోట్లను కేటాయించింది. అటవీ శాఖకు గతంలో కంటే రూ. 100 కోట్లకుపైగా కోతపెట్టి రూ. 281 కోట్లను కేటాయించింది.
  • రైతులకు గిట్టుబాటు ధర అందని స్థితిలో సాయం చేసేందుకు ఉద్దేశించిన మార్కెట్ స్థిరీకరణ నిధిని రూ.400 కోట్ల నుంచి రూ.100 కోట్లకే పరిమితం చేసింది.
వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రణాళిక పద్దులు (రూ. కోట్లలో)

శాఖ

2014-15

2015-16

వ్యవసాయ శాఖ

1828.87

1035.55

ఉద్యాన శాఖ

502.75

559.02

పశుసంవర్థక శాఖ

203.36

182.06

మత్స్య శాఖ

64.96

50.57

సహకార శాఖ

61.70

61.66

మార్కెటింగ్ శాఖ

-

402.82

అటవీ శాఖ

389.66

281.01

మొత్తం

3,051.32

2,572.72



వ్యవసాయం - కీలక కేటాయింపుల వివరాలు

సూక్ష్మ సేద్యానికి

రూ. 200 కోట్లు

జాతీయ ఉద్యాన మిషన్‌కు

రూ. 109.78 కోట్లు

చుక్క నీటితో ఎక్కువ పంట కోసం

రూ. 108 కోట్లు

సన్న చిన్నకారు రైతుల పంటల బీమాకి

రూ. 139 కోట్లు

వడ్డీలేని రుణాలు, పంటల బీమాకు

రూ. 200 కోట్లు

మార్కెట్ స్థిరీకరణ నిధి కోసం

రూ. 100 కోట్లు

వ్యవసాయ శాఖ భవన నిర్మాణాలకు

రూ. 5.19 కోట్లు

పావలా వడ్డీ రుణాలకు

రూ. 18.05 కోట్లు

వ్యవసాయ విస్తరణ కోసం

రూ. 28.83 కోట్లు

వ్యవసాయ యాంత్రీకరణకు

రూ. 100 కోట్లు

ఇన్‌పుట్ సబ్సిడీ కోసం

రూ. 6.88 కోట్లు

రైతులకు విత్తన సరఫరాకు

రూ. 64.51 కోట్లు

సీడ్ చైన్ బలోపేతానికి

రూ. 50 కోట్లు

పంట కాలనీలు, భూగర్భ జలాల విశ్లేషణకు

రూ. 20 కోట్లు

జాతీయ ఆహార భద్రత పథకానికి

రూ. 123.30 కోట్లు

ఆర్కేవీవై కోసం

రూ. 196.26 కోట్లు

ఉద్యాన శాఖ కార్యక్రమాలకు

రూ. 2 కోట్లు

మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ కోసం

రూ. 2.18 కోట్లు

ఫిష్‌సీడ్ ఫామ్స్ కోసం

రూ. 11 కోట్లు

వైద్యనాథన్ కమిటీ మార్గదర్శకాల అమలుకు

రూ. 49.77 కోట్లు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు

రూ. 4.08 కోట్లు

Published date : 12 Mar 2015 05:37PM

Photo Stories