Skip to main content

విద్యుత్ రంగానికి రూ. 3,241 కోట్లు

విద్యుత్ కొరతను అధిగమించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర సర్కారు.. ఈ రంగానికి మాత్రం నిధుల్లో భారీగా కోత విధించింది. విద్యుత్ రాయితీల కోటాను ఏకంగా సగం కత్తిరించింది. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రణాళికేతర వ్యయం కింద విద్యుత్ రంగానికి రూ. 3,241.89 కోట్లు కేటాయించింది. విద్యుత్ సబ్సిడీ రూ. 3,000 కోట్లు కూడా అందులో భాగమేనని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. వాస్తవానికి ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా విద్యుత్ రాయితీలకు ఈ ఏడాది రూ. 5,630 కోట్లు అవసరమని ట్రాన్స్‌కో అంచనా వేసింది. కొరత కారణంగా మరింత విద్యుత్ కొనుగోలు చేయక తప్పని పరిస్థితులున్నాయి. ఈ లెక్కన మొత్తం రూ. 6,000 కోట్ల వరకూ అవసరం.
టీఎస్‌జెన్‌కోలో రూ. 1,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యుత్ కొరతను అధిగమించే కసరత్తులో భాగంగా రైతులకు సౌర విద్యుత్ పంప్‌సెట్లను అందించేందుకు రూ. 200 కోట్లు కేటాయించారు.
రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 40 కోట్లు
మొత్తంగా విద్యుత్ రంగానికి ప్రణాళికేతర పద్దులో రూ. 3,241.89 కోట్లు.. ప్రణాళిక పద్దులో రూ. 1,636.78 కోట్లుగా ప్రతిపాదించారు. విద్యుత్ ప్రాజెక్టులకు రూ. 374.05 కోట్ల రుణాలను సమీకరించనున్నారు.
Published date : 06 Nov 2014 03:50PM

Photo Stories