Skip to main content

వైద్యం, ఆరోగ్యానికి రూ. 4,932 కోట్లు

  • బడ్జెట్‌లో వైద్య ఆరోగ్యశాఖకు రూ. 6 వేల కోట్ల వరకు కేటాయిస్తారని అధికారులు అంచనా వేయగా కేవలం రూ. 4,932 కోట్లే కేటాయించింది.
  • ఇందులో ప్రణాళిక బడ్జెట్ కింద రూ. 2,460.24 కోట్లు కేటాయించగా ప్రణాళికేతర బడ్జెట్ కింద రూ. 2,472.54 కోట్లు కేటాయించింది.
  • గత బడ్జెట్‌లో 10 నెలల కాలానికి ప్రణాళిక బడ్జెట్ కింద రూ. 2,284.09 కోట్లు కేటాయించిన ప్రభుత్వం...ఏడాది కాలానికి నిర్దేశించుకున్న ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ. 176.15 కోట్లే అదనంగా కేటాయించింది.
  • ప్రస్తుత బడ్జెట్‌లోనూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు రూ. 323.75 కోట్లు కేటాయించారు.
  • ఎస్సీ సబ్‌ప్లాన్ కింద గత బడ్జెట్‌లో రూ. 80.93 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 49.98 కోట్లే కేటాయించారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ. 1,218.19 కోట్లు
  • ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు గత బడ్జెట్‌లో రూ. 970.89 కోట్లు కేటాయించగా తాజాగా రూ. 1,218.19 కోట్లు కేటాయించారు.
  • ఆరోగ్య సమాచార సహాయం కోసం రూ. 10.49 లక్షలు, కుటుంబ సంక్షేమ కేంద్రాలకు రూ. 28.67 కోట్లు, వాటి భవనాలకు రూ. 18.33 లక్షలు కేటాయించారు.
ముఖ్య కేటాయింపులు...
  • ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా ఆస్పత్రులను నిమ్స్ స్థాయికి తెచ్చేందుకు చెరో రూ. 10 కోట్లు
  • ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను బలోపేతం చేసేందుకు చెరో 100 కోట్లు. నీలోఫర్ ఆస్పత్రి బలోపేతానికి 30 కోట్లు.
  • వరంగల్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 5 కోట్లు.
  • నిజామాబాద్‌లో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ. 92 కోట్లు
  • ఆదిలాబాద్‌లో కొత్త నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి రూ.69.47 కోట్లు.
  • వరంగల్‌లో కొత్త నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి రూ. 68.77 కోట్లు. వైద్య భవనాలకు రూ. 60 కోట్లు. రిమ్స్ జనరల్ ఆస్పత్రులకు రూ. 8.95 కోట్లు.
  • రిమ్స్ మెడికల్ కాలేజీలకు రూ. 11.76 కోట్లు

Published date : 12 Mar 2015 05:52PM

Photo Stories