సాగుకు రూ. 11,733 కోట్లు
Sakshi Education
ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాన్ని కలుపుకొని మొత్తంగా సాగునీటి రంగానికి బడ్జెట్‌లో రూ. 11,733.93 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ. రెండు వేల కోట్ల మేర అదనం.
- ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు రూ. 9,052 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ. 2,232 కోట్లు ప్రతిపాదించారు. మిషన్ కాకతీయకు రూ. 2,100 కోట్లను కేటాయించింది.
- పాలమూరు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు మొత్తంగా 942.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
- కరీంగనర్ జిల్లాలోని ఎల్లంపల్లికి రూ. 558 కోట్లు (గత బడ్జెట్‌లో రూ. 237 కోట్లు), ఎస్సారెస్పీ వరద కాల్వకు రూ. 747 కోట్లు (గతంలో రూ. 200 కోట్లు) ఇచ్చారు.
- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో రూ. 1820 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ. 1515 కోట్లకు పరిమితం చేసింది.
- మిషన్ కాకతీయ పథకానికి మొత్తం సుమారు రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం తొలి ఏడాది 9,305 చెరువులను పురుద్ధరించే లక్ష్యంతో 2014-15 బడ్జెట్‌లో రూ. 2,016 కోట్లు కేటాయించింది.
- ఈ ఏడాది సైతం 9,308 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టే రూ.2,083 కోట్లు కేటాయించింది.
Published date : 12 Mar 2015 05:40PM