పరిశ్రమలకు రూ. 973.74 కోట్లు
Sakshi Education
- పరిశ్రమల విభాగం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2636 కోట్లు అవసరమని ప్రతిపాదనలు చేయగా తాజా బడ్జెట్‌లో కేవలం రూ. 973.74 కోట్లను సర్కారు కేటాయించింది.
- ఇందులో ప్రణాళికా వ్యయం రూ. 859. 48 కోట్లు. ఇక జీతభత్యాలు, ఇతర ఖర్చులకు ప్రణాళికేతర వ్యయం కింద రూ. 114.25 కోట్లు దక్కాయి.
- రాష్ట్రంలో పరిశ్రమల కోసం మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను టీఎస్‌ఐఐసీకి అప్పగించింది. దీంతో అందుకు రూ. 1,075 కోట్లు అవసరమని టీఎస్‌ఐఐసీ ప్రతిపాదించగా ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌లో కేవలం రూ. 100 కోట్లు కేటాయించింది.
- కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖకు ప్రభుత్వం 2015-16 బడ్జెట్‌లో రూ.450.56 కోట్లు కేటాయించింది.
- ఇందులో ప్రణాళిక వ్యయం రూ.70.01 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ.380.55 కోట్లు. గతేడాది బడ్జెట్ తో పోలిస్తే ఈసారి రూ.113.65 కోట్లు అదనంగా దక్కాయి.
- రూ.380.55 కోట్ల ప్రణాళికేతర వ్యయంలో బీమా, వైద్య సర్వీసుల శాఖాధిపతికే రూ. 203.72 కోట్లు కేటాయించారు.
- ఉపాధి కల్పన, శిక్షణ శాఖాధిపతి పద్దు కింద రూ.104.73 కోట్లు కేటాయించింది.
Published date : 12 Mar 2015 05:56PM