పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 13,184 కోట్లు
Sakshi Education
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఏకంగా రూ.13,184 కోట్ల కేటాయింపులు చేసింది.
- ఇందులో పంచాయతీరాజ్ విభాగానికి రూ. 6,927.48 కోట్లు కేటాయించగా గ్రామీణాభివృద్ధి విభాగానికి 6,256.68 కోట్లు కేటాయించింది.
- పంచాయతీరాజ్‌కు కేటాయింపు నిధుల్లో రూ. 1,947.54 కోట్లను ప్రణాళికేతర వ్యయంగానూ రూ. 4,979.96 కోట్లను ప్రణాళిక వ్యయంగానూ చూపింది.
- గ్రామీణాభివృద్ధికి ప్రణాళిక వ్యయం కింద రూ. 6,244.86 కోట్లు చూపగా ప్రణాళికేతర వ్యయంగా చూపింది కేవలం రూ. 11.81 కోట్లే కావడం గమనార్హం.
- సచివాలయశాఖ ఆర్థిక సేవలకు రూ. 8.50 కోట్లు
- స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలకు నష్టపరిహారం, ఇతర కేటాయింపుల కింద రూ.1,556.91 కోట్లు
- ఈఎన్‌సీ పరిధిలో ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు రూ. 923.18 కోట్లు
- రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ. 72.10 కోట్లు
- స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం ఈసీకి రూ.3.19 కోట్లు
- గ్రామాల్లో తాగునీటి ప్రాజెక్టుల మెరుగుదలకు రూ. 105.83 కోట్లు
- వాటర్‌గ్రిడ్, పారిశుద్ధ్యం నిమిత్తం రూ.3,377.43 కోట్లు
- ఈఎన్‌సీ ఆధ్వర్యంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రూ.1,497.73 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖాధిపతి ఆధ్వర్యంలో ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు రూ.104.79 కోట్లు
- సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ. 3,336.73 కోట్లు
- ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు రూ.2,776.54 కోట్లు
- ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు రూ.131.55 కోట్లు
- రాజేంద్రనగర్‌లోని అపార్డ్‌కు గతేడాది మాదిరిగానే రూ.4.17 కోట్లు
- ప్రత్యేక కార్యక్రమాలకు రూ.3.85 కోట్లు
- అపార్డ్‌కు రూ.7.96 కోట్లు
- స్త్రీనిధి రుణాలకు రూ. 159.43 కోట్లు
- జాతీయ సామాజిక సహాయ పథకం కింద రూ. 230 కోట్లు
- అభయహస్తం పథకానికి రూ.74.60 కోట్లు
- ఎస్‌జీఎస్‌వై కింద రూ. కోటి
- డీఆర్‌డీఏలకు రూ.42 కోట్లు
- డ్వామాకు రూ.7 కోట్లు
- తెలంగాణ పల్లె ప్రగతికి సెర్ప్ కింద రూ. 30 కోట్లు
- రాజీవ్ యువశక్తికి రూ. 5 కోట్లు
- ఆమ్ ఆద్మీ బీమా యోజనకు రూ.21 కోట్లు
- ఎన్‌ఆర్‌ఎల్‌ఎం పథకానికి రూ. 71.25 కోట్లు
- ఉపాధి హామీ పథ కానికి రూ.2,351కోట్లు
- సమగ్ర వాటర్‌షెడ్ నిర్వహణకు రూ.131.55 కోట్లు
- ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులకు కోటి (గతేడాది 25 కోట్లు)
- గ్రామ పంచాయతీల్లో పరిపాలన పటిష్టతకు 15 కోట్లు (కొత్తగా)
- ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకానికి రూ.62 కోట్లు
- హైస్కూళ్ల నిర్మాణం కోసం రూ.10.32 కోట్లు
- గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ.1051.91 కోట్లు
- ఉపాధి హామీ పథకానికి రూ.13.42 కోట్లు
- మండల పరిషత్ భవనాల నిర్మాణానికి రూ.54.33 కోట్లు
- షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక కాంపొనెంట్ కింద రూ.30 కోట్లు
- గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ. 35.77 కోట్లు
- ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు రూ.45 కోట్లు
- జాతీయ గ్రామీణ నీటి పథకానికి రూ.60 కోట్లు
- స్వచ్ఛభారత్ అభియాన్‌కు 108.47 కోట్లు
- తీవ్రవాద ప్రభావిత జిల్లాల సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు నిధులు చూపలేదు. (గతంలో రూ. 60.17 కోట్లు)
Published date : 12 Mar 2015 05:47PM