Union Budget: బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్.... భారీగా ధరలు పెరిగే అవకాశం
అలాంటి వారి కోసం ఆర్థిక మంత్రి నిర్మలమ్మ కొంతమేరకు ఊరట కల్పించగా.. కొన్ని వస్తువులపై పన్నులు పెంచి షాక్ ఇచ్చింది. కొన్ని వస్తువులపై దిగుమతి సుంకం రాయితీ కల్పించగా, మరికొన్నింటిపై పన్ను భారం వేయడంతో కీలక వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి.
తగ్గనున్న రొయ్యల ఉత్పత్తులు....
కెమెరా లెన్సులపై కస్టమ్స్ సుంకంపై ఏడాది పాటు మినహాయింపు ఇచ్చింది కేంద్రం. అలాగే టీవీ పార్టులపై ప్రస్తుతం ఉన్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది. వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో వీటి ధర పెరిగే అవకాశం ఉంది. లిథియం అయాన్ బ్యాటరీలకు అవసరమైన సామగ్రిపైనా కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. రొయ్యల ఆహార ఉత్పత్తుల దిగుమతిపైనా కస్టమ్స్ డ్యూటీని నిర్మలమ్మ తగ్గించింది. దీంతో దేశీయంగా తయారు చేసే వాటి ధరలు తగ్గుతాయి.
భారతీయులు అధికంగా ఇష్టపడి కొనుగోలు చేసే బంగారం, వెండి ఉత్పత్తులు ఇకపై ప్రియం కానున్నాయి. గోల్డ్, సిల్వర్, ప్లాటినంతో తయారు చేసే వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాగే సిగరెట్ రేట్లు కూడా గణనీయంగా పెరగనున్నాయి. వంటింట్లో వినియోగించే ఎలక్ట్రిక్ చిమ్నీల(దిగుమతి చేసుకున్నవి) రేట్లు పెరగనున్నాయి.