Skip to main content

కేంద్ర బడ్జెట్ 2019-20

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే-2 ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5న లోక్‌సభలో సుదీర్ఘంగా చదివి వినిపించారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా రికార్డు సృష్టించిన నిర్మల.. బడ్జెట్‌లో తమ ప్రభుత్వ కేటాయింపులను, ప్రాధాన్యాలను స్పష్టంగా ప్రకటించారు. మొత్తం రూ. 27,86,349 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. మేకిన్ ఇండియా దిశగా పలు రాయితీలు ప్రకటించడంతోపాటు విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ప్రోత్సాహకాలు ఇచ్చారు.
మొత్తం బడ్జెట్
రూ. 27,86,349 కోట్లు
రెవెన్యూ వసూళ్లు రూ. 19,62,761 కోట్లు
మూలధన వసూళ్లు రూ. 8,23,588 కోట్లు
రెవెన్యూ లోటు రూ. 4,85,019కోట్లు

ఇదీ బడ్జెట్ సమగ్ర స్వరూపం (అంకెలు రూ.కోట్లలో)
అంశాలు 2017-2018 వాస్తవ కేటాయింపులు 2018-2019 బడ్జెట్ అంచనాలు 2018-2019 సవరించిన అంచనాలు 2019-2020 బడ్జెట్ అంచనాలు
1. రెవెన్యూ వసూళ్లు(2+3) 14,35,233 17,25,738 17,29,682 19,62,761
2. పన్ను ఆదాయం 12,42,488 14,80,649 14,84,406 16,49,582
3. పన్నేతర ఆదాయం 1,92,745 2,45,089 2,45,276 3,13,179
4. మూలధన వసూళ్లు(5+6+7) 7,06,740 7,16,475 7,27,553 8,23,588
5. రుణాల రికవరీ 15,633 12,199 13,155 14,828
6. ఇతర వసూళ్లు 1,00,045 80,000 80,000 1,05,000
7. అప్పులు, ఇతరత్రా వసూళ్లు 5,91,062 6,24,276 6,34,398 7,03,760
8. మొత్తం వసూళ్లు(1+4) 21,41,973 24,42,213 24,57,235 27,86,349
9. పథకాలుకాక ఇతర వ్యయం(10+13) 21,41,973 24,42,213 24,57,235 27,86,349
10. రెవెన్యూ ఖాతా 18,78,833 21,41,772 21,40,612 24,47,780
11. వడ్డీ చెల్లింపులు 5,28,952 5,75,795 5,87,570 6,60,471
12. మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు 1,91,034 1,95,345 2,00,300 2,07,333
13. మూలధన ఖాతా 2,63,140 3,00,441 3,16,623 3,38,569
14. రెవెన్యూ లోటు(10-1) 4,43,600 4,16,034 4,10,930 4,85,019
15. నికర రెవెన్యూ లోటు (14-12) 2,52,566 2,20,689 2,10,630 2,77,686
16. . ద్రవ్య లోటు (9-(1+5+6)) 5,91,062 6,24,276 6,34,398 7,03,760
17. ప్రాథమిక లోటు (16-11) 62,110 48,481 46,823 43,289

రూపాయి రాక(అంకెలు పైసల్లో)
రుణేతర మూలధన వసూళ్లు 3
పన్నేతర ఆదాయం 9
సేవా పన్ను, ఇతర పన్నులు 19
కేంద్ర ఎకై ్సజ్ పన్నులు 8
కస్టమ్స్ 4
ఆదాయపు పన్ను 16
కార్పొరేషన్ టాక్స్ 21
అప్పులు 20

రూపాయి పోక(అంకెలు పైసల్లో)
కేంద్ర ప్రాయోజిత పథకాలు 9
ఇతర ఖర్చులు 8
పింఛన్లు 5
పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా 23
ఫైనాన్స్ కమిషన్ 7
సబ్సిడీలు 8
రక్షణ రంగం 9
వడ్డీ చెల్లింపులు 18
కేంద్ర ప్రభుత్వరంగ పథకాలు 13

బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
 • రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను లేదు
 • రూ.400కోట్ల టర్నోవర్ కంపెనీలకు కూడా 25శాతం కార్పొరేట్ ట్యాక్స్
 • రూ.1.5లక్షల కోట్ల ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ
 • భారత్‌కు ఉన్న విదేశీ అప్పులు జీడీపీలో 5శాతం మాత్రమే
 • ఎలక్టిక్ ్రవాహనాలపై జీఎస్టీ ఐదు శాతానికి తగ్గింపు
 • ఐటీ రిటర్న్స్ కి పాన్‌కార్డు లేకపోతే ఆధార్ చూపించవచ్చు
 • కొత్తగా రూ.1, 2, 5, 10, 20 నాణేలు ముద్రణ
 • బ్యాంక్ ఖాతా నుంచి ఏడాదికి రూ.కోటి నగదు డ్రా చేస్తే 2 శాతం పన్ను
 • డిజిటల్ పేమెంట్స్‌పై రూ.50కోట్ల వరకు నో టాక్స్
 • రూ.2 కోట్లకుపైగా వార్షికాదాయం ఉన్నవారికి 3 శాతం సర్‌చార్జ్
 • ప్రత్యక్ష పన్నుల ఆదాయం 78శాతం పెరిగింది
 • ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.11.37లక్షల కోట్ల ఆదాయం సమకూరింది
 • రూ.5కోట్లకుపైగా వార్షికాదాయం ఉన్నవారికి 7 శాతం సర్‌చార్జ్
 • బంగారంపై కస్టమ్స్ చార్జీలు 10 నుంచి 12.5శాతానికి పెంపు
 • పెట్రోల్, డీజిల్‌పై రూ.2 సెస్ పెంపు
 • డిఫెన్‌‌స ఉత్పత్తులకు ఎకై ్సజ్ డ్యూటీ మినహాయింపు
 • వ్యక్తిగత ఆదాయం పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవు
 • రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదు
 • గృహరుణాలపై అదనంగా మరో రూ.లక్షన్నర వడ్డీ రాయితీ
 • రూ.45 లక్షల లోపు గృహ రుణాలకు రూ.3.5 లక్షల వడ్డీ రాయితీ
 • ప్రధానమంత్రి కర్మయోగి పథకం ద్వారా కోటిన్నర మంది చిల్లర వర్తకులకు పెన్షన్
 • చిన్న వ్యాపారులకు 59 నిమిషాల్లోనే రుణం
 • గ్యాస్ గ్రిడ్ హైవేల కోసం బ్లూ ప్రింట్
 • రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం
 • జీఎస్టీలో నమోదు చేసుకున్నవారికి 2శాతం వడ్డీ రాయితీ
 • చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థికసాయం కోసం రూ.350కోట్లు
 • జాతీయ హౌసింగ్ రెంటల్ విధానం
 • సెబీ పరిధిలో సోషల్ స్టాక్‌ఎక్చేంజ్ ప్రతిపాదన
 • లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ పార్టనర్‌షిప్ 35శాతానికి పెంపు
 • ఏవియేషన్, మీడియా, యానిమేషన్‌లో ఎఫ్‌డీఐ పెంచేందుకు కృషి
 • రైల్వేలో మౌలిక సదుపాయాల కోసం రూ.50లక్షల కోట్లు అవసరం
 • నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం వేగవంతం
 • ప్రభుత్వరంగ సంస్థల భూముల్లో పేదలకు ఇళ్లు
 • ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడులను విదేశీ పెట్టుబడులుగా పరిగణన
 • బీమారంగంలో 100శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం
 • ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద కొత్తగా 1.97కోట్ల ఇళ్లు
 • 114 రోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి
 • ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా రూ.80,250 కోట్లతో రోడ్ల నిర్మాణం
 • గ్రామాల కనెక్టివిటీ కోసం 1.25లక్షల కి.మీ. రోడ్ల నిర్మాణం
 • రోడ్ల నిర్మాణానికి వేస్ట్ ప్లాస్టిక్‌ను వినియోగం
 • సంప్రదాయ పరిశ్రమల ప్రోత్సాహానికి క్లస్టర్ల ఏర్పాటు.. ఈ ఏడాది వంద క్లస్టర్లను ఏర్పాటు
 • వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం
 • కొత్తగా 10 వేల రైతు సంఘాలు ఏర్పాటు
 • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం
 • పెట్టుబడులు లేకుండా రైతులు వ్యవసాయం చేయాలన్నదే లక్ష్యం
 • 2022 నాటికి గ్రామాల్లో 100శాతం వంటగ్యాస్ కనెక్షన్లు
 • న్యూ స్పేస్ ఇండియా కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తాం
 • ప్రధానమంత్రి గ్రామ్‌సడక్ యోజన ద్వారా 30వేల కి.మీ. రోడ్లు
 • ఫేజ్-3లో గ్రామాల్లో 1.25లక్షల కి.మీ. రోడ్ల నిర్మాణం
 • జల్ జీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి ప్రతి గ్రామానికి తాగునీరు
 • ఐదేళ్లలో 9.6 కోట్ల టాయిలెట్లు నిర్మించాం
 • బహిరంగ మలమూత్ర విసర్జన నుంచి 5.6లక్షల గ్రామాలకు విముక్తి
 • పీఎంఏవై అర్బన్ కింద 81లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతి. ఇప్పటికే 13లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం.
 • గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కోసం భారత్ నెట్ ఏర్పాటు
 • 2022 నాటికి అందరికీ విద్యుత్, గ్యాస్
 • పీపీపీ పద్ధతిలో సబర్బన్, మెట్రో రైళ్ల అభివృద్ధి
 • కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తాం
 • పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు పెద్దపీట, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు
 • అన్ని మంత్రిత్వ శాఖల ద్వారా విద్యార్థులకు నిధుల పంపిణీ
 • ఆన్‌లైన్ కోర్సులపై ప్రత్యేక దృష్టి
 • కోటి మంది యువతకు వృత్తి విద్యా శిక్షణ
 • దళితులు, గిరిజనులకు స్టాండప్ ఇండియా కింద సాయం
 • ఖేలో ఇండియా స్కీమ్‌ను విస్తరణ
 • జాతీయ స్పోర్‌‌ట్స కమిషన్ ఏర్పాటు
 • స్టార్టప్‌ల కోసం ప్రత్యేక టీవీ ప్రోగ్రామ్‌లు
 • కార్మిక చట్టాల్లో మార్పులు
 • మురుగు, వ్యర్థాల తొలగింపు యంత్రాలకు ఆర్థికసాయం
 • 30లక్షల మంది కార్మికులకు ప్రధానమంత్రి పెన్షన్ యోజన
 • ఉజ్వల యోజన కింద 35కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ
 • బల్బుల పంపిణీతో రూ.18,341 కోట్ల విలువైన విద్యుత్ ఆదా
 • 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులకు రూ.3వేలు పెన్షన్
 • దేశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీ పథకం
 • ముద్ర యోజన ద్వారా ఒక్కో మహిళకు రూ.లక్ష రుణం
 • స్వయం సహాయక గ్రూపులలో ఉన్న మహిళలకు రూ.5వేల ఓవర్‌డ్రాఫ్ట్
 • స్వయం సహాయక గ్రూప్ మహిళలకు రూ.లక్ష వరకు ముద్ర రుణం
 • దేశవ్యాప్తంగా వెదురు, తేనె, ఖాదీకి సంబంధించి 100 క్లస్టర్లు ఏర్పాటు
 • ఆఫ్రికా దేశాల్లో కొత్తగా 18 రాయబార కార్యాలయాలు
 • దేశవ్యాప్తంగా 17 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
 • భారత పాస్‌పోర్టు ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు సత్వరమే ఆధార్ కార్డ్
 • దేశవ్యాప్తంగా వృత్తి కళాకారుల కోసం స్ఫూర్తి క్లస్టర్లు ఏర్పాటు
 • స్ఫూర్తి క్లస్టర్ల ద్వారా 50వేల మంది కళాకారులకు లబ్ది
 • చేతి వృత్తిదారులకు పేటెంట్ల కల్పన
 • దేశవ్యాప్తంగా రూ.4 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలు
 • ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల మూలధన సాయం
 • నష్టాల నుంచి ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులకు విముక్తి
 • వచ్చే ఐదేళ్లలో మౌలిక వసతుల కోసం రూ.100లక్షల కోట్లు
 • గృహ నిర్మాణ సంస్థలపై ఆర్‌బీఐకి నియంత్రణాధికారం
 • ప్రత్యక్ష పన్నుల వసూలు 78 శాతం పెరుగుదల
 • రూ.250 కోట్ల టర్నోవర్ దాటిన కంపెనీలకు 25శాతం పన్ను
 • దేశంలో 657 కి.మీ. మేర నడుస్తున్న మెట్రో రైళ్లు
 • ఉడాన్ స్కీమ్‌తో చిన్న నగరాలకు విమాన సర్వీసులు
 • గంగానదిలో సరకుల రవాణా నాలుగురెట్లు పెంచుతాం
 • విద్యుత్ వాహన వినియోగదారులకు ఇన్సెంటివ్‌లు
 • రవాణా రంగం కోసం కొత్త రూపీ కార్డు
 • ఎలక్టిక్ ్రవాహనాల కోసం మూడేళ్లలో రూ.10వేల కోట్లు
 • జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు
 • పవర్‌గ్రిడ్ ద్వారా రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా
 • విద్యుత్ టారిఫ్ పాలసీలో సంస్కరణలు అవసరం
 • కోటిన్నర మంది చిరు వ్యాపారులకు పెన్షన్ పథకం
 • గ్యాస్ గ్రిడ్ హైవేల కోసం బ్లూ ప్రింట్
 • రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం

నిర్మలా బడ్జెట్‌లో పెరిగినవి.. తగ్గినవి...

పెరిగినవి ఇవే: పెట్రోల్, డీజీల్, బంగారం, ఆటోపార్‌‌ట్స, సీసీ టీవీ, జీడి పప్పు, ఇంపోర్టెడ్ పుస్తకాలు, పీవీసీ, ఫినాయిల్ ఫ్లోరింగ్, టైల్స్, మెటల్ ఫిట్టింగ్, ఫర్నిచర్, సింథటిక్ రబ్బర్, మార్బుల్ ల్యాప్స్, ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్, సీసీ టీవీ కెమెరా, ఐపీ కెమెరా, డిజిటల్ వీడియో రికార్డర్స్, స్ల్పిట్ ఏసీలు, లౌడ్ స్పీకర్స్, సిగరెట్లు, ఫ్లగ్‌‌స, సాకెట్స్, స్విచ్‌లు, గుట్కాల ధరలు పెరనున్నాయి.
తగ్గినవి ఇవే: ఎలక్టిక్ ్రవాహనాలు, ఇంటి రుణాలు, తోలు ఉత్పత్తులు, కృత్రిమ కిడ్నీల ముడిసరుకు, దిగుమతి చేసుకున్న ఊల్ ఫైబర్, రక్షణ పరికరాలు ధరలు తగ్గనున్నాయి.

Budget 19-20వ్యవసాయ రంగానికి రూ.1.39 లక్షల కోట్లు
2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే.. వ్యవసాయ రంగంలో భారీ పెట్టుబడులకు, వ్యవసాయాధారిత రంగాల్లో మౌలిక సవతుల కల్పనను ప్రోత్సహించే చర్యలకు మోదీ సర్కారు పచ్చజెండా ఊపింది. నిర్మల బడ్జెట్‌లో రైతు సంక్షేమానికి రూ. 1.39 లక్షల కోట్లను కేటాయించింది.
వ్యవసాయం రంగం... కేటాయింపులు.. అంశాలు
 • ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికే (పీఎం-కిసాన్) రూ. 77,752 కోట్లు
 • ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు రూ.14వేల కోట్లు
 • స్వల్పకాలిక పంట రుణాలకోసం రూ.18వేల కోట్లు
 • రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు రూ.1000 కోట్ల నుంచి రూ.3వేల కోట్లను కేటాయించింది.
 • ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ యోజన (పీఎం-ఆశా) బడ్జెట్‌ను.. గతంలో ఉన్న వందకోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంపు
 • పీఎం కిసాన్ సించాయి యోజన కోసం గతంలో కేటాయించిన రూ.2,954 కోట్లను పెంచి.. ఈసారి రూ.3,500 కోట్లు పెంపు
 • హరిత విప్లవ’పథకంలో భాగంగా 18 కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం రూ.12,560 కోట్లు కేటాయింపు.
 • త్వరలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం ప్రారంభం
 • 10వేల కొత్త ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌‌స (ఎఫ్‌పీవోలు) ఏర్పాటు
 • జీరో బడ్జెట్ వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
Budget 19-20గ్రామీణాభివృద్ధిపై దృష్టి
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్రం దృష్టిపెట్టింది. పల్లెవాసులకు ఇళ్లు, రోడ్లు ఇతరత్రా మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో మొదలైన ప్రతిష్టాత్మక పథకాల్లో కొన్నింటి లక్ష్యాలు సాకారమయ్యాయి. దీంతో వీటి ప్రాధాన్యాలను పెంచి తాజా బడ్జెట్లో కొత్త లక్ష్యాలను నిర్దేశించారు.
గ్రామీణాభివృద్ధి.. కేటాయింపులు.. అంశాలు..
 • ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన రూ.80వేల కోట్లకుపైగా కేటాయింపు
 • గ్రామాల్లో కొత్తగా వచ్చే మూడేళ్లలో 1.95 లక్షల గృహాలను నిర్మించేందుకు సమాయత్తం
 • ఉపాధి హామీ పథకానికి 2019-20 కేటాయింపు: రూ. 60,000 కోట్లు
 • 2018-19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.61,084 కోట్లు. ఈ పథకానికి గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈ దఫా 11% పెరిగింది.
స్వచ్ఛ భారత్ కోసం
 • స్వచ్ఛ భారత్ పథకం కోసం 2019-20 కేటాయింపు: రూ. 12644 కోట్లు.
 • 2018-19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.16,978కోట్లు. ఓడీఎఫ్ రహిత గ్రామాల సంఖ్య 5.6 లక్షలకు చేరింది
 • ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి భారత్‌ను ఓడీఎఫ్ రహిత దేశంగా ప్రకటించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పారు
 • ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్‌ఘాట్ వద్దనున్న గాంధీ దర్శన్ ప్రాంగణంలో ‘రాష్ట్రీయ స్వచ్ఛత కేంద్రం’ను నెలకొల్పనున్నామని వెల్లడించారు.
దేశమంతా విద్యుత్ వెలుగులు
 • విద్యుత్ రంగానికి 2019-20 బడ్జెట్‌లో కేటాయింపు: రూ.4,066 కోట్లు.
 • 2018-19 కేటాయింపు (సవరించిన అంచనా): రూ.3,800 కోట్లు.
తాగునీటికి ‘జల్ జీవన్’
 • 2019-20 కేటాయింపులు: రూ.10,001 కోట్లు
 • 2018-19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.5,500 కోట్లు
 • జీవన్ మిషన్‌ను కింద 2024 నాటికి గ్రామీణ కుటుంబాలన్నింటికీ (హర్ ఘర్ జల్) తాగునీటిని అందించడమే లక్ష్యం.
 • వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు తగిన మౌలిక వసతుల కల్పన, భూగర్భజలాల పెంపు, మురుగునీటి నిర్వహణ కూడా జల్‌జీవన్ మిషన్‌లో భాగమే.
గ్రామీణ రోడ్లకు ఇక మహర్దశ
 • 2019-20 కేటాయింపు: రూ.19,000 కోట్లు
 • 2018-19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.15,500 కోట్లు
 • పీఎంజీఎస్‌వై ఫేజ్-3లో భాగంగా భాగంగా వచ్చే ఐదేళ్లలో 1,25,000 కిలోమీటర్ల రోడ్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీనికి రూ.80,250 కోట్లు ఖర్చవుతుందని తాజా బడ్జెట్‌లో అంచనా వేశారు.
గ్రామీణ టెలిఫోన్
 • 2019-20 కేటాయింపు: రూ.8,350 కోట్లు.
 • 2018-19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.5,000 కోట్లు.
గ్రామీణ ఇళ్ల నిర్మాణానికి కొత్త జోష్
 • 2019-20 కేటాయింపులు: రూ.25,853 కోట్లు
 • 2018-19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.26,405 కోట్లు
 • ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)లో భాగంగా 2022 కల్లా దేశవ్యాప్తంగా ఇళ్లు లేని బలహీనవర్గాలకు పక్కా ఇళ్లను కట్టిఇవ్వడమే కేంద్రం లక్ష్యం.
 • రెండో దశ కింద 2019-20 నుంచి 2021-22 మధ్య 1.95 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు.
Budget 19-20విద్యా రంగానికి రూ. 94,853.64 కోట్లు
దేశ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చదిద్దేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తామని మంత్రి నిర్మలా తెలిపారు. ఈ విధానంలో పాఠశాల విద్య, ఉన్నత విద్యలో భారీ మార్పులను ప్రతిపాదించారు. పరిశోధనలు, నవకల్పనలపై మరింత దృష్టిపెడతామన్నారు. దేశంలో విద్యా రంగానికి తాజా బడ్జెట్‌లో రూ. 94,853.64 కోట్లను కేటాయించారు. 2018-19 సవరించిన బడ్జెట్ అంచనాలతో పొలిస్తే తాజా కేటాయింపులు 13 శాతం మేర పెరిగాయి.
విద్యారంగంలో విభాగాలవారీగా కేటాయింపులు.. విశేషాలు..
 • పాఠశాల విద్యకు రూ. 56,536.63 కోట్లు
 • ఉన్నత విద్యకు రూ. 38,317.01 కోట్లు
 • యూజీసీకి రూ. 4,600.66 కోట్లు (2018-19 సవరించిన అంచనాల్లో రూ. 4,687.23 కోట్లు)
 • ఐఐటీలకు రూ. 6,409.95 కోట్ల మేర కేటాయింపులు
 • ఐఐఐఎంలకు రూ. 445.53 కోట్లు
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు రూ. 899.22 కోట్లు కేటాయించారు.
 • విద్యారంగంలో ప్రపంచ స్థాయి సంస్థలను ఏర్పాటు చేసేందుకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 400 కోట్లు కేటాయింపు.
 • దేశ ఉన్నత విద్యాసంస్థల్లోకి విదేశీ విద్యార్థుల చేరికలను ఆకర్షించేలా ‘స్టడీ ఇన్ ఇండియా’కు శ్రీకారం.
 • అన్ని స్థాయిల్లో క్రీడలకు ఆదరణ కల్పించేందుకు, క్రీడాకారులను తయారు చేసేందుకు వీలుగా ఖేలో ఇండియా పథకం కింద జాతీయ క్రీడా విద్యా బోర్డు ఏర్పాటు.
 • జాతిపిత మహాత్మాగాంధీ సిద్ధాంతాలపట్ల యువతకు అవగాహన కల్పించేలా ‘గాంధీ-పీడియా’ను అభివృద్ధి
 • పరిశోధనలను ప్రోత్సహించి సమన్వయపరిచేందుకు, వాటికి నిధులు అందించేందుకు జాతీయ పరిశోధన ఫౌండేషన్ (ఎన్‌ఆర్‌ఎఫ్)ను ఏర్పాటు.
Budget 19-20ఆరోగ్య రంగానికి రూ. 6,400 కోట్లు
ఆరోగ్య రంగానికి తాజా బడ్జెట్‌లో రూ. 62,659.12 కోట్లు ప్రతిపాదించారు. 2018-19 బడ్జెట్ (రూ. 52,800 కోట్లు)తో పోల్చితే 19 శాతం పెంచారు. కేంద్రం కీలకంగా భావిస్తున్న బీమా పథకమైన ఆయుష్‌మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై)కు రూ. 6,400 కోట్లు కేటాయించారు.
ఆరోగ్యం రంగం.. కేటాయింపులు.. విశేషాలు..
 • పట్టణ ప్రాంతాల్లో ఆయుష్‌మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ నెలకొల్పడానికి రూ. 249.96 కోట్లు కేటాయింపు
 • జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఆ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ. 1,349.97 కోట్లు
 • జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 32,995 కోట్లు
 • ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమమైన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) పథకానికి రూ. 156 కోట్లు
 • జాతీయ ఎయిడ్స్, ఎస్‌టీడీ నియంత్రణ కార్యక్రమానికి గతేడాది కంటే రూ. 400 కోట్లు పెంచి రూ. 2,500 కోట్లు కేటాయించారు.
 • ఇక ఎయిమ్స్‌కు గత బడ్జెట్‌లో రూ. 3,018 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ. 3,599.65 కోట్లకు పెంచారు.
 • జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి రూ. 40 కోట్లు, కేన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల నియంత్రణ కార్యక్రమానికి రూ. 175 కోట్లు కేటాయించారు.
 • కార్పొరేట్ ఆస్పత్రులు, పెద్ద ఆస్పత్రుల్లో వైద్యానికి సంబంధించిన టెర్షియరీ కేర్ పోగ్రామ్‌లో రూ. 200 కోట్లు కోత పెట్టి రూ. 550 కోట్లు ప్రతిపాదించారు. - నర్సింగ్ సర్వీసులకు రూ. 64 కోట్లు, ఫార్మసీ స్కూళ్లు, కాలేజీకు రూ. 5 కోట్లు
 • జిల్లా ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు (పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్) అప్‌గ్రేడ్ చేయడానికి రూ. 800 కోట్లు
 • జిల్లా ఆస్పత్రులను కొత్త మెడికల్ కాలేజీలుగా మార్చడానికి రూ. 2,000 కోట్లు
 • ప్రభుత్వ మెడికల్ కాలేజీలను (అండర్ గ్రాడ్యుయేట్), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను బలోపేతం చేయడానికి రూ. 1,361 కోట్లు
 • సంప్రదాయ వైద్యానికి రూ. 1,939.76 కోట్లు కేటాయించారు.

Current Affairsమౌలిక వసతుల కల్పనకు భారీ బడ్జెట్

ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తుల సరసన నిలిచే బలమైన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం దేశంలో మౌలిక వసతులను ప్రపంచస్థాయికి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతులు, డిజిటల్ ఎకానమీ, ఉద్యోగ కల్పన ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేదిశగా దూసుకెళ్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గ్రామాలు-పట్టణాల మధ్య నెలకొన్న దూరాన్ని చెరిపేస్తూ.. వీటిని కలిపే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. ‘సరైన అనుసంధానతే ఆర్థిక వ్యవస్థకు జీవనాడి. అందుకే మౌలికవసతుల కల్పనకు ఏడాదికి రూ.20లక్షలకోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రూ.80,250కోట్ల వ్యయంతో 1.25 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే 2018-30 మధ్య రైల్వేల్లో మౌలిక వసతులకల్పనకు రూ.50లక్షల కోట్ల పెట్టుబడుల అవసరముందని నిర్మలా పేర్కొన్నారు.

రైల్వేకు 65 వేల కోట్ల కేటాయింపులు
రైల్వేల సత్వర అభివృద్ధి కోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టాలని మంత్రి సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించారు. రైల్వేలో మౌలిక వసతుల కల్పన కోసం 2018 నుంచి 2030 సంవత్సరాల మధ్య రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని ఆమె తెలిపారు. ఈ బడ్జెట్‌లో రైల్వే కోసం రూ. 65,837 కోట్ల నిధులను కేటాయించారు. అలాగే మూలధన వ్యయం కింద గతంలో ఎన్నడూ లేనంతగా, అత్యధికంగా రూ. 1.6 లక్షల కోట్లను ఇచ్చారు. రైల్వే ప్రయాణికులకు సౌకర్యాల మెరుగుదలకు రూ. 3,422.57 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం బడ్జెట్‌లో తెలిపింది.

Current Affairsరక్షణ రంగానికి 3.18 లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్‌లో 2019- 20 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ శాఖకు రూ. 3.18 లక్షల కోట్లు కేటాయించారు. 1962 చైనా యుద్ధం తర్వాత అతి తక్కువగా దేశ జీడీపీలో దాదాపు 1.6 శాతం మేర రక్షణ శాఖకు కేటాయింపులు చేశారని నిపుణులు చెబుతున్నారు. మొత్తం కేటాయింపుల్లో పెట్టుబడి మూలధన వ్యయం కోసం రూ. 1,08,248 కోట్లు కేటాయించారు. వీటి ద్వారా కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర మిలటరీ పరికరాలు, కొనుగోలు చేయను న్నారు. అలాగే రెవెన్యూ వ్యయాన్ని రూ. 2,10,682 కోట్లుగా ఖరారు చేశారు. ఈ నిధులను వేతనాలు, సైనిక వ్యవస్థల నిర్వహణ నిమిత్తం వినియోగిస్తారు. అలాగే ఈసారి రూ. 2.95 లక్షల కోట్లు బడ్జెట్ అంచనాలను చూపించగా.. 7.93 శాతం వృద్ధితో రూ. 3,18,931 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కార్యాలయం తెలిపింది. అలాగే మన దేశంలో తయారు కాని రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునేందుకు కస్టమ్స్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ. 1,12,079 కోట్ల పెన్షన్ నిధులను విడిగా కేటాయించారు. ఈ పెన్షన్ నిధులను, మొత్తం శాఖ బడ్జెట్‌ను కలిపి చూస్తే రక్షణ శాఖ బడ్జెట్ రూ. 4.31 లక్షల కోట్లు అవుతుంది. అయితే బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయించిన నిధుల తో రక్షణ నిపుణులు నిరాశ వ్యక్తం చేశారు.

జలశక్తి శాఖకు రూ. 28,261 కోట్లు
దేశంలో ఇంటింటికీ స్వచ్ఛమైన, పైపుల ద్వారా సురక్షిత మంచినీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం అమలును పర్యవేక్షిస్తున్న జలశక్తిశాఖకు 2019-20 బడ్జెట్‌లో రూ. 28,261.59 కోట్ల కేటాయింపులు లభించాయి.

జలశక్తిశాఖ కేటాయింపులు...
 • జలశక్తిశాఖలో విలీనమైన తాగునీరు, పారిశుద్ధ్య విభాగానికి రూ. 20,016.34 కోట్లు (2018-19లో రూ. 19,992.97 కోట్లు) కేటాయింపు
 • జలవనరులు, గంగా పునరుజ్జీవ విభాగానికి రూ. 8,245.25 కోట్ల (2018-19లో రూ. 7,269.25 కోట్లు) మేర కేటాయింపులు
 • జాతీయ తాగునీటి గ్రామీణ మిషన్‌కు రూ. 7,750 కోట్లు (2018-19లో రూ. 5,391.32 కోట్లు)
 • జల్ జీవన్ మిషన్‌లో భాగంగా 2024కల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు అన్ని రాష్ట్రాలతో కలసి జలశక్తిశాఖ పనిచేయనుంది. దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లోని 1,592 బ్లాకుల్లో జలవనరులను పరిమితికి మించి వాడినట్లు కేంద్రం గుర్తించింది.
విదేశాంగ శాఖకు రూ.17 వేల కోట్లు
2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌లో విదేశాంగ శాఖకు రూ.17,884.78 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం గత బడ్జెట్ కంటే రూ.2,873.78 కోట్లు అధికం. ఈ కేటాయింపుల్లో అత్యధిక భాగం మాల్దీవులు, మారిషస్, ఆఫ్రికా దేశాలకు సాయం చేసేందుకు కేటాయించారు. అలాగే భారత్ మిత్రదేశమైన భూటాన్‌కు రూ.2,801.79 కోట్ల నిధులను బడ్జెట్‌లో కేటాయించారు. ఇది గతంలో పోల్చుకుంటే రూ.151.79 కోట్లు ఎక్కువ. నేపాల్‌కు గత బడ్జెట్‌లో రూ.650 కోట్ల కేటాయించగా, ఈసారి రూ.1,050 కోట్లను కేటాయించారు. ఇక ఇరాన్‌లో భారత్ వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తున్న చాబహర్ నౌకాశ్రయానికి నిధుల కేటాయింపులో కోత పడింది. 2018-19 బడ్జెట్‌లో ఈ పోర్టుకు రూ.150 కోట్లు ఇవ్వగా, ఈసారి అది రూ.45 కోట్లకు పరిమితమైంది.

మహిళ సంక్షేమానికి 29 వేల కోట్లు
2019-20 ఏడాది బడ్జెట్‌లో మహిళ, శిశు అభివృద్ధితోపాటు సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2019-20కి మొత్తం రూ. 29,000 కోట్లు మహిళా, శిశు సంక్షేమానికి, అభివృద్ధికి వెచ్చించనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇందులో రూ.19,834.37 కోట్లు అంగన్‌వాడీ సేవలకు వెచ్చిస్తారు. పౌష్టికాహారం, సామాజిక భద్రత, సంక్షేమ రంగాలకు రూ.4,178 కోట్లు లభించాయి. ప్రధానమంత్రి మాతృ వందన యోజనకు రూ.2,500 కోట్ల మేర కేటాయింపులు చేశారు.

గిరిజన మంత్రిత్వ శాఖకు 15శాతం ఎక్కువ నిధులు
షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం గిరిజన వ్యవహా రాల మంత్రిత్వ శాఖకు ఈ సారి బడ్జెట్‌లో 15 శాతం ఎక్కువ నిధులను కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లో రూ.6,000 కోట్లు ఇవ్వగా.. ఈ సారి రూ.6,814 కోట్లను కేటాయించింది. ఇందులో గిరిజన విద్యార్థుల ఉన్నత చదు వులు, విదేశీ విద్య కోసం రూ.102 కోట్లను స్కాలర్‌షిప్‌ల కోసం కేటాయించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య కోసం రూ.1,953.50 కోట్లను కేటాయించింది.

Jobsఇస్రో వాణిజ్య అవసరాలకు ఎన్‌ఎస్‌ఐఎల్
భారత అంతరిక్ష విభాగానికి ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో కొద్దిపాటి పెరుగుదల మాత్రమే నమోదైంది. గత ఏడాది ఈ విభాగానికి కేటాయించిన రూ.11,200 కోట్లకు అదనంగా రూ.1,273 కోట్లు చేర్చి.. తాజా బడ్జెట్‌లో రూ.12,473 కోట్లు కేటాయించారు. అయితే అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అన్న అంశానికి ఏకంగా 1,400 కోట్ల రూపాయలు కేటాయింపులు పెరిగాయి. ఈ అంశానికి గత ఏడాది మొత్తం రూ.6, 992 కోట్లు కేటాయించగా..తాజా బడ్జెట్‌లో ఇది రూ.8,407 కోట్లు అయి్యంది.

అంతరిక్ష ప్రయోగాల కోసం సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీల ద్వారా వాణిజ్య లబ్ధి పొందేందుకు కొత్త కంపెనీ ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’(ఎన్‌ఎస్‌ఐఎల్) పేరుతో ఏర్పాటైన ఈ కంపెనీ భారతీయ అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఎన్‌ఎస్‌ఐఎల్ పేరుతో మార్చి 6వ తేదీనే ఒక కంపెనీని ఏర్పాటు చేసింది.

ద్రవ్యలోటు లక్ష్యం 3.3 శాతానికి తగ్గింపు
2019-20 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ద్రవ్యలోటు (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయాల మధ్య నికర వ్యత్యాసం) 3.3 శాతం వద్ద కట్టడి చేయాలని బడ్జెట్ నిర్దేశించింది. ఫిబ్రవరి 1న సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ లోటును 3.4 శాతంగా అంచనావేయడం జరిగింది.

ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు
సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, ఆర్థిక రంగ ప్రేరణకుగాను వాటికి మరో రూ.70,000 కోట్ల నిధుల సాయాన్ని ప్రకటిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

బ్యాంకులకు అదనంగా 1.34 లక్షల కోట్లు
వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్య నేపథ్యంలో బ్యాంకులకు అదనంగా రూ.1.34 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ ముందుకు వచ్చింది. ఇది ఎన్‌బీఎఫ్‌సీలకు రుణ కల్పనకు దోహదం చేస్తుంది.

ఎకై్సజ్, సర్వీస్ ట్యాక్స్ కేసులకుక్షమాపణ పథకం
సేవల పన్ను, ఎకై ్సజ్ సుంకాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న రూ.3.75 లక్షల కోట్ల విలువకు సంబంధించి కేసుల పరిష్కారానికి ప్రభుత్వం ‘సబ్‌కా విశ్వాస్ లెగసీ డిస్ప్యూట్ రిజల్యూషన్ స్కీమ్ 2019’ అనే పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద పన్ను బకాయిల్లో 40 నుంచి 70 శాతం వరకు ఉపశమనం లభించనుంది. స్వచ్చందంగా వెల్లడించిన కేసులు కాకుండా ఇతర కేసులకు ఇది వర్తిస్తుంది.

ఇతర కేటాయింపులు.. ముఖ్యాంశాలు
 • కరెంటు బిల్లు తగ్గించేందుకు 143కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ
 • హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 48,000 కోట్లు కేటాయించారు.
 • మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.4,700 కోట్లు
 • దృష్టి లోపం ఉన్న వారు కూడా సులభంగా గుర్తించేలా రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలను అందుబాటులోకి తెస్తామని నిర్మలా తెలిపారు.
 • లోక్‌సభ ఎన్నికలకు రూ.1,000 కోట్లు కేటాయింపు
 • ఎలక్ట్రిక్ వాహనాలకు తీసుకున్న రుణాలకు చెల్లించే వడ్డీపై రూ.1.5 లక్షలకు వరకు పన్ను మినహాయింపు
 • పరిశ్రమల్లో (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) బిల్లుల చెల్లింపునకు ఓ వేదికను ఏర్పాటు
 • గత ఏడాది అణుశక్తి సంస్థకు రూ.16,965.25 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఆ మొత్తం రూ.16, 925 కోట్లకు చేరింది.
 • పవర్ కార్పొరేషన్ కేటాయింపులు కూడా గణనీయంగా తగ్గి రూ.3, 000 కోట్లకు చేరాయి.
 • ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద కోటి మంది యువతకు పరిశ్రమలకు అవసరమైన రీతిలో శిక్షణ
 • ‘ఒక దేశం.. ఒక గ్రిడ్’ విధానంలో భాగంగా దేశంలో విద్యుత్ రంగం పురోగతి కోసం త్వరలో ప్యాకేజీ ప్రకటన
 • కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖకు ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది రూ.9963.25 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.8885 కోట్లే కేటాయించారు.
 • సీఐసీ, ఆర్టీఐలకు రూ. 5.5 కోట్లు కేటాయింపు
 • లోక్‌పాల్ వ్యవస్థకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు.
 • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే భారత ఆర్థిక వ్యవస్థ 3 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రెండు కోట్ల కోట్ల రూపాయలు) స్థాయికి చేరుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
 • 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.4.48 లక్షల కోట్లు మార్కెట్ నుంచి సమీకరించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
 • పబ్లిక్ ఇష్యూల ద్వారా ఎన్ బీఎఫ్‌సీలు నిధుల సమీకరణకు సంబంధించి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ (డీఆర్‌ఆర్) నిబంధనను ఎత్తివేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
 • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇదే ఇప్పటిదాకా అత్యధికం.
 • ఖాతాలో డబ్బుల్లేకుండా మహిళలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో స్వయం సహాయక బృందాల్లో జన్‌ధన్ ఖాతాలున్న వారందరికీ.. రూ.5వేల ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) ఇస్తామని ప్రకటించారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో ఒకరికి ముద్ర లోన్ కింద లక్ష రూపాయల రుణం ఇస్తామన్నారు.
 • స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడానికి మరిన్ని పన్ను రాయితీలను ప్రకటించారు. ఒక స్టార్టప్ కంపెనీ ప్రారంభించడానికి ఇంటిని విక్రయిస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే స్టార్టప్ నష్టాలను తరువాతి సంవత్సరాలను క్యారీఫార్వర్డ్ చేసుకోవడానికి అనుమతించింది. ఈ రెండు నిర్ణయాలు 2020-21 వరకు వర్తిస్తాయి.
 • అణు ఇంధనం యురేనియం, ముడిఖనిజంపై ప్రస్తుతమున్న 2.5 శాతం కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా మాఫీ చేయనున్నారు. అలాగే శుద్ధీకరించిన యురేనియం -235, ప్లుటోనియం, మిశ్రమాలన్నింటిపై ఉన్న 7.5 శాతం కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా తొలగించనున్నారు.
 • హోం మంత్రిత్వ శాఖకు మొత్తంగా రూ. 1,19,025 కోట్లను ఈ బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ. 5,858 కోట్లు ఎక్కువ.
Current Affairsతెలంగాణ ఆశలు... అడియాసలు
కేంద్ర ప్రభుత్వ పూర్తిస్థాయి బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చే నిధులనుబట్టి పూర్తిస్థాయి బడ్జెట్ పెడదామనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, విజ్ఞప్తులు బుట్టదాఖలయ్యాయి. కనీసం నీతి ఆయోగ్ సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకోకుండానే రాష్ట్రానికి చెందిన ఉపయుక్త ప్రాజెక్టులకు కూడా కేంద్రం నిధులు కేటాయించలేదు. మొత్తం బడ్జెట్‌లో పన్నుల వాటా కింద రాష్ట్రానికి రూ. 19 వేల కోట్లకుపైగా చూపిన కేంద్రం... ఈసారి కూడా రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని లేదంటే రూ. 20 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరింది. కానీ 2019-20 బడ్జెట్‌లో కేంద్రం ఒక్క రూపాయిని కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటాయించలేదు. మిషన్ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా జలశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం.. మన పథకానికి మాత్రం డబ్బులివ్వలేదు. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు అందించే ఈ ప్రాజెక్టుకు రూ. 19,500 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతోంది. మిషన్ కాకతీయ పథకానికి కూడా రూ. 5 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఈ పథకం గురించి కూడా కేంద్రం పట్టించుకోలేదు.

Budget 19-20ఆంధ్రప్రదేశ్‌కు నిరాశ
ఆంధప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న సంస్థలతోపాటు పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో పైసా కూడా కేటాయింపులు చేయలేదు. పోలవరం జాతీయప్రాజెక్టుకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి, 2019-20 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక కేటాయింపులేవీ చేయలేదు. బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశను మిగిల్చిన ఇతర అంశాలు..
 • అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,500 కోట్లు ఇవ్వగా ఇంకా రూ.వెయి్య కోట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే, ఆ వెయి్య కోట్లను కూడా కేంద్రం బడ్జెట్‌లో పొందపర్చలేదు.
 • రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద కూడా కేంద్రం నయాపైసా కేటాయించలేదు.
 • రాష్ట్ర విభజన సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీచేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ కాగ్ పేర్కొన్న మేరకు రెవెన్యూ లోటు ఇచ్చేందుకు కేంద్రం ముందుకు రావడంలేదు. దీంతో రెవెన్యూ లోటు భర్తీకి ఏమీ కేటాయించలేదు.
 • దుగరాజపట్నం పోర్టు, వైఎస్సార్ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖ-చెన్నై కారిడార్, బెంగళూరు-చెన్నై కారిడార్, అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వేకు బడ్జెట్‌లో మొండిచెయ్యే చూపారు. Current Affairs
 • విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం, విశాఖ, విజయవాడ మెట్రో రైళ్లు తదితర అంశాల ప్రస్తావనేలేదు.
 • ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన రాయితీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018-19 బడ్జెట్ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. కానీ, సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు.
 • ఎయిమ్స్ సంస్థలు అన్నింటికీ కలిపి రూ.3,599.65 కోట్లు కేటాయించారు. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్, ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌కు వీటి నుంచి కేటాయించే అవకాశం ఉంది.
పన్నుల వాటాలో పెరుగుదల
2019 ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.36,360.26 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో అందులోంచి రూ.రెండు వేల కోట్లు తగ్గిపోవడం గమనార్హం. అంటే.. రూ.34,833.18 కోట్లు వస్తాయి. కానీ, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.2వేల కోట్లు అదనం.

Download Budget Speech
Download Budget Highlights
Download Key to Budget Documents
Download Finance Bill
Download Memorandum

Budget at a Glance
Annual Financial Statement
Receipt Budget
Published date : 06 Jul 2019 06:42PM

Photo Stories