Telangana Budget 2023-24 Updates : తెలంగాణ వార్షిక బడ్జెట్ 2023-24.. గవర్నర్ తమిళిసై ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే..
సీఎం కేసీఆర్ దగ్గరుండి గవర్నర్‌కు హాల్‌లోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై బడ్జెట్‌పై ప్రసంగించారు.
☛ TS Budget 2022 Highlights: తెలంగాణ బడ్జెట్ 2022–23
గవర్నర్ తమిళిసై ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే..
☛ ఆశావర్కర్లకు రూ. 9,750 పారితోషికం
☛ 203 మైనారిటీ గురుకల పాఠశాలలు ఏర్పాటు
☛ ఇప్పటివరకూ 12.5 లక్షల మందికి షాదీ ముబారక్
☛ ఇప్పటివరకూ 12 లక్షల మందికి కల్యాణలక్ష్మి
☛ 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
☛ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశాం
☛ ఉద్యోగాల్లో స్థానికత కోసం కొత్త చట్టం తెచ్చాం
☛ గత ఎనిమిదేళ్లలో 2,21, 774 ఉద్యోగాలను భర్తీ చేశాం
☛ రూ. 7,289 కోట్లతో మన ఊరు-మన బడి కింద స్కూళ్ల అభివృద్ధి
☛ న్యాయవాదుల కోసం రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి
☛ జర్నలిస్టుల కోసం రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి
☛ బతుకమ్మ ఫెస్టివల్ చీరల ద్వారా చేనేతలకు ఉపాధి
☛ నేతన్నలకు రూ. 5లక్షల బీమా పథకం
☛ సివిల్ పోలీస్ ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్
☛ రాష్ట్ర జీఎస్‌డీపీలో 18.2 శాతం వ్యవసాయరంగం నుంచే సమకూరుతున్నది
☛ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది
☛ దళితబంధు విప్లవాత్మకమైన పథకం
☛ ప్రతి దళితుడికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తున్నాం
☛ పేదలకు చేయూతగా ఆసరా పథకం.. ఆసరా పథకం లబ్ధిదారుల వయస్సు 57కు తగ్గించాం
☛ ఎస్టీల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచాం
☛ 11వేల కోట్లతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ
☛ మాంసం ఉత్పిత్తిలో తెలంగాణ దేశంలోనే 5వ స్థానంలో ఉంది
☛ సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందుంది
☛ తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి
☛ వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించాం
☛ కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తి చేశాం
☛ రైతు బంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది
☛ ఇప్పటివరకూ రూ.65 వేల కోట్లు రైతులకు అందించాం
☛ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి
☛ ప్రభుత్వ కృషి వల్ల 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం
☛ నీటి కోసం గతంలో గొడవలు జరిగాయి.. ఇప్పుడు 24 గంటల పాటు నీటి సరఫరా అందిస్తున్నాం.