Skip to main content

Good News For Income Taxpayers Budget 2024-25 : ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌... ఈ కొత్త పన్ను విధానంతో ఎలాంటి మార్పులు లేవ్‌.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్ 2024-25 ను ప్ర‌వేశ పెట్టిన విష‌యం తెల్సిందే.
Good News For Income Taxpayers 2024-25   Union Finance Minister Nirmala Sitharaman presenting Interim Budget 2024-25

ఈ బడ్జెట్‌లో ఉద్యోగుల‌కు ఆర్థిక మంత్రి శుభ‌వార్త‌ను  చెప్పారు. ఈ సారి ప్రత్యక్ష, పరోక్ష పన్ను విధానంలో మార్పులు లేవని తెలిపారు.

☛ Union Budget 2024-25 Live Updates : కేంద్ర బడ్జెట్ 2024 కేటాయింపులు ఇలా.. ఈ సారి వీటికి అధిక ప్రాధాన్యత.. ఇంకా..

మధ్యంతర బడ్జెట్ 2024-25లో ప‌న్నులు విధానం ఇలా..

union budget tax news telugu 2024-25

☛ ప్రత్యక్ష, పరోక్ష పన్ను విధానంలో మార్పులు లేవు. 
☛ ఆదాయపు పన్నుల శ్లాబులు యథాతథం. 
☛ కొత్త పన్ను విధానంతో 7లక్షల వరకు పన్ను లేదు.
☛ స్టాండర్డ్‌ డిడెక్షన్‌ రూ.50వేల నుంచి 75వేలకు పెంపు.
☛ ప్రత్యక్ష పన్నులు మూడు రెట్లు పెరిగాయి. 
☛ పన్ను చెల్లింపుదారులకు అభినందనలు. 
☛ ఈ ఏడాది రూ.26.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం అంచనా.
☛ ఫిజికల్‌ డెఫిసిటీ 5.2 శాతానికి తగ్గింపు. 
☛ కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గింపు. 
☛ 2023-24 ఏడాదికి రెవెన్యూ ఆదాయం రూ.30.08 లక్షల కోట్లు. 
☛ ఈ ఏడాది ద్రవ్యలోటు 5.8 శాతం.
☛ ఈ ఏడాది అప్పులు రూ.14 లక్షల కోట్లు. 

☛ Union Budget Highlights 2024-24 : కేంద్ర ఆర్థికమంత్రులుగా ఉండి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టని వారు వీరే.. కార‌ణం తెలిస్తే.. మీరే..

ఈసారి ఆదాయపు పన్ను వర్గాలకు ఎలాంటి ఊరట కల్పించలేదు. ఆదాయపు పన్ను శ్లాబులను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేస్తామన్నారు. ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ సమయాన్ని 93 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించామని, ఇది ఐటీ రిఫండ్స్ వేగంగా చేసేందుకు కారణమైనట్లు చెప్పారు. గతేడాది బడ్జెట్ 2023లో కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు పన్ను మినహాయింపులు కల్పించిన సంగతి తెలిసింది. ఈ సారి కూడా అదే కొనసాగనుంది.

☛ గ‌తంలోని కేంద్ర, రాష్ట్ర‌ బడ్జెట్ల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 01 Feb 2024 01:22PM

Photo Stories