Skip to main content

వ్యవసాయానికి రూ. 7,307 కోట్లు

  • 2015-16 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయానికి రూ. 7,307 కోట్లు కేటాయిం చారు. ఇందులో ప్రణాళికేతర వ్యయం రూ. 5,905.03 కోట్లు కాగా, ప్రణాళిక వ్యయం రూ. 1,402.58 కోట్లుగా ఉంది.
  • గత ఆగస్టులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో(8 నెలల కాలానికి) వ్యవసాయానికి ప్రణాళికా వ్యయం కింద రూ. 6,738.44 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 6,373.95 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
  • ఈ ఏడాది రూ. 4300 కోట్లను రుణమాఫీకి ఇచ్చారు. గత ఏడాది బడ్జెట్‌లో ఇచ్చిన రూ. 13 వేల కోట్లలో రూ. 5 వేల కోట్లు రుణమాఫీకి కేటాయించారు. ఇక మొత్తం రూ. 7,307 కోట్లలో రుణమాఫీ నిధులు పో ను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మిగి లేది రూ. 3,007 కోట్లు మాత్రమే.
  • విత్తన సబ్సిడీ కోసం రూ. 212 కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ. 172 కోట్లను ప్రతిపాదించింది. గత ఏడాది కన్నా ఇది రూ. 40 కోట్లు తక్కువ. సాగునీటి శాఖకు రూ. 5,258 కోట్లు
    • సీమ ఎత్తిపోతల పథకం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదికి అనుసంధానం చేయనున్నారు. పట్టిసీమ ఎత్తిపోతలను రూ.1,300 కోట్ల తో ఏడాదిలో ప్రాజెక్టు పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
    • సాగునీటి శాఖకు రూ. 5,258 కోట్లు కేటాయించారు. అందులో ప్రణాళికా వ్యయం రూ. 4,678.13 కోట్లు, ప్రణాళికేత వ్యయంగా రూ. 580 కోట్లుగా చూపించారు. ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు, విదేశీ సహాయం, కేంద్రం నిధులను ప్రణాళికా వ్యయంలో చూపించారు.
    • బడ్జెట్‌లో పోలవరానికి రూ. 1032 కోట్ల కేటాయింపులు చేసింది. అయితే ఇందులో రూ. 257 కోట్లే రాష్ర్టం నుంచి అందుతాయి. మిగతా రూ. 775 కోట్లను కేంద్రం నుంచి వచ్చే ఏఐబీపీ నిధుల కింద రాష్ర్ట సర్కారు చూపించింది.
Published date : 14 Mar 2015 02:21PM

Photo Stories