విద్యకు రూ.17,729 కోట్లు
Sakshi Education
- బడ్జెట్‌లో విద్యారంగానికి 13.24 శాతం నిధులు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్ కన్నా 1.98 శాతం మేర స్వల్పంగా పెంపుదల ఉంది
- ఉన్నత విద్యకు మొత్తంగా చూస్తే రూ. 3,049 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో ప్రణాళికేతర వ్యయమే రూ. 2,203.29 కోట్లు కాగా ప్రణాళికా వ్యయం రూ. 463.62 కోట్లు మాత్రమే.
- గత ఏడాదిలో ఉన్నత విద్యకు ప్రణాళికేతర వ్యయం కింద రూ. 2,183.95 కోట్లు కేటాయించగా ఈసారి జీతభత్యాలు ఇతర వేతనాల్లో తేడా కారణంగా స్వల్పంగా పెంచారు.
- ప్రణాళికా వ్యయం కింద గత ఏడాదిలో 157.73 కోట్లు కేటాయించగా ఈసారి దాన్ని రూ. 463.62 కోట్లకు పెంచారు.
- కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకమైన రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) కింద రావలసిన రూ. 1,747 కోట్లు ప్రతిపాదనలనూ ఈ బడ్జెట్లో చేర్చారు.
- ప్రణాళికేతర వ్యయం కింద కళాశాల విద్యకు రూ. 726.25 కోట్లు, ఇంటర్మీడియెట్ విద్యకు రూ. 515.59 కోట్లు ఇచ్చారు. ప్రణాళికా వ్యయం కింద కళాశాల విద్యకు రూ. 30.81 కోట్లు, ఇంటర్ విద్యకు రూ. 69.60 కోట్లు కేటాయించారు.
- కొత్తగా నైపుణ్యాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన విభాగానికి బడ్జెట్లో ప్రణాళిక పద్దు కింద రూ. 360 కోట్లు కేటాయించారు.
- హిందీ అకాడమీకి రూ. 20 లక్షలు కేటాయించగా తెలుగు అకాడమీకి పైసా ఇవ్వలేదు.
పాఠశాల విద్యకు రూ.12,664.50 కోట్లు
- పాఠశాల విద్యకు గతేడాది ప్రణాళికేతర వ్యయం కింద రూ.10,297.11 కోట్లు కేటాయించగా ఈసారి రూ.12,664.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.2,367 కోట్లు అధికం.
- పణాళికా వ్యయం గతేడాది రూ.1,706.56 కోట్లు కేటాయించగా ఈసారి రూ.2,297.72 కోట్లు ప్రతిపాదించారు. గతేడాదితో పోల్చితే రూ. 591.16 కోట్ల మేరకు పెరిగింది.
Published date : 14 Mar 2015 02:36PM