Skip to main content

వైద్యానికి రూ.4387 కోట్లు

2014-15 సంవత్సరానికి వైద్య ఆరోగ్యశాఖకు మొత్తం బడ్జెట్టు రూ.4387 కోట్లు కేటాయించారు.ప్రణాళికేతర వ్యయం రూ.3347 కోట్లు కాగా, ప్రణాళికా వ్యయం కింద కేవలం రూ.1040 కోట్లు మాత్రమే చూపించారు. ప్రణాళికేతర వ్యయంలో 80 శాతం సిబ్బంది జీతభత్యాలు, అలవెన్సులకే ఉంటుంది.
గమనిక: ఏదైనా అభివృద్ధి పథకాలు చేయాలంటే వాటిని ప్రణాళికా వ్యయంలోనే చూపించాలి. ప్రణాళికా సంఘం అంచనా ప్రకారం బడ్జెట్‌లో పణాళికేతర, ప్రణాళికా వ్యయాలు65/35 దామాషాలో ఉండాలి. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో ఈ రేషియో 77.3/23.7 లెక్కన ఉందంటే అభివృద్ధి మాత్రం జరుగుతుందో చూడాలి.
  • ఆరోగ్యశ్రీకి 13 జిల్లాలకు కనీసం 58 శాతం లెక్కనైనా రూ.530 కోట్లు పైన కేటాయించాలి. కానీ రూ.500 కోట్లే చూపించారు.
  • మందులకు రూ.230 కోట్లు కేటాయించారు. కానీ 2012-13, 2013-14 సంవత్సరాల్లో కనీసం రూ.150 కోట్లు ఖర్చు చేయలేక నిధులు మురిగి పోయాయి.
  • విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు రూ.5 కోట్లే ఇచ్చారు.
Published date : 06 Sep 2014 05:08PM

Photo Stories