ఉద్యోగ కల్పనకు ఆంధ్రా యువశక్తి పేరిట రూ.25 కోట్లు
Sakshi Education
- యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ. 25 కోట్లు చూపారు. దీనికి ‘ఆంధ్రా యువశక్తి’ అని నామకరణం చేశారు. అన్ని వర్గాల యువతకు యువ కిరణాలు పేరిట శిక్షణ ఇచ్చేందుకు రూ. 55.16 కోట్లు కేటాయించారు.
- ఉద్యోగం కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఊసే లేదు. రాష్ట్రంలో మొత్తం కోటిన్నర కుటుంబాలుంటాయని కుటుంబానికి ఒకొక్కరు చొప్పున లెక్కవేసుకున్నా కోటిన్నర మంది నిరుద్యోగ యువత ఉంటుందని నిపుణుల అంచనా. ఎన్నికల హామీ ప్రకారం ఒక్కొక్కరికి నెలకు రూ. 2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఏటా రూ. 36,000 కోట్లు అవసరం. కానీ.. బడ్జెట్‌లో ఈ నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
- విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గత బకాయిలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,500 కోట్లు అవసరం కాగా.. కేటాయింపులు మాత్రం రూ. 2,040 కోట్లు
Published date : 06 Sep 2014 05:05PM