రాష్ట్ర జనాభా 4.95 కోట్లు
Sakshi Education
- రాష్ట్ర జనాభా 4.95 కోట్లు. అందులో పురుషులు 2.48 కోట్లు (50.08 శాతం).. మహిళలు 2.47 కోట్లు (49.92) ఉన్నారు. జనాభా పరంగా చూస్తే దేశంలో రాష్ట్రం పదో స్థానంలో ఉంది.
- 52.85 లక్షల జనాభాతో తూర్పు గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా.. 23.44 లక్షల జనాభాతో విజయనగరం జిల్లా చివర్లో ఉంది.
- రాష్ట్రంలో 127.19 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు.. ఒక్కో కుటుంబంలో సగటున నలుగురు సభ్యులున్నట్లు 2014-15 సామా జిక ఆర్థిక సర్వే అంచనా వేసింది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 997 మంది మహిళలు ఉన్నారు. (జాతీయ సెక్స్ రేషియో 943 మందే.) 2001 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ రేషియో 1000: 983 గా ఉంది.
- విశాఖ, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ఈ రేషియో వెయ్యి కన్నా అధికంగా ఉంది. రాష్ట్రంలో ఎస్సీల్లో సెక్స్ రేషియో 1,007.. ఎస్టీల్లో 1,012 కావడం గమనార్హం.
- రాష్ట్ర జనాభాలో 17.08 శాతం మంది ఎస్సీలు, 5.33 శాతం మంది ఎస్టీలు ఉన్నారు.
- ఎస్సీ జనాభా పరంగా చూస్తే 9.57 లక్షల మందితో తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలు ప్రథమ స్థానంలో ఉండగా.. 2.47 లక్షల మందితో విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది.
- ఎస్టీ జనాభా పరంగా చూస్తే 22.57 శాతం మందితో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా.. 2.77 శాతం మందితో వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో ఉంది.
Published date : 14 Mar 2015 03:11PM