‘రాజధాని’ భూ సమీకరణకు రూ.94 కోట్లు
Sakshi Education
- రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో భూసమీకరణకు రూ.94 కోట్లు మినహాయించడం మినహా రాజధాని ఊసే లేదు.
- మొత్తం రూ.3,169 కోట్ల పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల బడ్జెట్‌లో రాజధాని నిర్మాణ అంశాలను ఎక్కడా పొందుపరచలేదు.
- ప్రణాళికా వ్యయం కింద రూ.1,752 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.1,416 కోట్లు చూపించారు. కానీ బడ్జెట్‌లో 75 శాతానికి పైగా జీతాలకే సరిపోతుంది.
- స్మార్ట్ సిటీలకు రూ.500 కోట్లు, విశాఖపట్నం, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టులకు రూ.300 కోట్లు కేటాయించారు.
- జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంకు రూ.200 కోట్లు, పట్టణ జీవనోపాధికి రూ.40 కోట్లు, రాజీవ్ ఆవాస్ యోజనకు రూ.10 కోట్లు, పట్టణ సంస్కరణలు, పురపాలక సేవలకు గానూ రూ.291 కోట్లు ఇచ్చారు
Published date : 14 Mar 2015 02:32PM