పన్నుల ద్వారా రూ.7 వేల కోట్ల ఆదాయం
Sakshi Education
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే వచ్చే ఏడాదిలో పన్నుల ఆదాయం అదనంగా రూ.7 వేల కోట్లకు పైనే వస్తుందని బడ్జెట్‌లో వేసిన ప్రభుత్వ అంచనా.
- తాజా బడ్జెట్‌లో రూ.7,300 రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు రూ.17,584 కోట్లుగా అంచనా వేశారు. ప్రణాళిక, ప్రణాళికేతరలో మొత్తం రెవెన్యూ వ్యయం ఏకంగా రూ.97,224 కోట్లుగా పేర్కొన్నారు.
- ప్రస్తుత బడ్జెట్‌లో యూజర్ చార్జీల ద్వారా రూ.500 కోట్లు, వ్యాట్ రూపంలో అదనంగా రూ.4 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
- స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ల ద్వారా అదనంగా రూ.వెయ్యి కోట్ల ఆదాయం అంచనా.
- పన్నేతర ఆదాయం రూ.5,341 కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇందులో గనుల రంగం ద్వారా రూ.1,359 కోట్లు, ఎర్ర చందనం విక్రయం, ఇతర అటవీ ఉత్పత్తుల ద్వారా రూ.1,072 కోట్లు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
- రూ.17,500 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించగా... ఆస్తుల కల్పనకు మాత్రం కేవలం రూ.9,818 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- కేంద్ర, రాష్ట్ర పన్నుల ద్వారా రూ.67,061 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర పన్నుల ద్వారా రూ.55,313 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు.
- 2014-15 బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ద్రవ్యలోటు రూ.12,064 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.30 శాతం. సవరించిన అంచనాల మేరకు ద్రవ్యలోటు రూ.20,320 కోట్లకు చేరిందని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.88 శాతం.
- ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనల మేరకు ద్రవ్య లోటు మూడు శాతానికి మించకూడదు.
Published date : 14 Mar 2015 02:40PM