జలయజ్ఞంతో 20 లక్షల ఎకరాలు సాగులోకి
- దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం పథకం కింద చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఇప్పటివరకు 19.696 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 3.036 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 2013-14 సామాజిక, ఆర్థిక సర్వే ఈ విషయాలను వెల్లడించింది. (శాసనసభకు బడ్జెట్‌ను సమర్పించిన రోజునే.. సామాజిక, ఆర్థిక సర్వేను విడుదల చేయడం ఆనవాయితీ)
- ‘‘13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం కింద 52.05 లక్షల ఎకరాలను ఆయకట్టు కిందకు తీసుకురావడం, 21.18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా 54 ప్రాజెక్టుల (26 మేజర్, 18 మీడియం, 4 ఫ్లడ్ బ్యాంక్స్, 6 ఆధునికీకరణ ప్రాజెక్టులు)ను చేపట్టారు. ఇప్పటివరకు 13 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 14 ప్రాజెక్టులు పాక్షికంగా వినియోగంలోకి వచ్చాయి. వీటి ద్వారా 11.878 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. 11 ప్రాజెక్టుల నిర్మాణం చివరి దశలో ఉంది. వీటిని ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయనున్నారు. వీటి ద్వారా 2,03,628 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది.
జలయజ్ఞం కింద కొత్త ఆయకట్టు (లక్షల ఎకరాల్లో)
ప్రాజెక్టుల స్థాయి | కొత్త ఆయకట్టు | ఆయకట్టు |
| సృష్టి | స్థిరీకరణ |
మేజర్, మీడియం | 11.878 | 3.036 |
మైనర్ | 3.675 | 0 |
ఏపీఐడీసీ | 4.143 | 0 |
మొత్తం | 19.696 | 3.06 |
సాగునీటి శాఖలో మేజర్ ప్రాజెక్టులకు కేటాయింపులు
ప్రాజెక్టు పేరు | కేటాయింపులు (రూ. కోట్లలో) |
తుంగభద్ర హైలెవల్ కెనాల్ స్టేజ్-1 | 15 |
తుంగభద్ర హైలెవల్ కెనాల్ స్టేజ్-2 | 20 |
వంశధార స్టేజ్-1 | 0.03 |
కేసీ కెనాల్ ఆధునీకరణ | 8.4 |
సోమశిల | 24.9 |
గోదావరి డెల్టా ఆధునీకరణ | 141.13 |
పెన్నా డెల్టా ఆధునీకరణ | 10 |
ఏలేరు కాలువల ఆధునీకరణ | 13.5 |
పోలవరం | 138 |
శ్రీశైలం కుడి కాలువ(నీలం సంజీవరెడ్డి సాగర్) | 12.48 |
తెలుగుగంగ | 89.60 |
పులిచింతల | 26.21 |
నీరడి బ్యారేజ్(వంశధార స్టేజ్-2 కింద) | 32.93 |
గాలేరు నగరి | 55.14 |
పులివెందుల బ్రాంచ్ కెనాల్ | 27.81 |
కృష్ణా డెల్టా ఆధునీకరణ | 120.14 |
హంద్రీ నీవా | 100.28 |
వెలిగొండ | 76.58 |
చెంగలనాడు లిఫ్ట్ | 0.02 |
తారకరామ లిఫ్ట్ | 0.78 |
తోటపల్లి బ్యారేజ్ | 20 |
గురురాఘవేంద్ర లిఫ్ట్ | 15 |
గుండ్లకమ్మ | 0.05 |
పుష్కర లిఫ్ట్ | 29.7 |
తాటిపూడి లిఫ్ట్ | 40 |
వెంకటనగరం పంపింగ్ | 15 |
చింతలపూడి లిఫ్ట్ | 35.04 |
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి | 0.03 |
కోరిసపాడు లిఫ్ట్ | 0.07 |