ఇతర కేటాయింపులు
Sakshi Education
- 2015-16 ఆర్థిక సంవత్సరానికి పోలీస్ విభాగానికి రూ.4,062.74 కోట్లు కేటాయించారు. వీటిలో జీతభత్యాలు, ఇతర ఖర్చులకు సంబంధించిన ప్రణాళికేతర వ్యయం రూ.3,981.69 కోట్లుగా ఉంది. ప్రణాళికా వ్యయం రూ.81.05 కోట్లు. ఇందులో పోలీసు స్టేషన్లలో రిసెప్షన్ల ఏర్పాటు కోసం రూ.42.05 కోట్లు ఇచ్చారు.
- బడ్జెట్‌లో చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం కేవలం రూ.70 కోట్లు మాత్రమే కేటాయించింది.
- 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2.07 లక్షల ఇళ్లు కొత్తగా నిర్మిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి రూ. 897 కోట్లు మాత్రమే కేటాయించారు.
- విద్యుత్ సంస్థలకు బడ్జెట్‌లో కేవలం రూ.4,360 కోట్లు కేటాయించారు. ఇందులో వ్యవసాయానికిచ్చే ఉచిత విద్యుత్‌కు రూ.3 వేల కోట్లు కేటాయించారు.
- విద్యుత్ సంస్థలు రూ.7,716 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు ఇందులో రూ.1,261 కోట్లను టారిఫ్ రూపంలో పూడ్చుకోవాలని, మిగిలిన రూ.6,455 కోట్లను ప్రభుత్వం ఉచిత విద్యుత్, గృహ విద్యుత్‌కు సబ్సిడీ రూపంలో ఇస్తుందని అంచనా వేశారు.
- ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్‌ను అందచేసే ఎన్టీఆర్ సుజల స్రవంతి కి కేవలం రూ.11 కోట్లు కేటాయించారు.
- తాజా బడ్జెట్‌లో ఆర్టీసీకి ప్రణాళికేతర వ్యయం కింద రూ.218 కోట్లను రాయితీల కోసం చెల్లించేం దుకు కేటాయించగా.. ప్రణాళికా వ్యయం కింద రూ. 94.98 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
- మొన్నటి ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే మైనర్ పంచాయతీ (15 వేల కంటే తక్కువ జనాభా)లకు రూ. 7 లక్షలు, మేజర్ పంచాయతీ(15 వేల కంటే ఎక్కువ జనాభా)లకు రూ. 20 లక్షల చొప్పున ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.
- ఈ ఎన్నికల్లో మొత్తం 1,835 పంచాయతీలు ఏకగ్రీవమవ్వగా అవన్నీ మైనర్ గ్రామ పంచాయతీలే. వీటికి ఆర్థిక ప్రోత్సాహం కింద రూ. 128.45 కోట్ల నిధులు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం రూ. 80 కోట్లను మాత్రమే కేటాయించింది.
- నిరుపేదలకు వస్త్రాలు అందించేందుకు జనతా వస్త్రాల పథకం పునరుద్ధరిస్తామని, ఈ పథకం మళ్ళీ ప్రారంభిస్తామని జన్మభూమి సభలో ప్రకటించారు. కోటి కార్డులున్న వారికి ఈ పథకం వర్తింపజేయాలంటే రూ. 600 కోట్లు ఖర్చవుతుందని అంచనా. బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేదు.
- 2015-16 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం పారిశ్రామిక, వాణిజ్యానికి రూ.637 కోట్లు కేటాయించింది.
- చేనేతకు కేటాయించింది కేవలం రూ.64 కోట్లు. ప్రణాళిక పద్దులో రూ.23.32 కోట్లు, ప్రణాళికేతర ఖాతాలో రూ. 22.54 కోట్లు ప్రకటించింది. వాస్తవానికి రుణమాఫీ కోసం రూ.168 కోట్లు అవసరమని ప్రతిపాదించారు.
Published date : 14 Mar 2015 02:59PM