Skip to main content

ఏపీ తొలి వ్యవసాయ బడ్జెట్ రూ.13000 కోట్లు

శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ మంత్రి పుల్లారావు
రుణమాఫీకి రూ. 5 వేల కోట్లు..
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 8 వేల కోట్లు
విద్యుత్ రాయితీ, ఉచిత విద్యుత్ కోసం రూ. 3,188 కోట్లు..
ఇప్పటికి ఉచిత విద్యుత్ 7 గంటలే.. భవిష్యత్తులో 9 గంటలు

వ్యవసాయ సుస్థిరత, స్వయంసమృద్ధి, అధికోత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 2014-15 సంవత్సరానికి ఆగస్టు 22న శాసన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయానికి తొలిసారి ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మొత్తం 13,109.39 కోట్ల రూపాయలు.ఇందులో ప్రణాళిక వ్యయం రూ. 6,735.44 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ. 6,373.95 కోట్లు. ఈ మొత్తంలో రుణమాఫీకి రూ. 5 వేల కోట్లు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 8 వేల కోట్లనుకేటాయించారు. ప్రస్తుతానికి రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్‌తో సరిపెట్టి భవిష్యత్‌లో 9 గంటలు పెంచుతామని మంత్రి చెప్పారు. పులివెందులలో ఇందిరాగాంధీ పశుగణ అధునాతన పరిశోధన కేంద్రం (ఐజీసీఏఆర్‌ఎల్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇలా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌నుప్రవేశపెట్టిన మొదటి రాష్ర్టం కర్ణాటక.

బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు..
  • రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 76 లక్షలు
  • రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తిలో వ్యవసాయం వాటా 6.74 శాతం
  • ఇప్పటివరకు ఉన్న ఆదర్శ రైతుల తొలగింపు, ఎంపీఈవోల నియామకం
  • డీఎన్‌ఏ, బీపీ ప్రయోగశాలల ఏర్పాటు
  • మెరుగుపరిచిన పంటలు, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల అమలు
  • 2014-15లో రైతు రుణాల లక్ష్యం రూ. 56,019.16 కోట్లు
  • ప్రతి రైతుకూ భూసార ఆరోగ్య పత్రం, భూసార మ్యాపింగ్‌తో ఎరువుల సిఫారసు
  • సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం
  • సకాలంలో రుణాలు చెల్లించిన వారికే పావలా వడ్డీ రాయితీ
  • అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో సిల్క్ హబ్‌లు
  • వచ్చే ఐదేళ్లలో పశుసంవర్ధక రంగం ఆదాయం రూ. 60 వేల కోట్లకు పెంచేలా చర్యలు
  • ఒంగోలు, పుంగనూరు పశు జాతుల సంరక్షణకు చర్యలు
  • వైఎస్సార్ జిల్లా పులివెందులలో పశుగణ పరిశోధన కేంద్రం
  • 150 కృత్రిమ వీర్యధారణ కేంద్రాల ఏర్పాటు
  • సంచార రైతు బజార్లు, మిశ్రమ రైతు సేవా కేంద్రాల ఏర్పాటు
  • వ్యవసాయానికి 7 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా.. మున్ముందు 9 గంటలు సరఫరాకు కృషి
  • ఏటా 10 వేల సోలార్ పంపు సెట్ల ఏర్పాటు
  • రైతు ముంగిట్లోకి ఇక్రిశాట్ సేవలు, చీడపీడలను తట్టుకునే వంగడాల తయారీ
కేటాయింపులు..
  • విద్యుత్ రాయితీ, ఉచిత విద్యుత్ కోసం ప్రణాళికేతర కేటాయింపు రూ. 3,188 కోట్లు.
  • గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ పనులకు రూ. 1,386.30 కోట్లు
  • పశు సంవర్థక శాఖకు రూ. 723. 32 కోట్లు
  • బిందు సేద్యం, తోటల పెంపకం, అభివృద్ధికి రూ. 348.33 కోట్లు
  • రూ. 3 లక్షల లోపు రుణాలపై పావలా వడ్డీ రాయితీకీ రూ. 230 కోట్లు
  • విత్తన సరఫరా, రాయితీలకు రూ. 212 కోట్లు
  • వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖకు రూ. 156.87 కోట్లు
  • పట్టు పరిశ్రమాభివృద్ధికి రూ. 122.92 కోట్లు
  • జాతీయ వ్యవసాయ విస్తరణ, సాంకేతిక మిషన్‌కు రూ. 62.21 కోట్లు
  • జాతీయ ఆహార భద్రత మిషన్‌కు రూ. 153.23 కోట్లు
  • నూనె గింజలు, ఆయిల్‌పామ్ పెంపకానికి రూ. 59.28 కోట్లు
  • జాతీయ నూనె గింజలు, ఆయిల్‌పామ్ మిషన్‌కు రూ. 33.60 కోట్లు
  • రాష్ట్రీయ కృషి వికాస్ పథకం కింద కేంద్ర సాయం రూ. 237.08 కోట్లు
  • రాష్ట్రీయ కృషి వికాస్ పథకం కింద రాష్ట్ర సాయం రూ. 34.46 కోట్లు
  • సహజ వనరుల పరిరక్షణకు రూ. 169.71 కోట్లు
  • ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ. 192.92 కోట్లు
  • యాంత్రీకరణ, సేవా కేంద్రాలకు సబ్సిడీ రూ. 90 కోట్లు
  • సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద కేంద్ర సాయం రూ. 34.80 కోట్లు
  • డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీకి రూ. 30.61 కోట్లు
  • శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం నిర్వహణకు రూ. 112.80 కోట్లు
  • ఇందిరాగాంధీ పశుగణ అధునాతన పరిశోధన కేంద్రానికి రూ. 15.18 కోట్లు
  • దూడల పోషణ పథకం ‘సునందిని’కి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి ఆ వర్గాలకు రూ. 13.82 కోట్లు
  • ఇదే పథకం కింద ఇతర వర్గాలకు వ్యవసాయ బడ్జెట్ నుంచి రూ. 1.19 కోట్లు
  • పశు వైద్యశాలల నిర్మాణానికి రూ. 50 కోట్లు
  • జాతీయ పశుగణాభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నియంత్రణకు రూ. 32.40 కోట్లు
  • పాడి పరిశ్రమకు రూ. 17 కోట్లు
  • మత్స్యశాఖకు రూ. 60.07 కోట్లు
  • చేప పిల్లల పెంపకం, చేపల విక్రయం, మార్కెట్ వసతులకు రూ. 14.85 కోట్లు
Published date : 06 Sep 2014 05:31PM

Photo Stories