Skip to main content

డ్వాక్రా రుణమాఫీకి రివాల్వింగ్ ఫండ్

  • ఎన్నికల ముందు ఇచ్చిన డ్వాక్రా రుణాల మాఫీ హామీ అమలుకు బదులు గతంలో మాదిరిగా ప్రతి డ్వాక్రా సంఘానికి రివాల్వింగ్ ఫండ్ అందజేయనున్నారు. దీనికి ‘క్యాపిటల్ ఇన్ఫ్యూజన్’ అన్న పేరు పెట్టారు.
  • మహిళలు డ్వాక్రా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని కనీసం ఆరు నెలలపాటు అందులోని సభ్యులు ప్రతి నెలా పొదుపు చేసుకుంటే ప్రభుత్వం వారికి ప్రోత్సాహంగా కొంత సాయం చేస్తుంది. ప్రభుత్వమిచ్చే ఈ మొత్తాన్ని సంఘం పొదుపు ఖాతా(మూలధన నిధి) కు జమచేస్తారు.
  • ఈ మూలధన నిధిని బట్టే ఆయా సంఘాలకు బ్యాంకులు ఎంత మొత్తం రుణమివ్వాలో నిర్ణయించుకుంటాయి. కొత్త సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికో, పాత సంఘాలు రుణపరిమితిని పెంచుకోవడానికో మాత్రమే రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడుతుంది.
  • ఏపీ లోని 13 జిల్లాల్లో 2004 కు ముందు గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 2,26,757 డ్వాక్రా గ్రూపులుంటే వైఎస్ సీఎంగా ఉన్న తొలి నాలుగేళ్లలోనే కొత్తగా 2,86,780 గ్రూపులు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు పావలా వడ్డీ స్థానంలో జీరో వడ్డీ విధానం అమలులో ఉంది.
  • మార్చి 2014 నాటికి డ్వాక్రా సంఘాలు రూ.14,204 కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి. టీడీపీ సర్కారు రుణమాఫీ అమలు చేస్తుందని ఆశించారు. కానీ ఇప్పుడు ఏడాదిగా తాము చెల్లించని బకాయిలన్నింటినీ మహిళలు ఒకే విడతలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
  • ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 6,52,444 సంఘాల్లో 69,31,113 మంది.. పట్టణ ప్రాంతాల్లో ఉన్న 1,82,000 సంఘాల్లో 19 లక్షలమంది సభ్యులుగా ఉన్నారని ప్రభుత్వం మార్చి 3న విడుదల చేసిన జీవో 18లో పేర్కొంది.

డ్వాక్రా మహిళలు

89,00,000

రివాల్వింగ్ ఫండ్‌కు ఎంత అవసరం

8,900 కోట్లు

బడ్జెట్‌లో ఇచ్చింది..

1,000కోట్లు

(225 కోట్లు సబ్‌ప్లాన్ నుంచి)

Published date : 14 Mar 2015 02:31PM

Photo Stories