Skip to main content

బీసీ సంక్షేమానికి రూ.3,231.83 కోట్లు

  • బీసీ సంక్షేమ శాఖకు 2015-16 బడ్జెట్‌లో రూ.3,231.83 కోట్లు కేటాయించారు. 2014-15 బడ్జెట్ (రూ. 3,130.24) కంటే ఇది ఎక్కువ.
  • సాంఘిక సంక్షేమ శాఖకు రూ.2,692.61 కోట్లు కేటాయించారు. 2014-15 ఆర్థిక సంవత్సరం కేటాయింపులకన్నా కేవలం రూ.35.67కోట్లు మాత్రమే అధికం.
  • గిరిజన సంక్షేమానికి రూ.111.73 కోట్ల మేర కేటాయింపులు తగ్గిపోయాయి. గత బడ్జెట్‌లో గిరిజన సంక్షేమానికి రూ.1150.03కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1038.30 కోట్లు మాత్రమే కేటాయిం చారు.
  • మైనార్టీ సంక్షేమానికి కేటాయింపులు స్వల్పంగా (రూ.8 కోట్లు) పెంచారు.
  • మహిళ, శిశు, వికలాంగ సంక్షేమ శాఖకు రూ.1,137.51కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపుకన్నా ఇది రూ.5.51కోట్లు ఎక్కువ.
ఫించన్లకు రూ.3,741 కోట్లు
  • రాష్ట్రంలో ప్రస్తుతమున్న 40.88 లక్షల పింఛనుదారులకు డబ్బులివ్వడానికి ఏడాదికి రూ.5,400 కోట్లు అవసరం. గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు సైతం ఈ ఏడాది పింఛన్లకు బడ్జెట్‌లో 5,593 కోట్లు అవసరమని నివేదికలిచ్చారు. అయితే ప్రస్తుత బడ్జెట్‌లో 3,741 కోట్లు మాత్రమే పెట్టారు.

ఇప్పుడున్న వారికివ్వాలన్నా అవసరమున్న నిధులు

: రూ. 5,400 కోట్లు

గ్రామీణాభివృద్ధి శాఖ కోరింది

: రూ. 5,593 కోట్లు

ప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టింది

: రూ. 3,741 కోట్లు

(ఈ ఏడాది అదనంగా లక్ష పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది)

Published date : 14 Mar 2015 02:48PM

Photo Stories