బడ్జెట్ ముఖ్యాంశాలు
Sakshi Education
- 2015-16 ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 7.89% ఉంటుందని, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.41%గా ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా. తెలంగాణలో 9.99%, 10.26%గా ఉంటుందని అంచనా.
- బడ్జెట్ పరిమాణం గతేడాది కంటే కేవలం 1.1% అధికం. కానీ ప్రణాళికా వ్యయం 29.02% పెరిగింది. ప్రణాళిక, ప్రణాళికేతర రెవెన్యూ వ్యయం తగ్గింది.
- తలసరి ఆదాయం 2018-19 నాటికి రెట్టింపవుతుందని అంచనా.
- పాఠశాల విద్యకు కేటాయింపులను 11.26% నుంచి 13.24 శాతానికి పెంచారు.
- ప్రాథమిక, ఉన్నతస్థాయి ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి మాతా శిశుమరణాలను తగ్గించడానికి వైద్య రంగానికి కేటాయింపులను 3.92% నుంచి 5.07 శాతానికి పెంచారు.
- అన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ఆధార్‌తో అనుసంధించే ప్రక్రియలో రాష్ర్టం ముందంజలో ఉంది.
- అత్యవసర సేవలను సమర్థంగా అమలు చేయడానికి మెడికల్, పారామెడికల్, టీచర్లు, ఇంజనీర్లు, పోలీసు, హోంగార్డు ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు.
- ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కేటాయింపులు బడ్జెట్‌లో 22.61 %గా ఉన్నాయి.
- కాపుల సంక్షేమానికి రూ. 100 కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 35 కోట్లు కేటాయించారు.
- రుణమాఫీకి వీలుగా రైతు సాధికార సంస్థకు 5 వేల కోట్లు విడుదల.
- 7,748 గ్రూపులకు చెందిన 20,747 మంది నేత కార్మికుల రుణాల మాఫీకి రూ. 169 కోట్లు అవసరమని అంచనా.
- వచ్చే విద్యా సంవత్సరానికి ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్‌ఐటీ, ఎన్‌ఐటీ, సెంట్రల్, పెట్రోలియం, వ్యవసాయ, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- ఉన్నత విద్యలో నాణ్యతను పెంపొందించడానికి రాష్ట్రస్థాయి ‘అసెస్‌మెంట్, అక్రిడిషన్ కౌన్సిల్’ను నెలకొల్పనున్నారు.
- పరిశోధన రంగాన్ని ప్రోత్సహించడానికి ‘ఏపీ రీసెర్చ్ బోర్డ్’ను ఏర్పాటు చేయనున్నారు.
- సంక్షేమ పెన్షన్లకు రూ.3,741 కోట్లు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,645 కోట్లు ప్రతిపాదించారు.
- సాగునీటి ప్రాజెక్టుల పనుల కోసం రూ.4,580 కోట్లు కేటాయించారు.
- విద్యారంగానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14,265 కోట్లు కేటాయించగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.17,729 కోట్లు ప్రతిపాదించారు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరోగ్య రంగానికి రూ.4,134 కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.5,363 కోట్లు కేటాయించారు.
- ప్రజారోగ్యానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.497 కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.296 కోట్లే ప్రతిపాదించారు.
- పౌరసరఫరాలకు గతేడాది బడ్జెట్‌లో రూ.2,318 కోట్లు ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2,459 కోట్లు కేటాయించారు.గతేడాది కేటాయించిన నిధులతో పోల్చి చూస్తే కేవలం రూ.141 కోట్లే అదనం.
- ఆరోగ్యశ్రీకి రూ.800 కోట్లు అవసరమని ప్రతిపాదించగా బడ్జెట్‌లో కేవలం రూ.500 కోట్లే కేటాయించారు.
- 45 కాలేజీల్లో ఇంగ్లీష్ ల్యాబ్ ఏర్పాటుతో పాటు వివిధ సంస్థలతో కాలేజీలను అనుసంధానించడం ద్వారా విద్యలో నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు.
- 33,252 ఎకరాల విస్తీర్ణంలో రైతుల సమ్మతితోనే రాజధాని నిర్మాణం జరగుతోంది. 87% మంది రైతులు భూ సేకరణకు అంగీకరించారు.
- పన్నులద్వారా ఆదాయాన్ని పెంచలేం. అందువల్ల పన్నేతర ఆదాయం.. అంటే ఎర్రచందనం అమ్మకం, ఖనిజాల వెలికితీత ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారు.
- రాజధాని నిర్మాణానికి రూ.వెయ్యికోట్లు ప్రతిపాదించాలని పట్టణాభివృద్ధిశాఖకు సూచిస్తే వారు రూ.300 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు.
- పోలవరం ప్రాజెక్టుకు రూ.వెయ్యికోట్లు కేటాయించారు.
Published date : 14 Mar 2015 02:17PM