Skip to main content

బడ్జెట్ ముఖ్యాంశాలు

లక్ష కోట్ల మాఫీకి ఇచ్చింది రూ.5 వేల కోట్లు!
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 87,617 కోట్ల రూపాయల మేరకు వ్యవసాయ రుణాలున్నాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నివేదిక వెల్లడించింది. అలాగే మహిళా సంఘాల రుణాలు రూ. 14,204 కోట్లు ఉన్నాయి. మొత్తం కలిపి రూ. 1,01,821 కోట్ల రుణాలున్నాయి. వీటన్నింటికి కలిపి నామ మాత్రంగా రూ. 5,000 కోట్లు (ప్రణాళిక పద్దులో రూ. 4,000 కోట్లు, ప్రణాళికేతర పద్దు కింద రూ. 1,000 కోట్లు) మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు.
  • రైతులు, డ్వాక్రా సంఘాల వడ్డీలేని రుణాలకు ఎంత తక్కువగా అంచనా వేసినా రూ. 1,500 కోట్లు అవసరమవుతాయి. కానీ.. బడ్జెట్‌లో కేవలం రూ. 599 కోట్లు కేటాయించారు.
  • 2014-15 అక్టోబర్ 2వ తేదీ నుంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లను పెంచుతానని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఏడు నెలలకు పెంపు కోసం రూ. 3,080 కోట్లు అవసరం కాగా కేవలం రూ. 1,336 కోట్లు మాత్రమే కేటాయించారు.
  • తాజా బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి కేటాయించింది కేవలం రూ. 808 కోట్లు
  • ఇంటింటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందించడానికి ఉద్దేశించిన ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకం కోసం బడ్జెట్‌లో రూ. 5 కోట్లు కేటాయించారు.
  • సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల నిధుల్లో భారీ కోత విధించారు. కేవలం రూ. 3,103 కోట్లు మాత్రమే కేటాయించారు.
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధికి తాజా బడ్జెట్‌లో నిధులు ఏమీ కేటాయించలేదు.
  • ఆస్తుల కల్పనకు సంబంధించిన పెట్టుబడి వ్యయాన్ని కేవలం రూ. 7,000 కోట్లుగా ప్రతిపాదించారు. మార్కెట్ ద్వారా సుమారు రూ. 10,000 కోట్లు అప్పు చేస్తున్నప్పటికీ ఆస్తుల కల్పనకు సంబంధించిన పెట్టుబడి వ్యయం మాత్రం రూ. 7,000 కోట్లకే పరిమితం చేశారు.
Published date : 06 Sep 2014 04:43PM

Photo Stories